కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రావణునకుఁ బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్"
లేదా...
"రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రావణునకుఁ బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్"
లేదా...
"రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)
నా పూరణ.....
రిప్లయితొలగించండిభావించియు మోక్ష మిడఁగ
రావణునకుఁ, బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్
భూవరుఁడగు దశరథునకు
సేవించిన జయ విజయుల సేమము కొఱకై
నా రెండవ పూరణ.....
రిప్లయితొలగించండిపావనమౌ వికుంఠపుర వాసముఁ గోల్పడి ద్వారపాలకుల్
శ్రీవనితేశు వైరమునుఁ జేకొని యుండఁగ మోక్ష మివ్వఁగా
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
యా విధి భూమిపై దశరథాధిపు నింట నయోధ్యలో వెసన్
adbhutam sOdaraa
రిప్లయితొలగించండిఅక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు!
శైవుండు మేఘనాధుడు
రిప్లయితొలగించండిరావణునకుఁ బుత్రుఁ డయ్యె; రాముఁ డయోధ్యన్
దీవనతో వీడి జనియె
పావని జానకిని గూడి పన్నుగ నటవిన్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.
శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య (86) గారి సవరణ:
తొలగించండి"మేఘనాధుడు తప్పు. మేఘనాదుడు సరి"
శ్రీమాన్ శంకరయ్య గారి సవరణ:
"అటవిన్ కన్నా వనికిన్ సరి"
__/\__
కైవల్యము నిడె భక్తుడు
రిప్లయితొలగించండిరావణునకు, బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్
దేవుని వరమున దశరధ
జీవనుడు గజనక సుతను చేపట్టె నటన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సేవించ యాగ ఫలమున్
రిప్లయితొలగించండివేవిళ్లన్ దశరధసతి వేడుక ముగియన్
గావఁగ ధర్మము,మూఁడగ
రావణునకుఁ, బుత్రుఁడయ్యె రాముఁడయోధ్యన్
శ్రీవైభవ విలసితుడగు
తొలగించండిభూవరుడౌ పంక్తిరథుని పుణ్యఫలానన్,
జీవముగొని సద్గతినిడ
రావణునకుఁ, బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్.
హ.వేం.స.నా.మూర్తి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
******
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. మీ పూరణలు భలే బాగున్నాయి.
తొలగించండికైవల్యమునందించగ
రిప్లయితొలగించండిరావణునకుఁ, బుత్రుఁడయ్యె రాముఁడయోధ్యన్
పావకవంశమునందున,
నావైకుంఠమ్మునుండియరుదెంచి ధృతిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"భావన గాదది"గురువను,
"కావలె యతి గణపు కూర్పు కందమునందున్,
లే వనజా!"యన నుడివెను
"రావణునకు బుత్రుడయ్యె రాముడయోధ్యన్"
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిపాపం! నిద్రమత్తులో ఉన్న వనజతో కంద పాదం చెప్పించారు. వైవిధ్యమైన పూరణ. బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిస్థావరమౌ వికుంఠపురి సన్నిధి వీడి వరమ్ము నొందగా
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
పావనిలక్ష్మి గూడెజత, పన్నగ లక్ష్మణుడాతనిన్ సదా
సేవలగాంచ మోక్షమను సేవను గూర్చెను యుద్ధమందునన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిరావణునట్టి భీకరపు రాశియె యప్పకవీయ మీడ్వ నే
రన్ వణకుల్ జెలంగెగను రాదొ తృతీయ గణాంతపున్ యతిన్
బోవ నదేమి ఛందమగు బూర్తిగ నీ"కు","గు" జెల్లనో గురూ!
"రావణ కుంభకర్ణుల"కు "రాముడు పుట్టె "గు"ణాభిరాముడై"
డా. పిట్టా వారూ,
తొలగించండికొంత గజిబిజిగా ఉన్నా మీ పూరణ బాగున్నది.
రెండవ పాదంలో ప్రాస తప్పింది. '...మీడ్వ లే।రా వణుకుల్...' అందామా?
డా.పిట్టానుండి,ఆర్యా,
తొలగించండిఅప్పకవీయంభీకరం దీనినీగ జూడగా తీరా వణకు పుట్టింది.3వ గణాంతాన గల""కు"నకు5వ "అక్షరం"గు"వచ్చియతిగా చెల్లింది.ఈ నియమం పాటించే ఛందము కూడా ఉన్నదేమో అప్పకవీయములో అనే అనుమానం వచ్చింది నాలాంటి అభ్యాసకునికి.అదో ఛంధం ఉంటే దానిని ఉటంకించమని చెప్పమని అర్థిస్తున్నాడు గురువుగారిని.పృచ్ఛకులు పండితులే.ఛందస్సుపై ప్రయోగం చేసినవారై ఈ కుతూహలాన్ని చూపడం అసహజం కాదేమో!ఇక "తీరావణుకుల్"అందాము.
దేవత లందరున్ విధము దెల్పుచు ప్రార్థన జేసి యుండగా
రిప్లయితొలగించండిభూవరు డైన పంక్తిరథు పుణ్యము పండగ లోక రక్షకై
జీవనమున్ హరించి కడు శ్రేష్ఠ పదంబిడ నన్న దమ్ములౌ
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిఅద్బుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిబ్రోవగ నౌ వానికటన్
తా వరమిచ్చె తనచేత తధ్యము మోక్షం
బౌ,వెన్నుడేను మేలుగ
రావణునకు, బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికావగ ధర్మమున్ భువిని, కల్గగ జేయవికుంఠధామమున్
రిప్లయితొలగించండిరావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
పావక వంశమందునను పాలనఁ జేయగ కోసలమ్మునన్
కేవలమైన మర్త్యునిగ కేశవు డంభుజనాభుడిర్విపై
డుర్విపై
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిబావా విద్యాసాగర!
రిప్లయితొలగించండిరావణునకుబుత్రుడయ్యెరాముడయోధ్య
న్బైవిధమ యెట్లు జెప్పితి
వేమీ యీకలను గంటె?నిట్లుగ నిన్నన్
పావన నామమున్ గలిగి పల్కెడు వారికి కామధేనువై
రిప్లయితొలగించండిజీవనమందు తా విధము జేరుచు జూపెడు పుణ్యమూర్తియై
దేవతలంతగోర భువి ధర్మము నిల్పగ కాలరుద్రుడై
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై.
ఏ వనితను కామించిన
రిప్లయితొలగించండినా వనితను పొందలేక నలువురు నవ్వన్
చావే నయమని దలచిన
రావణునకుఁ; బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్
రావణ కుంభకర్ణుల యరాచక మోర్వక వేడగాదనున్
రిప్లయితొలగించండిదైవము రూపమున్దనరు దాశరధిన్గడుభీషణంబయెన్
రావణ కుంభకర్ణులకు, రాముడు పుట్టెనుగుణాభిరాముడై
జీవుల నెల్లటిన్దనుప శీతలదృక్కుల నెల్లవేళ లన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ విష్ణు వవని తలమున
రిప్లయితొలగించండిరావణ సంహార కార్య రతిని దశరథుం
డావసుధాధీశు నరై
రావణునకుఁ బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్
[నర+ఐరావణు = నరైరావణు: నరకుంజరుడు]
పావను డవ్యయుండు నిన వంశ మహోదధి శీతరశ్మి సం
భావిత లక్ష్మణుండు పరిపాలిత ధర్ముఁడు సత్యశీలి తా
దేవ హితైక కార్యమును దీర్ప ననంతుఁడు,వజ్ర ఘాతమై
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
…………………………………………….
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పావన రూపమున్ , మరియు , భవ్య
………… చరిత్రము గల్గి సర్వ వి
శ్వావళి గాచు శ్రీ పతి దయా
…....... హృదయమ్మన | స్వర్గ దాత యై
రావణ కు౦భ కర్ణులకు , రాముడు పుట్టె
……..... గుణాభి రాముడై |
బ్రోవ గల౦డు మాధవుడు మోక్ష మొస౦గుచు
………… నెల్ల వారికిన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షమించండి ఉత్పలమాలలో మూడోపాదం మరిచి పోస్టుచేసాను
రిప్లయితొలగించండికైవల్యమందజేయగ
రావణునకుఁ , బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్
భూవరుడగు దశరథునకు
శ్రీ వల్లభుడవతరించె క్షేమము గూర్చన్
దేవత లెల్ల గోరగను దీనజనాశ్రిత పోషకుండె తా
బ్రోవగ నెంచి, శ్రీహరియె భూతలమందున శాంతి నిల్పుచున్
సేవకులైన వారికిల క్షేమము గోరుచు మోక్షమివ్వగన్
రావణ కుంభకర్ణులకు, రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై
దేవేంద్రు గెల్చు వీరుడు
రిప్లయితొలగించండిరావణునకు బుత్రు డయ్యె,రాముడయోధ్య
న్నావిశ్వసృక్కు గోరగ
రావణు నిర్జింప దాశరథియై బుట్టెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినిన్నటి పూరణ:
ఏపారిరి సుచరితలై
తాపము లెన్నియొ భరించి తరుణు లిరువురున్
ప్రేపు నయోనిజలౌ యా
ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే
నేటి పూరణ:
దావరియగు నా యింద్రజి
రావణునకు బుత్రు డయ్యె; రాముడయోధ్యన్
కైవడి గూడిన నరునిగ
రావణ వధకై జనించె రంజన మిడగన్
ఆ వేదముఖుని మనుమడు
రిప్లయితొలగించండిపావన పౌలస్త్య వంశ పాలిత శ్రేష్ఠున్
బ్రోవగ యనుపమ దశరధ
రావణునకు బుత్రుడయ్యె రాముడయోధ్యన్!
రావణుడు= గొప్ప శబ్దము జేయువాడు
దశరధ రావణుడు= పది రధముల నడుపుచు గొప్ప శబ్దము బుట్టించు వాడు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవరించిన పూరణ!
తొలగించండిఆ వాణికి మునిమనుమడు
పావన పౌలస్త్యవంశ పాలన శ్రేష్ఠున్
బ్రోవగ యనుపమ దశరధ
రావణునకు బుత్రుడయ్యె రాముడయోధ్యన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదీవెనగ మేఘనాధుడు
రిప్లయితొలగించండిరావణునకుఁ బుత్రుఁ డయ్యె; రాముఁ డయోధ్య
న్నావైదేహికి పతిగా
నీవసుధన్నేలె యిడుము లేలేకుండన్
సవరించబడిన నిన్నటి నా రెండవ పద్యము క్రింద నీయబడినది
భూపాలురె దృపద, జనకు
లేపాపము లెరుగ నట్టి లేమల పెండ్లిం
డ్లే పంతముగొని జేసిరొ
ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే
. భావనగ మేఘనాతుడు
రిప్లయితొలగించండిరావణునకు పుత్రుడయ్యె|”రాముడయోధ్యన్
జీవుల కండగ నిలచియు
గావగ రావణుని జంపి ఘనతను బెంచెన్|
2.క్రమాలంకారము
కాముకుడైన రావణుని కర్మనుమాన్పగ జన్మ నెత్తెనా? {రాముడు}
సోమరి,నిద్ర,తిండి తనసొంతమటంచును నెంచుయూహలే?{కుంభ కర్ణులకు}
క్షెమమొసంగు మార్గములు,కీర్తికితోడ్పడునీతి,నిష్టకున్? {రాముడు పుట్టె గుణాభిరాముడై|}
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్సులు. ఉదయం హైదరాబాద్ వెళ్లి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాను. అందువల్ల మీ పూరణలపై స్పందించే అవకాశం దొరకడం లేదు. మన్నించండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసేవిత పాదపద్ముఁడయి జీవిత భక్తి విహారి హన్మకున్;
గావఁగఁ బాద ధూళి వర గమ్య సుపాద సరోరుహుండునై
గ్రావ కహల్యకున్; గనలి కాంతను మ్రుచ్చిలఁ, బ్రాణహంతగా
రావణ కుంభకర్ణులకు; రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై!
సేవిత పాదపద్ముఁడయి జీవిత భక్తి విహారి హన్మకున్;
తొలగించండిగావఁగఁ బాద ధూళి వర గమ్య సుపాద సరోరుహుండునై
గ్రావ కహల్యకున్; గనలి కాంతను మ్రుచ్చిలఁ, బ్రాణహంతయై
రావణ కుంభకర్ణులకు; రాముఁడు పుట్టె గుణాభిరాముఁడై!
శ్రీ గుండు మధుసూదన్ గారూ, మీరు అరసున్న ను చాలా ఉక్తముగా వేస్తారు. పోతన శ్రీ భాగవతం చదువుతున్నప్పుడు కూడా చూస్తాను. మీ ఈమెయిలు ఇవ్వగోరుతాను. రెండు మూడు పాఠాలు నేర్చుకోవాలి.-చంద్రశేఖర్.
రిప్లయితొలగించండిమీ అభిమానమునకుం గృతజ్ఞుఁడనండీ చంద్రశేఖర్ గారూ!
తొలగించండిఏదో చిన్నప్పటినుండీ పోతన భాగవతం చదవడంవల్ల అరసున్న నా మదిలో నిలిచిపోయింది. తరువాత పెద్దవాఁడనై సాహిత్యాన్ని ఇష్టాంశంగా తీసికోవడంచేత, ప్రాచీన కావ్య పఠనం చేయడంతో మరింతగా అరసున్న వాడుక నా మదిలో తిష్ఠవేసికొనిపోయింది. విద్యార్థులకు తెలుఁగు నేర్పే భాషోపాధ్యాయుఁడను కావడంతో వ్యాకరణ కార్యాల నిరూపణ ద్వారా అరసున్నా పూర్తిగా కాకున్నా, దాదాపు పూర్తిగా నా మనస్సులో స్థిరపడింది. అలాగే, పద్య రచనలో ఇది నాకు ఎల్లవేళలా తోడ్పడుతోంది.
తెలుఁగుఁ బద్యంబు నిత్యమై తేజరిల్లు
ఈ అరసున్న వాడుక... వ్యాకరణ పఠనం ద్వారా కొంతవఱకు మాత్రమే నేర్చుకోవడం జరుగుతుందేమో గానీ, అనుభవం ద్వారానే దీని వాడుక తెలుసుకోడానికి వీలవుతుందండీ!
మీరడుగుతున్నారు కాఁబట్టి నా ఈమెయిల్ చిరునామా ఇస్తున్నాను. మీయంతటివారికి పాఠాలు నేర్పేటంత గొప్పవాడిని కాను నేను.
నా ఈమెయిల్: gundumadhusudhan555@gmail.com
వినమ్ర పూర్వక వందనములతో...
భవదీయుఁడు
గుండు మధుసూదన్