22, జనవరి 2014, బుధవారం

శ్రద్ధాంజలి

అక్కినేనికి శ్రద్ధాంజలి

చలనచిత్రసీమ నలవోకగా నేలి
మేటినటనచేత మించినట్టి
నటుఁడు అక్కినేని నాగేశ్వరునకుశ్ర
ద్ధాంజలిని ఘటింతు రాంధ్రు లెల్ల!

13 కామెంట్‌లు:

  1. వసంత కిశోర్ గారు చెప్పారు....

    నిర్దయుండగు విధియొక్క - నిర్ణయమున
    నిలువ లేనిక నేలపై - నిలువ ననుచు
    నింగి కెగసెను ధ్రువతార - నిశ్చయముగ
    నిన్ను నన్ను తెలుగువారి - నేడ్వమనుచు
    నిలచి యుండును తనకీర్తి - నేలమీద
    నింగి సూర్యుని కడదాక - నిజము నిజము !

    Telugu Yankee (ఫేస్‍బుక్ నుండి)

    అంద చందాలలో మేటి! అక్కి నేని
    చుక్కల నడుమ రేరాజ! అక్కినేని
    ఆంధ్రుల ప్రియతమనటుడా! అక్కినేని
    అందు కోవయ్య వీడ్కోలు అక్కినేని

    రిప్లయితొలగించండి
  2. ఏయింటి లోన జూచిన
    ఏయెన్నార్ నీదు పేరె యెదలోనిండెన్
    మాయన్న యనగ సినిమా
    శ్రేయంబును కోరినావు చిరజీవివిలే

    రిప్లయితొలగించండి
  3. చక్కనైన నటుడు అక్కినేనిమనకు
    ఒక్కడంటె కోటి కొక్కడంట
    సాగనంపెదము చక్రవర్తినికనా
    స్వర్గ లోకములకు చల్లగాను

    రిప్లయితొలగించండి
  4. తెలుగుసినిమానిఘంటువు
    వెలిగిన రాజా రమేషు వెడలెను అకటా!
    విలపించునుగద ప్రతిహృది
    సెలవంటునీవు వెడలినచిరజీవివిలే

    రిప్లయితొలగించండి
  5. నటన యందున నినుమించు నటుడు భువిని
    కాన రాడయ్య !యెవరును కన్ను గవకు
    అక్కినేని కు లాంబుధి నగ్ర గణ్య !
    అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    తెలుగు యాంకీ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    శైలజ గారూ,
    సుబ్బారావు గారూ,
    నటసమ్రాట్ అక్కినేనికి శ్రద్ధాంజలు ఘటిస్తూ మీరు వ్రాసిన పద్యాలు బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ,
    అభినందనలు.
    ‘సామ్రాట్’ అన్న పదం లేదు. అది ‘సమ్రాట్’. కవిసమ్రాట్, నటసమ్రాట్ అనడం సరియైనది.

    రిప్లయితొలగించండి
  8. తెలుగు చలనచిత్ర వెలుగులు మలిగెను
    అక్కినేని దివికి నరిగె నేడు
    వెండి తెరకు గుండె మండెను బాధతో
    చిత్ర సీమ మొగము చిన్న వోయె

    రిప్లయితొలగించండి
  9. ఎవ్వాని సౌందర్య మీయాంధ్రదేశంబు
    ..........తిలకించి పులకించె నలఘుకాల
    మెవ్వాని నటనలో, నింపైన పలుకులో
    ..........నవరసంబులు చిందు నవ్యగతుల
    నెవ్వాని కృషిచేత నీచిత్రసీమకు
    ..........భాగ్యనగరమిందు యోగ్యమయ్యె
    ఎవ్వాని నడతలో నేకోణమున జూడ
    ..........వినయదీప్తులజ్యోతి వెలుగుచుండు
    అతడు నాగేశ్వరుండు మహానటుండు
    ఘనుడు సమ్రాట్టుగా కీర్తి గాంచి నటన
    నాంధ్రదేశాని కనుపమయశము గూర్చె
    నక్కినేనికి శ్రద్ధతో నంజలింతు.

    రిప్లయితొలగించండి
  10. gurudevulaku dhanyavadamulu.savarinchina padyam

    ఆగదు యేనిషమనుచు
    సాగిరి దివిసీమకు నటసమ్రాట్టవగన్!
    స్వాగతమిత్తురు మీకట!
    యేగిన రీతి మరి రండి యేయెన్నారై!

    రిప్లయితొలగించండి
  11. gurudevulaku dhanyavadamulu.savarinchina padyam

    ఆగదు యేనిషమనుచు
    సాగిరి దివిసీమకు నటసమ్రాట్టవగన్!
    స్వాగతమిత్తురు మీకట!
    యేగిన రీతి మరి రండి యేయెన్నారై!

    రిప్లయితొలగించండి