కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శుకయోగికి నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే"
లేదా...
"శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శుకయోగికి నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే"
లేదా...
"శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
అకటా! యొకచో గంటిమి
రిప్లయితొలగించండిశుకయోగికి కూతురుండె సుతులున్నాల్గుర్!
వికట పురాణమ్ములలో
శుకయోగికి నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే!
దేవీ భాగవతం:
భార్య: పివారి
https://en.m.wikipedia.org/wiki/Shuka
ఒక వ్యాసుడు తండ్రెవరికి?
తొలగించండినొక రాముం డేమయెనుర నొక జనకునకు?
న్నొక బ్రహ్మచారెవరు మరి?
శుకయోగికి; నల్లుఁ డయ్యెఁ జుమి; భీష్ముండే!
ఒక వ్యాసుడు = వేద వ్యాసుడు; బాదరాయణ వ్యాసుడు కాదు
తొలగించండిఒక రాముడు = రఘురాముడు; పరశురాముడు, బలరాముడు కారు
ఒక జనకుడు = మిథిలకు రాజులు పలువురు జనకులు...నిజాముల లాగ
పివారి కాదు పీవరి
తొలగించండి"పీవర్యస్య జాయా..." ....✍🏻
__/\__
బాలముకుంద శర్మ గారికి ధన్యవాదాలు...
తొలగించండి
రిప్లయితొలగించండిబెకబెక యనుచు జిలేబీ
యొక పద్యమునటు భళి యుపయోగము గూర్చన్
చకచక వచ్చెను పూరణ
శుకయోగికి నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే !
జిలేబి
అకలంక మౌని వర్యుడు
రిప్లయితొలగించండిశుకయోగికి , నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
ప్రకటిత మైనట్టి ప్రతిన
వికటించె యితిహాస ములట వేయి విధమ్ముల్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఇక భూమాతయు గాంధి జాతిపితయున్ యిందుప్రభల్ మామగా
ఒకడన్నంబునకన్న రైతు గలుగన్ యూరందరున్ తమ్ములే
వికటంబౌ గ్రహమేది?"యల్లు"డన; పో,వీరే యిటన్ జెల్లగా
శుకయోగీంద్రున కల్లుడయ్యెగద భీష్ముండందరుప్పొంగగన్!
డా.పిట్టా
రిప్లయితొలగించండిశుకసప్తతి కథలను విన
బకపుం జపమెన్న శునక బాధ్యత గనగా
ఒకరెవరికి నేమగుదురు?
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే!
1.జామాతకు గ్రహం అని పేరే గాని ఆ గ్రహం లేదు.వరుసకొకరిని ఉటంకించే ప్రథ ఉన్నది.సమస్యలోని సంబంధం కూడా అట్టిదే కాని చందమామ ఎవరి మామ? జవాబు, అందరి మామ అని. ఈధోరణిలో పూరణం సాగింది.
2.చిలక ఒక గ్రృహిణికి కథలు సందర్భాను సారంగా చెప్పినది.ఇవి డెబ్భై కథలు.నా చిన్నతనంలో నేను చదివినాను.ఈ శుకుడు కథలే చెప్పాడు.జంతువుల తమ చర్యలతో ప్రసిద్ధి చెందినవి.వాటికి వరసలు, కాల గణన ఉండవు.సమస్యలోని సం.కూడా సర్దుకు పోవలసినదే
సుఖముల బడయగ నణుహుడు
రిప్లయితొలగించండిశుకయోగికి నల్లుడయ్యె జుమి , భీష్ముండే
ప్రకటిత శపథని బద్దత
వికలముగాకుండగడిపె వీరునిరీతిన్
రిప్లయితొలగించండిసకలం నీ కథలన్ జిలేబి గద ! సాక్షీభూత, పార్థుండు హా!
శుక! యోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద ! భీష్ముం డంద ఱుప్పొంగగన్
సకలం వీడుచు రాజభోగముల చట్టన్ద్రోలి కారుణ్య మొ
ప్ప గనన్నీశుని యానగన్నియమ పాగెంబైసు శోభిల్లెనౌ
జిలేబి
ఒక రీతి సుతుడు విజయుడు
తొలగించండిశుకయోగికి, నల్లుఁడయ్యెఁ జుమి , భీష్ముండే
సకలముఁ గూర్చగ ద్రోణుని
కొక శిష్యుడగుచు ద్రుపదునకు సుత వరించన్
అకటా యేమని వ్రాయుదు
రిప్లయితొలగించండిశుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే
తికమక గా నుండెను మరి
శుక భీష్ముల కిడుదు నతులు సుమ్మీ యిపుడున్
తికమక యిందేమున్నది
రిప్లయితొలగించండిసుకరంబిది ఇద్ద రిచట సోదరు లొక నా
టక మాడెడు వేళ న్నా
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే.
హ.వేం.స.నా.మూర్తి.
ప్రకటమ భవకారకుఁ డా
రిప్లయితొలగించండిశుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
యకళంకు నగాధిపునకు
నిక ముద మొసఁగఁగ నభవుఁడు హిమవంతునకున్
[భీష్ముఁడు = శివుఁడు]
వికలంబైన నిజేచ్ఛ పార్వతి గిరిం బ్రీతిన్ తపం బాచరిం
చి కరంబా పరమేశ్వరున్ గుఱిచి తాఁ జిత్తంబు మెప్పించగం
బ్రకటామ్నాయ విభాగుడే నుడివె నాద్వైపాయనుం డివ్విధిన్
శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్
[భీష్ముఁడు = శివుఁడు]
ఒకనా డన్నవరంబు నందు గనగా నుత్సాహ పూర్ణాత్ములై
రిప్లయితొలగించండిసకల ప్రేక్షకమోదకారు లగుచున్ సన్మిత్రు లవ్వారు నా
టకమున్ వేయుచు పాత్ర లందిరి వినుం డవ్వారిలో వృద్ధు డౌ
శుకయోగీంద్రున కల్లు డయ్యె గద భీష్ముం డంద ఱుప్పొంగగన్.
హ.వేం.స.నా.మూర్తి.
అకలంకుండగు వ్యాసరా డ్విభుడు నౌన్గదా తండ్రియు
రిప్లయితొలగించండిన్శుకయోగీంద్రునక,ల్లుడయ్యెగదభీష్ముండందరుప్పొంగగ
న్నకటా భీష్ముడు భీకరముగా హా దాను నుద్వాహము
న్నికజే బూననిబల్కగా నగునె నోయీ భీ ష్మకుం డల్లుగాన్
అకలంకుడు వ్యాసుడు పిత
రిప్లయితొలగించండిశుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
చకచక తపమ్ము మదనుడు
కకవిక చేయ వరియించి, గౌరి గురువుకున్
గురువుః తండ్రి
ఒకరేమొ పుట్టు తాపసి
రిప్లయితొలగించండియకలంక చరితు డొకండు యౌన్నత్యమునన్
యకటా సంభవ మెవ్విధి?
శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే??
ముఖమే కీరమెవరికి జ
రిప్లయితొలగించండినకునకు రాముడగునేమి? జనులెరగిన ఘో
టక బ్రహ్మచారెవరనిన
శుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి, భీష్ముండే.
త్రికరణ శుద్ధిగ మ్రొక్కెద
శుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
సుకుమారి కోరగ యప
ర్ణ కరగ్రహణమందుచు గిరి రాజుకు గాదే
భీష్ముడు=శివుడు.
సకల కధలెఱుక యెవనికి ?
రిప్లయితొలగించండినొక రాముడు జనకరాజు కొడుకవడుకదా !
నికరపు వటు వెవడొ జెపుమ!
శుకయోగికి /నల్లుఁ డయ్యెఁ జుమి / భీష్ముండే
ముఖతాఃజెప్పెను మౌని భాగవతమే మోక్షార్థికిన్, మ్రొక్కెదన్
రిప్లయితొలగించండిశుకయోగీంద్రున, కల్లుడయ్యెగద భీష్ముండందరుప్పొంగగన్
వికచాబ్జానని సుందరాంగి సతినే పెండ్లాడె తా వొంద తా
రకసంహారిని బుత్రుగాను సురులే ప్రార్థింపగా నద్రికే
అకలంకుండని దెలియన్
రిప్లయితొలగించండిప్రకటించెను తోటి నటుని వరునిగ సుతకున్
సకలురనిరి గత నాటక
శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే!