20, మార్చి 2017, సోమవారం

పద్యరచన - 1229

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

35 కామెంట్‌లు:

 1. చంద్రమౌళి సూర్యనారాయణ గారి కోరిక మేరకు 'పద్యరచన' శీర్షికను పునఃప్రారంభించాను. చూడాలి... ఈ శీర్షికకు వచ్చే పద్యాలను, సమస్యాపూరణలను, వాట్సప్ పూరణలను సమీక్షించే తీరిక, ఓపిక ఎంత ఉంటుందో?

  రిప్లయితొలగించండి
 2. ఆడపిల్ల యంచు యల్పంబు జేయకు
  యాడపిల్ల యేర యాదరింప
  యాటపాటలాడు యాలేత ప్రాయమ

  య్యెనుగ బరువు ,బాధ్యతలనుమ్రోయ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పద్యం బాగున్నది. కొన్ని లోపాలు... నా సవరణ..

   ఆడపిల్ల యనుచు నల్పంబు జేయకు
   మాడపిల్లయె గద యాదరింప
   నాటపాటలాడు నాలేత ప్రాయమ
   య్యెనుగ బరువు, బాధ్యతలను మ్రోయ!

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారము! మీ యాత్ర నిర్విఘ్నంగా జరిగినందుకు అభినందనలు!
   మీ సవరణలు అమూల్యము! ఇన్ని రోజులు వాటికి దూరమైన బాధ కలిగింది!
   ధన్యవాదములు!

   తొలగించండి
 3. చిన్న నాటి నుండి చేదోడు అమ్మకు
  పనులు జేయు టన్న పరమ ప్రీతి
  బరువు పంచు కొనగ బాధలే దటంచు
  కష్ట పడుట కెపుడు నిష్ట బడుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పద్యం బాగున్నది.
   'చేదోడు+అమ్మకు' అన్నపుడు సంధి నిత్యం. "చేదోడు తల్లికి" అనండి.

   తొలగించండి

 4. రిక్షాలోనెక్కి బడికి
  శిక్షణకైవెళ్ళుచున్న చిన్నారులనున్
  రిక్షా త్రొక్కెడి బాలిక
  తీక్షణమౌ యెండలోన తిలకించెడిదిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పద్యం బాగున్నది.
   "చిన్నారులఁ దా...తిలకించెనుగా" అనండి బాగుంటుంది.

   తొలగించండి

  2. రిక్షాలోనెక్కి బడికి
   శిక్షణకైవెళ్ళుచున్న చిన్నారులఁ దా
   రిక్షా త్రొక్కెడి బాలిక
   తీక్షణమౌ యెండలోన తిలకించెనుగా

   తొలగించండి
 5. రిక్షా ద్రొక్కుచు బాలిక
  శిక్షణ కై బోవుచున్న చిన్నారులరన్
  దీ క్షగ జూచుట నరయగ
  శిక్షణకును దానుగూడ జేరును నేమో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది.
   "చిన్నారులఁ దా" అనండి.

   తొలగించండి
 6. అరువుకు తెచ్చిన బండిన
  పరుగులు పెట్టుచు నెగిరిరి పక్షుల వోలెన్;
  బరువులు మోయుచు వగచిరి
  సరకులు మోసెడి పశువుల శ్రాద్ధపు రీతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'బండిని' అనండి. ఇకారాంత పదాలకు 'న' ప్రత్యయం చేరదు.

   తొలగించండి
 7. . *చిత్రానికి పద్యము*

  బుడతలు ప్రగతిని గోరుచు
  బడిపథమున కదులుచుండ బాధ్యత పెరుగన్
  బడుగుల జీవన రథమది
  యొడుదుడు కులబాటపట్టె నుర్విన గనరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పద్యం బాగున్నది.
   'ఉర్విని' అనాలి. ఇకారాంత పదాలకు 'న' ప్రత్యయం చేరదు.

   తొలగించండి
 8. పరితోషమ్మొక వైపునఁ
  బరితాపము వేరొక దెసఁ బరికించంగన్
  వరమాయె వారికిఁ జదువఁ
  దరమే తన కంచు బాల దలచెను మదిలో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   పరితోష పరితాపాలను చిత్రించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 9. స్కూలుకు బోయెడి పిల్లల
  హేలను గమనించితాను యేవిధి యటులన్
  మేలుగ బోవుదునోనని
  బాలయె మదిదలచుకొనుచు బండిని నడిపెన్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   చక్కని పద్యం. అభినందనలు.
   'తాను+ఏవిధి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "హేలను తాను గమనించి యేవిధి నటులన్...బోవుదునో యని..." అనండి.

   తొలగించండి
 10. రిక్షా బాలిక
  శా. ఏ జన్మంబున జేయు పాపమొ గదా! యీబాల యీతీరుగా
  నీజన్మంబున బేదయై బ్రతుకుకై యేమార్గముం గానమిన్
  రోజీరీతిగ బండి లాగును భువిన్ రూపంబు క్షీణించు న
  ట్లాజీవం బిటులే తపించ వలెనా? హర్షంబు చేకూరదా? ౧.

  సీ. తనయీడు వారంద రనునిత్యమును విద్య
  లందంగ బడికేగు చందము గను,
  తల్లిదండ్రులు వారి కెల్లసౌకర్యంబు
  లొనగూర్చు చుండ దా గనుచు నుండు,
  చీకుచింతలు లేక యేకాలమును వారు
  తిరుగుచుండుట నెప్పు డరయు చుండు,
  కౌటుంబికములైన లోటుపాట్లన్నింట
  దూరమై హర్షించు తీరు గాంచు
  ఆ.వె. తనకు శాపమైన ఘనతర దారిద్ర్య
  మెట్టు లొదవె ననెడి గుట్టు తెలియ
  కనుదినంబు తాను పనులిట్లు చేయుచు
  వికల యౌచు తిరుగు నకట బాల. ౨.

  సీ. మదిలోన నున్నట్టి చదువు నేర్చుటయన్న
  కోరిక సఫలమౌ తీరు లేక,
  పెద్ద లందరి జేరి ముద్దు లందుట కోస
  మిరవైన మార్గంబు నెరుగ లేక
  తోటి వారలలోన మేటియై క్రీడించు
  సమయ మొక్కింతైన నమర కునికి
  సమసమాజము నందు తమ కెవ్వరుంగాని
  సాయ మించుకయైన చేయ కునికి,
  తే.గీ. బాల బ్రతుకగ బండిని బేల యగుచు
  లాగు చుండిన దాకలి కాగలేక
  ఆదుకొనియెడి దైవంబు లే దటంచు
  మిగుల పేదరికంబున వగచుచుండి. ౩.  కం. ధరణిని జననం బందున
  మరణించెడి వేళనైన మనుజులకు ధనం
  బరయగ నంటదు కాదా
  నిరుపేదలు ధనికు లేల? నిఖిల జగానన్. ౪.

  చం. అబలను గాను నేననుచు నందరికిన్ విశదంబు చేయుచున్
  సబలను గాంచు డీరలని చాటెడు రీతిగ విశ్వ మంతటన్
  బ్రబలిన న్యూనతన్ దునిమి బండిని ద్రొక్కు సమర్థురాలుగా
  సొబగులు చూపు నాయమకు చూడ నసాధ్యము లేదు పృథ్విలో. ౫.

  కం. నీతో పోటీ పడగల
  నీ తీరును జూడు మనుచు నింపలరంగా
  చేతంబు దెలుపు రీతిగ
  నాతని వెనుదిరిగి చూచు నాయమ కనగాన్. ౬.

  కం. ఘోరం బగు దారిద్ర్యము
  చేరిన యడలంగ వలదు శ్రీప్రద మనుచున్
  ధీరత్వము గోల్పోవక
  ధారుణి గష్టించ దీరు తథ్యము కాంక్షల్. ౭.

  ఆ.వె. అబల లైన నేమి యానందచిత్తులై
  శ్రమకు జంక కుండ సడలకుండ
  పేదవార మనుచు మోదంబు గోల్పోక
  నిలుతురేని భువిని కలుగు సిరులు. ౮.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మళ్ళీ మీ ఖండకృతులను చదివి ఆనందించే అవకాశం లభించింది. అద్భుతమైన ఖండిక. అభినందనలు.
   దీనిని శంకరాభరణం వాట్సప్ సమూహంలో ప్రకటించాను.

   తొలగించండి
  2. ఆర్యా!
   ధన్యవాదములు.
   శంకరాభరణం వాట్సప్ సమూహంలో 9441320381 అను నా వాట్సప్ నంబరును జోడించ ప్రార్ధన.

   తొలగించండి
 11. తన యీడు పిల్లలు చురుకు
  తనముగ చిత్తమిడి చదువ తా నొంటిగ యా
  తనయ బరువు బాధ్యత పె
  త్తనమును మ్రోయ పసిడి పసితనమే పోయెన్ ౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తంగిరాల రఘురామ్ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   "తా నొంటిగ నా" అనండి.

   తొలగించండి
 12. ఆడుచు బాడు ప్రాయమున నండగ నండుచు దల్లిదండ్రికిన్
  వేడుక జేయ నెంచి యభివృద్ధిని బొందగ చిన్న నాడె చే
  దోడుగ నిల్చి తాను పరితోషముతోడ కుటుంబ వృద్ధికై
  యాడుదియైన కష్టపడుచు హాయిగ రిక్షను ద్రోలుచుండెడిన్!

  రిప్లయితొలగించండి
 13. చదువుల నెరుగని జీవన
  చదరంగములోన బాల సాగెను వడిగా
  నుదయపు సూరీడు పగిది
  వెదజల్లుచు తనదుకాంతి విధులను సల్పెన్

  రిప్లయితొలగించండి
 14. బాలిక చదువుకు దూరము
  ఏలిక నిత్యమ్ము రిక్ష ఎక్కగ జేసేన్
  తోలెను కుటుంబ బండిని
  పాలితులేమైననేమిపట్టని ప్రభుతన్

  రిప్లయితొలగించండి
 15. ఒకదెసనుబడిపిల్లలునొక్కవైపు
  కష్టజీవియౌబాలిక కర్మయిదయె
  పేదరికమీవిధంబుగ వేరుచేసి
  ఆటలాడుచుండెనుగదాయవనియందు

  రిప్లయితొలగించండి
 16. కం.
  రిక్షాత్రొక్కుచుబాలిక
  రక్షగతానిలచెనింట ,రాణిగవెలిగెన్
  భక్షించగనయమార్గము
  దీక్షగగైకొన్న బాల ,ధీరతగనుమా.

  రిప్లయితొలగించండి