కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై"
లేదా...
"తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై"
లేదా...
"తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో...)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివమ్మవ సీతాన్వేషణ
తొలగించండితమ్ముని తోగూడి వగచి తల్లీనుండై
ఝమ్మని నాట్యమ్మాడెడి
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై
తమ్మి = పద్మము
👏👏శిల్పం చాలా బాగుంది.. ఝుమ్మని నాట్యమాడేవి తమ్ములు గావు.. కొంచెం ఇలా....
తొలగించండిఝుమ్మను తుమ్మెదలలరెడు
తమ్ములపై..
అంటే మరింత సొగసు గా ఉంటుందేమో...
..........మైలవరపు మురళీకృష్ణ...వెంకటగిరి
అమ్ములు పలువిధ శస్త్రా
తొలగించండిస్త్రమ్ముల కధిపతి ధరణిన రాజులపై కో
పమ్మున బహు క్షత్రియజా
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై
జాతము = సమూహము (శబ్దరత్నాకరము)
(హే పరశురామా! క్షమించు...నాకింతకంటే చాతకాదు ;)
తమ్ముడు కృష్ణుని చంపుట
తొలగించండివమ్మని తెలియకనె మామ పంపగ తమపై
క్రమ్మిన రాక్షస సంజా
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై
(ఈ తడవ బలరాముడు ;)
రాముడు బలరాము, పరశు
తొలగించండిరాములనుచు పద్య రాజములొదలన్
ఏమీ యీ పూరణములు
సామాన్యములా యిషాని సాదర ప్రణతుల్
***నాగమంజరి గుమ్మా ***
🙏🏼🙏🏼🙏🏼
ఇమ్ముగ కోరెను కైకయె
రిప్లయితొలగించండిసమ్మతి తెలిపెను మెండు సంతస మందున్
వమ్మని యోచన జేయుట
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుడై
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఇమ్మహి కల్పతరువుయన
కమ్మని శ్రీరాముగాథ కలుషితమవగా
కొమ్మయె గనె విషవృక్షము
తమ్ములపై రాముడు పగ దాల్చె గుపితుడై!
(రచయిత్రి యొకరు ముప్పాళ రంగనాయకమ్మ యని నాకు జ్ఞాపకమున్నది.సరిగానిచో మిత్రులు,గురువుగారు సహకరించవేడెద.)
డా.పిట్టా
రిప్లయితొలగించండిఇమ్మహి క్రొత్తగాథలవి యేర్పడ పోర్టరు భాతి యూహలన్
కమ్మగ జేయ బూనెదవె కావ్యము వ్యంగ్యము నందు దేల్చ వే
దమ్ములు నున్న నమ్ముట సుతారము కాదది యెవ్వరంటిరా
తమ్ముల మీద మత్సరము దాల్చె సధర్ముడు రాముడుద్ధతిన్?!
(పోర్టరు॥హారీపోర్టరు అనువాడు ఊహా కథలను వ్రాసి పిల్లలను భలేగా ఆకర్షించాడు)
వమ్మొనరించుచు యాగము
రిప్లయితొలగించండిలిమ్మహి దిరుగాడునట్టి యింద్రారి సమూ
హమ్ముల దామస సంజా
తమ్ములపై రాముడు పగ దాల్చె గుపితుడై.
ఎమ్మెయి యాగకర్మముల నెచ్చట జూచిన దుర్మదాంధులై
వమ్మొనరించి కర్తల కవాంఛిత త్రాసము గూర్చు దైత్య యూ
ధమ్ముల మీద శీఘ్రముగ ధర్మము గావగ తామసాత్త జా
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్.
హ.వేం.స.నా.మూర్తి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఅమ్ముని వేషముతో సీ
తమ్మనుఁ గొని, చెఱనుఁ బెట్టి, ధర్మువు విడియున్
దమ్ముఁ దఱుము రావణుని కృ
తమ్ములపై, రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై!
తమ్ముడు రణమున మూర్ఛిల
రిప్లయితొలగించండినెమ్మది లేకనె మనమున నెంతో వ్యధతో
దమ్మగు దానవ సంఘా
తమ్ములపై రాముడు పగదాల్చె గుపితుడై!
నమ్మిన బంటులు సతి సీ
రిప్లయితొలగించండితమ్మను వీడిన హితమన దనుజుడు విపరీ
తమ్ముగ చెలంగ నా పం
తమ్ముల పై రాముఁడు పగ దాల్చెఁ గుపితుడై
ఇమ్ముగ బ్రేమను జూపును
రిప్లయితొలగించండిదమ్ములపై రాముడు, పగదాల్చె గుపితుడై
నమ్మించి దనదు భార్యను
చుమ్మన గ్రోశించు చుండ జోరుగ బోవన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితమ్ముల మీదమ త్సరము దాల్చె సధర్ముడు రాముడు ధ్ధతిన్
రిప్లయితొలగించండితమ్ముల మీద మత్సరము దాల్చ సధర్ము డెట్లగు
న్నిమ్ముగ రాముడె ప్పుడును నేరికి నైనను మంచినే నిడున్
అమ్మహిమాత్ముని న్దనర నౌదల దాల్చిన మోక్షమబ్బు తన్
తమ్ముల మీదమ త్సరము దాల్చె సధర్ముడు రాముడు ధ్ధతిన్
రిప్లయితొలగించండితమ్ముల మీద మత్సరము దాల్చ సధర్ము డెట్లగు
న్నిమ్ముగ రాముడె ప్పుడును నేరికి నైనను మంచినే నిడున్
అమ్మహిమాత్ముని న్దనర నౌదల దాల్చిన మోక్షమబ్బు తన్
ఇమ్ముని వేషాకృతి కత
రిప్లయితొలగించండినమ్మున నల్పుని వలెం దన ననుకొనియె పా
పమ్మని వనధి తరంగ శ
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై
సమ్మత మౌనె శాంతమది సంతత మెల్లర కెక్కడైననున్
నెమ్మది దారి నిమ్మనుచు నేరక వేడితి నంచుఁ దల్చి తా
నిమ్ముగ బాణమూని వడి నిమ్మకరాకరపుం దరంగ జా
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్
అద్భుతం!!🙏🙏🙏🙏
తొలగించండిసుకవి మిత్రులు పోచిరాజు కామేశ్వర రావుగారూ...మీ రెండు పూరణములు అద్భుతముగా నున్నవి. అభినందనలు.
తొలగించండిచిన్న సందేహము...
మొదటి పూరణలో...కతము..అనే అర్థంలో...కతనము...అని ప్రయోగించిన పదము సాధువేనా యని సందేహమున్నది. నివృత్తి చేయగలరని మనవి.
డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
తొలగించండికవిపుంగవులు మధుసూదన్ గారు నమస్కారములు. నిజమే కతన, కతము పదముల మధ్య ప్రమాద భరితమే కతనము. ధన్యవాదములు. సవరణను తిలకించ గోర్తాను.
ఇమ్ముని వేషాకృతి కర
ణమ్మున నల్పుని వలెం దన ననుకొనియె పా
పమ్మని వనధి తరంగ శ
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై
నా “శ్రీమదాంధ్ర సుందర కాండ” చతుర్థ సర్గ లోని చివరి పద్యము:
అతి గుప్తం బట దూఱె మారుతి దశాస్యాంతఃపురమ్మున్ వడిన్
సిత ముక్తా మణి భూషి తాంతము మహాచిత్రాభ్ర నిర్యూహమున్
సత తోత్కృష్ట పటీర వంశక వరశ్లాఘ్యావలిప్తంబునున్
సత సద్రక్షిత శత్రు దుష్కరము దుష్ప్రాప్యమ్మ భేద్యమ్మునున్
చాలా సంతోషమండీ పోచిరాజువారూ! సవరించిన పూరణ చాలా బాగున్నది. కతనము తొలగించి, కరణమును స్వీకరించుటలో మీ ఔచిత్యము ప్రశంసింపదగినది. ఎందుకంటే...కరణము అన్నా కారణము అనే అర్థం ఉండడమే. ధన్యవాదములు. అభినందనలు.
తొలగించండిఅలాగే భవదీయ విరచిత సుందరకాండలోని చతుర్థసర్గ చివరి పద్యం పఠించే భాగ్యాన్ని మాకు కలిగించారు. ఇందలి జిగి బిగి మీ పద్యరచనా ప్రావీణ్యమును ప్రకటించుచున్నది. ధన్యవాదములు.
కవిపుంగవులకు ధన్యవాదములు.
తొలగించండిఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
రిప్లయితొలగించండితమ్ములమీఁద మత్సరముఁ దాల్చె, సధర్ముఁడు రాముఁ డుద్ధతి
న్నమ్ముల వేసి రక్కసిని యార్యులు మెచ్చగ జంపినాడు లో
కమ్మున లోక రక్షకుడు కారణ జన్ముడు రామచంద్రుడే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇమ్ముగ జానకి కన్గవ
రిప్లయితొలగించండితమ్ములు తన స్మృతికి దోచ తాపము హెచ్చన్
తమ్ముల యింటను విరిసిన
తమ్ములపై రాముడు పగ దాల్చె కుపితుడై
ఇమ్ముగ లంకను జేర ర
రిప్లయితొలగించండియమ్మున వంతెనను గట్ట నబ్ధితలమ్మున్
సమ్మతి తెలుపని కడలి కృ
తమ్ములపై రాముడు పగ దాల్చే గుపితుడై
తమ్మిముఖ సీత గానక
రిప్లయితొలగించండిసొమ్మసిలగ బహు విరహము శోకము చేతన్
తుమ్మెద లలరిన పద్మ హ్ర
దమ్ములపై రాముడు పగదాల్చె గుపితుడై!
ఇమ్ముగ ప్రేమను జూపెను
రిప్లయితొలగించండితమ్ములపై రాముఁడు, పగఁ దాల్చెఁ గుపితుఁడై
కొమ్మ తనమనో హరి సీ
తమ్మనపహరించినట్టి దైత్యుని పైనన్
ఇమ్మహి కంఠకుండగుచు హీనగుణాత్ముడు రావణుండు సీ
తమ్మను బంధిసేసెనని తానిక తాళగ లేక దైత్య వ్రా
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతి
న్నమ్మయె జెప్పె రామకథ యద్భుతమంచును పిల్లవాడికన్
రిప్లయితొలగించండిపిన్ని నాగేశ్వరరావు.
ఇమ్ముగ ప్రేమను జూపెను
తమ్ములపై రాముడు; పగ దాల్చె గుపితుడై
యమ్మహిజా సుతయౌ సీ
తమ్మను జెఱపట్ట రావణాసురు పైనన్.
*********************************
పిన్నక నాగేశ్వరరావు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు
రిప్లయితొలగించండిఇమ్ముగ భిక్ష నిడెడి సీ
రిప్లయితొలగించండితమ్మ నపహరించి చెఱకు తరలించిన నా
నమ్మిక లేని దనుజుని కృ
తమ్ములపై రాముడు పగ దాల్చె గుపితుడై!
అమ్ములపొది ముట్టక తన
రిప్లయితొలగించండికిమ్మన నశ్వమును వినక నిరువురు కానన్
రమ్మన పోరున కా ప్రాం
తమ్ములపై రాముఁడు పగఁ దాల్చెఁ గుపితుఁడై
నిన్నటి సమస్యకు నా పూరణ
ప్రేముడి లేని వర్తనము భీకర రూపము తోడు గాగ తా
కామమె మెండుగా దలచి కన్నెను వెంపర లాడ జేయగా
లేమయు భార్య గా తనదు లిక్కరుత్రాగిన భర్త చర్యకున్
కౌముది లేని రాతిరినిఁ గాంచెను పున్నమినాడు వింతగా
ఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
రిప్లయితొలగించండిఇమ్మహి తాటకాసురి కడీర్ష్యను మిక్కిలి సాదు సద్గణో
త్తమ్ముల మీద మత్సరముఁ దాల్చె, సధర్ముఁడు రాముఁ డుద్ధతి
న్నమ్ముల వేసి రక్కసిని యార్యులు మెచ్చగ జంపినాడు లో
కమ్మున లోక రక్షకుడు కారణ జన్ముడు రామచంద్రుడే
నమ్మినసిద్దాంతమ్ముల
రిప్లయితొలగించండితమ్ములపై “రాముడుపగదాల్చె గుపితుడై
అమ్మకమున పంటధరలు
సమ్మతిగారాకపోగ?సంబరబడకన్”.
2.నమ్మక మెప్పుడుండు?తగునాగరికంబునులేనిబాల్యమే|
అమ్మనుయంటి పెట్టుకొని యాదరణంబగుచిన్ననాటనే.
“సొమ్ముల షోకులన్ దిరిగి సోమరు లైరి|విచార మందుకే|
తమ్ములమీద మత్సరము దాల్చె” సధర్ముడు రాముడుద్దతిన్|
తమ్ముడొకండు గూగులున తాండవ మాడుచు కాలరెత్తగా
రిప్లయితొలగించండితమ్ముడొకండు బ్యాంకరుగ దాగుడు మూతలు నాడుచుండగా
వమ్మయె నాదు జన్మయని బాదుచు గుండెలు వారివారి జీ
తమ్ములమీఁద మత్సరముఁ దాల్చె సధర్ముఁడు రాముఁ డుద్ధతిన్
తొలగించండిఎవడా రాముడు ఏమిటా కథ ?
జిలేబి
మా వాచ్‌మన్
తొలగించండి