కం. వచ్చిన యుగాది
పండుగ
తెచ్చినది వసంతశోభ
దీపింపగ; మా
యచ్చపుఁ గోర్కెలు
దీరఁగ
వచ్చు ననెడి
యాశఁ గొలిపెఁ బంచాంగమ్ముల్.
కం. క్రొత్తగ వచ్చెను
వత్సర
మిత్తఱి షడ్రుచులతోడ
నింపై సొంపై
చిత్తాహ్లాద
మొసంగగ
నిత్తురు పచ్చడిని,
దినిన హితకరము గదా!
ఆ.వె. క్రొత్తచీతఁ
గట్టుకొన్నట్టుల ప్రకృతి
క్రొత్త చిగురు
వేసి కులుకుఁ జూప
మావిచిగురు
మెక్కి మత్తెక్కి కోయిల
పంచమ స్వరమునఁ
బాడి మురియు.
ఆ.వె. గతము గతమె; నాటి
కష్ట సుఖమ్ముల
కోర్చినాము;
వచ్చుచున్న నూత్న
వత్సరమున నైన
ఫలియించి కోరికల్
ప్రజలు సుఖము
లందవలెను సుమ్ము!
ఆ.వె. హేవిళంబి వచ్చె,
నే విలంబము లేక
జనహిత పథకముల
ఘనతఁ గన్న
ప్రభుత యమలుపఱచి
పాలించి దేశప్ర
జల ప్రశంస లంది
సాగుగాక!
కం. చీకటి వెలుగుల
కలయిక
యే కద జీవితము;
బాధలే శాశ్వతమా?
సాకారమందు శుభములఁ
బ్రాకటముగ నీ
యుగాది పర్వము దెచ్చున్.
కంది శంకరయ్య
(మొన్న హైదరాబాద్, మఖ్దుంనగర్,
చైత్యన్య విద్యా నికేతన్ ‘కవిసమ్మేళనం’లో నేను చదివిన పద్యాలు)
లలిత పదజాల ములతోడ లహరి వోలె
రిప్లయితొలగించండిసాగె మీయది కవనమ్ము శంకరార్య!
యేమి భాగ్యము మాయది యీపుడమిని
మీకు శిష్యుల మైతిమి మేము మరిని
మంచి పద్యములివిమాకందినవి జూడ
రిప్లయితొలగించండికంది శంకరార్య క(ర)లము వలన
ఆరు రుచులవోలె నారైన విధముల
పంచినారు నేటి ప్రథమ దినము.
బాగున్నవి. అభినందనలు !
రిప్లయితొలగించండి