కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్"
లేదా...
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్"
లేదా...
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపేరోలగంబు గాంచును
"నారాయణ!" యనిన నరుఁడు, నరకముఁ జెందున్
వేరొక నామజపంబును
ధారణ జేయన్ జిలేబి ధర్మము గనుమా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(మనలో మాట... 'వేరొక నామజపంబున' అంటే శివనామజపంతో నరకానికి వెళ్తాడా? మరీ ఇంత వైష్ణవ పక్షపాతమా?) :-)
తొలగించండిఅబ్బే ! కంది వారు ! హర హర శంకర !
పూరణ కోసం అంతే :)
జిలేబి
మేము వైష్ణవులమే. మా అమ్మానాన్నలు మా సోదరులకు వెంకటనారాయణ, సూర్యనారాయణ, లక్ష్మినారాయణ అని పేర్లు పెట్టి నాకుమాత్రం (మా అమ్మమ్మ సూచనతో) 'శంకరయ్య' అని పేరు పెట్టారు! కనీసం 'శంకర నారాయణ' అని పేరు పెట్టి ఉండవచ్చుకదా అనేవాణ్ణి!
తొలగించండిధారాళము నోంకారము,
రిప్లయితొలగించండినారాటము, లేక నామమనుటయు తగునా
కారాదు జప విరుద్ధము
నారాయణ యనిన నరుఁడు నరకముఁజెందున్
(ఓంకార రహితమైన నామ జపము నిష్రయోజనమని నా భావన)
ప్రసాద రావు గారూ,
తొలగించండికొంత అన్వయక్లేశం ఉన్నా చక్కని భావంతో మీ పూరణ అలరారుతున్నది. అభినందనలు.
నిష్ప్రయోజనము లో ప వడలేదు.మన్నంచండి
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణతో:
తొలగించండిఓరీ! ప్రహ్లాదా! విను!
కారాగారమున నిన్ను ఖైదీ జేతున్!
శూరుడనగు నన్ను మఱచి
"నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిహిరణ్యకశిపుని మాటగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
__/\__
తొలగించండిఅరయన్ నాస్తికు లొక్కచోట సభలో నత్యున్నతోత్సాహులై
రిప్లయితొలగించండివరుసం జేరుచు బోధ జేసి రిటు లప్పౌరాళి కవ్వేళ నో
కరిచర్మాంబర కావుమన్న నఘముల్ కాయంబునన్ నిండు నా
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో.
ఔరా నాస్తిక సభలో
వారట బోధింతు రిట్లు పరమేశ శివా
రారా యన నఘ మంటును
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఐనా నాస్తికులు స్వర్గనరకాలు కూడా లేవంటారు కదా! లేనిచోటికి పోతారని వారెలా అంటారు?
ఆర్యా!
తొలగించండిశ్రోతల నమ్మకాన్ని దెబ్బకొట్టేట్లుగా అలా అన్నారనే భావంతో వ్రాశాను. అయినా ప్రశ్నార్థకమే కనుక క్రింది పూరణలను తిలకించ ప్రార్థన.
ఆరాజు మూర్ఖు డిట్లను
పౌరులు! దైవంబ నేను పలుకగ వలయున్
కోరుచు నా నామంబును
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.
ఏరోజు నన్ను సుఖములు
చేరంగా వలయు దేవ చీకాకులతో
నూరందరున్న నేమగు
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్.
ధరణీనాథు డొకండు మత్సరమునన్ దైవంబు తానే యనున్
వరుసం జాటును నన్ను గొల్వవలె మీ పాపంబులం గూల్తు ని
ర్జరు లింకెవ్వరు లేరు సత్య మిదియే సంకోచ మింకేలనో
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో.
పరులన్ బాధలు పెట్టుచున్ సలుపగా పాపమ్ములన్ నిత్యమున్
రిప్లయితొలగించండినరకంబందును మానవుండు; "వరదా! నారాయాణా" యన్నచో
చరితార్థంబగు జన్మమెల్ల, కలుగున్ స్వర్గమ్ము తథ్యమ్ముగా
పరమార్థంబన నియ్యదే సుహృదయా పద్మాక్షు కీర్తింపుమా ||
సిసింద్రి(?) గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మీరు బ్లాగుకు క్రొత్తవారైతే స్వాగతం! పాతవారే అయి కొడుకు మెయిలో, మనుమడి మెయిలో వినియోగించుకొని పూరణ పంపి ఉంటే మీ పేరును పూరణ ముందో, చివరనో ఉంచండి.
అయ్యా నేను నేమాని సోమయాజులు. పాత వాడినే.
తొలగించండి
తొలగించండిసోమయాజులు వారు శంకరాభరణం కొరకే సిసింద్రి అన్న పేరుతో ప్రొఫైల్ మార్చి లో కొత్త గా కట్టి నట్టి ఉన్నారు :)
జిలేబి
డా.పిట్టాస.నా.
రిప్లయితొలగించండివీరావేేేశపు శైవులు
ఆరాటము కొలది నాడ నన్యపు భక్తిన్
ఈరీతి ననిరి,"భజనన్
నారాయణ యనిన నరుడు నరకము జెందున్"!
డా.పిట్టాస.నా
రిప్లయితొలగించండిపర రాష్ట్రంపు సునామి బాధితులదో పైపైని ప్రాణాల సం
గరమందోడగ వచ్చెనొక్క కవిగా గద్యంపు కావ్యాళినిన్
విరచించెన్ బహు రమ్యమంచు"వరద"న్ విశ్వాత్మ రమ్మంచు !తా
నరకంబందును 'మానవుండు';"వరదా!నారాయణా"యన్నచో!!
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'శైవులు+ఆరాటము' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! "శైవులె। యారాటము..." అనవచ్చు.
మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ.....
రిప్లయితొలగించండినరకంబందును మానవుండు వరదా! నారాయణా! యన్నచో
కరుణాసింధువు సర్వలోకజనరక్షాదక్షుడౌ విష్ణువున్
పరమంబౌ పదమిచ్చు , జీవులకు కైవల్యమ్ము సిద్ధించెడున్ !
హరి సర్వాంతరవర్తి , నిశ్చయమికేలా! మీకు సందేహముల్!!
( నరకంబందును.. = నరకంలో కూడా)
మైలవరపు మురళీకృష్ణ గారూ,
తొలగించండిక్రియాపదాన్ని విభక్తి ప్రత్యయంగా మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఓ రమణీ ! "నలుగురితో
నారాయణ" యనిన నరుఁడు నరకముఁ జెందున్
పారా హుషారు బిడ్డా !
గోరీలను గట్టవలదు కోట్లను జేర్చీ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'జేర్చీ' అనడం సాధువు కాదు.
నారాయణయనుమంత్రము
రిప్లయితొలగించండిపారాయణజేయువాని పరిహాసమునన్
గీరుచు గిల్లుచుఁ గలడా
నారాయణ? యనిన నరుఁడు నరకముఁ జెందున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిజిలేబిగారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ ఆలోచనా స్ఫూర్తితో....
చోరులు, నేరము జేసెడి
వారలతో గలిసి సలిపి వసుధను నఘముల్
ఘోరములా "నలుగురితో
నారాయణ" యనిన నరుఁడు నరకముఁ జెందున్.
తొలగించండిగోలి వారు
అదురహో ! గోలి వారి గోళీ :)
జిలేబి
గోలి వారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిమ్మాజీ రావు గారూ,
తొలగించండిపూరణ భావం సందిగ్ధంగా ఉంది. '..జూపి యొసగు' అనండి.
గురుదేవుల సూచనమేరకు పద్యము సవరించడమైనది
తొలగించండిశ్రీరాముని స్మరియించిన
కారుణ్యము జూపి యొసగు కైవల్యమ్మున్
దూరుచు మన దేవతలన్
నారాయణ! యనిన నరుఁడు నరకముఁ జెందున్.
కూరును ఘనమగు పుణ్యము
రిప్లయితొలగించండినారాయణ యనిన నరుడు, నరకము జెందున్
ధారుణిలోబీరముతో
నారడి పుచ్చగ గుణులను నన్యాయముగన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిత సంఖ్య :-- 689. 24--3--2017.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు. యస్.కే.1043.
శీర్షిక :-- సమస్యా పూరణము.
శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :--
" నారాయణ"! యనిన నరుడు నరకము
జెందున్.
పూరణము :-- కందపద్యము.
చేరును స్వర్గము తుదకున్
నారాయణ! యనిన నరుడు ; నరకము
జెందున్
ఘోర దురితముల జేయుచు
దూరముగా నుంచి హరిని దూరుచు
నుండన్.
9490313830.
**********************************
పిన్నక నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చోరుడు సద్గుణ హీనుడు
రిప్లయితొలగించండిక్రూరుడు సత్కర్మ రహిత కుటిలాత్ముండున్
జేరియు దేవాలయములు
నారాయణ యనిన నరుఁడు నరకముఁ జెందున్.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు..
చోరుడు సద్గుణ హీనుడు
రిప్లయితొలగించండిక్రూరుడు సత్కర్మ రహిత కుటిలాత్ముండున్
జేరియు దేవాలయములు
నారాయణ యనిన నరుఁడు నరకముఁ జెందున్.
"హా! రామయ్యది మంచిది!"
రిప్లయితొలగించండి"పోరా! చైతన్య గొప్ప ప్రోద్బల మిచ్చున్"
"హేరాం! మూఢా! 'చెడ్డది
నారాయణ!' యనిన నరుఁడు నరకముఁ జెందున్!"
శాస్త్రి గారూ,
తొలగించండి_/\_
మీరఁగ రాదాడి నుడులు
రిప్లయితొలగించండిపారావార మినికినను వసుధాలయమై
నీరైన నసత్యం బిది
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్
పరమైశ్వర్యము పొంద శక్యమగు నప్పద్మాక్షుఁ గీర్తించినన్
దురితౌఘమ్ములు నాశనంబగును వే తోరంబుగన్ ధాత్రినిన్
నిరయాధీశుడు ధర్మరాజునకు వానిం ద్రోయగా శక్యమే
నరకం బందును, మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నిరతమ్మున్ నటియించుచున్, నిజముగా నిర్భాగ్యులన్ బ్రోచగన్
రిప్లయితొలగించండిధరణిన్ జన్మము నొందినామనుచు, నిర్దాక్షిణ్య మార్గమ్మునన్
కరమౌ ప్రీతిని దోచుకొంచు ప్రజలన్ కాంక్షించి లాభమ్ములన్
మరణమ్మొందెడు కాలమందుకడు సన్మార్గంబునన్ బోయినన్
నరకంబందును మానవుండు; "వరదా! నారాయణా" యన్నచో
రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు..
నేరుగ దివికే నేగును
రిప్లయితొలగించండినారాయణ యనిన నరుడు .నరకము జెందున్
పోరానిచోటు కేగిన
రారానిగ నిడుములొంది రహిచెడి దానే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు..
'దివికే యేగును' అనండి.
కోరుచు పరుల ధనమ్మును
రిప్లయితొలగించండినేరములను చేసి కరము నేరుపుతోడన్
ధారుణిని వీడు నప్పుడు
నారాయణ!" యనిన నరుఁడు నరకముఁ జెందున్
రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు..
క్రూరత్వము చోరత్వము
రిప్లయితొలగించండిజారత్వం బసురబలిమి జమిలిని గల్గన్
పారద్రోలవు పాపము
"నారాయణ" యనిన, నరుడు నరకము జెందున్!
అజామిళుడు మినహాయింపు!😊😊😊
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు..
'పారద్రోలవు' అన్నపుడు 'ర' లఘువే. దానివల్ల గణదోషం. 'పారంద్రోలవు' అనండి.
హిరణ్యకశిపుని మాట:
రిప్లయితొలగించండిహరి యెవ్వండును లేడు లోకముల హా హా జూడనేతావునన్
దరుమంబోయితి క్షీరసాగరము మధ్యన్ వానివాసంబనన్
మరుగున్ దాగెనొ! కాంచనైతి, వినుమా మారాజ్యమందేరు బో
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో
-----
హరిపాదాబ్జనితాంతచింతన దినాసాంతంబునున్ జేయుచోన్
దరణోపాయము చూపునాతఁడను సత్యంబున్ స్పృహందాల్చియే
సిరినాధుండను భక్తిఁగొల్చినను సూ శీఘ్రమ్మె స్వర్గస్థుడౌ
నరకం బందును మానవుండు, "వరదా! నారాయణా!" యన్నచో
దండాన్వయము:
తొలగించండినరకం బందును మానవుండు
హరిపాదాబ్జనితాంతచింతన దినాసాంతంబునున్ జేయుచోన్
దరణోపాయము చూపునాతఁడను సత్యంబున్ స్పృహందాల్చియే
సిరినాధుండను భక్తిఁగొల్చినను సూ శీఘ్రమ్మె స్వర్గస్థుడౌ
"వరదా! నారాయణా!" యన్నచో
ఊకదంపుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పరువంబందున విఱ్ఱవీగి మహిలో పాపాలు సాగించుచున్
రిప్లయితొలగించండిసరకంబున్ కడు గ్రోలి మత్తున సదా సంవేశనాసక్తులై
పరిధుల్ దాటి చరించి యంత్యదశలోవార్ధక్య భారంబునన్
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో
సరకంబున్ కడు గ్రోలి మత్తున సదా సంవేశనాసక్తుడై
తొలగించండిఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరువంబందున నీచ కార్యముల దా బాహాటము న్ జేయుచో
రిప్లయితొలగించండినరకంబందును మానవుండు ,వరదా ! నారాయణా యన్నచో
నిరతంబాతడు బోవు సద్గతికి దానే కంబుగానిధ్ధరన్
నరకంబయ్యది చూడబోదలచ నానాపా పాముల్ జేయుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేరుపుతో దివి కేగును
రిప్లయితొలగించండినారాయణ యనిన నరుడు;నరకము చెందున్
కారాగారము నందును
నారాటమును జూపి యొరుల కస్తి బెట్టన్.
చేరును నాకము సతతము
నారాయణ యనిన నరుడు:నరకము చెందున్
క్రూరుండై తిరుగుచు పరులను
ఘోరంబుగ హింసచేయు కూళుండెపుడున్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
రిప్లయితొలగించండికం: చేరెను వైకుంఠమునకు
నారాయణ యనిన నరుడు ,నరకము చేరెన్
జారుడు హరీ అని అనక
మారక సమయమున వాని మగువను తలచన్
పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పారాయణ?పరమార్థమె|
రిప్లయితొలగించండి“కారణములు కల్మషాల కఠినత్వమునన్
వేరొకమతకర్త బలికె
నారాయణయనిన నరుడు నరకము జెందున్”
2.శరణంబంచు హిరణ్యకున్గొలువ?విశ్వాసంబెస్వర్గంబగున్
వరముల్ బొందినరాక్షసోత్తముడు గర్వంబందునేదెల్పెగా
హరినే దల్చిన శిక్షగా యముడు నాహ్వానించుమిమ్మెల్లరున్
నరకంబందును మానవుండు వరదా|నారాయణా|యన్నచో|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కృష్ణ సూర్యకుమార్ పూసపాటి గారి పూరణ.....
రిప్లయితొలగించండికం: చేరెను వైకుంఠమునకు
నారాయణ యనిన నరుడు ,నరకము చేరెన్
జారుడు హరీ అని అనక
మారక సమయమున వాని మగువను తలచన్
మీరే ప్రకటించారు కదా! సంతోషం!
తొలగించండిపోపాయణం:👇
రిప్లయితొలగించండికరముల్ మోడుచు గొంతులెత్తుచును హా! కాపాడు మమ్మోయనన్
వరముల్ నిచ్చుచు జీససుండు మనలన్ స్వర్గమ్ము చేర్పించడే!
త్వరగా రండిటు రామ భక్తులును భల్! తండోప తండాలుగా!
నరకం బందును మానవుండు "వరదా! నారాయణా!" యన్నచో!