కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె"
లేదా...
"హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె"
లేదా...
"హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారు: నమస్సులు. పూరణలో సమస్య పాదము మారినటులున్నది. చూడవలె.
తొలగించండిసుధను పంచెడి తరుణము సొగసు లొలుకు
తొలగించండిహరియె మోహిని గావున యంద మునకు
పరవ శించిన మైకమ్ము బ్రమసి ముదము
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె
------------------------------------
ధన్య వాదములు GPS గారు.
అక్కయ్యా,
తొలగించండికొంత సందిగ్ధత ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తపము జేసి యాయసురుడు తలను తాక
రిప్లయితొలగించండిపగిలి పోవలెనని కోరి వరము పొంది
తలను జూపించి వెనువెంట తాకె దనన
హరునిఁ, జూచి వేగమ్మున హరుఁడు పారె
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
'దనన హరుని'...?
"తాకెద నన"
తొలగించండి__/\__
👌
తొలగించండిశంకరులకు విన్నపము
రిప్లయితొలగించండి" సలలిత సీతభూమి ధరయాప్రియ సంగమ కాంక్ష సాంబుడు " అన్న ఈ కొప్పరపు వారి
ఆసువు లాగ , మా మరదలితో చక్కగా అన్నీ చూసి హాయిగా తీరుబడిగా రండి. అక్కడకుడా పద్యాలు సమస్యలు అనకుండా .
క్షమాపణలతో
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు.
నే నెక్కడున్నా నా ఆలోచనలు 'శంకరాభరణం' పైనే. కాకుంటే ప్రయాణంలో అవకాశం, తీరిక, నెట్‍వర్క్ అందుబాటులో ఉండాలి.
వర మొసంగిన దానవ వత్సలుడయి
రిప్లయితొలగించండితత్ప్రభావంబు మొదటగా తనకె చూప
వచ్చుచున్నట్టి దైత్యు నవ్వాని ధర్మ
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె.
హ.వేం.స.నా.మూర్తి
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిధర్మహరునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా పూరణలు....
రిప్లయితొలగించండి1)
ఎవరి శిరముపైఁ జెయి వెట్టెనేని బూది
యగు వరమ్మును గని వచ్చె నా వరప్ర
భావ మెఱుఁగ భస్మాసురాహ్వయుఁడు, యజ్ఞ
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె.
2)
శిరమునఁ జేయి వెట్టఁగనె చివ్వున బూదిగ మారి చావఁగా
వరమును బొందినంతనె కపర్ది తలం జెయి వెట్టి చూడఁగాఁ
దిరముగ వచ్చు బూదిపొలదిండి వివేకవిహీను యజ్ఞసం
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే.
(బూదిపొలదిండి = భస్మాసురుఁడు; యజ్ఞసంహరుఁడు = రాక్షసుఁడు)
మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయండీ శంకరయ్యగారూ! నేనూ భస్మాసురుని ప్రస్తావనతోనే పూరణ పెడుదామనుకున్నాను. మీరు పెట్టారు. సంతోషం. అభినందనలు!
తొలగించండిమాస్టరుగారూ! మీ పూరణలు అమోఘముగానున్నవి.
తొలగించండిమీ తీర్థయాత్ర సుఖముగా...దైవ దర్శనములు సులభముగా జరగాలని కోరుకొనుచున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య దంపతులకు వారి దక్షిణ దేశ యాత్ర శుభప్రదము గా సాగవలెనని ఆశిస్తూ
రాజేశ్వరి అక్కయ్య గారి సౌజన్యం తో నేటి పూరణ :
కంది శంకర వర్యులు కాళ హస్తి
నగర మందున నీశుని నరయ జూసి
పూరణ యొకటి యిచ్చి జెప్పుమన, విదుర
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె :)
జిలేబి
మూడవ పాదము suggestion:
తొలగించండిదత్తపది నిచ్చి పూరించు దైవ మనిన
జిలేబీ గారూ,
తొలగించండిబాగుంది. కాని నేను 'విదురహరుణ్ణి' కాను. విదురులను ప్రోత్సహించేవాణ్ణే!
తొలగించండి:) ఒక్క కామా కొంప ముంచింది :)
పూరణ యొకటి యిచ్చి జెప్పుమన, విదుర !
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె :)
జిలేబి
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిహరుని వేషపు సర్దారు(సిక్కు సర్దారు)నందరూర
హరుడు(దొంగ) పరుగెత్తె బట్టుమనంగ వాని
వెంటనంటి భ్రమణ కళన్ వీగ జేయ
హరుని జూచి వేగమ్మున హరుడు పారె!
దొంగ కంటెను సర్దారు ధుర్యతరుడు(తర,తమప్రయోగం)
లక్ష్యమెరుగునో శివుడైన లాస్య మమర?!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివరమని తోడుదొంగలొక వాయస జంటగ గూడి యింటిలో
సరగున దోచుకొన్న యది చాటుగ బొందగ స్వార్థ బుద్ధినిన్
పరుగులు దీయు వాడురుకు;బట్టగ నింకొకడున్ భ్రమించు; నా
హరుని కనంగనే కడు భయార్తిని బారె హరుండు వేగమే!
డా.పిట్టా
రిప్లయితొలగించండిపరుగులుదీయు వానినట బట్టగ నింకొకడున్ భ్రమించు గా 3వ పాదంలో సవరణ జేసి స్వీకరించండి
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు (ముఖ్యంగా రెండవది) చాలా బాగున్నవి. అభినందనలు.
'వాయస జంట' దుష్టసమాసం.
డా.పిట్టానుండి,ఆర్యా,కృతజ్ఞతలు.సిక్కుసర్దారు పరుగులోనిపుణుడు.దొంగను ప్రజల అభీష్టం మేరకు పట్టుకొనడానికఉరక మొదలిడి బాటలో దొంగను జూచి,"వీడు నాకంటే వేగంగా పరుగెత్తుతాడా!"అని వానిని పట్టుకోవడం మరిచి వాణ్ణి ఓడించి వస్తాడు.సర్దార్ల పైన జోకులు పెక్కులు.ఈమధ్య సిక్కులు ఆ జోకులు వాడవద్దని వాదిస్తున్నారు.మన శివుడు లాస్యం లో తన లక్ష్యాన్ని మరువడంలో ఆశ్చర్యం లేదు.
తొలగించండివరమడుగంగ వల్లెయని వాని కొసంగెను హస్త మెచ్చటేన్
రిప్లయితొలగించండిశిరమున నుంచ భస్మమగు సిద్ధ మటంచును, దాని నంది నే
డరయుదు దీని సత్త్వ మిపు డాగుము నీవను దైత్యు సంస్కృతీ
హరుని కనంగనే కడు భయార్తిని బారె హరుండు వేగమే.
హ.వేం.స.నా.మూర్తి.
హరుని జూచి వేగమ్మున హరుడు పారె
రిప్లయితొలగించండిహరియు హరుడును నొక్కరే యార్య! వినుము
పారు టనునది జరుగదు భవులు వారు
వారి గూరిచి మనమట్లు పలుక వలదు
వంద నంబులు సేయంగ వలయు సుమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"Yoga becomes popular in China"...News Report
రిప్లయితొలగించండియోగమును జేయ పులితోలు యోగ్యమనగ
లక్ష కోట్లగ ధరలు కైలాస మంట
వ్యాకులత తోడ నొకనాడు వ్యాఘ్ర చర్మ
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె
విష్ణు మాయ లవి తలుప వింతలె సుమి
రిప్లయితొలగించండిదాట తరమె యేరికి నైన ధరణి మోహి
నీ సురూపధారి హరిని నిజ మనోప
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పాఱె
[మనః + అపహరు = మనోపహరు; పాఱె : కలుసుకోవడానికి పరుగు పెట్టెను]
కర మరుదైన గాథ నిలఁ గంటిమి కాదె మనోహరమ్ముగన్
గురు విష సర్ప రాజులను గోరి పయస్సునఁ బెంచ వచ్చునే
వర పరిశీలనార్థి హరభక్తుఁడు భస్మపలాశి జీవ నా
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే
[జీవన + ఆహరు =జీవనాహరు: జీవనముల నపహరరించు వాఁడు]
మనోపహరుడు, జీవనాహరుడు - బాగున్నాయండి.అభివాదములు.
తొలగించండిమూర్తి గారు నమస్సులు ధన్యవాదములు.
తొలగించండిఅత్యుత్తమమైన పూరణలతో నిత్యము అలరిస్తున్న కామేశ్వర రావు గారికి వినయపూర్వక అభినందనలు.
తొలగించండిసత్యనారాయణ రెడ్డి గారు నమస్సులు ధన్యవాదములు.
తొలగించండికిరి పరుగుదీసె యడవిలో నరుని, విజిత
రిప్లయితొలగించండిహరునిఁ, జూచి వేగమ్మున, హరుఁడు పారె
కరము వేగముగనట సూకరముఁ బట్ట
నరుని తోడ సమరమయ్యె హరునికచట
…………………………………………………
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ సురభి నాటకములో మోహిని పాత్రధారి
శివునకు ముద్దిడెను . వాని ( హరి ) నోటి
దుర్వాసన కు హడలి ఈశ్వరపాత్రధారి
పరుగుతీసెను . }
" హరి హర పుత్ర స౦భవ " మటన్న
…… యొకా నొక నాటక౦బు నా ,
సురభి నటీనటులు చూపిరి | మోహిని
………… పాత్ర ధారి యా
హరునకు ము ద్దిడన్ దగిలె న౦త
…………… నసహ్యపు క౦పు | శ్రీ మనో
హరుని గన౦గనే కడు భయార్తిని బారె
……………… హరు౦డు వేగమే ! !........
ఇదో ప్రయత్నం. మిత్రులేమంటారో మరి.
రిప్లయితొలగించండికరము నుతించుచుండెను మృకండుని పుత్రుడు వీడు గౌరి ! స
త్వరమె, యమాయుధమ్మునకు తాళునొ తూలునొ, పోదు, తూర్పునన్
సరగున బ్రాక తేరునదె సర్దె ననూరు, డటంచు నా తమో
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండువేగమే.
శత్రువుల భస్మమొనరించు శక్తి గోరి
రిప్లయితొలగించండిఘోరతపమాచరించిన కుత్సితుండు
తనని బూదిజేయందలచిన నిశావి
హరుని జూచి వేగమ్మున హరుడు పాఱె.
కరుణను జూపి బ్రోచు శితికంఠుని గూర్చితపమ్ము జేసి యా
పురహరి మెప్పుతో పరుఁల బూదిని జేసెడమోఘ శక్తినే
వరముగ నొందికుత్సిత ప్రవాహికుడంతట హీనబుద్దితో
వరఫలితమ్ముగాంచగను పాపహరుండను జేరు యఙ్ఞసం
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే
వరము పొందె శివునిచే యసురుడొకండు
రిప్లయితొలగించండితలను తనచేయి పెట్ట దగ్ధమ్మవంగ
అరయ శివుని వెంబడి పడు నరుల ప్రాణ
హరుని జూచి వేగమ్మున హరుడు పారె
కరముల మోడ్చి వేడ, కఱకంఠుడు భక్తుని బ్రోవనెంచియున్
రిప్లయితొలగించండికరమది తాకినంత ప్రతికర్తల భస్మము జేయగల్గినన్
వరమది యిచ్చినంత వృషపర్వుని జంపగ వెంటవచ్చు సం
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.పిట్టానుండి ఆర్యా ,జంటకు బదులు "వాయస యుగ్మము వోలె"అని సరిజేసుకుంటాను."వాయస దంపతుల్ తగునివాసముగానొక..."అనే చిన్ననాటి పద్య పాదం గుర్తురాగా "జంట"ను వాడితిని.
రిప్లయితొలగించండిఉబ్బు లింగడు వరమీయ నిబ్బరముగ
రిప్లయితొలగించండివరము పొందిన యసురుడు పడగ వెంట
తనదు , తలతాక వచ్చెడు తనదు ప్రాణ
హరునిఁ జూచి వేగమ్మున హరుఁడు పారె
తపముజేయుచు పార్వతితలపునందు
రిప్లయితొలగించండిహరునిజూచి వేగమ్మున”|”హరుడుపారె
యనుచుయూహలు నడయాడ తనువుకదిలె|
శివునియాజ్ఞలు శక్తికి భవిత నిలిపె|
2.వరములు నివ్వగా శివుడు |వైనముగానె పరీక్షజేయ నా
కరమును నుంతు నీతలన గావున నిల్వుమటన్నరాక్షసుం
డురుకుచు రాగ-శ్రీహరియు యుహలె మోహినియయ్యు శత్రుసం
హరుని కనంగనే కడు భయార్తినిబారె “హరుండు వేగమే|
చేరి పీడింతు ననిదెల్ప జేష్ఠ హృదయ
రిప్లయితొలగించండిహరుని జూచి వేగమ్మున హరుఁడు పాఱె
చెట్టు తొర్రలో దాక్కొన గట్టు వీడి
తక్షణ శని ప్రభావిత తలఁపు మరచి
తరుణి రూపుతోడ దర్శించి శ్రీహరిని
రిప్లయితొలగించండిమూడు కనుల సామి మోహమంది
మరల చూడగోరె మదిని రాధా మనో
హరుని జూచి వేగమ్మున హరుడు పాఱె.
అరయగ నద్దమందునను హాయిని జూడగ వెండికొండలో
రిప్లయితొలగించండిమురియుచు మూడు కన్నులును ముచ్చట మీరగ నాగుపామునున్
కురియుచు గంగ నెత్తినను కూడగ గొంతున హాలహల్మునున్
హరునిఁ గనంగనే కడు భయార్తినిఁ బారె హరుండు వేగమే