21, మార్చి 2017, మంగళవారం

సమస్య - 2314 (కందము వ్రాయంగలేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"
లేదా...
"కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

65 కామెంట్‌లు:

 1. విందున తన మిత్రులతో
  పందెము గాయగ చతురత పద్యము వ్రాయ
  న్నందమగు మగువ రమ కో
  కందము వ్రాయంగ లేని కవి పూజ్యుండగున్!

  కోకందము= చీర యందము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   వైవిధ్యంగా పూరించడానికి ప్రయత్నించారు. ప్రశంసనీయం. కాని 'కోక+అందము' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. సంధులలో సదా విఫలము విచారకరము!
   ముఖ్యంగా తెలుగు సంధుల యందు!😟😟

   గురుదేవులకు ధన్యవాదములు!

   తొలగించండి
 2. చిందర వందర పదములు
  గందర గోళపు దరువులఁ గలసి వెలువడన్
  నందియె దక్కిన దినమునఁ
  గందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. అంధుడు ఛందము తెలిసియు
   కందము వ్రాయంగలేని కవి; పూజ్యుఁ డగు
   న్నందమ్ముగ సుమతుల కా
   నందము నిడు బద్దెనవలె నరవరుడిలలో!

   తొలగించండి
  2. ఛందము లన్నియు తెలిసియు
   కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగు
   న్చందమ్మది యెట్లన్నన్
   కుందేలు నడవగ లేదు కొట్టిన తిట్టన్ ;)

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 4. వందనములు కొనలే డిల
  కందము వ్రాయంగలేని కవి, పూజ్యు డగున్
  సుందరముగ నలవోకగ
  వందలు వేలైన సభను పలికిన యెడలన్.

  వందన మందలే డిలను పండితమండలిలోన నెచ్చటన్
  కందము వ్రాయలేని కవి, గణ్యత కెక్కును కీర్తినందుచున్
  సుందర శబ్దభావముల శోభిలున ట్లలవోకగా సభన్
  వందలు వేలు చెప్పగలవాడన సందియ మేల చూడగన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. డా.పిట్టా
  అందరు టెన్నిసు యాటకు
  ఎందుకురా వలయు నొకటి యేర్పడ బరువం
  చెందుకనరు? వచనముగని
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్!?

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  గందరగోళపు క్రైస్తవ
  స్పందనతో వచన కవిగ ప్రార్థన గనరా!
  ఎందుకు గుడి ,ఛందస్సది
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్1?

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  ఎందరికోపిక గలదీ
  ఛందస్సును వీడు పదపు చాలన చాలున్
  అందము లేని సతిని గొనె
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  పొందుగ జెప్ప లేదనక పోయెరు సుమ్మిది బ్రహ్మవాక్కు వే
  ఛాందసు లుద్భవించెదరు ఛం"దము"(అభిప్రాయము) చాలును "దస్సు" వీడగా
  అందరునాలకించెదరు హాయిగ మేధయె నిద్రబోవ నా
  కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  [1]
  ముందు గతించిన దినములఁ
  గందము వ్రాయఁ గలవాఁడె కవియనఁ బఱఁగెన్!
  డెందము మండఁగ నిప్పుడు
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్!

  [2]
  ముందు గతించినట్టి దినముల్ గణుతించుచుఁ జూడ, నప్పుడున్
  గందము వ్రాయఁగల్గు కవి గణ్యత కెక్కియుఁ గీర్తిఁ గాంచె! నా
  డెందము మండుచుండఁగను దీవన లందుచు నౌర యిప్పుడున్
  గందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్!"

  స్వస్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. చందమునకందమందమ
  నందుము కవియేల నంది యదివ్రాయనిచో
  నందుము 'పూజ్యము ' శూన్యమె
  కందము వ్రాయంగలేని కవి "పూజ్యుఁ" డగున్.

  రిప్లయితొలగించండి
 11. పొందునె యశంబునిలలో
  కందము వ్రాయంగ లేనికవి,పూజ్యుఁడగున్
  సుందర భావమ్ములతో
  నందరు మెచ్చెడి కవితల నల్లు ఘనుండే!!!

  రిప్లయితొలగించండి
 12. అందము జూడగ మదిలో
  స్పందన గలుగుట సహజము సత్కవికిలలో
  నందునునకు పాలిడు రవి
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁడగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ కొంత అగమ్యంగా ఉంది. 'ఇలలో నందునునకు...'...?

   తొలగించండి


 13. విందారగించి హృద్యపు
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగు
  న్నందరి లోన జిలేబీ ?
  ఛందస్సుల మత్తునందు జవ్వాడవలెన్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కందం మీకు బాగా ఒంటబట్టినట్టుంది!

   తొలగించండి
 14. డెంద మలరంగ భక్తిని
  నంద వరాత్మజ సుకీర్తనలఁ బరవశులై
  చిందులు వేయు నృపులపై
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్


  డెందము పొంగ శిష్యులకు ఠేవగ మంత్రము చేత సంగరం
  బందునఁ బ్రాణ హీనులగు నందఱి కింపుగ నిచ్చు జీవముల్
  సుందరమైన సంస్కృతము శోభిలఁ జేయును దెన్గు నందు నే
  కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్

  [కవి = శుక్రుడు]

  రిప్లయితొలగించండి
 15. ఛందము నందము గానము
  బంధమ్మది భావములను ప్రకటించంగన్
  విందగు వచన కవితతో
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుండగున్!

  రిప్లయితొలగించండి
 16. చందా నగరపు పౌరుడు
  విందున నొకచోటబలికెవెటకా రముగా
  నందరు వినుడీ మాటను
  కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్

  రిప్లయితొలగించండి
 17. పొందడు మనమున తృప్తిని
  కందము వ్రాయంగలేని కవి , పూజ్యుండౌ
  సుందరమగు పద్యమ్ముల
  ఛందము లన్నింటిలోన చక్కగ వ్రాయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 18. రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. 22/1/2017 నాటి నా సందేహమునకు పరిష్కారము నీ విధముగా నూహించ వచ్చునను కుంటాను. పరిశీలించండి.

   అ – ద్యః లకు (సద్యోగర్భములోని) యతి మైత్రి:
   సద్యః + గర్భము = సద్యోగర్భము.

   లుప్తవిసర్గకస్వరయతి ప్రకారము దాసః+అహం, తమః+అర్క మొదలైన చోట్ల అకారం తరువాతి విసర్గకు అకారం పరమైనపుడు విసర్గ, దాని ముందువెనుకల అకారాల స్థానంలో ఓకారం ఆదేశమై దాసోహమ్, తమోర్క అవుతుంది. ఇక్కడ ఉత్తరపాదాది అకారానికే యతి చెల్లుతుంది.

   ఇందు విసర్గ తరువాత “అ” కారము లేదు. హల్లు కలదు. ద్యః – ద్యో గా మారినది. కానీ ఉత్తరపదమైన గ అందులో విలీనమవ్వ లేదు. యతి మైత్రి స్తానములో “ద్యో” ఉన్నది. కనుక “ద్యో” కి మాత్రమే యతి వేయాలి.
   ఉదా:
   పురుషుండే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా పు – భో సమస్య పాదము.
   భూమింగ్రుంకకిన నింగి బ్రాకిన మహాంభోరాశిలో జొచ్చినన్ భూ – భో భాగ. దశ. 1526.

   అదే అ ఉన్న ఓ లో గర్భితము. కనుక ఉత్తర పదమైన “అ” కు యతి వేయాలి.
   *అపరిమితానురాగసుమ*నోలసమై చిగురాకు జేతులం (*అపరిమిత.... సుమనః+*అలసమై) [మనుచ. ౩.౨౭]
   అక్కడు మనోజ్ఞ ఉంటే యతి చెల్లదని నా యభిప్రాయము. .

   ఈ సమర్థన తో అ – ద్యః లకు (సద్యోగర్భములోని) యతి మైత్రి చెల్లదని భావిస్తున్నాను. మీ యభిప్రాయము తెలుప గోర్తాను.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   ఏదైనా సందేహం కలిగితే అది తీరేదాకా మీకు మనశ్శాంతి, తృప్తి ఉండవనుకుంటాను. బాగానే శ్రమ పడ్డారు. మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. స్వస్తి!

   తొలగించండి
 19. కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్
  వందన మాచరింతు నిక పండితు డాతడు నిజ్జగంబునన్
  కందమువ్రాయగా దగును కష్టమి కించుక బడ్డచోధరన్
  ఛందము సాక్షిగా నతడు సత్కృతిజేయును నెల్లవే ళలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   'కష్ట మొకించుక' అనండి. 'కష్టము + ఇక + ఇంచుక' లో దోషం లేదు. కాని కర్ణపేయంగా లేదని...

   తొలగించండి
 20. .” కందము కవితాగంధము
  కందము వ్రాయంగ” లేనికవి పూజ్యుడగున్
  కందము కందముయతిగణ
  ఛందస్సును గూర్చి భావసంపద నింపన్.
  2.కందము లందచందముల కల్పనలే యతిప్రాస బంధమై
  కందము వ్రాయ?”లేనికవిగణ్యత కెక్కునుకీర్తి నందుచున్
  పొందికచేత గద్యమున పొత్తముగూర్చ?కవిత్వమున్నచో
  అందరి మెప్పుబొందుటగు యద్భుతమౌరచనాంశమైనచో”|

  రిప్లయితొలగించండి
 21. కందము మా కందమ్ముగ
  నందించెను తిక్క నార్యు డాదిని ; నేడో
  సుందరమగు ఛందము గల
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్

  ముందుగ తిక్కన దలచక
  కందుచునె భ జ స న ల గ గ గణముల కొరకున్
  కుందుచు మా కందమ్మను
  కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్
  ( నకారాత్మక ప్రయోగము )

  నిన్నటి సమస్యకు నా పూరణ

  గంగా దేవికి పుత్రుడె
  గాంగేయుండన్న ;నెవడు గంగా పతియే
  సంగరమున పాశువతము
  నుంగొను మన పొందెననగ నుర్వి యెరుగదే !

  రిప్లయితొలగించండి
 22. 1.చిందరవందర కవితలు
  గందరగోళముగ వ్రాసి ఘనుడ నటంచున్
  ఛందము తిరస్కరించుచు
  కందము వ్రాయంగ లేని కవి పూజ్యు డగున్
  2.మందాకిని మురుగంచును
  స్కందుండోడెను రణమున శహబాషనుచున్
  నిందించుచు దేవతలన్
  కందము వ్రాయంగ లేని కవి పూజ్యు డగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 23. కందమనంగ నీరదము కందము మేలగు దుంప కాదొకో!
  కందమనంగ మూపుగద కందమనంగ వ్రణమ్ము తల్పగా
  కందము వ్రాయనేల కృతికార్యము చాలదె సత్కవీంద్రుకున్?
  కందము వ్రాయలేని కవి గణ్యతకెక్కును కీర్తి నందుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేమాని వారూ, (మీ పూర్తి పేరు తెల్పండి)
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అయ్యా నమస్తే. నా పూర్తి పేరు నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు. పాశ్చాత్యదేశంలో స్థిరపడ్డ తరువాత దాన్ని చిన్నదిగా చేయాల్సింది, ఇక్కడ వాళ్లకి పలకడం కోసం కాస్త సులభతరం చేద్దామని.

   తొలగించండి
  3. సంతోషం! గురువర్యులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు మీకు ఏమవుతారు?

   తొలగించండి
 24. అందంబై పద బంధపు
  విందొనరెడి గతుల గూడి ప్రీతిం గొనెడిన్
  ఛందం బమరంగ, నెటుల
  కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్?!

  రిప్లయితొలగించండి
 25. 9493846984 డా.బల్లూరి ఉమాదేవి .
  ఛందో రీతుల నరయక
  కందము వ్రాయంగ లేని కవి పూజ్యండౌ
  నందురు కొందరు ముదమున
  నందంబుగ వచన కవిత లల్లగ భువిలో.

  రిప్లయితొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందమె సర్వోత్తమమగు
   ఛందముగద చూడ పద్యశాస్త్రమునందున్
   సుందరవదనా! ఎవ్విధి
   కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్

   తొలగించండి
  2. నేమాని వారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 27. సుందరమగు కావ్యాలకు
  అందమునే గూర్చునట్టి యద్భుత ఛందో
  బంధము గలిగిన పద్యము
  కందము వ్రాయంగలేని కవిపూజ్యుడగున్ ?

  ఛందములోన పట్టు గల సత్కవు లందున గాంచ యుండరే
  కందము వ్రాయలేనికవి, గణ్యత కెక్కును కీర్తినందుచున్
  బంధకవిత్వమున్ మిగుల పాటవమందు రచించు పండితుల్
  ముందుగ విజ్ఞులైన జన మోదము నొందెడు వారలే గదా!

  రిప్లయితొలగించండి
 28. డెందము నలరించునుగా
  కందము వ్రాసిన యతండె కవి యనిరి గదా!
  అందము చిందగ; నెవ్విధి
  "కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 29. శక్తిగ సృష్టించి ముగుర
  రక్తిగ పదునాల్గు లోకరక్షణకై , వై
  యక్తికముగ సృష్టి సలుపు
  భక్తుని పూజింప వచ్చె భారతి తానే

  రిప్లయితొలగించండి
 30. తొందర తొంద్రగా కవిత ధూముగ ధాముగ వ్రాయగోరుచున్
  ముందును వెన్కనున్ గనని మూర్ఖుడు నైనను లజ్జ వీడుచున్
  ఛందము శంకరాభరణ శంకరు కొల్వును జేరి నేర్వగా
  కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్

  రిప్లయితొలగించండి