కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్"
లేదా...
"పడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్"
ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్"
లేదా...
"పడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్"
ఈ సమస్యను పంపిన అంబటి భానుప్రకాశ్ గారికి ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినడి పద్మవ్యూహమునన్
తొలగించండిపడమట క్రుంగెడి రవిగని పార్థుడు నొవ్వన్
విడవగ కృష్ణుని చక్రము
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్
ఇడుములకోర్చి దేశమున కిచ్చి స్వతంత్రము వారు కోరగా
రిప్లయితొలగించండియొడుపుగ రామరాజ్య సమయోన్నతి, కాంచుము నేటి దుస్థితిన్
చెడు విపరీతమై పెరిగె క్షీణత నొందెను రాజకీయముల్
పడమటఁ దోచె భాస్కరుడు పద్మములెల్ల విషాద మందగన్
నొడుపుగ
తొలగించండి(రెండవ పాదంలో నుగాగమే, యడాగమము రాదు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండికడనంటగ విధి వ్రాతలు
విడువని తన తోడు నీడ వీడిన భంగిన్
(అంధ్ కార్ మే ఛాయా భీ సాథ్ ఛోడ్ దేతీహై)
గడగెడి సాయము మరచున్
పడమట నుదయించెను రవి పద్మములేడ్వన్
రిప్లయితొలగించండిబుడిబుడి గానన్ శుక్రుడు
పడమట నుదయించెను, రవి పద్మము లేడ్వన్
వడివడి గాక్రుంగెనటన్
బుడతడు వెడలెను నిదురకు పున్నమి రేయిన్ !
జిలేబి
డా.పిట్టా
రిప్లయితొలగించండిఎడనెడ కష్ట కాలములు నేర్పడె భారత భారతిన్ గొనన్
నడచిరి నాల్గు దిక్కుల ననాథగ జేయగ రాజ్యకాంక్షమై
ఎడద జెలంగ జెప్పుకొని"రెప్పుడు గ్రుంగడు సూర్యుడం"చు మా
పడమట దోచె భాస్కరుడు పద్మములలెల్ల విషాద మందగన్
(భారత స్వాతంత్ర్యమునకు పూర్వము సూర్యుడు అస్తమించనిది తమ రాజ్యమని వలస విధానంతో విర్రవీగు చుండిరా పాశ్చాత్యులు.అప్పటికి మనం కష్టాలలో క్రుంగి పోయినాము.)
కం: వెడలును ఇలపై ఖద్యో
రిప్లయితొలగించండితుడనుచు పార్ధుడు రయముగ తూణము వీడన్
సడలగ కృష్ణుని చక్రము
పడమట, నుదయించెను రవి పద్మము లేడ్వన్
సైంధవ వధ వృత్తాంతము
కం: వెడలెను ఇలపై ఖద్యో
రిప్లయితొలగించండితుడనుచు పార్ధుడు రయముగ తూణము వీడన్
సడలగ కృష్ణుని చక్రము
పడమట, నుదయించెను రవి పద్మము లేడ్వన్
సైంధవ వధ వృత్తాంతము (మొదటి పాదము సవరించబడినది)
తడబడుచు బలికె బాలుడు
రిప్లయితొలగించండిబడిలో గురువర్యు డడుగ భయకంపితుడై
నడిసంద్రము నం దచ్చట
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్.
తడబడి ఛాత్రు డొక్కరుడు తా గురువర్యుడు ప్రశ్న వేయగా
వడిగొని పల్కె నీవిధిని వైనము నెంచక భీతితోడ నే
డుడుపతి యంతరిక్షమున నుత్సవ మొప్ప జరించుచుండగా
బడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్.
హ.వేం.స.నా.మూర్తి
గడిపినది చాలు దినమనె
రిప్లయితొలగించండినడుగిడుచును చంద్రుడంత కలువలజతకై
విడిపొండు మీరు చాలని
పడమట నుదయించెను-రవి, పద్మము లేడ్వన్.
నడిరేయి నాకశంబున
రిప్లయితొలగించండిపడమట నుదయించెను రవి పద్మములేడ్వన్
సడిసేయక నిదురింపగ
వడిబాయని భూమియందు ప్రాగ్దేశ జనుల్!
జడివాన పిడుగులురుములు
రిప్లయితొలగించండివడగండ్లు కురిసి వెలియగ వైశాఖ మునన్
కడకొక సాయం సమయము
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్
ఉడుగును తపనుండేదిశ?
రిప్లయితొలగించండిముడుచు కొనెను, కలువలేల భూతల మందున్?
వడి రవిని రాహువు గొనెన్
పడమట, నుదయించెను రవి, పద్మము లేడ్వన్
బడలిక తో సోలెను శశి
రిప్లయితొలగించండిపడమట,నుదయించెను రవి,పద్మము లేడ్వన్,
తుడిచెను లేయెండ నిడుచు,
కడపె సరోజముల కలత కాంతుల వానన్
పడ బండి నుండి బాలుఁ డు
రిప్లయితొలగించండినడిరేయి గడచినఁ బెట్టిన నిరవధికముం
బడతులు ముఖపద్ములు కాఁ
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్
[పద్మములు : ఇక్కడ పడతులు]
అడరి విషాద కోపముల నర్జును డంతట నిశ్వసించుచున్
వడిఁ గడతేర్చ సైంధవునిఁ బశ్చిమ మేఁగక ముందు సూర్యుడే
తడఁబడ కెందుఁ బంతమున ధైర్యము మీరఁగ పోరు చుండగం
బడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్
[తోచు = ప్రత్యక్షమగు]
9/3/2017 నాటి పూరణలు:
తొలగించండిదొంగ తన మది యాతని దొడ్డ వృత్తి
యన్య మెఱుఁగఁడు చిఱుత ప్రాయమ్ము నుండి
దూఱి కలవారి యింటను దొంగిలించఁ
బడమటం బొంచె రవి సుప్రభాతమందు
[పడము+అటన్ = పడమటన్; పడము = రత్న కంబళము; సుప్రభాతము = తెల్లవారు ఝాము]
అడరిన విష్ణు లీలలు గ్రహాంతర సంచలనాత్మకమ్ములం
బడయగ శక్య మేరికిని బ్రహ్మమహాండపు టద్భుతమ్ములున్
బడలిక లేక యింపుగను బశ్చిమ దేశము, భారతమ్మునం
బడమటఁ బొంచి, చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్
Paduthuka yokkathe vedkatho
రిప్లయితొలగించండిNadachuchunundanga thanadu nayanammulatho
Vadi choodanenchinaadoko
Padamatanudayinchenu ravi padmamuledwan
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
తడబడక ౘవితి చంద్రుడు
పడమట నుదయించెను ; రవి పద్మము
లేడ్వన్
వడి వెలుగులు పంచిన యా
బడలికతో యస్తమించె పశ్చిమమందున్.
*********************************
వడివడి తూర్పు రేఖల వి
రిప్లయితొలగించండిభాతి నొసంగుచు జీవకోటితో
ముడివడి నట్టి బంధమున
మోదము నిచ్చుచు సాగు దారులం
బడమట దోచె భాస్కరుడు;
పద్మములెల్ల విషాదమందగన్
బొడమె ప్రపూతకాంతిమయ పుంజములంది నవోదయమ్ములో!
గడియారము వెనుదిరిగెను
రిప్లయితొలగించండిగొడుగులు తలక్రిందులాయె గోవులు మొరిగెన్
మిడిమిడి త్రిశంకు జగమున
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్
(దయజేసి రేఫములను తేలికగా పలుకవలెను)
పడమట రవి యుదయించడు
రిప్లయితొలగించండితడబడి యిక బలికితివ? తలిరుంబోడీ!
నుడువగ యిట్లుం సబబే?
పడమట నుదయించెనురవి పద్మము లేడ్వన్
పడమటి దేశమునను (మన
రిప్లయితొలగించండిపడమట) నుదయించెను రవి,-పద్మము లేడ్వన్
వడి చంద్రుడుదయమయ్యెను
సడి సేయక భారతమున, సాగెను కలువల్
పడమట దోచె భాస్కరుడు పద్మము లెల్ల విషాద మందగన్
రిప్లయితొలగించండితడబడి రార్య మీరలు గతంబున కేగిర యేమి యిప్పుడున్
పడమట నస్త మించునుగ భాస్కరు డెప్పుడు దైవ సాక్షిగన్
నుడుపతి రాగ జెం గలువ లొయ్యన తోషము నొందు చుండగా
విడదీయరాని మోహము
రిప్లయితొలగించండిగుడిఁ గట్టినఁ గమలమందు కోమల కలువల్
పడిగాపులఁ బడ శశియై
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్
విడువగ రాహు,కేతువుల పీడను బొందిన జాడలందగా?
రిప్లయితొలగించండితడబడె జంతుజాలములు తత్తరయౌ గ్రహణంబు వీడగా
పడమట దోచె భాస్కరుడుపద్మములెల్ల విషాద మందగన్
దడదడ పక్షు లన్నియునుదాగక?వెళ్ళెను వెల్గులల్లగా|
2.వెడలడు,సూర్యుడు దిరుగడు
పడమట|నుదయించునురవి”పద్మము లేడ్వన్
గడచెడి కాలముకానిది
అడుగిడ తూర్పార భానుడంబర మందున్|