10, మార్చి 2017, శుక్రవారం

సమస్య - 2304 (భారత యశ మడఁచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్"
లేదా...
 "భారత కీర్తిచంద్రికలు భావితరాలకుఁ జేటుఁ గూర్చురా"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

55 కామెంట్‌లు:

 1. శ్రీరాముని దయ లేకను
  నారూఢిగ సకల జనులు నౌరా యనగా
  ధారాళ మైన లంచము
  భారత యశ మడఁచు సుమ్ము; భావితరములన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వీరులు రాములు కృష్ణులు
   నారులు దమయంతి సీత, నారద మునులున్
   తీరుగ నెలకొన్న ననఘ
   భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. విరివిగ నదీ నదమ్ములు
   విరివిగ ధన ధాన్యములును విరివిగ మణులున్
   విరివిగ జ్ఞాన యశమ్ములు
   బరువుగనే దోచునేమొ భారత మాతా!

   తొలగించండి
  4. తీరని తాతల సంపద
   తీరని తలిదండ్రులాన ధీరుల కైన
   న్నేరీతిగ భారమవునొ...
   భారత యశమడఁచు సుమ్ము భావితరములన్!


   ఏరీతిగ వ్రాయగలము?
   భారత భాగవతములిక భగవద్గీతల్!
   భారత మాతా! నమ్ముము...
   భారత యశమడఁచు సుమ్ము భావితరములన్!

   పై రెండు పద్యములు మన పూర్వీకుల మన్ననలుగా వ్రాయగోరితిని. ఫలించకున్నచో క్షంతవ్యుడను!

   తొలగించండి
 2. శారద యనుమాట మరచి
  పౌరుల కింగ్లీషు జొరము పట్టిన పీడన్
  తీరని కాంక్షల జిక్కిన
  భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్

  రిప్లయితొలగించండి

 3. మనోహర్ పారికర్ ఉవాచ - భారత దేశానికి సత్తా వున్న గురువులు ఆచార్యులు టీచర్లు ప్రొఫెసర్లు కావలె


  పారికరు చెప్పె వినవే
  భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్,
  సారము గలిగన గురువుల
  యీరము గలిగిన మనుజుల యివ్వక బోవన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. పేరెన్నిక గన్నట్టిది
  భారత యశ మడచు సుమ్ము భావి తరములన్
  మీరినచో మర్యాదను
  మారినచో నీతిలేక మదమత్తులుగాన్.

  ధారుణి నన్నికోణముల ధర్మయుతిన్ వెలుగొంది యున్నవీ
  భారత కీర్తిచంద్రికలు భావితరాలకు జేటు గూర్చురా
  మీరుచు హద్దులన్ సుఖమె మెక్కుచు స్వార్థముతోడ మత్తులై
  దూరిన తత్పథంబు బహు దుఃఖము లందరె కుందరే కనన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. డా.పిట్టా సత్యనారాయణ
  కోరుచు వేదాభ్యాసము
  ఊరక సరి వల్లెవేసి యొల్లరు శ్రమలన్
  పారులుగా బాలురగన
  భారత యశ మడచుసుమ్ము భావి తరములన్

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  కోరకుమది జరుగును యట
  మీరిన యాశల్ యవేల?మిడిసిపడకుమం
  చారయు బాలలగనగా
  భారత యశమడచుసుమ్ము భావితరములన్

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  "మీరిన యాశాళి యేల?"గా చదువ ప్రార్థన!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జరుగును + అట' అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
 8. నమస్కారములు
  ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ప్రయాణంలొకుడా ??????????????????????
  మీ శ్రద్ధకు జోహార్లు .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   కాసేపట్లో పాల్ఘాట్ (పాలక్కాడ్) స్టేషన్ రానున్నది.

   తొలగించండి
  2. చాలా సంతోషంగా ఉంది.మీ ప్రయణంలొ సరిగమలు లాగ మా పూరణలు శుభా కాంక్షలతో

   తొలగించండి

  3. పాలక్కాడును జేరుచుంటి నిచటన్ పద్యంబులన్జూచుచు
   న్నీలావణ్య మయూఖమెల్ల గనుచున్నీ కేరళమ్మున్ భళా :)


   జిలేబి

   తొలగించండి
  4. హేలన్ దాటితి పాలుఘాటు నిపుడే యెర్నాకులం చేరితిన్

   తొలగించండి


  5. లాలిత్యంబుల పద్యమాలికలనెల్లన్నాదరింతున్ సదా ! :)

   తొలగించండి
  6. యుగళ పద్యంబు భళా!


   గురువు గారికి, జిలేబిగారికి 🙏🙏🙏🙏

   తొలగించండి
 9. డా.పిట్టా సత్యనారాయణ
  కూరిన యంశమున్ గొనియు గొప్పలకై పరిశోధనావళిన్
  బారిన యన్యదేశములె బాగని యందుము,భారతావనిన్
  బోరిరి శాస్త్ర శోధనల బో,యిది తత్త్వపు దేశమన్న నా
  భారత కీర్తి చంద్రికలు భావితరాలకు చేటు గూర్చురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. కురుక్షేత్రమున శ్రీ కృష్ణుడు అర్జునునితో :-

  వీరుడవనుచు నలు దిశల
  పేరెన్నిక గన్న నీవు పెనకువ వీడన్
  ధారుణి వింతగ దలచున్
  భారత! యశమడఁచు సుమ్ము భావితరములన్

  రిప్లయితొలగించండి
 11. కారణ జన్ములైరి,పథగాములునైరి, పురాతనంబునన్
  ధీరత చాటిచెప్పి జగతిన్ వెలగొందగ చేసినారొకో
  భారత కీర్తిచంద్రికలు--భావితరాలకుఁజేటుఁగూర్చురా
  నీరసమై నికృష్టమగు నేటి కుతంత్రపు భావజాలముల్.

  రిప్లయితొలగించండి

 12. ఏరకముగ బలికితి రి టు
  భారత యశ మడచు సుమ్ము భావి తరములన్
  వీరులన బడెడు వారలు
  భారతమున బెక్కు మంది భటులు గలరుగా 

  రిప్లయితొలగించండి
 13. కారణ జన్ములైరి,పథగాములునైరి, పురాతనంబునన్
  ధీరత చాటిచెప్పి జగతిన్ వెలగొందగ చేసినారొకో
  భారత కీర్తిచంద్రికలు--భావితరాలకుఁజేటుఁగూర్చురా
  నీరసమై నికృష్టమగు నేటి కుతంత్రపు భావజాలముల్.

  రిప్లయితొలగించండి
 14. పార మెఱుంగ దధర్మము
  భారతమున నేడు వింత పరికింపంగన్
  దూరీకృత సతృణీకృత
  భారత! యశ మడఁచు సుమ్ము భావితరములన్


  వీరులు ధర్మ వర్తనులు పేర్మి వహించిన సత్యసంధులున్
  భూరి యశో విలాసితులు భూపతు లెల్లరు భారతమ్మునన్
  ధీరత వీడి భోగములఁ దేలుచు నిత్యము, విస్మరించినన్
  భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 15. రిప్లయిలు
  1. భారత దేశమూలములు, భారతమందలి ధర్మసూక్ష్మముల్
   శ్రీరఘురామమంగళచరిత్రము కృష్ణునిగీతబోధలున్
   పేరిడలేని విస్తృతవిభిన్నత నందున కల్గెడైక్యతన్
   భూరివిదేశ సైన్యమును బోరక ద్రోలిన శాంతిమంత్రముల్
   వీరుల యుద్ధగాధలును వేవుర శాస్త్రసుశోధనల్ సదా
   చారము లట్లెకాలగత చాంధస భావము లార్షజీవనా
   ధారము గానుదోచు ఘన తత్వవిచారము, నిత్యమున్ను లో
   వైరుల తోడయుద్ధములు, వైరుల తో గన సంధియున్ను యే
   మారక తల్లితండ్రులను మన్నన చేయుట నొజ్జమండలిన్,
   నారిని గారవించువిధి నైతిక వర్తన మింక ధారుణిన్
   వేరుమతమ్మువారన సువీ!సహనమ్ముయు, గోవు పాముల
   న్నేరుల జెట్టులన్ బ్రకృతి నెల్లడ దైవము గాంచుపద్ధతిన్
   గోరిక లెల్లముక్తిగొను కోర్కుగ మార్చెడి నిత్య సాధనల్
   సారమతుల్ కృపన్ మును చక్కగ చెప్పిన మోక్షమార్గముల్
   మారుట విద్యలెల్ల, పెను మాయయు గప్పుట దోపకున్నచో
   భారత కీర్తిచంద్రికలు భావితరాలకుఁ, - జేటుఁ గూర్చురా

   తొలగించండి
 16. వారధి గాగనుం డవలె బాయని రీతిని నెల్ల వేళలన్
  భారత కీర్తిచం ద్రికలు భావి తరాలకు, జేటు గూర్చుగా
  బీరము లాడుచు న్మిగుల పేకలు బేర్చుచు గూరుచుండుచో
  నేరికినైన నీభువిని ,నీశుని వేడిన నిచ్చు సౌఖ్యముల్

  రిప్లయితొలగించండి
 17. కోరగ లంచము నిత్యము
  మీరగ యవినీతి దేశ మేరలు దాటన్
  పౌరుల హక్కులు ద్రుంచగ
  భారత యశ మడచు సుమ్ము భావితరములన్!

  రిప్లయితొలగించండి
 18. నారీమణులిల తీరును
  నీరీతిగ మార్చుచుండ నెవ్విధి నిలుచున్
  కూరిమి,ప్రేమలు?గనుమా
  భారత యశమడచు సుమ్మి భావి తరములన్.

  వీరుడ వందురు పార్థా
  భీరుడవై యిటు పలుకుట భూరిగుణంబే?
  నీరీతిగ నున్న భువిలో
  భారతయశమడచు సుమ్ము భావితరములన్.

  కోరికలు పెరుగ నిలలో
  తీరుచు కొనగా సతతము దేహీయనుచున్
  జారిన విలువలతోడను
  భారత యశమడచు సుమ్ము భావితరములన్.

  రిప్లయితొలగించండి
 19. జోరుగ పరాను కరణము
  భూరిగ వ్యసనాలు స్వార్థ పూరిత చింతల్
  మీరిన నవనాగరికత
  భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్

  శ్రీరఘు రాముశీలము వశిష్టుడు వ్యాసుడు కృష్ణలీలలున్
  భారతమాదిగ్రంధములు భాగవతమ్మితిహాసముల్ భువిన్
  భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా
  మీరిన స్వార్థచింత మితిమీరిన నేరప్రవృత్తియే గదా.

  రిప్లయితొలగించండి
 20. నేరకతిండితిప్పలును నిద్రయు సౌఖ్యము లెంతమాత్రమున్
  పోరునవెన్నుజూపకను పూనిక వైరులమట్టుబెట్టు నా
  వీరుల ధీరకృత్యముల విస్మరణమ్మున మాయు నిక్కమీ
  భారత కీర్తిచంద్రికలు, భావితరాలకుఁ జేటుఁ గూర్చురా.

  రిప్లయితొలగించండి
 21. వైరిచమూసమూహములు పన్నిన వ్యూహము నందుచిక్కినన్
  భారత కీర్తిచంద్రికలు భావితరాలకు జేటు గూర్చురా
  ధీరత తోడ శత్రువుల దీకొని చెచ్చెరఁ గ్రొవ్వుదించినన్
  శూరుల వీరగాధలవి చూపును మార్గము దేశమంతటన్

  రిప్లయితొలగించండి
 22. వైరుల విజయము లెప్పుడు
  భారత యశ మడఁచు సుమ్ము, భావితరములన్
  వీరులుగతీర్చి దిద్దుచు
  పోరాటమ్ములను చేయ భూషణమొదవున్

  రిప్లయితొలగించండి
 23. మారగమానవ తత్వము?
  భారత యశమడచు సుమ్ము|భావితరములన్
  ప్రేరణనీతి,నియమములు
  జేరెడి సంస్కరణ లుంచి జెప్పక జేయన్.
  2పూరణ లెన్నియో జరిపి పూర్తిగ మానవతత్వముంచగా|
  భారత కీర్తి చంద్రికలుభావితరాలకు|”జేటుగూర్చురా
  ఆరని యాశ దోషముల నంతరమందున నంకురించగా?
  తీరికచేత బెంచుటయె ధీరతటంచునుమోసమెంచగా?

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరయ్య గారికి ప్రణామములు.ప్రయాణంలో ఉండికూడా శ్రమతీసుని మాపూరణలు పరిశీలించి ,తగు సలహలిస్తున్నదుకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 25. ఘోరము జర్గుచుండెనిల క్రూరుల,నీచుల,ధుర్త చేష్టలన్
  భారత మాత కంఠమున భవ్యముగా ధరయించినట్టి మా
  భారత కీర్తిచంద్రికలు భావి తరాలకు చేటు గూర్చురా
  మారకయున్న నీతరపు మానవ జాతిని మెచ్చరెవ్వరున్

  రిప్లయితొలగించండి
 26. నేరము జేసి లండనుకు నిక్కపు రీతిని పారిపోవుటల్
  బేరము జేసి దేశమును బింకపు రీతిని నమ్మబోవుటల్
  శూరులు లేక కాంగ్రెసును సోనియ పప్పుల చేతబెట్టుటల్ ...
  భారత కీర్తిచంద్రికలు భావితరాలకుఁ జేటుఁ గూర్చురా!

  రిప్లయితొలగించండి