29, మార్చి 2017, బుధవారం

సమస్య - 2322 (హేవళంబి జగతి...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హేవళంబి జగతి కిడుము లొసఁగు"
లేదా...
"వచ్చిన హేవళంబి కడు వంతలు లొసంగును మానవాళికిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

 1. శంకరాభరణ రథసారధి మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి, సుకవి మిత్రబృందమునకు అశేష వీక్షక మహాజనులకు ముందుగా “హేమలంబ” వత్సర శుభాకాంక్షలు.
  హేవళంబ సంవత్సరానికి “స్వాగత” వృత్తంతో స్వాగతం పల్కుచూ

  హర్ష మొప్పగను హార్దము చూపన్
  వర్ష మంతటను పారగ నీరున్
  ఘర్షణంబులిల గాలికి పోవన్
  కర్షకాళినిట కావగ రమ్మా!
  సమస్యా పూరణ:

  వచ్చు చున్న దోయి పావన వర్షము
  “హేవళంబి” జగతికి,(ఇ)డుము లొసగు
  దారులన్ని కూల్చి దరహాస వీచికల్
  శాశ్వతముగ జనులు సంత సింప.

  రిప్లయితొలగించండి
 2. ఆచార్యులు కంది శంకరయ్యగారికి, తదితర కవిమిత్రులందరికి హేవళంబి సంవత్సరాది శుభాకాంక్షలు.

  విచ్చెడి మొగ్గలున్ విరులు వేలయినన్ శుభ మీయగల్గునే?
  మెచ్చును దేవతాగణము మేలును చేయగ సజ్జనాళికిన్
  హెచ్చిన దుష్ప్రవర్తనము హింస భయమ్ము శిరస్సు దించగా
  వచ్చును, హేవళంబి కడు వంత లొసంగును మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 3. "హేవిలంబ" తప్పు! "హేమళంబి" సబబు!
  తంగిరాల వారు తప్పు లెన్ను
  ధూళిపాళ వారు ధూము ధామనెదరు
  "హేవళంబి" జగతి కిడుము లొసఁగు!

  పుట్టి పుట్ట కుండ గట్టి తగవు లొచ్చె
  పేరులోన నేమి పెన్నిధుంది?
  చిత్తశుధ్ది తోడ చింతించగ నెటుల
  హేవళంబి జగతి కిడుము లొసఁగు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శ్రీ శంకరయ్య గారి అమూల్యమైన సవరణతో, శతాధిక వందనములతో:


   "హేవిలంబ" తప్పు! "హేమళంబి" సబబు!
   తంగిరాల వారు తప్పు లెన్ను
   ధూళిపాళ వారు ధూము ధామనెదరు
   "హేవళంబి" జగతి కిడుము లొసఁగు!


   పుట్టి పుట్ట కుండ గట్టి తగవు లొచ్చె
   పేరులోన నున్న పెన్నిధి యెది
   చిత్తశుధ్ది తోడ చింతించగ నెటుల
   హేవళంబి జగతి కిడుము లొసఁగు?

   తొలగించండి
 4. శంకరాభరణం నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్య గారికి, కవివరేణ్యులకు ఉగాది శుభాకాంక్షలు!

  విచ్చిన పూలతావులవి
  వీచెడి వైనము జూచి మెచ్చకన్
  పచ్చగ విచ్చు పల్లవము
  బంచెడి స్నేహములో గమించక
  న్నచ్చముగా వసంతమున
  నామని గీతము పాడు కోయిలన్
  మెచ్చగలేని జీవనము
  మేలొనగూర్చదుగా, దలంచగన్,
  వచ్చిన "హేవిళంబి" కడు
  వంత లొసంగును మానవాళికిన్!


  రిప్లయితొలగించండి


 5. పేరు జూడ గాను పెక్కురీతి జిలేబి
  హేవళంబి! జగతి కిడుము లొసఁగు
  నోయనుట తగదయ పోచిరాజు కవీశ !
  వచ్చె హేవిళంబి వన్నె హెచ్చు !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. స్వాగతము హేవిళంబీ,
  స్వాగతము! మనోజ్జ్వలమగు సంవత్సరమై
  భోగమ్ముల నిమ్మ యుగా
  దీ! గమ్మత్తుగను పేరు దిమిదిమి దిందిం !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. సాహిత్యాభిమానులు, కవిమిత్రులు, గురుజనులందరికి
  హేవళంబి/హేమలంబ/హేమలంబి నామ
  నూతనసంవత్సరాది సందర్భముగా
  హృదయపూర్వక శుభాకాంక్షలు.



  స్వాగతంబు నీకు వత్సరరాజమా!
  హేవళంబి! జగతి కిడుము లొసగు
  చుండగోరు మతుల ఖండించి సౌఖ్యంబు
  గూర్చవలయు నీవు కూర్మిమీర.


  అచ్చపు బ్రేమ జూప బరిహాసము లాడుచు దుర్మదాంధులై
  హెచ్చగు స్వార్థభావనము లెల్లశరీరమునందు నిండగన్
  మచ్చరికించి మేదిని నమానుష కృత్యము లాచరించగా
  వచ్చిన, హేవళంబి కడు వంత లొసంగును మానవాళికిన్.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  శ్రీకరి హేవళంబి శ్రిత శీలన శీలివి హేల హారి వ
  స్తోకము జూడ నీ యుగపు ధుర్యత నీజనమానసంబుల
  న్నేకము జేయ స్వాగతము! నేతల బృందము నీతి నిల్ప వా
  క్శ్రీకము చేతలన్ జెలగ శ్రీలు వెలుంగ తెలుంగు నేలపై!!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ వినాయక

  హేవిళంబి ఉగాది పద్య మాల
  తే: చైత్ర మాసంపు చెంగావి చీర కట్టి,
  కంచుకమ్ము వైశాఖమ్ము ఎంచి ఈయ,
  జ్వేష్ట ఆషాడ మాసంబు లిష్ట పడుచు
  గాజుగమ్ములై ముంజేల కాంతులిడగ,

  తే: శ్రావణపు కుంకుమ నుదుట సౌఖ్య మీయ,
  భాద్రపదపు ముక్కెర నీకు భాగ్య మిడగ,
  కర్ణములకు ఆశ్వయిజము కార్తికములు
  కమ్మలై శోభ నంబుగా అమరి పోవ,

  తే: మార్గశిరము కంఠమ్మున హారమొసగ
  పుష్య మాసమ్ము పాపట పొంత చేర,
  పసిడి బిళ్ళతో జడమిసమిసలుగొలుప
  మాఘ ఫాల్గుణ మాసముల్ నీ ఘనమగు


  తే: చరణ దోయికి గజ్జెలై శిరము వంచ,
  ప్రతి పదాది తిధుల పూలబాట నడుమ,
  అశ్వనీ తారకలు శ్వేత హయము లన్ని
  ఆరు రుతువుల బంగరు తేరు నడుప

  తే: పుల్ల మావుల సిగ్గు దోబూచులాడ,
  వేప పూచిరు నగవుల్ విందు చేయ
  ఉదయ భానుని కిరణాలు సుందరముగ
  భువికి చేరు సమయమున హేవిళంబి

  తే: కన్నియా వచ్చుచుంటివా కాంతు లిడుచు
  తెలుగు ప్రజలకు ఘనముగ మేలు చేయ,
  తెలుపు చుంటిమి ఎల్లరం చెలిమి తోడ
  స్వాగతంబులు నీకు సుస్వాగతంబు

  పూసపాటి కృష్ణ సూర్య కుమార్



  సాహితీ సార్వభౌములకు హేవలంబి ఉగాది శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  హేమళంబి యనిరి హేలను(మనోవికారమును)నూహించి
  హేవళంబి యనిరి యిదియ సాధు
  "వలభి"చంద్రశాల "వలతి"నేర్పరి యాయె
  పోచిరాజుకట్టి బుగులు యేల?
  అక్షరాల మార్పు నైన సంశయమదిఃః
  "హేవళంబి జగతికిడుము లొసగు!"

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  వచ్చెను పోయె దుర్ముఖియె వన్నెల దెచ్చెను పద్య విద్యనున్
  మెచ్చగ బమ్మెరన్ జరిగె మిశ్రణమొక్కటి,చాలులే భయం
  బెచ్చట నా విళంబియు సభీత వికారియు నుండె ముందటన్
  ఇచ్చక మాడుకొంటకని యీకవి కిచ్చిన దీసమస్యయే,
  "వచ్చిన హేవళంబి కడు వంతలొసంగును మానవాళికిన్"

  రిప్లయితొలగించండి
 12. కవి మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ దినము శంకరయ్య మాష్టారు వారి పద్య మాలిక ప్రచురించి ఒక వెలుగు వెలిగారు! ఆనందం!

  రిప్లయితొలగించండి
 13. క్రొత్త వ త్స రమ్ము కోరి రాగంగను
  బ్లా గు కవుల కిత్తు వందనములు
  హేవిళంబి మీకు హితము నొసఁగు గాక !
  వత్స రమ్ము పూర్తి వరకు ధరను

  రిప్లయితొలగించండి
 14. హేవళంబి జగతి కిడుము లిచ్చుననుట
  పాడి గాదు సామి! పాడి పంట
  లనిల నిచ్చి బ్రజకు లహరి వోలెనుసాగు
  గాక వత్స రంబు కడవరకును

  రిప్లయితొలగించండి
 15. వచ్చిన హేవిళంబి కడువంతలు బెట్టును మానవాళికిన్
  బచ్చియబధ్ధ మే యదియ బాధలు బెట్టదు హేవళం బిలన్
  బచ్చగ నుండజేయునిక పైరుల తోడన భూమి నం తయున్
  మెచ్చు విధంబునం బ్రజలు మేదిని బంగరు భూమిజేయుగా


  రిప్లయితొలగించండి
 16. అవసరముల జగతి నవలంబ మది లేక
  యున్న సంపద లవి యెన్ని యున్న
  మఱి విళంబ మంత మది విడువక యున్న
  హేవళంబి జగతి కిడుము లొసఁగు


  నిచ్చలు స్నేహ భావమున నిర్మల వృత్తిని సంచరించుచున్
  వచ్చిన దాని తోడ మదిఁ బన్నుగఁ దృప్తిల భాగ్యవంతులే
  కచ్చిత మౌను దా యునికి కై కలహమ్ముల కెల్ల నింత తా
  వచ్చిన హేవళంబి కడు వంత లొసంగును మానవాళికిన్

  [తావు+అచ్చిన =తావచ్చిన: చోటిచ్చిన; అచ్చు = ఇచ్చు]

  రిప్లయితొలగించండి
 17. గురుదేవులకు, కవిమిత్రులకు మరియు వీక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

  దైవ భక్తిఁ గలిగి దాన ధర్మాదుల
  మఱువ కుండగ ప్రజ మసలినంత
  హేవళంబి జగతి కిడుము లొసఁగువారిఁ
  ద్రుంచి వైచి తాను మంచి చేయు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సన్మిత్రులు సహదేవుడు గార్కి ఉగాది శుభాకాంక్షలు. ఆట వెలది చతుర్థాన్ని తృతీయం చేసి చాల బాగా సమర్థించారు. అభినందనలు.

   తొలగించండి
  2. Tbs శర్మ గారికి నమస్సులు.బహుకాలదర్శనం.తమకు నా పద్యం నచ్చినందులకు ధన్యవాదములు

   తొలగించండి
 18. హేవళంబి జగతి కిడుము లొసగునంచు
  పలక బోకు మదియు భావ్యమవదు
  కాలశకట మదియు కదలిపోవుచునుండ
  వచ్చిపోవునుగద వత్సరములు



  వచ్చు తుఫానులాగవు, శుభాలను దాచవు కాలచక్రమే
  నిచ్చము తాభ్రమించగను నేమము తప్పని కాలమానమై
  వచ్చుచు పోవుచుండుగద వత్సర కాంతలు బంధువట్లుగా
  వచ్చిన హేవళంబికడు వంతలొసంగును మానవాళికిన్
  పచ్చియబద్ధమే యదియు వాస్తవమింతయు నుండబోవదే

  రిప్లయితొలగించండి
 19. గురుదేవులైన శ్రీకంది శంకరార్యులకు మరియునితర కవిమిత్రులకు శ్రీహేవిళంబి నామ నూతనసంవత్సర శుభాకాంక్షలు.

  ఝుమ్మని యాడుతుమ్మెదల ఝూంకృతనాదములుప్పతిల్ల లే
  గొమ్మకు కొమ్మకున్ జివురు క్రొత్తదనంబును మేళవింపగా
  కమ్మని మాధురీకలిత గానము కోయిల పాడనెంచె రా
  రమ్మిక "హేవిళంబ"మ పరంపర సౌఖ్య శుభప్రదాయినీ.

  కర్షకవ్రజమెల్ల హర్షాతిరేకమై
  .......... వర్ధిల్లఁజేయు సంవత్సరమ్ము
  దౌర్జన్యములు బాపి దౌష్ట్యంబులను ద్రుంచి
  .......... ధర్మంబు నిల్పు వత్సరయుగమ్ము
  మహనీయ శాంతి సామ్రాజ్యంబు వెలయించి
  .......... సంతోషముల బంచు సాల ఘనము
  విజయోత్సవములచే విహరింపగాజేసి
  .......... ప్రభవింపజేయుముర్వట శిఖంబు

  వేలయాశలు తలదాల్చి వేచినాము
  వేలకడగండ్లు భరియించి వేగినాము
  మీదుయాగమనము మాకు మోదమొసఁగె
  హేవిళంబమ యొసఁగు మీ దీవెనలను.

  నేటి సమస్యాపూరణము.........

  హెచ్చిన క్రూరకర్మములహీనవిహీనములైన యాశలున్
  సచ్చరితాంబురాశిని విషంబులుగాగ దలంచు వైఖరుల్
  చెచ్చెర పాశ్చ్యసంస్కృతి వశీకృతమై దురితంబులెల్ల చే
  వచ్చిన హేవళంబి కడు వంతలొసంగును మానవాళికిన్

  చేవచ్చిన = చేసినట్లైతే

  రిప్లయితొలగించండి
 20. 29.03.2౦17.శంకరయ్య గురు వర్యులకు ఉగాది శుభాకాంక్షలు
  సకల లోక విభుడు స్వామి వేంకటపతి
  చల్లగాను జగములెల్ల జూడ
  కలత మాను మయ్య కవివర!నూతన
  హేవిళంబి జగతి కిడుములొసగు

  రిప్లయితొలగించండి
 21. నూతనవసంతశోభితహేమలంబివత్సరశుభాకాంక్షలుకవివర్యులకు
  హేవళంబి జగతి కిడుము లొసగునను
  టన్నమాటవట్టి దన్నమాట
  పాడిపంట లొసగు| ప్రజలకు మేలును
  గూర్చగలిగె నాడు| మార్చదిపుడు.

  రిప్లయితొలగించండి
 22. నచ్చియుమెచ్చునట్లు నవనాగరికంబున మార్పు చేర్పులున్
  దెచ్చిన?లెక్కజేయకను తీర్పు నొసంగు యుగాది నాదిగా
  సచ్చరితంబు నిల్పుటకుసాయము జేయగ సంతసంబుగా
  వచ్చిన హేవళంబి కడు వంతు లొసంగును మానవాళికిన్|

  రిప్లయితొలగించండి
 23. నచ్చియుమెచ్చునట్లు నవనాగరికంబున మార్పు చేర్పులున్
  దెచ్చిన?లెక్కజేయకను తీర్పు నొసంగు యుగాది నాదిగా
  సచ్చరితంబు నిల్పుటకుసాయము జేయగ సంతసంబుగా
  వచ్చిన హేవళంబి కడు వంతు లొసంగును మానవాళికిన్|

  రిప్లయితొలగించండి
 24. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు రెండు కవిసమ్మేళనాలలో పాల్గొని ఇంతకు ముందే అలసి ఇల్లు చేరాను. ప్రస్తుతం మీ పూరణలను పద్యాలను సమీక్షించలేను. వీలైతే రేపు ఉదయం పరిశీలిస్తాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 25. హేవళంబి! జగతి కిడుము లొసఁగు
  నట్టి దుష్టనేతల పీచమడచి, ప్రీతిఁ
  బ్రజల బాధల తొలగించ రమ్ము త్వరగ
  మంచి వర్షములిడి ప్రజ మనుపుమమ్మ

  రిప్లయితొలగించండి