25, మార్చి 2017, శనివారం

పద్యరచన - 1234

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

31 కామెంట్‌లు:

  1. ఒళ్ళు మరచి దూకె నొకతె
    పళ్ళు తెరచి నవ్వె నొకడు పకపక మనుచున్
    కళ్ళెము లేనట్టి పసిడి
    కళ్ళల కళలును వెలుగులు గాంచితి నేడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      స్వభావోక్త్యలంకారంతో మీ పద్యం శోభిస్తున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఒళ్ళు మరచి దూకె నొకతె
      పళ్ళు తెరచి నవ్వె నొకడు పకపక మనుచున్
      కళ్ళెము లేనట్టి పసిడి
      కళ్ళల్లోన వెలుగులను గాంచితి నేడే!


      ...అంజయ్య గారికి ధన్యవాదాలతో...

      తొలగించండి
  2. వంగి యున్నట్టి యామెపై బా లికొకతె
    దూకు చుండెను జూడుమా దూకుడు గను
    బ్రక్క నున్నట్టు బాలుడు పండ్లి గిలిచి
    నవ్వ సాగెను జి త్రా న నయము లేక

    రిప్లయితొలగించండి
  3. వంగుడు దుముకుళ్ళివియే
    సంగడిగాళ్ళంతజేరి సరి పల్లెలలో
    చెంగున దూకుచు నాడెద
    రంగాంగములన్ని కదలి హాయిగనుండన్.

    రిప్లయితొలగించండి
  4. ఎత్తునుండి దుముకు జిత్తలాటిది పల్లె
    పిల్ల లాడు చుంద్రు పల్లెలందు
    ఎత్తు పెరుగు చుండు నెగిరి దుముకుచుండ
    నంద్రు దీని నేడు "హైటు జంపు "


    రిప్లయితొలగించండి
  5. లీలా కేళి విలాస వి
    లోల సదరహాస వదన రూపాతిశయుల్
    హేలా లంఘన సమ్మద
    వాల విహీన హరి బాల బాలిక లచటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      తోకలేని కోతిపిల్లల గురించి వ్రాసిన మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
      దీనిని వాట్సప్ సమూహంలో ప్రకటించాను. ఇప్పటికే ఇద్దరు ప్రశంసించారు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రత్యేక ధన్యవాదములు. నా పద్యమును మెచ్చుకున్న పాఠక మహాశయులకు ధన్యవాదములు తెలుప గోర్తాను.

      తొలగించండి
  6. బాల్యం - అమూల్యం
    మానవ జీవనంబున సమానత నేర్పుస్థలంబు నిత్యస
    న్మానము గూర్చుచున్ సతము మైమరపించుచునుండు చోటు ది
    వ్యానుభవంబు లందగల భాగ్యము పంచెడి దిక్కిలన్ బసం
    దైన విధంబుగా నడిపి హర్షము నింపును బాల్యమేవిధిన్.

    చీకు చింత లుండ వేకాకి యనియెడు
    బాధ కలుగబోదు వ్యాధు లన్న
    భయము చేరరాదు జయ మొక్కటేతప్ప
    సంతసంబు గూడు నెంతయేని.

    నీనాభేదము లెరుగరు
    కానిమ్మని పిలువ జేరి కడు హర్షముతో
    నానా రకముల క్రీడల
    కేనిమిషంబైన నిలుతు రీబాలు రిలన్.

    ఎక్కి దూకు క్రీడ యీచిత్రమందున
    గానవచ్చుచుండె గాంచనగును
    మిత్రులంద రెట్లు మేలంచు చేరిరా
    చోట మేటి దాటు నాటయౌట.

    భగవానుడు నా కెదురుగ
    నగపడి వరమడుగుడన్న నతి హర్షమునన్
    నిగమనుతా! బాల్యంబును
    తగునిదె నాకిచ్చుటందు దండంబులతోన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      కల్ల కపటం తెలియని బాల్యావస్థను వర్ణిస్తూ మీ రందించిన ఖండిక మనోహరంగా ఉంది. అభినందనలు.
      దీనిని వాట్సప్ సమూహంలో ప్రకటించాను.

      తొలగించండి
  7. బంగారు బాల్యమందున
    వంగుడు దుముకుళ్ళయాట వాటము జూడన్
    చెంగున దూకఁగ నేర్చుము
    వంగును కష్టములటంచు పాఠము నేర్పున్

    రిప్లయితొలగించండి
  8. పాపము పుణ్యమ్మెరుగని
    పాపల వలె నాటలాడు పచ్చని దినముల్
    రూపులు రేఖలు మారిన
    తాపపు తరుణీ తరుణుల తలపుల మెదిలెన్

    రిప్లయితొలగించండి
  9. వంగుడు దూకుడు యాటయె
    యంగద దుముకుడు గమారె యందరు మెచ్చ
    న్నంగనలు బాలు రందరు
    చెంగున నెగురుచు చెలిమిని చేవను బెంచన్!

    అంగద్ కూద్= హై జంప్
    హనుమాన్ కూద్= లాంగ్ జంప్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ఈ 'అంగద్ కూద్' నాకు క్రొత్త పదం.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారము! ఉత్తర భారత దేశంలో చాల వాడుక పదాలు ఈ కూద్ లు!

      తొలగించండి
  10. బాధలేమియు తెలియని బాల్యమందు
    కల్లకపటము లెరుగక యుల్లసముగ
    పిల్లలందరు నొకచోట ప్రేమతోడ
    వంగుడు దుముకుళ్ళాటల వరలుచుండ్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      మీ పద్యం సహజ సుందరమై శోభిల్లుతున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
      సత్యనారాయణ రెడ్డి

      తొలగించండి
  11. *చిత్రానికనువైన పద్యము*

    పాపమెరుగని పసివారి పసిడి మనసె
    యాట పాటలకేరింత లందు మనిగి
    యాడు చుండిరట దుముకుడాట జూడ
    మధుర స్మృతులనది మోసె మరువ నీక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పద్యం బాగున్నది.
      మునిగి... మనిగి అయింది. 'మధుర స్మృతులు' అన్నచోట ర గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
  12. పిల్లలాడువారు ప్రీతిగగలసియు
    ఆటపాటలన్ని చాటియాడ
    నొకరి పైన నొకరునోటమి గెలుపులు
    యెంచిపంచు కొనుట యెంతహాయి|

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు మనవి.
    రేపు, ఎల్లుండి హైదరాబాదులో కవిసమ్మేళనాలలో పాల్గొనడానికి వెళ్తున్నాను. అందువల్ల సమయాభావం వల్ల మూడురోజుల పాటు 'పద్యరచన' శీర్షిక ఉండదు. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  14. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి .
    పల్లెటూళ్ళయందు బాలబాలికలెల్ల
    నాడుకొనెడి కమ్మనైన యాట
    యరమరికలు లేక హాయిగా నాడెడు
    పిల్లల నిటు జూడ ప్రీతి గల్గు.

    రిప్లయితొలగించండి