3, మార్చి 2017, శుక్రవారం

సమస్య - 2298 (ద్రౌపది సీతయును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే" 
లేదా...
"ద్రౌపది సీత యిద్ద రొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!"
(విజయవాడ శతావధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య. కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలతో)

63 కామెంట్‌లు: 1. రాపాడిన తీరు గనన్
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే,
  గాపాడవలసిన పతులు
  వేపుకుని తినిరి జిలేబి వేకరమువలెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. ద్రౌపదికి మామ "లైదు"ర
  పాపము సీతకుర "మూడు" పచ్చటి యత్త
  ల్లేపాప మెరుగ నిరువురు
  ద్రౌపది సీతయును "నొక్క" తండ్రికి సుతలే! 

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పచ్చ = నవరత్నాలలో నొకటి:

   "కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యాలను కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు..."

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది.
   'పచ్చల యత్తల్' అనండి. 'అత్తల్+ఏ పాప'మన్నపుడు లకారానికి ద్విత్వం రాదు. అది కేవలం నకారానికే పరిమితం. "పాపము లెరుగని యిరువురు" అనండి.

   తొలగించండి
 3. శాపము నొందిన తరుణము
  కాపాడ రైతిరె వరును కాఠిన్యము తోన్
  ఏపాప ఫలితమో యిది
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   రెండవ పాదంలో గణదోషం. ('డరైతి' సరిగణంగా జగణం). "కాపాడగ రా రెవరును" అందామా?

   తొలగించండి
  2. శాపము నొందిన తరుణము
   కాపాడగ రారెవరును కాఠిన్యము తోన్
   ఏఫాప ఫలితమో యిది
   ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే

   తొలగించండి
 4. తమ కూతురిని సంతోష పెట్టడం లేదని సతాయించే మామగారితో ఓ అల్లుడు:

  మీ పుత్రిక సంతోషమె
  నా పరమావధిగ నెంచు నన్నిల మీరల్
  వేపుకొని తిందురేటికి?
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. కొద్దిపాటి సవరణతో:

   మీ పుత్రిక నొచ్చెననుచు
   వాపోయెదరేల మామ వైభవమున్నన్
   ద్వాపర త్రేతల వగచిన
   ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే!

   తొలగించండి
  3. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. పాపారాయుడు మందుడు
  భూపతి కర్థంబు వ్రాసె పుత్రుండనుచున్
  శ్రీపతికి చెప్పె నిట్టుల
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే.

  శ్రీపతి చెప్పరా యనుచు జేరి గురుం డొకచేత బెత్తమున్
  చూపగ కాతరుం డగుచు శూన్యుడు జ్ఞానవిహీను డౌటనా
  పాపడి కేమితోచకను బల్కె జవాబుల నొక్కసారిగా
  ద్రౌపది సీతయిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  కాపగు సుతకని భర్తయె
  వేపాటుల వరుని వెదకు వేసట దప్పన్
  ఆ పాటుల మెట్టిన గృహ
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే!  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా

  కాపగు బిడ్డకల్లుడని కాలికి బల్పము గట్టి తిర్గి తా
  నోపిక నెంపికన్ గనగ నూర్చిరె సౌఖ్యము లాడ కూతుకున్?
  రూపము యౌవనంబు కుల రూఢిని గన్నను దుఃఖభాజనుల్
  ద్రౌపది సీతలిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలేకదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'గృహ ద్రౌపది'...?

   తొలగించండి
  2. డా.పిట్టానుండి
   ఆర్యా,"మెట్టిన గృహము॥అత్తవారింటి.ద్రౌపది,సీతలు. ఆగృహాలు పాటులతో నిండినవి.వారలే పుట్టినింట సుఖముల బొందినవారు.వివాహిత ఇచ్చటిది కాదు"ఆడి॥అచ్చటి పిల్ల,ఆడపిల్ల

   తొలగించండి
 8. తాపములు వీరి మనసుల
  శాపములై మారి దునుము శత్రు గణములన్
  రూపము శీలము లోనను
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే!

  రిప్లయితొలగించండి
 9. ఆపరమాత్మయెజగతికి
  ప్రాపునునైమనలనెపుడురక్షించుటతో
  నేపుగమనతోబాటుగ
  ద్రౌపదిసీతయునునొక్కతండ్రికిసుతులే

  రిప్లయితొలగించండి
 10. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
  “గురు స్త్రీలు” లో రు గురువని విస్మరించి నందులకు క్షమార్హుడను.
  అయినను పూరణకు కొంచెము కూడా నష్టము వాటిల్లక పోవుట గమనార్హము.
  కురు స్త్రీలు = చిన్న భార్యలు (సతీ దేవి పెద్ద భార్య ) గ స డ ద వాదేశ సంధి జరిగి కురు గురు గా మారినది.

  దేహ మందు సగము తీసు కొన్నది యుమ
  ప్రేమ మీర చూడ వింత గంగ
  యాక్రమించె నంత యతివ జటా జూట
  ము గురు స్త్రీల మగఁడు మొదటి యోగి

  [కురుస్త్రీలు = చిన్న భార్యలు; మొదటి యోగి = ఆది బిక్షువు, శివుడు]

  “దేహ మందు సగము తీసు కొన్నది గౌరి” యని కూడా అనవచ్చును.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ సమర్థన ఆమోదయోగ్యం, శాస్త్రీయం! అభినందనలు, ధన్యవాదాలు.

   తొలగించండి
 11. పాపాయిల బడిలో గల
  దీపకు జనకుండు తాను దీక్షితు లటులే
  రూపకు గోపాలుం డిక
  ద్రౌపదిసీతయునునొక్కతండ్రికిసుతులే.

  బాపుల పాటి ఛాత్రలగు వారల సూచిక చెప్పిరీ గతిన్
  దీపకు తండ్రి దీక్షితులు, దివ్యకు తిమ్మన, రుద్రనాము డా
  రూపకు, రోహిణీరమకు రోశయ యాపయి నెంచి చూచినన్
  ద్రౌపది సీత యిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా.
  హ.వేం.స.నా.మూర్తి  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 12. భూపతి కూతులై పెరిగి భూమిజ యున్ మరి యాజ్ఞసేనియున్
  భూపతులన్ వరించి వ్యథ పొందిరి కానలలోన, పూర్వపున్
  పాపఫలమ్ముదాటుకొన బ్రహ్మకు సాధ్యమె? బాధలొందుటన్
  ద్రౌపది సీతయిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. ఆపరమాత్ముడేమనకునన్నిటబాసటగాగనుండుట
  న్నేపుగనుంటిమిన్గనుకయీశునిదండ్రిగనెంచుకొంటిమే
  ప్రాపుగనుండుమూలమునభావ్యమపల్కగవీరినిన్సుమా
  ద్రౌపదిసీతయిద్దరొకతండ్రికిబుట్టినబిడ్డలేకదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   పదాల మధ్య వ్యవధానం (space) ఉంచండి.

   తొలగించండి
 14. గురుమూర్తి ఆచారి గారి పూరణ....

  (1)
  ద్వాపరమ౦దు ముఖ్యమగు పాత్ర ధరి౦చిన కా౦త యెవ్వరో
  ఆ పరమాత్ము డౌ దశరథాత్మజు రాముని భార్య యెవ్వరో
  పాపహరు౦డు విఘ్మపతి, ప్రాపుగ వేల్పుల బ్రోచు స్క౦ధుడున్
  ద్రౌపది; సీత; యిద్దరొక త౦డ్రికి బుట్టిన బిడ్డలే కదా ! !
  ( స్క౦ధుడు = కుమారస్వామి )

  పూరణ యి౦కొక విధ౦గా.....
  (2)
  ద్వాపర మ౦దు ముఖ్య మగు పాత్ర ధరి౦చిన యట్టి కా౦తయు,
  న్నాపరమాత్ము డౌ దశరథాత్మజు నర్మిలి భార్యయున్ గనన్
  పాపహరు౦డు విఘ్నపతి, ప్రాపుగ వేల్పుల బ్రోచు స్క౦ధుడున్
  ద్రౌపది; సీత లిద్ద; రొక త౦డ్రికి బుట్టిన బిడ్డలే కదా ! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. ద్వాపర త్రేతా యుగముల
  దీపములై వఱలుచు పతి దేవుల గొలువన్
  జూపిన రీతుల నెంచగ
  ద్రౌపది, సీతయును నొక్క తండ్రికి సుతలే!

  రిప్లయితొలగించండి
 16. పాపల పెండిలి జేసిరి
  శాపాలకు బానిసలుగ సలుపగ బ్రతుకుల్
  భూపాలురె కద జనకులు !
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే

  భూపాలురె దృపద, జనకు
  లేపాపము లెరుగ నట్టి లేమలకు వివా
  హం పాప మనగజేసిరి
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నదవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'వివాహం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. దానివల్ల ప్రాసకూడా చెడింది.

   తొలగించండి


 17. ఉత్పలమాల సాటియగు ఉత్పలమాల శతావధానియే :)

  హమ్మయ్య కొండగుర్తు కనుక్కున్నా :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. ఓప దిటులన నెవరికిని
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే
  యా పద్మ నయన లిరువురు
  నీ పుడమి నయోనిజలు నహీన గుణవతుల్


  పాఁప విభుండు లక్ష్మణుఁడు పన్నుగ రాముడు భర్తలే కదా
  క్ష్మాపతి సూర్య వంశజు స్నుషల్ మిథిలాపతి రాజయోగి యా
  భూపతి నందనల్ పరమ పూజితు లూర్మిళయున్, లతాంగి యో
  ద్రౌపది!, సీత యిద్ద రొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా
  [పాఁప విభుఁడు = ఆదిశేషుఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మొదటి పూరణలో చాలా కాలానికి మీ అన్నయ్య గారి పూరణ విధానాన్ని స్వీకరించారు.
   రెండవ పూరణలో ద్రౌపదిని సంబోధిస్తూ పూరణ చెప్పారు.
   రెండూ అద్భుతమైన పూరణలు. ఔత్సాహికులకు మార్గదర్శకాలు.
   అభినందనలు.

   తొలగించండి
  2. పద సంపద లేని ప్రభాకర శాస్త్రి యనుకరణ:

   శాపము వోలె తన విరహ
   తాపము తీరుటకు నిద్ర దాల్చిన సతియా
   కోపము వీడిన యూర్మిళ,
   ద్రౌపది! సీతయును నొక్క తండ్రికి సుతలే!

   __/\__ __/\__ __/\__

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఎవరన్నారండీ పదసంపద లేదని... గణ యతి ప్రాసలకోసం తడబడకుండా సాఫీగా సాగింది మీ పద్యరచన.. చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారు, కవివర్యులు కామేశ్వర రావు గారు:

   ఈ నాలుగు పాదములు వ్రాస్తున్నానంటే అంతా మీ దయ __/\_

   తొలగించండి


  5. పదసంపద లేల జిలే
   బి దరువులన బేర్చు మోయి బిగిబిగి పదముల్
   బెదరకు చెదరకు వదరకు
   కుదురుగ వచ్చునట పద్య కుముదిని సఖియై !

   జిలేబి

   తొలగించండి
  6. పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. అవునండి గురు వాక్య మాచరణీయము కదా!

   శాస్త్రి గారు పాతిక నిఘంటువులు (ఆంధ్ర భారతి) సరసన పెట్టుకొని పద సంపద లేదనడము భావ్యమా! నిజ మేధ నే గాక బాహ్య మేధను (అంతర్జాలము) బాగా ఉపయోగించు కోవాలి.

   తొలగించండి
  7. సారూ: నిఘంటువులతో పదసంపద వస్తుందా? మీలా కావ్యాలు, ప్రబంధాలు, పురాణాలు చిన్నతనంలో చదివియుండాలి. ఆ పైగా వస్తుతః వస్తుంది:

   "యా నవిద్యతే వస్తుతః సా మాయా''

   తొలగించండి
  8. మనలో మాట: తెలుగులో పదసంపద లేదని నేను ఖేదిస్తున్నాననుకోకండి. ఉన్న మాట అంతే! ఆంగ్లలో కొంచెం అసామాన్యమైన పరిచయం ఉన్నది. దానిని తనివి తీరా వేరే చోట ఉపయోగించుకున్నాను. కానీ గత సంవత్సరం నుంచీ కంద పద్యం పై ఎనలేను అనురాగం కలిగినది. శంకరాభరణంలో చేరడానికి అదే కారణం. కందం లాంటి పద్యం ఆంగ్లం లో లేదు. అదీ సంగతి!

   తొలగించండి
 19. గురుదేవులకు నమస్కారములు!

  ద్వాపర మందున ద్రౌపది
  దీపము త్రేతమున సీత తేజోమూర్తుల్
  వోపగ బాధల సతతము
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఓపగ'ను 'వోపగ' అనరాదు. 'తేజోమయులై। యోపగ...' అనండి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారము! సందేహిస్తూనే వ్రాశాను! సవరణలకు ధన్యవాదములు!

   తొలగించండి
 20. ఇత్తువ్యవధానమికపైననెక్కడెకడ
  యవసరమ్మనితోచునోనక్కడకడ
  సామి!మన్నించుడిప్పుడుసదయనుమరి
  వేడుచుంటినిమిమ్ములవినయముగను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   వ్యవధానం ఇస్తానంటూ చెప్పిన ఈ పద్యంలోనూ వ్యవధానం లేదు. వ్యవధానాలుంటే మీ పద్యం ఎంత అందంగా సులభగ్రాహ్యంగా ఉంటుందో చూడండి.....

   ఇత్తు వ్యవధాన మికపైన నెక్కడెకడ
   యవసరమ్మని తోచునో నక్కడకడ
   సామి! మన్నించు డిప్పుడు సదయను మరి
   వేడుచుంటిని మిమ్ముల వినయముగను.

   తొలగించండి
 21. పాపము సీత గతించగ
  రూపసి ద్రౌపదియు భార్య రూపము నందున్
  కాపు నుమాపతి కవ్వగ?
  ద్రౌపది, సీతయును నొక్క తండ్రికి సుతలే|
  2.మాపటి వేళ వేషములమర్మము జూడగ వింతపంతమే|
  లోపము లేనిదౌ నటన,లోకులు మెచ్చెడి నాట్య భంగిమల్
  చూపునరంభ,యూర్వసులు|చోధ్యముగా గనుపించు భావనల్
  ద్రౌపది,సీత యిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలేకదా|

  రిప్లయితొలగించండి
 22. వ్యాపకుడైన వాని సతి వ్యాకుల పాటున లంకనుండగా
  భూపతి యజ్ఞ కార్యమునఁ బుట్టిన చిన్నది కష్టమొందినన్
  క్ష్మాపతులిర్వురార్తినను మాటున నేడ్చిరయోనిసంభవల్
  ద్రౌపది సీత యిద్ద రొక తండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా!

  రిప్లయితొలగించండి
 23. ఆ పడతులయోనిజలే
  ద్రౌపది సీతయును, నొక్క తండ్రికి సుతలే
  తాపము కోపము లనునవి
  పాపమునకు మూలమవియె వసుధను గాంచన్

  కోపము చేయబోకుడిక కోరితి నేనని కోవిదుండెయౌ
  శ్రీపతి పండితాచ్యుతుడు చెప్పెనయోనిజలుర్వియందునన్
  ద్రౌపది సీత, యిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా
  ద్వాపర మందు భీముడును వాయుసుతుండగు నాంజనేయుడున్

  రిప్లయితొలగించండి
 24. మా పతియే "మా"రాజ" ను
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే !
  కోపింపరు బాధింపరు
  మా పాతివ్రత్య మహిమ మహనీయమ్మౌ !!


  (అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా.....)


  శాపమొ యేమొ"యేవురును"శాంత గభీర మనస్కలయ్యు నే..
  పాపము జేసినారొ ? పలు బాధల బొందిరి జీవితమ్ములం
  దాపదలన్ భరించిరసహాయత ! వారలలోన "నోర్మిలో "
  ద్రౌపది, సీత యిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శాపము+ఏమొ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు."శాప మదేమొ" అనండి.

   తొలగించండి
 25. మా పతియే "మా"రాజ" ను
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే !
  కోపింపరు బాధింపరు
  మా పాతివ్రత్య మహిమ మహనీయమ్మౌ !!


  (అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా.....)


  శాపమొ యేమొ"యేవురును"శాంత గభీర మనస్కలయ్యు నే..
  పాపము జేసినారొ ? పలు బాధల బొందిరి జీవితమ్ములం
  దాపదలన్ భరించిరసహాయత ! వారలలోన "నోర్మిలో "
  ద్రౌపది, సీత యిద్దరొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా !!

  రిప్లయితొలగించండి
 26. [03/03, 3:18 PM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  ద్రౌపది సీతయిద్ద రొక తండ్రికి బుట్టిన బిడ్డలే కదా
  రూపములొక్కటౌచు నపురూపముగాగనిపించెనంచు నా
  రూపకముల్ ద్వయంబుగని రుద్రయపల్కగ దర్శకుండనెన్
  దాపరికంబులేదుబుగతా! నటి యొక్కతే యనెన్

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
  [03/03, 3:18 PM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందితబెంగుళూరు*

  ఆపక పతిభిక్ష యనుచు
  ద్వాపరమునయాగమందుపుట్టె నొకతె !నా
  భూపతికిలన్ దొరికె కద!
  ద్రౌపది సీతయును నొక్క తండ్రికి సుతలే?

  *శ్రీమతి జి సందితబెంగుళూరు*

  రిప్లయితొలగించండి