కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రణము ప్రాంగణ మది రణము గాదె"
లేదా...
"రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రణము ప్రాంగణ మది రణము గాదె"
లేదా...
"రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
రంగు లాట లాడి భంగు మందులు తాగి
రిప్లయితొలగించండితందనాలు తొక్కి తరుము కొనుచు
పిల్లజెల్ల మగువ పెద్దల హోళికా
రణము ప్రాంగణ మది రణము గాదె!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిచక్కని పూరణతో శుభోదయం పలికారు. బాగుంది. అభినందనలు.
త్రాగి, త్రొక్కి. ... అనడం సాధువులు.
సార్! బాగున్నారా? సంతోషం. ఆంధ్రభారతి చూసే వాడేను సార్ ఆ రెండు పదాలు...హోలీ ఆటల మజాకి సరిపడతాయని. మీరన్నట్లు అవి వ్యావహారికాలే. శుభోదయం __/\__
తొలగించండిబాగున్నానండీ.... శ్రీరంగంలో ఉన్నాం. కాసేపట్లో తంజావూరు బయలుదేరుతాం.
తొలగించండిరేఫ లేకుండా వాటి రూపాంతరాలను నిఘంటువులు పేర్కొన్నా అవి నాకెందుకో కర్ణపేయంగా ఉండవు.
__/\__ __/\__ __/\__
తొలగించండిబీరకాయ లమ్మొ! బెండ కాయల్లమ్మొ!
తొలగించండిఅంటి కాయ! పొన్నగంటి కూర!
గంప క్రింద దించి చంపి బేరమ్ముల
రణము ప్రాంగణ మది రణము గాదె!
....నెల్లూరు 1950
కోలొ కోలొ యన్న గుండమ్మ కథలోన
తొలగించండిసూర్యకాంత మత్త జుట్టు బట్ట
ఛాయదేవి తోడ సావిత్రి సలిపిన
రణము ప్రాంగణ మది రణము గాదె
చేప నొకటి తెచ్చి చెరి సగముగ నియ్య
తొలగించండిగుఱ్ఱు గుఱ్ఱు పఱ్ఱు పఱ్ఱు గుఱ్ఱు
మ్యావు క్యావు పోరు మార్జాల విధ్వంస
రణము ప్రాంగణ మది రణము గాదె
...క్షమించాలి. సార్ లీవులో నున్నారని తోక విప్పే శానీరోజు ;)
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిరక్షక భటోద్యోగ రాశుల నెంపిక
పరుగు పందెమ్మను స్పర్ధ జూడ
ఎవరినెవరు మది నిండుగా బడవేయు
రణము ప్రాంగణమది రణముగాదె?!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిసమస్య ఆటవెలదిలో ఉంది. మీ పద్యం ఛందస్సు?
డా.పిట్టా
రిప్లయితొలగించండిగుణములనెంచ సద్విభవ గోచరమైన వివాహ యుగ్మమున్
వణికులు మేళనంబుల నవారిత రీతినిబిల్వ నచ్చటన్
గణనము సేయ నెవ్వరికి గావలె నెవ్వరు యెవ్వరెవ్వరో
రణము రణమ్మమహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్!
డా. పిట్టా వారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని 'వణికుల' ప్రస్తావన ఎందుకు?
పెండ్లి సంద డచట ప్రియరాగ ములవిందు
రిప్లయితొలగించండికిలకి లారవముల కలక లమ్ము
కనుల వేడు కంట గగనంపు సొగసుల
రణము ప్రాంగణ మది రణము గాదె
గణుతికి నెక్కి దేశమున ఖ్యాతిని గూర్చెడి పాలనంబుతో
రిప్లయితొలగించండిప్రణతుల నందుకొం డనుచు వారల నెంపిక చేసి పంప నా
మణిమయ సత్సభాస్థలము మాత్రము తిట్టుల చోటు చూచినన్
రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్.
హ.వేం.స.నా.మూర్తి.
మాస్టరుగారూ! మీ తీర్థ యాత్ర ఇబ్బందులు లేఉండా కొనసాగుచున్నది కదా!
రిప్లయితొలగించండిచట్టసభను బెట్టి సరికొత్త బడ్జెట్టు
ప్రభుత పొగడ, నెదుటి పక్ష మంత
తెగడి చిందులాడి త్రెంచగా శాంతితో
రణము, ప్రాంగణ మది రణము గాదె.
కడుపు నిండ త్రాగి కల్లు సారాయిలు
రిప్లయితొలగించండిహోళిహోళి యనుచు నూగు చుండి
యొకరి మీదను మరి యొకరు ప డుచుండ
రణము ప్రాంగణమది, రణము గాదె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిజయ నగర మందు వీథుల పేర్లవి
రిప్లయితొలగించండిలంక,సుంకరలకు,సంకరమ్ము
దివ్వె జాత రందు జువ్వలనేయుచు
రణము ప్రాంగణమది రణము గాదె
వైరివర్గమెల్ల బంధు,గురు గణము
రిప్లయితొలగించండిచంపలేననంగ సవ్యసాచి
గీతఁ జెప్పుచు నిడ కృష్ణయ్య వలయు ప్రే
రణము, ప్రాంగణమది రణము గాదె
సలలితస్వర మృదు కలిత గానామృత
రిప్లయితొలగించండిరస ఝరీ నినాద రమ్య తరము
ప్రణవ నాద కలిత రాగ యుక్త మధుర
రణము ప్రాంగణ మది రణము గాదె
[రణము = 1. శబ్దము , 2. యుద్ధము ; ప్రాంగణము=పణవవాద్యము]
మణిమయ మా వివాహ ఘనమంటప మొక్క నిమేష మాత్రఁ గా
రణ మొక యింత లేక యనురాగము గర్జనమయ్యె నంత తో
రణములు ద్రెంచి వేదికలు రవ్వలు సేసి చెలంగ నత్తరిన్
రణము రణమ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్
పణముగ బెట్టగా గొలుసు భార్యది యప్పుడు గోల బెట్టగా
రిప్లయితొలగించండినణకువ యెంత యైన దన హారము గానక పోవ నత్తరిన్
రణము రణమ్మహా రణము ప్రాగణ మెల్లరణాంగణమ్మగున్
సణుగుల తోడ నుండుచు గషాయి ని బోలుచు నుండు సుమ్ముదా
సడిని సేయవలదు శబ్దకాలుష్యమ్ము
రిప్లయితొలగించండికలుగ జేయు నంచు గానసభల
నిర్ణయింపనేల? నేలలోన మధుర
రణము ప్రాంగణమది రణము గాదె
రణము =శబ్దము ప్రాంగణము=పణవవాద్యము
వణిజుని పుత్రులారుగురు పాలుల వేసిరి తండ్రిసంపదన్
మణిమయ భూషణమ్ములె ప్రమాదము తెచ్చెను సోదరాళి స
ద్గుణములె యంతరించగను దుర్మతులైరట యాస్తికోసమై
రణము రణమ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్
asnreddy
రిప్లయితొలగించండిక్రొత్తజంట యొకటి కోరి యూటికిపోయి
పగలురేయి గూడ పరవశమున
కరముతృప్తితోడ జరుపునట్టి మదను
రణము ప్రాంగణ మది రణము గాదె
రుణములఁ దెచ్చినిత్యమును లోటువిధానము కాదటంచు నో
రిప్లయితొలగించండిగుణరహితుండు నేతగను కూర్చగణాంకము, లేకయే నియం
త్రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్
ఘనమగు వైరిపక్షమున కల్గిన నేతలుచేయ చర్చలన్
క్షణమును విశ్రమింపక ప్రగల్భములాడుచు,మత్తచిత్తులై
రిప్లయితొలగించండిగుణగణదూరులై, మమతకున్ కడు నోచని దుష్టభావనల్
పుణికిని పుచ్చుకొన్నతలపుల్ ఘటియించెడు వారి దుష్ట మా
రణము రణమ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్
హేవళంబి యుగాది సహేతుకాన
రిప్లయితొలగించండిరమ్ము మీప్రేరణల నిమ్మురక్షగూర్చ
రైతు రాజుగజేసెడి జాతినాద
రణము ప్రాంగణ మది|రణముగాదె|
2.గుణగణ మిచ్చుపండుగలకూర్పులు మంచికె| హేవళంబిలన్
క్షణమున వచ్చిపండుగన కాంక్షలు దీర్చగ పాడిపంటలున్
తృణమును బెంచు మార్గములదేగ?వసంతపురంగులందుతో
రణము,రణమ్మహో రణము ప్రాంగణ మెల్ల రణాంగణమ్మగున్|
కోట్ల కొలది జనులు కోర్కెల నీ డేర్చ
రిప్లయితొలగించండిమనుచు గోర లలిత మందిరమున
పూజ సలుప దలఁచు భూరి దీపాల తో
రణము ; ప్రాంగణ మది రణము గాదె !
నిన్నటి సమస్యకు నా పూరణ
అలిగిన రామ చంద్రుడు వనాంతర సీమను జొచ్చి యిట్లనెన్
తలచుము రామ బాణమిది దానవ ! నీ వశమౌనె పోరునన్
నిలువగ ? మాయ వేషమున నీవని చంపగ నెంచి తే ననున్ ?
కొలువగ బంపెదన్ యముని కోటకు నిన్నిదె క్షుద్ర రాక్షసా !
మౌనమనెడి గుణమె మనుజున కిల నాభ
రిప్లయితొలగించండిరణము! ప్రాంగణమది రణము గాదె
నిచ్చ వచ్చినటుల రెచ్చ గొట్టగ నెంచి
నోటి కదుపు లేక మాట లాడ!
డా.పిట్టా
రిప్లయితొలగించండిగుణములనెంచ సద్విభవ గోచరమైన వివాహ యుగ్మమున్
వణికులు మేళనంబుల నవారిత రీతినిబిల్వ నచ్చటన్
గణనము సేయ నెవ్వరికి గావలె నెవ్వరు యెవ్వరెవ్వరో
రణము రణమ్మమహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్!
డాపిట్టానుండి,ఆర్యొ
రిప్లయితొలగించండిసవరించిన సమస్య
రక్షకాళి గనగ రాశుల నింపంగ
పరుగు పందెమన్న స్పర్ధ జూడ
ఒకరినొకరు మదిని నోపికన్ బడవేయు
రణము ప్రాంగణమది రణముగాదె?!
డాపిట్టా నుండి,ఆర్యా
రిప్లయితొలగించండివణకులు marriage bureau వారు మేళనములు (వధూవరులను తల్లి దండ్రులను పిలిచి సంబంధాలను గూర్చే ప్రయత్నం జేసి దాన్ని) వాణిజ్యంగా మలచుకుంటున్న వణికులు.ఇది ఈ నాటి లోకం పోకడ.)
రిప్లయితొలగించండికందిశంకరయ్యగారిట స్థాపించె
శంకరాభరణము శ్రద్ధతోడ
పద్యరాజములను ప్రతిరోజుచూపు తో
రణము ప్రాంగణమది రణము గాదె.
కనుగొని చేప నొక్కటిని కన్నుల నిండుగ పండుగైనదౌ
రిప్లయితొలగించండితినమని నారు పిల్లులను తియ్యటి నీలను కొట్టి పిల్వగా
క్షణమున వారలెల్లరును గంతులు వేయుచు పర్వు బెట్టగా
రణము రణ మ్మహో రణము ప్రాంగణమెల్ల రణాంగణమ్మగున్