కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే"
లేదా...
"భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై"
ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే"
లేదా...
"భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై"
ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
శక్తిసహితుడగు శివునను
రిప్లయితొలగించండిరక్తిగొలుచు కాళిదాసు రమ్యత తోడన్
యుక్తిని పాండిత్య మడుగ
భక్తుని బూజింపవచ్చె భారతి తానే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియుక్తిన్, శక్తియు, భక్తియు,
రిప్లయితొలగించండిముక్తిం గొను మార్గమరసి పుంభావమునన్
రక్తిం గైతల నిడ నా
భక్తుని బూజింప వచ్చె భారతి తానే!
రక్తి గలిగి మన తెలుగున
రిప్లయితొలగించండిశక్తి యొకింతయును లేని శాస్త్రిని బ్రోవన్
యుక్తిగ నంతర్జాలపు
భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే
భారతి = "ఆంధ్రభారతి" నిఘంటు సంకలనము
శాస్త్రి = ప్రభాకర శాస్త్రి (భవదీయుడు)
పూజ = (అంతర్జాల) పత్ర పూజ
తొలగించండి
రిప్లయితొలగించండిశాక్తం బెవరికొరకు, తా
ముక్తిని గన భక్తుడేమి ముంగట జేయన్ ?
శక్తి యెవరు పూరణకున్ ?
భక్తుని; బూజింప వచ్చె ; భారతి తానే
జిలేబి
శక్తిని ధారవోసి నరసంఘలలాటసహస్రపంక్తి నా
రిప్లయితొలగించండిసక్తిగ భావిఁ, గర్మములు జన్మలు లెక్కిడి వ్రాయుచున్ దివా
నక్తము లెంచకుండుటను, నారదు తండ్రిని విష్ణుమూర్తి స
ద్భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై.
ఉక్తికి నోచని రోగిని
రిప్లయితొలగించండిభక్తుని పూజింపవచ్చె భారతి తానే
వ్యక్తమయి శక్తినిడగా
రక్తము చిందించి కావ్యరచనన్ఁజేసెన్
(జబ్బు చేసి మాట పడిపోయిన సందర్భం)
డా.పిట్టా
రిప్లయితొలగించండిశక్తికి యుక్తియె ముఖ్యము
రక్తికి పాండిత్యవిద్య రచనాదులు స
ద్భుక్తికి ధనికుని కొలువే
భక్తుని బూజింప వచ్చె భారతి తానే!
డా.పిట్టా
రిప్లయితొలగించండిభుక్తికి పంతులయ్య యయి భూరి వదాన్యతనంది శిష్యునిన్
రక్తిని బెద్దజేయగను రాజ్యము లేలగ;యీతిబాధకౌ
ముక్తికి తద్గురుత్వమును మోయక దేహి యనంగరాడె స
ద్భక్తుని బూజసేయుటకు భారతి తానయి వచ్చె హంసపై!
రక్తిని నింపు కావ్యములు వ్రాయుచు రాజుల కంకితమ్ముగా
రిప్లయితొలగించండిభుక్తిని పొందగన్నిడుచు పొట్టను నింపక,శాశ్వతమ్ముగన్
ముక్తి పథమ్ము బట్టె నొక భూరి కవీశుడు,పోతనార్యునిన్
భక్తిని బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై
శక్తినశించియు తనువున
రిప్లయితొలగించండివ్యక్తిత్వము విడి కవితలఁ బ్రభువున కిడి తా
భుక్తినిగొన నిష్టపడని
భక్తుని బూజింపవచ్చె భారతి తానే
🌺🙏🏻🕉నమశ్శంకరాయ🕉🙏🏻🌺
రిప్లయితొలగించండిఉత్పలమాలిక..
ప్రాక్తనపుణ్యరాశి ఫలవంతమునై వర శంకరార్యుడై
యుక్తియుతాద్భుతోక్తి సమయోచితరీతిని ద్వైతభావనా..
సక్తిని ద్రుంచి, నిత్యమగు సత్యము జాటి, యనేకదేవతా
భక్తిరసప్రధానగుణబంధురమౌ స్తుతికోటినిచ్చి , వై
రక్తియె మోక్షమార్గమని రమ్యముగా హితబోధ జేసి , తా
ముక్తిని బొందగా ., జనని మోదమునంది యశశ్శరీరుడై
వ్యక్తి గతించినన్ జనహృదంతరవీథి వసించునట్టి యీ
భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి
చాలా బాగున్నదండి, నమస్సులు
తొలగించండిమురళీకృష్ణ గారూ!నమస్కారం.చక్కని పద్యం.అభినందనలు.
తొలగించండినీదీ యుత్పల మాలిక
తొలగించండిమోదము జేకూర్చె మాకు మురళీ కృష్ణా!
సాదర వందన మిదిగో
గాదిలి కవివర్య! నీవు గైకొను మిపుడే
శక్తిని గొల్చి కావ్యములు చక్కగ వ్రాసిన కాళిదాసుతో
రిప్లయితొలగించండిరక్తిగ సాగు భోజరాజ సభ లాతి కవీశ్వరులన్ నుతింప ను
ద్రిక్తత నిండగా మది దృతిన్ జగదంబను తల్చినంతనే
భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై ||
చక్కని పూరణండి, అభినందనలు
తొలగించండిధన్యవాదములండీ.
తొలగించండిరెండవ పాదంలో "రాజ" శబ్దమును తొలగించ ప్రార్థన
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
యుక్తి మెయి భాషపై యను
రక్తిని గలిగించ బాలలందరి యందున్
శక్తి కొలది కృషి చేసెడు
భక్తుని బూజించ వచ్చె భారతి తానే.
*********************************
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముక్తికి మార్గము దెలిపెడి
రిప్లయితొలగించండిభక్తుని బూజింప వచ్చె భారతి, తానే
యుక్తోపదేశ మొసగెను
భక్తుం డదిగొనుచునామె పరవశ యయ్యెన్.
ముక్తిని బొందు మార్గముల బోధన చేయుచునున్నవాని నా
భక్తుని బూజ సేయుటకు భారతి తానయి వచ్చె, హంసపై
యుక్తముగాగ చిత్రమున నున్న సరస్వతి కర్చనల్ మహా
సక్తిగ జేసె నాపయిని సత్కృప జూపు మటంచు మ్రొక్కుచున్.
హ.వేం.స.నా.మూర్తి
భక్తుడు పోతన వర్యుని
రిప్లయితొలగించండిరక్తిని నోదార్చ దలచి రమణీ! గంటే?
ముక్తిని నీయగ దానా
భక్తుని బూజింప వచ్చె భారతి తానే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినక్తంచ రాన్వవాయా
తొలగించండిముక్తాసుర వర వదాన్యుఁ బూర్వజుని వరా
సక్తోపాసన సుస్థిర
భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే
వ్యక్తము పూర్వ జన్మ పరిపాక సుకర్మ నికాయ పుణ్యునిన్
యుక్త కటాక్షవీక్షణల నుత్తమ పండితుఁ జేసె వాణియే
రిక్త మనస్కుఁ డల్పు విపరీతపు మూర్ఖుఁడు కాళిదాసునిన్
భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై
[సాక్షాత్తు సరస్వతీ దేవి చే “అహమేవ త్వం త్వమేవాహమ్” అని పించుకున్న మహా విద్వాంసుడు కాళిదాసు.]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభక్తిని నన్ను నమ్ముకొని భాగవతమ్ము రచించి తా సదా
రిప్లయితొలగించండిభుక్తికి లేక బాధపడు పూజ్య కవీశ్వరు పోతనోత్తమున్
రక్తిని బ్రోవుమంచు, హరి రాణి రమా కడకేగె శ్రద్ధతో
భక్తునిఁ ,బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై
శక్తికొలది ద్రవ్యమ్ముల
రిప్లయితొలగించండిసక్తముతోనిడి గణేశు,జలధిజఁ దగు భా
వోక్తులఁ గొల్చ, బ్రోవఁగ
భక్తునిఁ, బూజింప, వచ్చెభారతి తానే
రక్తిని నాదరించవలె రాముని జేరగ నెల్లవేళలన్
రిప్లయితొలగించండిభక్తుని, బూజసేయుటకు భారతి తానయి వచ్చెహంసపై
ముక్తినినీయగోరి యిక మోదము తోడన కాళిదాసుకిన్
శక్తియె దానుగా ముదము సల్పగ రక్తిని జేరనా తనిన్
ముక్తిని గైకొనంగ బహు పూనికతోడను సాధనంబునే
రిప్లయితొలగించండిభక్తిని యోగమార్గమున బ్రాణము నిల్పుచు ధ్యానధారణల్
శక్తికొలంది యాత్మను విచారణ జేయుచు జ్ఞానమున్గొనన్
భక్తుని బూజజేయుటకు భారతి తానయివచ్చె హంసపై!
హంసపై = శ్వాసపై! భారతి = సరస్వతి
మనలో ఇడ, పింగళ నాడుల మధ్య ప్రవహించే సుషుమ్నయే
గంగా యమునల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి!
కం: భుక్తికి సముచిత ఆర్ధిక
రిప్లయితొలగించండిశక్తిని పోతన కీయుము సాగర పుత్రీ,
ముక్తినిడుము రయముగ , అని
భక్తుని పూజింప వచ్చెభారతి తానే
పేదరాలైన భారతికి యొకడు శక్తిని పూజింపమని చెప్పాడనే యూహతో
రిప్లయితొలగించండిభక్తుండొక్కడు చెప్పెను
భుక్తికి కొరతంచు వగచ బోకుము తల్లీ
శక్తి గొలువుమన నమ్మియె
భక్తుని పూజింప వచ్చె భారతి తానే.
భక్తియె లేని పామరుని బండితుడంచును బెండ్లిసేయగా
శక్తిని గొల్చెనాతడట జవ్వని చెప్పగ మూఢభక్తితో
భక్తుని బూజసేయుటకు భారతి తానయి వచ్చె హంసపై
భుక్తియె లేనివాడిలను భూరిగ వెల్గెనె కాళిదాసుగన్
భక్తియనంగ వాణి తనవాక్కును బంచక మానసంబుకున్
రిప్లయితొలగించండిశక్తియుగూడునా?ప్రతిభ శాంకరినింపున?న్యెంచిచూడ నా
సక్తిని లక్ష్మియుంచున?విచారణ జేయగయుక్తి,రక్తికై
భక్తుని బూజసేయుటకు భారతితానయివచ్చెహంసపై
2.భక్తియె వాణి స్పందన
భక్తియె నాసక్తి గూర్చు వాణియు వాక్కే|
రక్తికి,యుక్తికి,ముక్తికి
భక్తుని పూజింప వచ్చెభారతి తానే|
భక్తి రసానువర్తి యయి భాగవత ప్రభ నిల్పి చిత్తమున్
రిప్లయితొలగించండివ్యక్తము జేయ శ్రీ హరి వియత్తలమున్ విడి పోతనార్యు స
ద్భక్తికి మెచ్చి కైతలను తానుగ బూరణ జేసె,
"రాజుకై
రక్తినొసంగ వ్రాయను, విలాసముకై దన కైతనమ్మ"నన్
భక్తుని బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై!
కం. సూక్తుల ముక్తాయింపులు ,
రిప్లయితొలగించండివక్తల సుమ భాషణంబు వాణిగ బలుకన్,
శక్తిగ నవధానమునను
భక్తుల బూజింప వచ్చె భారతి తానే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.
రిప్లయితొలగించండి9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండిఅంశం:సమస్యాపూరణం
*భక్తునిఁ బూజింప వచ్చె భారతి తానే*
భక్తిని జూపుచు కొలిచిన
భక్తుని బూజింప వచ్చె భారతి తానే
శక్తి నొసంగుచు సతతము
సూక్తంబగురీతిలోన సూచన లొసగున్
భుక్తిని గోరుచున్ తెలుగు భూమిని వీడుచు పారిపోవగా
రిప్లయితొలగించండిరక్తియె పద్యమందునను రమ్యపు రీతిని చుట్టుముట్టగా
శక్తియె లేక నేనిటను శంకరు కొల్వును జేరగానె నీ
భక్తునిఁ బూజ సేయుటకు భారతి తానయి వచ్చె హంసపై...
భారతి = ఆంధ్ర భారతి నిఘంటు శోధన