2, మార్చి 2017, గురువారం

సమస్య - 2297 (ముగురు స్త్రీల మగఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి"
(గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ"

79 కామెంట్‌లు: 1. శీర్ష మందు గంగ చెంతన నగజాత
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి
  మూడవ యువతి యెవరూ యన్నది సమస్య
  పూరణ యెటులనగ గూర్తు వమ్మ ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   కాని మూడవ, నాల్గవ పాదాలలో యతి తప్పింది. "మూడవ యువతి యెవరో డౌటు కలిగె స।మస్య పూరణకును మార్గ మేది?" అందామా?

   తొలగించండి
 2. ఒకతె దూకె మంట నోహొ మండి పడుచు;
  ఒకతె దూకె నెత్తి నోహొ! యనుచు;
  ఒకతె దూకె ప్రక్క నోహొ హాయి యనుచు;
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   సతీదేవి,గంగ, పార్వతుల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని మంటలో దూకిన సతియే మరోజన్మలో పార్వతియై శరీరార్ధభాగం పొందింది కదా! ముగ్గు రెలా అవుతారు?

   తొలగించండి
  2. సార్! "బ్రతికియున్న స్త్రీలు" అనలేదు గదా సమస్యలో! లాయరు వద్దకు వెళ్ళ వలె ;)

   తొలగించండి
  3. క్రింద గరికిపాటి వారి పూరణ ఇచ్చాను. వారు మీ వలెనే సతీదేవి, పార్వతి, గంగ... ముగ్గురు భార్యలని చెప్పారు. కనుక మీ పూరణ గ్రాహ్యమే. ఆ ముగ్గురికీ తండ్రులు వేరు వేరు (దక్షుడు, హిమవంతుడు, విష్ణువు) కదా! సరిపోయింది. (వేరే లాయర్ ఎందుకు? గరికిపాటి వారి జడ్జ్‌మెంటు ఉండగా!).

   తొలగించండి
 3. తగ్గుము డాంబికం బులిక తన్మయ మొందుచు పొంగి పోవుటన్
  ముగ్గురు సుందరీ మణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ
  భగ్గున మండిపో వుదురు భర్తకు మూడవ దేడ నుండెనో
  ఎగ్గులు మానిముం దుగను వేరొక రెవ్వరొ పేరుచెప్పుమా
  -------------------------------
  శిరము పైన నొకరు స్థిరము గానుండె
  సగము దేహ మనుచు సదురు కొనెను
  ముద్దు మోము తోన మురిపించి యెటజేరె
  ముగురు స్త్రీల మగ@డు మొదటి యోగి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. 'స్థిరముగా నుండెను' అనండి.

   తొలగించండి
 4. డా.పిట్టా సత్యనారాయణ
  అవ(కతవక)ధూత యర్చనా విధులలో
  సేవలొంటరిగను చేయ చెలులు
  ఎవరికెరుక లెక్క యెంతవారైనను
  ముగురు స్త్రీల మగడు మొదటి యోగి!

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా సత్యనారాయణ
  చెత్తయెక్కువైన చేరుదుమట బాప
  దేహ భ్రాంతులిట్లె దీప్తి గూడు
  ఎడమ,కుడిన నీడ్చ నెగసి గోచినిబీక
  ముగురు స్త్రీల మగడు మొదటి యోగి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  ముగ్గునదింపిరాతనిని "మూడు ఋణంబులు జీవికం"చు నే
  ఎగ్గులు లేక గొన్న సతి యెప్పుడొ చావగ మారుమన్వునన్
  దగ్గర యైన దాయువతి దండుకొనన్ తనకున్న సంపదన్
  గగ్గలమైన జీవితము గాంచియు నొక్కతె కోర్టు కెక్కగా
  బుగ్గియె పితృ,దేవ ఋణపుంజము సద్గురుకైన యప్పునున్
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాది యోగిరా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 7. దశరథుండు నాడు ధరణీతలంబందు
  ముగురు స్త్రీల మగఁడు, మొదటి యోగి
  భక్తు డతని సుతుడు, పరికింప నవ్వాని
  వినుతి చేయు యోగి వీర్యజుండు.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వీర్యజుడు' అంటే పుత్రుడు. ఇక్కడ 'యోగి పుత్రు' డెవరు?

   తొలగించండి
  2. ఆర్యా!
   రుద్రవీర్య సముద్భవుఁడు హనుమంతుడు కదా.

   తొలగించండి
  3. నిజమే! ఆ విషయం స్ఫురణకు రాలేదు. మన్నించండి.

   తొలగించండి
 8. డా.పిట్టానుండి,ఆర్యా,శ్రీ గ॥పా॥వారి పూరణం చూడాలని ఆసక్తి మెండయె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా.గిరికిపాటి వారి ధార-ధారణ, ద్విశతావధానము అనే రెండు పుస్తకాలు అంతర్జాలంలో దొరికాయి. అందులోని సమస్యలను మాత్రమే ఒకచోట ఎత్తి వ్రాసుకున్నాను.ఇప్పుడు పూరణలకోసం ఆ పుస్తకాలను వెదికితే దొరకడం లేదు. అయినా ప్రయత్నిస్తాను.

   తొలగించండి
 9. గరికిపాటి నరసింహ రావు గారి పూరణ.....

  తగిన భార్య సతియె, ధవళాద్రి విభునకు
  నామె మరల పుట్టి యాలు నయ్యె
  నెత్తి నొక్క భార్య నృత్యమ్ము చేయఁగా
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి.

  రిప్లయితొలగించండి


 10. శీర్ష మందు గంగ చెంతన నగజాత,
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి
  యని జనుల పలుకుల యారడి తప్పును
  కోరినదిక చాలు, కోకనదుడ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. జిలేబీ గారూ,
  బాగుంది ఈ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. గంగభార్యగాదు గంగాధరునకును
  సతియు నొకతె, గిరిజ, సతియు నొకరె
  శంక యేల నరుడ శాంకరి భర్తకు
  ముగురు స్త్రీల? మగఁడు మొదటి యోగి.


  రిప్లయితొలగించండి
 13. వదనమందు వాణి,హృదయమందున రమ
  శైలజ సగమౌచు చక్కనుండు
  స్వాములొక్కటైన ప్రభువయ్యె దత్తుండు
  ముగురు స్రీల మగడు మొదటి యోగి

  (తప్పొప్పుల నిర్ణయం బుధజనులదే)

  రిప్లయితొలగించండి
 14. తలఁపు మాట చేత తా మొకటై యున్నఁ
  జాలు; వాటి కేల సవతిపోరు?
  రీతి నదుపున నిడు త్రికరణము లనెడు
  ముగురు స్త్రీల మగడు మొదటి యోగి.

  రిప్లయితొలగించండి
 15. వరుసగ నరుదెంచు వరయోగులకు మ్రొక్కె
  ముగురు స్త్రీల మగఁడు; మొదటి యోగి
  "శుభము నీ కగు" ననె; శోకార్తుఁడై వాఁడు
  'సన్యసింతుఁ గోర నన్య" మనెను.

  రిప్లయితొలగించండి
 16. నెగ్గినవాడు యుద్ధముల నిర్జరకోటికి సాయముండి యా
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె, యాదియోగియౌ
  నగ్గిరిజాధవుం గొలుచునట్టి రఘూత్తము తండ్రి యాతడే
  దిగ్గజ మట్టు లీధరను ధీరత దాల్చినవాడు చూడగన్.
  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ ప్రత్యేక ప్రశంసకు అర్హమై శోభిస్తున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. అర్ధ భాగ మైన యా పార్వతే గాక

  శిరముపయి వసించు సిద్ధ గంగ

  దక్ష యజ్ఞ మందు దహనమయిన సతి

  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పార్వతియె గాక' అనండి.

   తొలగించండి
 18. భరణికోసలంపుబతియదశరధుడు
  ముగురుస్త్రీలకుమగడు,మొదటియోగి
  ముగురుకాంతలుండుమృడుడునుబుడమికి
  యోగివరులకతడునొజ్జసుమ్ము

  రిప్లయితొలగించండి
 19. దేహ మందు సగము తీసు కొన్నది యుమ
  ప్రేమ మీర చూడ వింత గంగ
  యాక్రమించె నంత యతివ జటా జూట
  ము గురు స్త్రీల మగఁడు మొదటి యోగి

  [గురుస్త్రీలు = గొప్పభార్యలు; మొదటి యోగి = ఆది బిక్షువు, శివుడు]


  అగ్గలమైన ప్రేమ కడు నద్భుత భక్తియు పారవశ్యముం
  దగ్గని యాత్మ గౌరవము దాల్మి దయార్ద్ర హృదంబుజంబునున్
  బెగ్గల మెంచ సుంత కనిపించని చంద్రముఖుల్ మహా పయో
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ

  [పయోముక్ + గురు = పయోముగ్గురు: మేఘనిభాలఘువులు; పయోముచ్ = మేఘము; ఆది యోగి = ఆది బిక్షువు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారికి సహదేవుడు గారికి నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
   మొదటి పూరణలో వైవిధ్యమైన ఆలోచన. కాని 'గురుస్త్రీలు' సంస్కృత సమాసమై 'రు' గురువై గణదోషం కదా!

   తొలగించండి
 20. ఉమను వామ భాగమమర జేసి, జడల
  గంగనుంచి,పురము కాశి,యనెడి
  నింతి గూడి యున్న నీశుడే నెంచగా
  ము గురు స్త్రీల మగఁడు మొదటి యోగి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...నీశుడే యెంచగా' అనండి.

   తొలగించండి
 21. జగ్గయశాస్ర్రియేపలికెసాదరమొప్పగశంభుడేకదా
  ముగ్గురుసుందరీమణులముద్దులభర్తయె,యాదియోగియౌ
  నగ్గలమైనరక్తినిలనాశ్రితభక్తులవాంఛితంబుల
  న్నెగ్గులురానిచొప్పునననీశుడుతప్పకతీర్చునేసుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   (ఈమధ్య వృత్తరచనలో చక్కని ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సంతోషం!)

   తొలగించండి
  2. గురుదేవులకునమస్కారములతో...ఆవృత్తరచనాప్రావీణ్యత మీయాశీర్వాదమువలననే

   తొలగించండి
 22. ధ్యానమున వివేకి ఙ్ఞానియై శోభిలు
  బుద్ధి నిలుపగ నగు శుద్ధ యోగి
  ధ్యానము మఱి బుద్ధి, ఙ్ఞానము లనబడు
  ముగురు స్త్రీల మగడు మొదటి యోగి!

  రిప్లయితొలగించండి
 23. దార లెంతమంది దశరథునకు భువి?
  వల్లకాడె తనకు వాసమవ్వ
  తిరిపెమెత్తుకొనెడు దేవేశుడెవ్వరు?
  ముగురు స్త్రీల మగడు, మొదటి యోగి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. వాట్సప్ సమూహంలో నా సూచనలను గమనించండి.

   తొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు:
  01-03-2017
  కుదిరికతో జేజేలను
  వదినా! నీకందజేతు; స్వర్గ సుఖమ్ముల్
  చదురుగ నీకందించెడి
  పదురగు నన్నకు నతులను పఱచెద నిచ్చల్
  02-03-2017
  క్రమముగ శచి గిరిజ గంగను గూడిన
  ముగురు స్త్రీల మగడు మొదటి యోగి
  నౌ యఖిల గురుండు ననయము మమ్మిల
  నెంతయు పొదిలించి నిలుప గలడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శచి... సతి'

   తొలగించండి
 25. క్రొవ్విడి వెంకట రాజారావు:
  01-03-2017
  కుదిరికతో జేజేలను
  వదినా! నీకందజేతు; స్వర్గ సుఖమ్ముల్
  చదురుగ నీకందించెడి
  పదురగు నన్నకు నతులను పఱచెద నిచ్చల్
  02-03-2017
  క్రమముగ శచి గిరిజ గంగను గూడిన
  ముగురు స్త్రీల మగడు మొదటి యోగి
  నౌ యఖిల గురుండు ననయము మమ్మిల
  నెంతయు పొదిలించి నిలుప గలడు

  రిప్లయితొలగించండి
 26. అగ్గలమైన శౌర్యముననాజి నధీశుల వంచి నేర్పుతో
  మ్రగ్గుచు పుత్రసంతతికి మన్యువు చేసిన రాజు యెవ్వరో?
  అగ్గలమైన కోపమున నాహుతి చేసె పురమ్ములెవ్వరో?
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె, యాది యోగిరా
  మన్యువుః యాగము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెడ్డి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాజెవండొ తా। నగ్గలమైన...' అనండి.

   తొలగించండి
 27. దక్ష పుత్రి యొకతె తలపై మరియొకతి
  అర్థభాగ మందునాలి యొకతి
  యద్భుతమ్మె కనగ నాదిశంకరుడంట
  ముగురు స్త్రీలమగడు మొదటి యోగి.

  బుగ్గిగ మారెనే కినుక బూనిన దక్షుని పుత్రికొక్కతిన్
  నెగ్గగ దల్చి జూటమున నిల్పెను యోషిత జాహ్నవిన్ గదా
  యగ్గిరి రాజసూతనట యన్నుల మిన్నయనంగ నొప్పునా
  ముగ్గురు సుందరీ మణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ

  రిప్లయితొలగించండి
 28. నిదుర లోన తాను పదిలమై యుండగ;
  కలల లోన తాను కమ్మ గుండె;
  మెలకు వందు తాను కలతలం దుండగ;
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శ్రీ శంకరయ్య గారి "త్రికరణము" లను అనుసరిస్తూ...

   తొలగించండి
  2. తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణః
   అవస్థాత్రయ సాక్ష్యస్మి అహమేవాహమవ్యయః

   -- బ్రహ్మజ్ఞానావళి మాల (ఆది శంకర భగవత్పాదులు)

   తొలగించండి
  3. శాస్త్రి గారూ,
   చైతన్య, స్వాప్నిక, సుప్తావస్థల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. లగ్గము నాటినుండి మది లావుగ కోరగ పుత్ర సంతతిన్
  పగ్గము లేనికోరికల, పాయసమివ్వగ యాగశాలలో
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె, యాదియోగియే
  తగ్గక,నుగ్గడించె వరదాతగ నల్వురు సంతు నిచ్చుచున్

  రిప్లయితొలగించండి
 30. * తగ్గక బెంగదీర్చె వరదాతగ నల్వురు సంతు నిచ్చుచున్

  రిప్లయితొలగించండి
 31. ఆదినగ్ని దూకె నమ్మ సతీదేవి
  హైమవతిగ వచ్చె నా మగువయె
  నెత్తినెక్కె గంగ నిబ్బరముగ నిల్వ
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి

  రిప్లయితొలగించండి
 32. గంగ జుట్టున తను కాపురముండగ?
  సతియు,పార్వతి శివ సతులుగాగ
  మూడు కనుల వాడు|ముల్లోక మెంచగ
  ముగురు స్త్రీల మగడు మొదటియోగి|
  2.ముగ్గురు మూర్తులందునతి ముఖ్యుడుశంకరుడయ్యు,దక్షుడే
  తగ్గక కూతురౌ సతియె “ధర్మ విరుద్ధమునందుచావగా|
  నెగ్గియు గంగ,పార్వతులు నేర్పున శంకరునందు భార్యలై
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ|

  రిప్లయితొలగించండి
 33. నా మూడవ పూరణ....

  కలరు యోగి పేరఁ గార్యాలయములోన
  నిద్ద, రందొకనికి ముద్దుభార్య
  గలదు, పనియు కావ్యకరణమ్ము సతులైరి,
  ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి.

  రిప్లయితొలగించండి
 34. ఇత్తువ్యవధానమికపైననెక్కడెకడ
  యవసరమ్మనితోచునోనక్కడకడ
  సామి!మన్నించుడిప్పుడుసదయనుమరి
  వేడుచుంటినిమిమ్ములవినయముగను

  రిప్లయితొలగించండి
 35. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  ద్రౌపది సీతయిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా
  రూపములొక్కటౌచు నపురూపముగాగనిపించెనంచు నా
  రూపకముల్ ద్వయంబుగని రుద్రయపల్కగ దర్శకుండనెన్
  దాపరికంబులేదుబుగతా! నటి యొక్కతెచూడుమా యనెన్

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  గురుదేవా! సవరించాను ఆశీర్వదించండి🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 36. *సహస్రకవిభూషణ శ్రీమతి సందితబెంగుళూరు*

  బుగ్గననెత్తిపైనెనరుపొంగగచల్లగనిల్చెగంగ తాన్
  భగ్గని పోరబోకతనువందునఁదాన్ సగమయ్యెనంబ తా
  నెగ్గెనుప్రేమజూపియనినిక్కముపల్కెపతివ్రతామణుల్
  ముగ్గురు! సుందరీమణుల ముద్దుల భర్తయె ఆదియోగియౌ

  *సహస్రకవిభూషణ శ్రీమతి సందితబెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 37. సిగ్గరి యొక్కదౌ వనిత చిందులు త్రొక్కగ నెత్తిమీదనున్
  సిగ్గరి యొక్కదౌ వనిత చిందులు ద్రొక్కుచు నగ్నిదూకగా
  సిగ్గరి యొక్కదౌ వనిత సిగ్గును వీడుచు నర్ధభాగమై
  ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ

  రిప్లయితొలగించండి