పులుపు తీపి కార ముప్పుచేదువగరుయారురుచుల సార మాకళింపమోదఖేద క్రోధ మోహభయాదులువరలుచుండు వావివరుసలేక!
శ్రీగురుభ్యోనమఃగురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు నమస్సులు. శ్రీ హేమళంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కవన ప్రసూనగంధముల గాలులు వీచుచు కాలభూరుహంబవనిన నామనిన్ నిలిపి హ్లాదము గూర్చుచు జీవరాశికిన్వివిధ రసంబులన్ జిలికి వేదన దీర్చు సుధారసంపు వైభవములు హేమళంబి యయి వచ్చెను దీవెనల లిచ్చి బ్రోవగన్ ధాన్యరాశుల బండించి ధరను బ్రోచిహర్షమును గూర్చు వర్షము కర్షకులకు శుభము లందించు సైనిక సోదరులకు క్షేమముల నిచ్చు భువికెల్ల హేమళంబి
శంకరాభరణ రథసారధి మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి, సుకవి మిత్రబృందమునకు అశేష వీక్షక మహాజనులకు ముందుగా “హేమలంబ” వత్సర శుభాకాంక్షలు. సీ. నీ స్వన మాధురి నాస్వాదనము జేసి వత్సర కాలమ్ము పరగి పోయె చూతమన్నను లేవు చూతవృక్ష తతులు నాగరీక మనెడి నగర మందుగ్రామసీమల లోన గ్రసియింప రావోయి ఘోషింపగ వసంతఘోషి యిపుడుక్రొమ్మావి చివురుల క్రొత్తందనాలతో కూత కూయగ రమ్ము కోయిలమ్మ తే.గీ సతత వసంతకాంతుని సరస జేరి సరస విరసాల రసన మాస్వాదనమునయేవిలంబము జేయక హేవిళంబివర్షమునకు స్వాగతమయ్య హర్ష మిడగ.తే.గీ చెరకు తునకల తీపియు, చింత పండుపులుపు, లేతమామిడిపింది పుట్టు వగరు,వేప పూవుల చేదును, విటలవణపుచవురు, మిరియాల కారము చక్క గాను,తే.గీ ఇచ్చకం బొదవు యుగాది పచ్చడగుచుముందు తెలియజేయు మనకు ముదము తోడషడ్ర సోపేత భరితము సంసృతి యనిమంచి మనసున రారండు పంచు కొనగ.
ఉగాది శుభాకాక్షలు శర్మ గారు. చిరకాల దర్శనము! సంతోష దాయకము!
పోచిరాజు కామేశ్వర మహోదయులకు ముందుగా నమస్సులు ఉగాది శుభాకంక్షలు. సదా మీ ఆశీర్వచనాభిలాషిని.
వెండి పళ్ళెమందు వెండి దొన్నె సొగసువెండి సెమ్మెలోన రెండు శిఖలువెండి జూడ కనుల విందులాయె భళిగవెండి ధరను జూడ మండె గుండె!
శ్రీ హేమలంబీ(బా) నీకు స్వాగతముశా. శ్రీలాలిత్యము, సర్వకార్యములలో క్షిప్రప్రమోదంబు సత్ శీలౌన్నత్యము, సాధుసేవయు, మహిన్ చిత్సౌఖ్య సౌభాగ్యముల్ మేలై వెల్గెడు భావజాలము మదిన్, మిన్నంటు సత్కీర్తు లే కాలం బెల్లెడ “హేమలంబి”! ప్రజకుం గల్గంగ నేతెంచుమా!.శా. హేమాలంకృత! “హేమలంబి” వినుమా హెచ్చైన సౌఖ్యంబు లీ భూమిం బంచగ వేగ రమ్ము కొనుమా పూజ్యా! ఘనస్వాగతం బేమీయన్ హృదిలో దలంచి యిలపై కేతెంచి యున్నావు? రా యీ మాదేశపు దుర్దశన్ మనుపగా నిచ్ఛన్ మదిం దాల్చుచున్. కం. మరియాదను నేర్పించగ సరసాత్మక! “హేమలంబి”! సత్వరగతితో నరుదెంచితి విదె స్వాగత మురుతర సౌఖ్యప్రదాత! యూహాతీతా!కం. లంకల, బీళ్ళను, బొలముల నంకిత భావంబుతోడ నద్భుతరీతిన్ సంకటహరమగు వృష్టిని గొంకక నో “హేమలంబి”! గురిపించవలెన్. కం. బీదలు ధనికులు ననియెడి (బాదలు పెట్టక నీనా) భేదంబును జూపకుండ విమలాత్మకవై శ్రీదముగ”హేమలంబీ” మోదంబున సాగిరమ్ము మురిపించుటకై. శా. నీవాసంబున భారతావని నికన్ నిత్యం బనాథ ప్రజా సేవాకార్యము వృద్ధిచెందవలయున్ శీఘ్రాతి శీఘ్రంబుగా భావావేశము ధర్మకర్మములకై పౌరాళి కబ్బన్వలెన్ ధీవిస్తారము “హేమలంబి” మహదుత్తేజంబు లందన్వలెన్. చం. కువలయ మంతటన్ గనగ కూర్ముల పేర్ములు మానవాళిలో స్తవమున కర్హమౌ విధిని సభ్యత నిండగ “హేమలంబి” నీ సువిదిత కాలచక్రమున శోభనమై వెలుగొందగా వలెన్ భవదభిమాన భాగ్యమిక పౌరుల కెల్లర కందగా వలెన్. కం. స్వార్థంబున నిధులన్నియు వ్యర్థం బొనరించువారి యత్నము లికపై సార్థకనామా! విను ని న్నర్థించెద “హేమలంబి” యణచుట కొరకై.కం. గతి దప్పిన జనజీవన మతివేగమె నవ్యదీప్తు లందగ వలయున్ క్షితిపయిని “హేమలంబీ” యతి సౌఖ్యము గూడవలయు నన్ని విధాలన్. చం. తరముల సంస్కృతుల్ ప్రజలు దాల్చెడి మానస మీయరమ్ము నీ వరయుము నేటి కాలమున నంతట నిండు విదేశ పద్ధతుల్ సురుచిర భావనాభరిత! సుందరనామక! “హేమలంబి” యీ భరత మహీస్థలంబుపయి పావనతన్ బ్రసరింప జేయుమా.చం. ముదితలు సన్నుతుల్ గొనుచు మోదముతో జరియించుచుండి యే యదనున కష్టముల్ గొనక యిమ్మహి నుండెడి భవ్య గౌరవా స్పదమగు కాల మిత్తరిని సత్వర మీయగ “హేమలంబి” నీ మదిని దలంచి యెల్లెడల మాన్యత నందగ స్వాగతించెదన్. అందరికీ శ్రీహేమలంబి(బ)నామ సంవత్సరాది సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు హ.వేం.స.నా.మూర్తి,
అందరికీ శ్రీహేమలంబి(బ)నామ సంవత్సరాది సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.చిత్రవ్యాఖ్యపళ్ళెరంబు నందు పావనం బైనట్టివస్తుచయము గాంచవచ్చునదిగొస్వాంతశుద్ధితోడ సర్వేశు బూజించువారి యత్న మనగ వచ్చు నిజము.పూజ చేసి పిదప పూర్ణమానసులౌచుహేవళంబి నిలకు నెంతయేనిసంతసంబుతోడ స్వాగతింపగగోరువారి యత్న మనగ వచ్చు నిజము.ఘనత గూర్చుచుండి తనకాలమందంతశుభము లొసగుచుండి విభవమీయవలయు హేవళంబి స్వాగతం బనగోరువారి యత్న మనగ వచ్చు నిజము.సకలగతుల మమ్ము సత్యానురక్తితోనుండు నట్లు చూచి మెండుగానుసర్వహితము గోరు సద్భావమిమ్మనువారి యత్న మనగ వచ్చు నిజము.కనుక రయముమీర కవులార! ముదముతోస్వాగతించ రండు సవ్యగతినిభూమి కేగుదెంచు హేమలంబిని నేడుస్వాస్థ్య మొసగుచుండి సాకుమనుచు. స్వాగతంబు నీకు వత్సరరాజమా!హేవళంబి! జగతి కిడుము లొసగుచుండగోరు మతుల ఖండించి సౌఖ్యంబుగూర్చవలయు నీవు కూర్మిమీర. హ.వేం.స.నా.మూర్తి
పూజ్య గురుదేవులకు సుకవిమిత్రులందరకు "హేవళంబినామ" ఉగాది శుభాకాంక్షలు...పళ్ళెరమున ముద్ద బంతులు మరియునుదీపశిఖలనుంచి దివ్యముగనుఆరురుచుల తోడ నలరారు పచ్చడిసిరిని గొలువ వేచె శ్రీకరముగ!!!
మత్తకోకిల గానమాధురి మత్తు గొల్పగ మేదినిన్క్రొత్త యాశలు కొమ్మలేయవె కోటి కాంతుల తోడుతన్క్రొత్త వత్సరమందు లక్ష్మిని గూర్మితో భజియింపగన్చిత్తమందున కోర్కెలన్నియు శ్రీకరమ్ముగ దీరునే!!!
సకల జగతి లోన శాంతి బూవులుబూయమానవతను నింపి మనుజులందుఇలను గావు మమ్మ హేవళంబియునీవుసంతసమ్ము నిడుచు సర్వులకును !!!
సంవత్స రాంత రాగతసంవాద వివాద జాల సంతప్తులిలన్సంవిద సమేత జనులకుసంవిత్తగు నీ యుగాది సవ్యంజనమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దైవ భక్తియు మీదు మిక్కిలి దానధర్మము వీడకన్మావి ముక్కలు వేప పూతయు మంచి చింతను దెచ్చియున్మోవికందగ తీపి,కారము పోడిమింతయు జేర్చుచున్హేవిళంబికి స్వీకరించిన నింట సౌఖ్యము దివ్వెలౌ
. *చిత్రానికనువైన పద్యం*వేపపూవు మామిడి చింత బెల్లముప్పువాముతో షడ్రుచులతోడ వాసిగానునోటినూరించు పచ్చడే మేటి రుచియెతెలుగు సంస్కృతి చాటదే ధీటుగాను
ఆరు రకముల రుచులను మేళవించిచేతు రతివలు పచ్చడి చిత్రముగనుపళ్ళె రంబున నున్నట్టి పచ్చ డదియవేకు జామున దినినచో వీడు నఘము
ఉః మామిచిగుళ్ళుగొంచు కడు మత్తున సొక్కుచు చెట్టుకొమ్మపై కాముని బాణముల్ తగిలి కమ్మని గీతము లాలపించుచున్ ప్రేమపు యాటలన్ సలుపు పేశలముల్ తనరించునుల్లముల్ ఏమని చెప్పుదున్ ప్రకృతి యింపు వసంతపు మాసమందునన్ఉః మల్లెలు జాజులున్ మతికి మత్తునొసంగుచు చెంగలించగా నుల్లము చేరుచుండె దివి యుల్లసమొందుచు పుష్పమాసమున్ పల్లెలలోజనమ్ము తమ పంటపొలమ్మున చెట్లనీడలో పెల్లుగ నుద్భవించు చిఱుపిందెల, కాయలఁ గాంచి పొంగెడిన్
మాస్టరుగారికి మిత్రులందరికీ హేమలంబ ఉగాది శుభాకాంక్షలు. కందము: హేమము గోరను నిను నే క్షామమ్మే లేక ధరను సరివత్సరమే ధీమాగా పాలించుము హే!మా శ్రీ హేమలంబ హిత సహితముగా.
పులుపు తీపి కార ముప్పుచేదువగరు
రిప్లయితొలగించండియారురుచుల సార మాకళింప
మోదఖేద క్రోధ మోహభయాదులు
వరలుచుండు వావివరుసలేక!
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు నమస్సులు. శ్రీ హేమళంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.
కవన ప్రసూనగంధముల గాలులు వీచుచు కాలభూరుహం
బవనిన నామనిన్ నిలిపి హ్లాదము గూర్చుచు జీవరాశికిన్
వివిధ రసంబులన్ జిలికి వేదన దీర్చు సుధారసంపు వై
భవములు హేమళంబి యయి వచ్చెను దీవెనల లిచ్చి బ్రోవగన్
ధాన్యరాశుల బండించి ధరను బ్రోచి
హర్షమును గూర్చు వర్షము కర్షకులకు
శుభము లందించు సైనిక సోదరులకు
క్షేమముల నిచ్చు భువికెల్ల హేమళంబి
శంకరాభరణ రథసారధి మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి, సుకవి మిత్రబృందమునకు అశేష వీక్షక మహాజనులకు ముందుగా “హేమలంబ” వత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసీ. నీ స్వన మాధురి నాస్వాదనము జేసి
వత్సర కాలమ్ము పరగి పోయె
చూతమన్నను లేవు చూతవృక్ష తతులు
నాగరీక మనెడి నగర మందు
గ్రామసీమల లోన గ్రసియింప రావోయి
ఘోషింపగ వసంతఘోషి యిపుడు
క్రొమ్మావి చివురుల క్రొత్తందనాలతో
కూత కూయగ రమ్ము కోయిలమ్మ
తే.గీ సతత వసంతకాంతుని సరస జేరి
సరస విరసాల రసన మాస్వాదనమున
యేవిలంబము జేయక హేవిళంబి
వర్షమునకు స్వాగతమయ్య హర్ష మిడగ.
తే.గీ చెరకు తునకల తీపియు, చింత పండు
పులుపు, లేతమామిడిపింది పుట్టు వగరు,
వేప పూవుల చేదును, విటలవణపు
చవురు, మిరియాల కారము చక్క గాను,
తే.గీ ఇచ్చకం బొదవు యుగాది పచ్చడగుచు
ముందు తెలియజేయు మనకు ముదము తోడ
షడ్ర సోపేత భరితము సంసృతి యని
మంచి మనసున రారండు పంచు కొనగ.
ఉగాది శుభాకాక్షలు శర్మ గారు. చిరకాల దర్శనము! సంతోష దాయకము!
తొలగించండిపోచిరాజు కామేశ్వర మహోదయులకు ముందుగా నమస్సులు ఉగాది శుభాకంక్షలు. సదా మీ ఆశీర్వచనాభిలాషిని.
తొలగించండివెండి పళ్ళెమందు వెండి దొన్నె సొగసు
రిప్లయితొలగించండివెండి సెమ్మెలోన రెండు శిఖలు
వెండి జూడ కనుల విందులాయె భళిగ
వెండి ధరను జూడ మండె గుండె!
శ్రీ హేమలంబీ(బా) నీకు స్వాగతము
రిప్లయితొలగించండిశా.
శ్రీలాలిత్యము, సర్వకార్యములలో క్షిప్రప్రమోదంబు సత్
శీలౌన్నత్యము, సాధుసేవయు, మహిన్ చిత్సౌఖ్య సౌభాగ్యముల్
మేలై వెల్గెడు భావజాలము మదిన్, మిన్నంటు సత్కీర్తు లే
కాలం బెల్లెడ “హేమలంబి”! ప్రజకుం గల్గంగ నేతెంచుమా!.
శా.
హేమాలంకృత! “హేమలంబి” వినుమా హెచ్చైన సౌఖ్యంబు లీ
భూమిం బంచగ వేగ రమ్ము కొనుమా పూజ్యా! ఘనస్వాగతం
బేమీయన్ హృదిలో దలంచి యిలపై కేతెంచి యున్నావు? రా
యీ మాదేశపు దుర్దశన్ మనుపగా నిచ్ఛన్ మదిం దాల్చుచున్.
కం.
మరియాదను నేర్పించగ
సరసాత్మక! “హేమలంబి”! సత్వరగతితో
నరుదెంచితి విదె స్వాగత
మురుతర సౌఖ్యప్రదాత! యూహాతీతా!
కం.
లంకల, బీళ్ళను, బొలముల
నంకిత భావంబుతోడ నద్భుతరీతిన్
సంకటహరమగు వృష్టిని
గొంకక నో “హేమలంబి”! గురిపించవలెన్.
కం.
బీదలు ధనికులు ననియెడి (బాదలు పెట్టక నీనా)
భేదంబును జూపకుండ విమలాత్మకవై
శ్రీదముగ”హేమలంబీ”
మోదంబున సాగిరమ్ము మురిపించుటకై.
శా.
నీవాసంబున భారతావని నికన్ నిత్యం బనాథ ప్రజా
సేవాకార్యము వృద్ధిచెందవలయున్ శీఘ్రాతి శీఘ్రంబుగా
భావావేశము ధర్మకర్మములకై పౌరాళి కబ్బన్వలెన్
ధీవిస్తారము “హేమలంబి” మహదుత్తేజంబు లందన్వలెన్.
చం.
కువలయ మంతటన్ గనగ కూర్ముల పేర్ములు మానవాళిలో
స్తవమున కర్హమౌ విధిని సభ్యత నిండగ “హేమలంబి” నీ
సువిదిత కాలచక్రమున శోభనమై వెలుగొందగా వలెన్
భవదభిమాన భాగ్యమిక పౌరుల కెల్లర కందగా వలెన్.
కం.
స్వార్థంబున నిధులన్నియు
వ్యర్థం బొనరించువారి యత్నము లికపై
సార్థకనామా! విను ని
న్నర్థించెద “హేమలంబి” యణచుట కొరకై.
కం.
గతి దప్పిన జనజీవన
మతివేగమె నవ్యదీప్తు లందగ వలయున్
క్షితిపయిని “హేమలంబీ”
యతి సౌఖ్యము గూడవలయు నన్ని విధాలన్.
చం.
తరముల సంస్కృతుల్ ప్రజలు దాల్చెడి మానస మీయరమ్ము నీ
వరయుము నేటి కాలమున నంతట నిండు విదేశ పద్ధతుల్
సురుచిర భావనాభరిత! సుందరనామక! “హేమలంబి” యీ
భరత మహీస్థలంబుపయి పావనతన్ బ్రసరింప జేయుమా.
చం.
ముదితలు సన్నుతుల్ గొనుచు మోదముతో జరియించుచుండి యే
యదనున కష్టముల్ గొనక యిమ్మహి నుండెడి భవ్య గౌరవా
స్పదమగు కాల మిత్తరిని సత్వర మీయగ “హేమలంబి” నీ
మదిని దలంచి యెల్లెడల మాన్యత నందగ స్వాగతించెదన్.
అందరికీ
శ్రీహేమలంబి(బ)నామ సంవత్సరాది సందర్భంగా
హృదయపూర్వక శుభాకాంక్షలు
హ.వేం.స.నా.మూర్తి,
అందరికీ
రిప్లయితొలగించండిశ్రీహేమలంబి(బ)నామ సంవత్సరాది సందర్భంగా
హృదయపూర్వక శుభాకాంక్షలు.
చిత్రవ్యాఖ్య
పళ్ళెరంబు నందు పావనం బైనట్టి
వస్తుచయము గాంచవచ్చునదిగొ
స్వాంతశుద్ధితోడ సర్వేశు బూజించు
వారి యత్న మనగ వచ్చు నిజము.
పూజ చేసి పిదప పూర్ణమానసులౌచు
హేవళంబి నిలకు నెంతయేని
సంతసంబుతోడ స్వాగతింపగగోరు
వారి యత్న మనగ వచ్చు నిజము.
ఘనత గూర్చుచుండి తనకాలమందంత
శుభము లొసగుచుండి విభవమీయ
వలయు హేవళంబి స్వాగతం బనగోరు
వారి యత్న మనగ వచ్చు నిజము.
సకలగతుల మమ్ము సత్యానురక్తితో
నుండు నట్లు చూచి మెండుగాను
సర్వహితము గోరు సద్భావమిమ్మను
వారి యత్న మనగ వచ్చు నిజము.
కనుక రయముమీర కవులార! ముదముతో
స్వాగతించ రండు సవ్యగతిని
భూమి కేగుదెంచు హేమలంబిని నేడు
స్వాస్థ్య మొసగుచుండి సాకుమనుచు.
స్వాగతంబు నీకు వత్సరరాజమా!
హేవళంబి! జగతి కిడుము లొసగు
చుండగోరు మతుల ఖండించి సౌఖ్యంబు
గూర్చవలయు నీవు కూర్మిమీర.
హ.వేం.స.నా.మూర్తి
పూజ్య గురుదేవులకు సుకవిమిత్రులందరకు "హేవళంబినామ" ఉగాది శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిపళ్ళెరమున ముద్ద బంతులు మరియును
దీపశిఖలనుంచి దివ్యముగను
ఆరురుచుల తోడ నలరారు పచ్చడి
సిరిని గొలువ వేచె శ్రీకరముగ!!!
మత్తకోకిల గానమాధురి మత్తు గొల్పగ మేదినిన్
రిప్లయితొలగించండిక్రొత్త యాశలు కొమ్మలేయవె కోటి కాంతుల తోడుతన్
క్రొత్త వత్సరమందు లక్ష్మిని గూర్మితో భజియింపగన్
చిత్తమందున కోర్కెలన్నియు శ్రీకరమ్ముగ దీరునే!!!
సకల జగతి లోన శాంతి బూవులుబూయ
రిప్లయితొలగించండిమానవతను నింపి మనుజులందు
ఇలను గావు మమ్మ హేవళంబియునీవు
సంతసమ్ము నిడుచు సర్వులకును !!!
సంవత్స రాంత రాగత
రిప్లయితొలగించండిసంవాద వివాద జాల సంతప్తులిలన్
సంవిద సమేత జనులకు
సంవిత్తగు నీ యుగాది సవ్యంజనమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిదైవ భక్తియు మీదు మిక్కిలి దానధర్మము వీడకన్
మావి ముక్కలు వేప పూతయు మంచి చింతను దెచ్చియున్
మోవికందగ తీపి,కారము పోడిమింతయు జేర్చుచున్
హేవిళంబికి స్వీకరించిన నింట సౌఖ్యము దివ్వెలౌ
. *చిత్రానికనువైన పద్యం*
రిప్లయితొలగించండివేపపూవు మామిడి చింత బెల్లముప్పు
వాముతో షడ్రుచులతోడ వాసిగాను
నోటినూరించు పచ్చడే మేటి రుచియె
తెలుగు సంస్కృతి చాటదే ధీటుగాను
ఆరు రకముల రుచులను మేళవించి
రిప్లయితొలగించండిచేతు రతివలు పచ్చడి చిత్రముగను
పళ్ళె రంబున నున్నట్టి పచ్చ డదియ
వేకు జామున దినినచో వీడు నఘము
ఉః మామిచిగుళ్ళుగొంచు కడు మత్తున సొక్కుచు చెట్టుకొమ్మపై
రిప్లయితొలగించండికాముని బాణముల్ తగిలి కమ్మని గీతము లాలపించుచున్
ప్రేమపు యాటలన్ సలుపు పేశలముల్ తనరించునుల్లముల్
ఏమని చెప్పుదున్ ప్రకృతి యింపు వసంతపు మాసమందునన్
ఉః మల్లెలు జాజులున్ మతికి మత్తునొసంగుచు చెంగలించగా
నుల్లము చేరుచుండె దివి యుల్లసమొందుచు పుష్పమాసమున్
పల్లెలలోజనమ్ము తమ పంటపొలమ్మున చెట్లనీడలో
పెల్లుగ నుద్భవించు చిఱుపిందెల, కాయలఁ గాంచి పొంగెడిన్
మాస్టరుగారికి మిత్రులందరికీ హేమలంబ ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికందము:
హేమము గోరను నిను నే
క్షామమ్మే లేక ధరను సరివత్సరమే
ధీమాగా పాలించుము
హే!మా శ్రీ హేమలంబ హిత సహితముగా.