24, మార్చి 2017, శుక్రవారం

పద్యరచన - 1233

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

37 కామెంట్‌లు: 1. చతురస్రాకారపుది
  న్నె తరచి జూడగను మధ్య నేర్పగు గుండ్రం
  బు తనకు జత పొత్రంబగు
  ను, తరుణి నేటి దినముల గనుట కుదరదుగా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగుంది. మూడు పాదాల్లో ప్రాసాక్షరంతో పదాన్ని మొదలు పెట్టడం ప్రశంసనీయం. అభినందనలు.

   తొలగించండి


 2. రుబ్బురోలును జూడగానటు రుబ్బవమ్మ జిలేబిలా
  సుబ్బురమ్ముగ పద్యమొక్కటి చుర్రుగాసరి జోడువై
  యబ్బురమ్ముగ నుండగా మరి యయ్యవారలు మెచ్చగన్
  మబ్బువీడగ సుబ్బురమ్ముగ మత్తుగా మరి జోగవే :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ మత్తకోకిల బాగుంది. అభినందనలు.
   `సుబ్బు(బ్బ)రమ్ము' ఒక్కటే గ్రామ్యం. అదీ పునరుక్త మయింది.

   తొలగించండి
 3. రిప్లయిలు
  1. పూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణతో:


   అబ్బుర మీ మన జంత్రము
   జబ్బల బలమున్న చాలు జాప్యమ దేలా!
   డబ్బులతో పని లేదుర
   రుబ్బుడు రోలిదియె యాహ! రుబ్బగ చట్నీ!

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   జబ్బల బలమేమో కాని మీ మేధోబలంతో చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

   తొలగించండి
 4. పొత్రముతో గల రోలది
  చిత్రంబున జేరియుండె క్షేమంకరయై
  మైత్రిని బంచుచు నుండును
  ధాత్రిని గృహిణులకు నెపుడు తన్మయ యగుచున్.

  పలు రకముల వంటకముల
  కిలలో రుచి గూర్చునట్టి యింపగు లేహ్యా
  లలవోకగ నందించుచు
  నిలుచును హితకారి యౌచు నిష్థాగరిమన్.

  గారెలు మొదలగు వాటికి
  కోరికతో పప్పు రుబ్బ గూరిమి జూపున్
  వారించదు తానెప్పుడు
  మీరిన యాదరముతోడ మేదిని పైనన్.

  పొత్రము బట్టుచు తనపై
  చిత్రముగా ద్రిప్పువారి శ్రేయమె గోరున్
  శత్రుత్వం బిల తానే
  మాత్రంబును దాల్చబోదు మనుజులతోడన్.

  రోకటి పోట్లకు నదరక
  సాకతమున కాంక్ష దీర్చి సర్వ జనాలన్
  శ్రీకరయై దయ జూచెడి
  నీకు నులూఖల యశంబు నిరతం బందున్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ ఖండిక అద్భుతంగా, రసవంతంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
   దీనిని వాట్సప్ సమూహంలో ప్రకటిస్తున్నాను.

   తొలగించండి
 5. అబ్బబ్బొ రుబ్బు రోలిది
  తబ్బిబ్బును బడక రుబ్బు తాలిమితో నీ
  జబ్బలు నొప్పులు పెట్టును
  రుబ్బిన యా పిండివంట రుచిబాగుండున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పద్యం అబ్బా అనిపించింది. చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 6. ...రుబ్బు రోలుకు క్షమాపణ...

  అబ్బా! రుబ్బితి! తిట్టకు
  మిబ్బందైనదిర! ముష్టి మిక్సీ యెగిరెన్
  కొబ్బరి చట్నీ కావలె
  సుబ్బవ్వకు మనుమరాలి శుభ కార్యమునన్

  రిప్లయితొలగించండి
 7. పంచభక్ష్యములను పళ్ళెమందుంచిన
  రోటిపచ్చడిఁ గొన రోయుచుంద్రు
  ఆంధ్రులు తిను నట్టి యమృతమే యయ్యది
  మరువలేరు రుచిని ధరణి నెవరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   'రోయుచుందు। రాంధ్రులు...' అనండి.

   తొలగించండి
 8. తంత్రము సేసి కను గొనిరి
  యంత్రము లిక రుబ్బుఱోలు లంతర్హితముల్
  మంత్రము లవి నిక్కంబుగ
  నాంత్రముల సురక్షణకట వ్యాయామమునన్

  రిప్లయితొలగించండి
 9. రుబ్బు రోలును పొత్రము లబ్బురంబు
  జూసి వాటిని నాయెను సుమ్ము చాల
  కాల మార్య!యి కకనగ గాలు వోలె
  దోచె నాదు మ ది కదియ తులక రించె


  రిప్లయితొలగించండి

 10. ~~~ మూడు పాదాల్లో ప్రాసాక్షరంతో పదాన్ని మొదలు పెట్టడం ప్రశంసనీయం. అభినందనలు.

  @ కంది వారు


  మీ ప్రశంసలకు నెనరులు !

  పదాాలని పేర్చుకుంటూ పోవడం మాత్రమే ! మీ సహృదయ హృదయ పరిశీలన కి జోహారులు !

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. వంటయింటి జంట వాలుజడల పంట
  పుట్టినింటి వారు కట్ట బెట్ట
  పప్పు రుబ్బ గాను పండుగ పూటను
  నిప్పటులకు పిండి నింపు గాను
  యెప్పుడనగ నప్పు డింతిచేతి చెలియ
  సంత సంబు గూర్చ సతికి నెపుడు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ఆటవెలది నాలుగు పాదాలే. చివరి రెండు పాదాలు లేకున్నా భావానికి లోటు లేదు.

   తొలగించండి
 12. నిప్పట్లు= అరిసెలు. నెల్లూరి భాషలో!

  రిప్లయితొలగించండి
 13. అమ్మ చేసిన పచ్చళ్ళ కమ్మ దనపు
  రుచుల ఙ్ఞప్తికి దెచ్చె నీ రుబ్బు రోలు!
  పచ్చడిని రుచి జూడగ వచ్చి నంత
  నమ్మ మమకారమును గూడ నందు కొంటి!

  రిప్లయితొలగించండి
 14. ఇబ్బడి ముబ్బడి సుబ్బడు
  డబ్బులు పదివేలు పోసి డంబము జూపన్
  రుబ్బెడి యంత్రము కొనగను
  సుబ్బులు మఱి రుబ్బుఱోలు సోకున విడిచెన్

  రిప్లయితొలగించండి
 15. నడిఝామున లేచి పడతి
  వడివడి వడియాల పిండి వాయల వారిన్
  నడుమెత్తక సుతిమెత్తగ
  సుడిగుండము వోలె రుబ్బు సొంపుగ రోలన్!

  రిప్లయితొలగించండి
 16. రుబ్బురోలనంగ జబ్బల కరిగించు
  జంత్రమిదియె గనుడు జగతియందు
  పట్టుదలను చూపి పచ్చడి చేయంగ
  నావు రావు రంచు నారగింత్రు.

  పలురకమ్ములైన పచ్చళ్ళ నిలలోన
  చేయవచ్చు గనుము చిటికె లోన
  రోటి పచ్చడన్న నోటికి హితమౌన
  టంచునుందు రెల్ల రవని యందు

  విద్యుతాగునన్న వెతయు కలుగ బోదు
  పొత్రమున్నచాలు చిత్రముగను
  పుడమి యందు చూడ పూర్ణము నైనను
  రుబ్బవచ్చు గనుము సుబ్బరముగ

  రుచిగ దీని యందు రుబ్బవచ్చును పిండి
  చేతుల కిల మంచి సేవ యౌను
  పడతు లెల్ల మెచ్చు పచ్చని గోరింట
  యాకు నిందు రుబ్బహర్షమొదవు.

  రిప్లయితొలగించండి
 17. చిత్రముగ నాంగ్ల వనితలు
  సత్రములో దడుసుకొనుచు సణుగుడు వినగన్
  మిత్రులు చెప్పిరి రుబ్బుడు
  పొత్రము రోలున తిరిగెడు పోరది లలనల్!

  రిప్లయితొలగించండి
 18. ఆలియువోర్పు,నేర్పు తనకందిన రీతినరోలు యుండగా
  జాలిగ నున్నభర్త సహచర్యల చేతను రుబ్బనెంచగా
  మేలిడు రుబ్బు,రోలు పరమేశ్వరలింగము పానివాట్టమౌ|
  తాలిమియందు రోలిడెడితత్వము తన్వికి నబ్బె విశ్వమున్|
  2.రుబ్బు,రోలుశిల్పిరూపకల్పనజేయ?
  ప్రజలమేలుకొరకె|ఋజువులెన్నొ
  స్వార్థ పరత లేని సహనంబుగలిగిన
  విలువయింటనుండపేదకెపుడు|  రిప్లయితొలగించండి