15, మార్చి 2017, బుధవారం

న్యస్తాక్షరి - 39 (రా-మ-చం-ద్ర)

అంశము- రామ రావణ యుద్ధము
ఛందస్సు- చంపకమాల
మొదటి పాదం 5వ అక్షరం 'రా'
రెండవ పాదం 6వ అక్షరం 'మ'
మూడవ పాదం 14వ అక్షరం 'చం'
నాల్గవ పాదం 18వ అక్షరం 'ద్ర' .... ఉండాలి!

23 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. రామలీల...
   ఐ.ఐ.టి. ఖర్గపూర్ (1965)
   సరదా స్మృతులు...
   మన్నింపవలె

   __/\__


   ఘనమగు రావణాసురుని కట్టుడు బొమ్మను దెచ్చి బాంబులున్
   దొనరగ రోమ రోమముల దోపియు బొడ్డున తాడు గట్టగా
   ఘనముగ రాకెటౌ శరము గట్టిన చందము తుస్సు బోవగా
   జనములు గొట్టిరే భళిగ చప్పటు లీవిధి చింద్ర వంద్రగా!

   తొలగించండి
 2. డా.పిట్టా సత్యనారాయణ
  దశముఖ రావణుండనిని దాశరధిన్ గని రౌద్ర మగ్నుడై
  "వశమట నన్ను గెల్వ నిటు వానర సేన ప్రచండమా "యనన్
  "నిశిత శరాళి గూర్చియును నిందరి జంపగ రామచంద్రుడే
  అశనిని గన్నయింద్రుడె‌‌ సుమా!" యని జిక్కెశరంపు సంద్రమున్(శరస్సముద్రమున్)!

  రిప్లయితొలగించండి
 3. గురుదేవులకు ప్రణామములు. చంపకమాల మొదటి పాదం నాల్గవ అక్షరం లఘువు రావాలసియుంది.పరిశీలించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా,ఆర్యా,
  రెండవ పాదం లో:వశమట మట్టిగర్చు నిట......గా చదువ ప్రార్థన
  ఒకటవ పాదంలో5వ అక్షరం గురువు స్థానము కదా!4వగురువన్నది(రా),సమస్య.5వచోటవేసినాను.

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  "ద్ర" 17 వ అక్షరమని ఉండ వలసినదేమో! ఆర్యా,

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. ఆర్యా!
  నమస్కారములు,
  చంపకమాలలో 4వ అక్షరం దీర్ఘము, 5వ అక్షరం హ్రస్వము ఉంచుట కుదరదు కనుక దీనిని
  మొదటి పాదం 5వ అక్షరం 'రా'
  రెండవ పాదం 4వ అక్షరం 'మ'
  మూడవ పాదం 14వ అక్షరం 'చం'
  నాల్గవ పాదం 18వ అక్షరం 'ద్ర'
  అను విధముగా సవరించి పూరించుట జరిగినది. గమనించ ప్రార్థన.

  నిలువుము రావణా! తులువ! నిన్నిపు డంపెద స్వర్గసీమకున్
  నిలువు మటన్న రావణుడు నీకిది సాధ్యమె రాక్షసేంద్రునిన్
  దెలియవె నేడు నాకు కసిదీరును చంపెదనన్న రాముడా
  పలుకుల కుండు మంచు శరవర్షము బంపెను రౌద్రమూర్తియై.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 8. పోరున రావణుండు కడు మోదముతోడ చెలంగి యుగ్రుడై
  బోరన రామనిల్వుమని మూర్ఖత నేసె శరమ్ములన్ వెసన్
  శూరుడు సూర్యవంశ ఘన సోముడు త్రుంచె ప్రచండ శక్తితో
  ధారణికంపమొందె యని ధాటికి, శోణితముల్ ద్రవించె వే

  రిప్లయితొలగించండి
 9. ఉత్పల మాలగా మార్చి మోడవ పాదం పదహారవ అక్షరం గా " చం" తీసుకొన్నాను.

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  "ద్ర" 17 వ అక్షరమని ఉండ వలసినదేమో! ఆర్యా,

  రిప్లయితొలగించండి
 11. ఆర్యా!
  సవరించిన సూచన ప్రకారం వ్రాసిన పద్యం

  నిలువుము రావణా! తులువ! నిన్నిపు డంపెద స్వర్గమన్న నా
  పిలుపున రామ దూషణము బిట్టుగ జేయుచు రాక్షసేంద్రునిన్
  దెలియవె నేడు నాకు కసిదీరును చంపెదనన్న రాముడా
  పలుకుల కుండు మంచు శరవర్షము బంపెను రౌద్రమూర్తియై.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులారా,
  నమస్కృతులు. ప్రయాణపు తొందరలో సరిగా పరిశీలించకుండా న్యస్తాక్షరిని పోస్ట్ చేసి అందరికీ ఇబ్బంది కలిగించినందుకు మన్నించండి.
  ఉదయమే సరిచేశాను. గమనించండి.

  రిప్లయితొలగించండి
 13. మనమున రామ భద్రుడట మాతలి మాటలు గౌరవించి యా
  యినకుల భీమ విక్రము డహీన విధాతృ ఘనాస్త్ర మంతటన్
  ఘనముగ నేయ మంత్రములఁ గార్ముక చండ విముక్త మంతఁ దా
  కెను దశకంఠు వక్షము వికీర్ణము సేసెను రౌద్ర వంతమై

  రిప్లయితొలగించండి
 14. *సహస్ర కవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  వృత్తం... మత్తేభము

  ()

  4..5..14..18.. రామచంద్ర

  సమరారామముభీకరాబ్దితటిసాక్ష్యంబయ్యె నాకాశమే
  యమసంగ్రామమురామపక్షమునఖాయంబైన చందంబునన్
  సమరంబందసురాళిచచ్చెనటుకాంచంగన్ సురుల్ శ్రేణులై
  సమసెన్ రావణుడాహవస్థలిఁమహాశస్త్రవ్యథాద్రష్టుడై!

  *సహస్ర కవిరత్న,కవిభూషణ శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  చంంపక మాల లో పైై న్యస్తాక్షరి రమచంంద్ర గా ఇముడుతుంంది.
  మత్తేభంంలో అయితే భేషుగ్గా వస్తుంంది పైైగా యుధ్ధంంవర్ణన లోమత్తేభశార్దూలాలుంంటే బావుంంటుంంది.
  చంంపకాలతో ఇతర సరసాలు శోభిల్లుతాయి. క్షమిస్తారని ఆశిస్తూ మీ తుంంటరి శిష్యురాలు పాదాభివంందనాలుచేస్తూ
  సమర్పింంచుకుంంటోంంది పెద్దల పాదాల వద్ద

  రిప్లయితొలగించండి
 15. పలికెను రావణుంగని సభాసదు లందరు నిచ్చ మెచ్చగన్
  నిలువుము నీమదంబును ననేకులు జూడగ ద్రుంచు దిప్పుడే
  తెలియుము రావణా !కసిని దీరగ జంపెద జూడుమా యిట న్
  బలికెను నీవి ధంబుగ సభాంగం ణ మధ్యన రౌద్ర మూర్తియై

  రిప్లయితొలగించండి
 16. చివరిసారిగా విభీషనుడు రావణునకు చెప్పిన హితవాక్కులుగా

  కదిలెను రామదండిటకు కయ్యము గోరి మహా ప్రవాహమై
  వదులుము రామ పత్నినిక వైరము కూడదు, ధీరశాంతుడౌ
  బుధజన వంద్యుడాతడట పోరున చండకుడై చెఱంగునే
  కదనము మాని నిత్యమును గాంచుము నీ కులబద్రతన్ సుమా

  రిప్లయితొలగించండి
 17. దురమున రావణా! యిపుడు
  దొల్గక నిల్వుమి తప్పదింక నీ
  మరణము రామభాణమున
  మౌనులు మెచ్చగ సంభవించు నా
  శరణము వేడినా విడువ సత్యము
  చంపెద బండె పాపముల్
  ఎరుగవు నా ప్రతాప మిపు డేర్పడునో!
  యసురేంద్ర కాచుకో!

  రిప్లయితొలగించండి
 18. దురమున రావణా! యిపుడు
  దొల్గక నిల్వుమి తప్పదింక నీ
  మరణము రామభాణమున
  మౌనులు మెచ్చగ సంభవించు నా
  శరణము వేడినా విడువ సత్యము
  చంపెద బండె పాపముల్
  ఎరుగవు నా ప్రతాప మిపు డేర్పడునో!
  యసురేంద్ర కాచుకో!

  రిప్లయితొలగించండి
 19. ఘనుడని రావణాసురుడు గర్వమదంబున లంకనుండగా
  నణచగ రామచంద్రుడట యారణమందున నుగ్రరూపమే
  గనపడ?రాక్షసుల్ మనసు కందుచు చంచల మందు చావగా|
  కనుగవ లన్నిమూసె |దశకంఠుని ద్రుంచగ చిద్రరూపముల్|

  రిప్లయితొలగించండి
 20. శరములు రాల్చెనగ్నికణ జాలములట్లు శత్రుమూకపై
  వెరువక రామభద్రుడనిభీముని యాగ్రహజ్వాలగాంచి యా
  హరిప్రియ భక్తుడా కదనమందున చండకుడై చరించి సం
  గరమున రావణాసురుడె కాలునిజేరెను ఛిద్రనాభుడై

  రిప్లయితొలగించండి