వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర
రావు)
(౧౦)
తరుగని సంపదౌఘమని ధారుణి వెల్గెను వేంకటాద్రిగం
బరగగ నీల నామ కపి పన్నుగ నొప్పెను నీల శృంగిగన్
నరహరి రూపుడై వెలుగ నామము కల్గెను సింహశృంగిగన్
హరి వర మాత సేయ తప మంజన శైలమ వేంకటేశ్వరా! 86.
దివ్యము ధారుణిం గపిల తీర్థము ధామము చంద్ర మౌలికిన్
భవ్యము పాప నాశకము భక్త వరేప్సిత దాయకమ్మును
న్నవ్యయ కీర్తితమ్ము సక లాంచిత తీర్థనిమజ్జ నాభమున్
నవ్య జలప్రకాశము ననంత సుకీర్తిత! వేంకటేశ్వరా! 87.
సనక సనంద నాది ముని సంఘము వేడగ వేంకటాద్రి దు
ర్జన కృత సంకటమ్ములను సర్వము ఖర్వము సేసి యంత భూ
జనులకుఁ బూర్వ కాలమున సంతత దర్శన భాగ్యమిచ్చుచుం
దనరితి వయ్య నేడు మము ధన్యులఁ జేయవె వేంకటేశ్వరా! 88.
జగతి వరాహ మంత్రము నచంచల భక్తిఁ బఠించి నిత్యమున్
సుగతినిఁ బొందె ధర్ముడు ప్రచోదితు డయ్యజ వాచ్య బోధలన్
నగరిపు విప్ర శాపము వినాశము సెందగ నేలె నాకము
న్నగ వరు డాయనంతు డిల నంత ధరించెను వేంకటేశ్వరా! 89.
[ధర్ముడను మనువు, నగరిపువు=ఇంద్రుడు, అగవరుడు= సర్పరాజము]
అనుదిన మెవ్వ డేని నిల నంచిత భక్తినిఁ బూజ సేసినన్
ఘనముగ నీదు భక్తులను గారవ మొప్పగ సన్నుతించినన్
వినినను నీదు గాథలను వీనుల కింపుగఁ దన్మయమ్మునం
గనికర మొప్పఁ గాచెదవు కానల నున్నను వేంకటేశ్వరా! 90.
బ్రహ్మ మహోత్సవమ్ము ధ్వజ భాసిత మాశ్వయుజమ్మునన్ ఘనా
జిహ్మ సుమంత్ర పూజితము శ్రీయుత కేశవ సమ్మతమ్మునున్
బ్రాహ్మణ రాజ వైశ్య వృషలవ్రజ సేవిత పర్వమున్ సదా
జహ్మము ముక్తి దాయకము సర్వ జనాళికి వేంకటేశ్వరా!
[అజిహ్మము= సరియైన, ఋజువైన; అజహ్మము= హృద్యము] 91.
భిదురము లౌన ఘమ్ములకు వేంకట నాథ సుకీర్తనావళుల్
వెదుక విభూతి మూలములు వేంకట నాథ సుకీర్తనావళుల్
విదితపు మోక్ష మార్గములు వేంకట నాథ సుకీర్తనావళుల్
వదలక చిత్త మందు నిడి ప్రార్థన సేసిన వేంకటేశ్వరా! 92.
[భిదురము=వజ్రాయుధము
సలుపగ నన్న దానమును సప్త కులావధి నిత్తు వన్నమున్
సలిలపు శాల లేర్పరుచ చక్కగ శీతల చిత్తు డౌదువే
ఫలిత మహీన సంపద కృపన్నరయన్ వికలాంగు లెల్లరం
జెలువపు టుత్సవాహములఁ జిత్రము సూడగ వేంకటేశ్వరా! 93.
అనయము కోపతాపముల నన్యుల కెంతయుఁ గీడు సేయుచుం
దనువుల యందు మోహమున దారుణ కర్మల నాచరించుచుం
గనులకు గోచరించగనె కాంతల నెల్లరఁ గోరునట్టి దు
ర్జనులకు విందు దండధరు సమ్మెట పోటులు వేంకటేశ్వరా! 94.
జన్మల యందు దుర్లభము చక్కటి మానవ జన్మ మిద్ధరన్
సన్మతి ధర్మసంయుతము శార్ఙ్గధ రాంచిత పాద చింతనా
తన్మయ పారవశ్యమునఁ దామర సాక్ష సుపూజలం బున
ర్జన్మ నివృత్తి సేకురు నసత్యము గాదిల వేంకటేశ్వరా! 95.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేంకటనాథుని స్మరణా
తొలగించండిలంకృత జీవనము మనసు రంజిల జేయున్
సంతస మొసగును నిరతము
సంకటముల బాపుచు నిట జయము
నొసంగున్!
జన్మలన్నిటికంటెనుజన్మమరయ
రిప్లయితొలగించండియిలనుమానవజన్మయేమేలుగదర
బుధ్ధితెలివియుజ్ఞానాన బూర్ణుడగుచు
మానవత్వముతోడనమసలుచుండు
శర్మ గారు అన్నయ్య ధన్యవాదములు. శర్మ గారు "పంకజ నేత్రుడు నిరతము" అనండి బాగుంటుంది (ప్రాస దోషము పోయి).
రిప్లయితొలగించండికవివరేణ్యులు కామేశ్వర రావుగారూ మన్నించాలి.... గమనించలేదు..... సవరణతో:
తొలగించండివేంకటనాథుని స్మరణా
లంకృత జీవనము మనసు రంజిల జేయున్
పంకజ నేత్రుడు నిరతము
సంకటముల బాపుచు నిట జయము
నొసంగున్!
కవివరేణ్యులు కామేశ్వర రావుగారూ మన్నించాలి.... గమనించలేదు..... సవరణతో:
తొలగించండివేంకటనాథుని స్మరణా
లంకృత జీవనము మనసు రంజిల జేయున్
పంకజ నేత్రుడు నిరతము
సంకటముల బాపుచు నిట జయము
నొసంగున్!