కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద"
లేదా...
"పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద"
లేదా...
"పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఎవరి మేలుగోరి కడలి లవణ మొసగె?
రిప్లయితొలగించండినెవరి మేలుగోరి ప్రకృతి పవన మొసగె?
నెవరి మేలుగోరి కవియు కవిత నొసగె?
పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద...
"ద్యుమణి పద్మాకరము..." సుభాషితమును అనుకరించబోయి బోల్తా కొట్టాను...
తొలగించండిఎవరి కోసము జీససు డెక్కె శిలువ?
తొలగించండిఎవరి కోసము గాంధీజి యిచ్చె తనువు?
ఎవరి కోసము శ్రీకృష్ణుడవతరించె?
పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద...
"పరిత్రాణాయ సాధూనాం..."
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలలో సంధిగ్ధత గోచరిస్తున్నది. పరహితం కోరినవాళ్ళు పతితు లెలా అయ్యారు?
ఏసు క్రీస్తు, గాంధీ గారూ స్వార్ధం కోసం తమ ప్రాణాలివ్వలేదు గదా. శ్రీ కృష్ణుడు స్వర్గం వీడి భూమికి దిగినది సాధువులను రక్షించుట కొరకేనని చెప్పినాడు కదా...అని...__/\__
తొలగించండిఅన్యు లెట్లున్న నాకేమి యని దలంచి
రిప్లయితొలగించండిస్వార్థ భావైక చిత్తులై సకల జనులు
సంచరించుచు నున్నట్టి సమయమందు
పరుల మేలు గోరు నతడు పతితుడు గద.
నిరతము స్వార్థ మేగతిని నిష్ఠగ బూనుచు విశ్వమంతటన్
తిరుగుచు నుండు వారలకు దేవుని నందరిలోన జూచుచున్
స్థిరమతియౌచు సంఘమున సేవలు చేయు మహచ్ఛుభేచ్ఛతో
పరుల హితంబు గోరెడి కృపామయుడే పతితుండు నా దగున్.
హ.వేం.స.నా.మూర్తి
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిగంజాయి వనంలో తులసిమొక్క... అందరు స్వార్థపరులలో ఒక్కడు పరహితైషి అయితే వారి దృష్టిలో పతితుడే... బాగున్నవి మీ పూరణలు. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఒరులు నీ మేలు గోరరీ యుర్వివియందు
రంతి దేవుని కీనాడు రథము రాదు
కొంత తన నుద్ధరించక గొడవ పడుచు
పరుల మేలు గోరెడునతడు పతితుడుగద!
డా.పిట్టా
రిప్లయితొలగించండిహరియె స్థిరీకరించె నిటు హైందవ ధర్మము కలిని నెంచగా
చెరిసగ మన్నరీతి నిటు జేయుము దానము త్యాగమేర్పడన్
"నెరి నను గావరా",యనుచు నెమ్మిని నాత్మను(ను)యుద్ధరించకే
పరుల హితంబు గోరెడికృపామయుడే పతితుండు నాదగున్(పతితుండనందగున్)
డా.పిట్టా
రిప్లయితొలగించండిమొదటి పూరణలో టై పాటు యుర్వి గాచదువ ప్రార్థన."వి"అదనంగా పడినది,ఆర్యా,
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ మొదటి పాదం చివర గణదోషం. సవరించండి.
రిప్లయితొలగించండిసంఘ జీవియై మనుజుడు చక్క గాను
పరుల మేలుఁ గోరు నతఁడు ; పతితుఁడు గద
కొంత యైన కనికరము, కూర్మి యసలు
లేక నడచుకొను నరుడు లెక్క జూడ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండివిరుపుతో పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండి2వ పూరణంలో 2వ పాదములో"నిటు"కుబదులు"నిక"ను వేసి పునరుక్తిని గాదన్నాను,ఆర్యా,
నిరతము దుష్టలోక ధరణీపతిగా వెలుగొందు నీచుడున్
రిప్లయితొలగించండిపరుల సుఖమ్ము చూడగనె బాధను పొందెడి కల్మషాత్ముడున్
పరులకు పూని నిత్యమును బాధలు పెట్టెడి దుష్టజీవియున్
పరుల హితంబు గోరెడి కృపామయుడే? పతితుండు నా దగున్
నేమాని సోం (సోము?) గారూ,
తొలగించండిఅద్భుతం! విలక్షణమైన విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరుల పైకమాశింపగ పరమ లోభి
రిప్లయితొలగించండిపరుల పడతుల పొందెడు పాతకుండు
నరుల పీడించుచు ధరలోన నవినీతి
పరులమేలు గోరునతడు పతితుడు గద!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తనకు పేరు రాదు ప్రజల దప్పి తీర
రిప్లయితొలగించండిలబ్ది పొందెదరుఁ దగ పాలకులటంచు
నీచ బుద్ధి తోడఁదలచి నిలువరించ
ప్రజల మేలు, గోరువాడు పతితుడు గద
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండికొంత అన్వయక్లేశం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వర్గమునకేగు నిజముగా సంతతమ్ము
రిప్లయితొలగించండిపరుల మేలుఁ గోరు నతఁడు, పతితుఁడు గద
పరులసొమ్ముకై యారాట పడుచు సతము
దుర్వ్యసనములతోడుత తూలువాడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రాజకీయము సేయగ రాటు దేలి
రిప్లయితొలగించండికరుణ వీడి మానవతను కాల రాచి
ధనము నార్జింప జూచుచుండు నవినీతి
పరుల మేలు గోరు నతడు పతితుడు గద!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుణ్య లోకంబులకు నేగు బోధ గురువ !
రిప్లయితొలగించండిపరులకు మేలు గోరునతడు ,పతితుడు గద
గొడ్డు మాంసాలు దినుచును గొదవ యైన
పాప భీతిని లేనట్టి బడుగు వాడు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరతము సత్యమార్గమున నిశ్చలమైన మనస్సుతోడుతన్
రిప్లయితొలగించండితిరుగుచు, భక్తిఁ గొల్చుచును తీర్థకరున్ వసియించు నిత్యమున్
పరుల హితంబు గోరెడికృపామయుడే, పతితుండు నాఁ దగున్
స్థిరమగు స్వార్థబుద్ధికల చెడ్డమనస్కుడు సంతతమ్మిలన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'తీర్థకరున్ వసియించు'...?
నిరతము పూజ్యుడౌఁగద వినిర్మలభావ హితప్రయుక్తుడన్,
రిప్లయితొలగించండిపరుల హితంబుఁగోరెడు కృపామయుఁడే,---పతితుండు నాఁదగున్
దురితము లాశతో సలుపు దుర్జను డొక్క నిమేషమేనియున్
ధర పరిపూర్ణమౌ మహిత ధర్మపథంబునుఁగాంచడించుకన్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
స్వార్థ చిత్తుఁడు దుష్టస్వభావుఁ డన్య
రిప్లయితొలగించండిజన ధనాపహరుఁడు క్రూర జనుఁడు విభుఁడు
రాజ నీతి నంతను వీడి రాజ భజన
పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద
తరతమ భేదముల్ విడిచి ధర్మయుతమ్ముగ సంచరించుచుం
గర మనురక్తి నర్హులకు గౌరవ మిచ్చిన మంచివాఁ డగున్
నిరతము విత్త లాభమున నిశ్చిత బుద్ధులు స్వార్థ భావ త
త్పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిభజనపరులతో మొదటి పూరణ, స్వార్థతత్పరతతో రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండినిరయము బోవు సద్గతి కనేకుల యాశిసు లొందుచున్భువిన్
రిప్లయితొలగించండిబరుల హితంబు గోరెడి కృపామయుడే ,పతితుండునా దగున్
కరంబు మదంబు తోడన నెకాయెకి దుష్కృత కార్య మెంతయు
న్నెరవది లేక జేసిన ననేకము గాగను నాతడేధరన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది.
మొదటి పాదంలో 'నిరయము (నరకము) పోవు సద్గతికి'... అన్వయం కుదరడం లేదు.
ధన్యజీవి యగునుగాదె తధ్యముగను
రిప్లయితొలగించండిపరులమేలు గోరు నతడు, పతితుడుగద
మానవత్వము లేకుండ మహిని జనుల
నరక బాధలు బెట్టుచు నవ్వువాడు!!!
శైలజ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచ వర్షములు ప్రజల ప్రగతి దోసి
రిప్లయితొలగించండిమాట తప్పిన నేతయే మరల వచ్చి
యోటు వేయుడని యడుగు బూటకులగు
పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భరతదేశపు ఖ్యాతిని భంగ పఱచి
రిప్లయితొలగించండిప్రగతి పథమున కవరోధపరచునట్టి
ఖరులు హంతకుల్ విద్రోహకరుల ధర్మ
పరుల మేలుఁ గోరు నతఁడు పతితుఁడు గద
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఖరులు... ఖలులు కావచ్చు.
. కరువున,కాటకంబున సకాలమునందున రక్షగూర్చుగా
రిప్లయితొలగించండిపరుల హితంబుగోరెడి కృపామయుడే|”పతితుండు నాదగున్
మరచిన మానవత్వమున మంచిని వీడుచు వంచనంబులే
వరము లటంచు నెంచగల పాపపు కోపియు నెప్పుడేనియున్|”
2.మంచి మానవతలు నెంచి మసలగలిగి
పరుల మేలుగోరునతడు|”పతితుడుగద
ముఢతత్వము నందున మూర్ఖ తనము
గలిగి మెలగుచు యవినీతిదలచువాడు”.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండివిరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తీర్థయాత్రలు క్షేమంగా ముగించుకొని వచ్చినందుకు మా బావమరది మమ్మల్ని భోజనానికి పిలిచాడు. అందువల్ల రోజంతా బ్లాగును చూడలేకపోయాను. స్పందించడం ఆలస్యమయింది. మన్నించండి.
రిప్లయితొలగించండి22/3/17
రిప్లయితొలగించండి9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
సమస్యాపూరణం
తే.గీ:ఆపదలొడమ కాపాడి యాదుకొనును
పరుల మేలు కోరునతడు;పతితుడు గద
సతతము పరులకిలలోన సంకటముల
కలుగ చేసి బాధించును కలియుగాన.
అరువుల నిచ్చుచున్ వడిగ నర్వది శాతపు చక్రవడ్డికిన్
రిప్లయితొలగించండికరువున కర్షకాదులను కావక నిండ్లను కొల్లగొట్టుచున్
బరువుగ దోచి భాగ్యముల భారత వాసుల వల్లకాటి కా
పరుల హితంబుఁ గోరెడి కృపామయుఁడే పతితుండు నాఁ దగున్