కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్"
లేదా...
"రామునిఁ జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్"
లేదా...
"రామునిఁ జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే"
హోమము జేయుచు లంకను
రిప్లయితొలగించండిరాముని ధ్యానమున రామ రామా యనుచున్
కామాంధు లైన యసుర వి
రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఅసుర విరామాన్ని అంతం చేసిన హనుమను గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
నమో నమః
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండినీమము సత్యమహింసలు
క్షేమము పరమతసహన సుశ్రీలను గాంధిన్
ఏమా వనయము గోడ్సే
రామాంతకుడయ్యె హనుమ రాక్షసులేడ్వన్!
(రాక్షసులు, కఠినాతి కఠిన హృదయులేడ్వగా
వినయముతో మ్రొక్కవచ్చి కపట భక్తిని రామునంతటి గాంధీని జంపెగదా ఆ అభినవ హనుమ అను ధ్వనితో)
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిచక్కని భావాన్ని ఎన్నుకున్నారు పూరణకు. 'సుశ్రీలను' అన్నపుడు 'సు' గురువై గణదోషం. "సుశీలుని గాంధిన్" అనవచ్చు. 'వనయము'...?
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా,"వనయము"టైపాటు.అది"వినయము"గోడ్సే మ్రొక్కవచ్చెగదా!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబాముక కుడ్ములన్ సరిగ బండెడు మ్రింగు బలాఢ్యుడన్న యా
సామి బకాసురుండు పెలుసై మనుజాళికి కంటకుండవన్
క్షేమము లేక గుందునెడ చిక్కగ బాదియు లోక హింస కా
రాముని జంపినాడుగద రాక్షసులేడ్వగ వాయు పుత్రుడే(భీముడు)
(బకాసుర వధ ,భీమునిచే)
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,పెళుచు॥మూర్ఖుడు శ.ర.
'పెలుసై'ని 'పెళుచై'గా సవరించినాను.వాడుక భాషా దోషం తప్పుతుంది.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిరాముడు పెక్కు యాటలను రావణు జంపెను కాంతి రేఖలన్
క్షేమము గోరెనో ప్రజకు సేవను బంచిన యెన్.టి.యారదే
"ఏమిది?మోసపోతి"నని యెంతగ చింతిలె నాటకీయతన్
కామిత రాజ్య కాంక్షలను గన్న సుపుత్రుడు రాజకీయపుం
రాముని జంపినాడుగద రాక్షసులేడ్వగ వాయు పుత్రుడే?!
డా. పిట్టా వారూ,
తొలగించండిరెండు ఉత్పలమాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
కవిమిత్రులారా!
రిప్లయితొలగించండినమస్కృతులు.
మీ అందరి శుభకామనలతో దక్షిణ భారత తీర్థయాత్రను ఎటువంటి ఇబ్బంది లేకుండా, సంతోషంగా పూర్తి చేసికొని ఇప్పుడే ఇల్లు చేరాను. కాస్త ప్రయాణపు బడలిక ఉంది. ఇన్ని రోజులు మీ పూరణలను చూస్తున్నా వాటిపై స్పందించలేకపోయాను కదా అని బాధపడుతున్నాను.
శుభాభినందనలు శంకరయ్య గారూ!
తొలగించండిదక్షిణ భారత పుణ్యతీర్థ యాత్ర ముగించు కొని వచ్చిన పుణ్యాత్ములు పూజ్యులు శంకరయ్య గారికి వందన యుతాభినందనలు!
తొలగించండిభూమాతకూతుఁ గనుగొని
రిప్లయితొలగించండిభీమబలముతోడ లంక పెంపడచి కడున్
క్షేమముగ తిరిగితా నా
రామాంతకుడయ్యె హనుమ రాక్షసులేడ్వన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిఆరామాంతకుడైన హనుమను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
కోమలి జాడను కనుగొన
రిప్లయితొలగించండిక్షేమమ్ముగ కడలిదాటి చేరెను లంకా
ధామమచట లంకిణియను
రామాంతకుడయ్యె హనుమ రాక్షసులేడ్వన్
కోమలి కష్టముల్ గనగ కోపము హెచ్చిన యాంజనేయుడా
ధామము బాడుజేసెనట, దాడిని జేయగ తా స్మరించుచున్
రామునిఁ , జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే
కాముకుడైన రావణుని గారపు బిడ్డనుపోరునందునన్
విరించి గారూ,
తొలగించండిలంకిణీ ప్రస్తావనతో మొదటి పూరణ, విరుపుతో రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
భూమాత జాడ కొఱకుగ
రిప్లయితొలగించండిరాముని నామంబు దోడ రయ్యున జనగా
రామా ! లంకిణి యనునా
రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిరామ శబ్దానికి ఉన్న స్త్రీ అనే అర్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముని దలచుచు నాడా
రిప్లయితొలగించండిరామముగా లంక వనిని రమణిని జూచెన్
రా, మార్కొన రాగా నా
రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిపాదాద్యనుప్రాసతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
మాస్టరుగారూ! నమస్సులు. మీ తీర్థ యాత్ర సంతృప్తికరంగా జరిగినందులకు సంతోషముగా నున్నది.
రిప్లయితొలగించండినిన్న రాత్రి గుంటూరులో జరిగిన సంస్కృతి సంస్ధ వారి పురస్కార కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. ముగ్గురు సహస్రావధానులను ఒకే వేదికపై చూడటం ఒకే సమస్యను ముగ్గురు పూరించటం అద్భుతమైన ఘట్టం.
ఆటవెలది:
శక్తి భక్తి యుక్తి సరిగ నొక్కట గూడు
ఘనమగుయ వధాన కళయె నేడు
మూడుగా విడిబడి మూర్తులై నిలచెగా
తెలుగుతల్లి కీర్తి తేజరిల్ల.
ఖందము:
అనసూయ కలిపి చూపెను
కనగా నానాడు బ్రహ్మ కరివరదు హరున్
అనసూయ మేడసానిని
ఫణిశర్మను నేడు గరికి పాటిని కలిపెన్.
కొప్పరపు కవుల ఆశుకవితా వైభవం గురించి ముగ్గురు అవధానులూ తమదైన శైలిలో ప్రసంగించారు.ఒక అవధాని ఇచ్చిన సమస్యను వారి పూరణకాక మిగిలిన ఇద్దరూ పూరించటం అలా మూడు మూళ్ళు తొమ్మిది పూరణలతో విందు కొసమెరుపు.
శాస్త్రి గారూ,
తొలగించండిఆ సభా విశేషాలు వాట్సప్‍లో ఎవరో పెడితే చదివాను. నేను యాత్రలకు వెళ్ళకుండా ఉంటే ఆ సభకు తప్పక వచ్చేవాణ్ణి!
ఆ సభావైశిష్ట్యాన్ని తెలుపుతున్న మీ పద్యాలు చాలా బాగున్నవి. ఆ ముగ్గురినీ త్రిమూర్త్యాత్మక దత్తునిగా భావించడం మీ మనోజ్ఞమైన భావనా రామణీయకతకు దర్పణం. అభినందనలు.
మాస్టరుగారూ! ధన్యవాదములు.
తొలగించండిసమస్య-వాాారి వాారి పూరణలు తెలియ జేయ ప్రార్ధన
రిప్లయితొలగించండిరాముని పనుపున సతి సీ
రిప్లయితొలగించండితామాతను జూచి వనము ధ్వంస మొనర్చెన్
ధామములన్ గాల్చెను యా
రామాంతకు డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిఆరామ ధ్వంసంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేమము దోడ నా హనుమ నెయ్యము మీరగ సేవ జేయుగా
రిప్లయితొలగించండిరాముని , జంపి నాడు గద రాక్షసు లే డ్వగ వాయు పుత్రుడే
రాముని నామము న్దరచు రమ్యము గా నట బల్కుచు న్మఱిన్
గా ముకుడైన రావణుని గా దిలి బట్టిని యుధ్ధమందునన్
సుబ్బారావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భూమిజ జాడను గనుగొని
రిప్లయితొలగించండినీమముతో లంక సొగసు నిర్మూలించన్
తామసమున దిరుగుచు నా
రామాంతకుఁడయ్యె హనుమ రాక్షసులేడ్వన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముని పనుపున లంకా
రిప్లయితొలగించండిసీమను సీతను గనుగొని చేవను జూపగ
ధామంబు ఘన యశోకా
రామాంతకుడయ్యె హనుమ రాక్షసు లేడ్వన్!
రెండవ పాదంలో చివర
తొలగించండిచేవను జూపన్! యని చదవ ప్రార్ధన!
సీతాదేవి గారూ,
తొలగించండిఅశోకారామాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామాభ్యుదయము గోరుచు
రిప్లయితొలగించండినా మారుతి యేగ జలధి నల సింహిక నా
భామను వధించి రాక్షస
రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్
[రామా+అంతకుఁడు= రామాంతకుఁడు; రామ = స్త్రీ]
భీమ పరాక్రముండు నరి వీర భయంకరుఁ డస్త్ర శస్త్ర వి
ద్యామిత తేజ విక్రమ మహా బల దర్పిత దైత్య వీరుఁడే
యా మహిమాన్వితాత్ము ఘను నక్ష కుమారుని, ఘోర వైరి సు
త్రామునిఁ, జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే
[కుమారుఁడు = యువరాజు; సుత్రాముఁడు = ఇంద్రుఁడు]
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
రెండవ పద్యాన్ని చదవడం ప్రారంభించి అందలి విశేషణాలన్నీ వాయుపుత్రుడివి అనుకున్నా! మూడవ పాదంలో అవి అక్షకుమారునివి అని తెలిసి అబ్బురపడ్డాను.
క్షమించాలి... ద్వితీయ పాదాంతంలో తెలిసింది...
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఅక్షయ కుమారుఁడు సామాన్యుఁడు కాదు. వానియుద్ధమునొక సంపూర్ణ సర్గ లో (సప్త చత్వారింశ స్సర్గ) వర్ణించిరి వాల్మీకి మహర్షి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిరాముని కోర్కెఁ దీర్చఁగ విరామము లేకయె సీత జాడకై
నేమముతోడ లంకఁ జని, నీరజ నేత్రిని సీతఁ గాంచి, యా
రామము రూపు మాపియును, రక్కసు నక్షకుమారు దుష్కృతా
రామునిఁ జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే!
స్వస్తి
దక్షిణదేశ తీర్థయాత్రలు నిర్విఘ్నంగా ముగించుకొని, క్షేమంగా తిరిగివచ్చిన శంకరయ్య గారికి శుభాభినందనలు!
దుష్కృతారాముడైన అక్షకుమారుని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
తొలగించండిఅభమునుశుభమునుదెలిసిన
రిప్లయితొలగించండిసుభగుడు మాశంకరయ్య సూనృత వ్రతుడు
న్నభినందింతును నాతని
శుభముగదారాకకతనసుకవుల దరికిన్
ధన్యవాదాలు సుబ్బారావు గారూ!
తొలగించండిరాముడు లక్ష్మణుండు రణరంగములో హరియించి రావణున్
రిప్లయితొలగించండిక్షేమముగా నయోద్యకును సీతను దోడ్కొని వచ్చి మేడలో
నా మహితాత్ములున్ నిదుర యందున నుండగ మాయ జేయు మై
రామునిఁ జంపినాఁడు గద రాక్షసు లేడ్వఁగ వాయుపుత్రుఁడే
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమైరావణుని ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. కాని 'మైరాముడు'...?
డా.పిట్టానుండిఆర్యా,నమస్సులు,కృతజ్ఞతలు,సమస్యలను తప్పక మాకివ్వడమే విశేషం.మీస్పందన రాలేదని అనిపించలేదు.ఈ పద్య విద్య కికనైనా మీద.భా యాత్రతో శనీశ్వరుని కృప ఉండాలని ఆశిస్తున్నాను.ఎంతచాటుమాటుగా మాకై శ్రమించారో మేమూహించగలం.బహుధా కృతజ్ఞులము!
రిప్లయితొలగించండిధన్యవాదాలు పిట్టా వారూ!
తొలగించండిసోముని అంశతో కలిగి శుద్ధపు భక్తిని రాముఁ గొల్చుచున్
రిప్లయితొలగించండిభీమబలమ్మునన్ గదిసి వీరుడు మానసమందుఁ దల్చి తా
రాముని, జంపినాడుగద రాక్షసులేడ్వగ వాయు పుత్రుడే
సోమముఁ జూపియుద్ధమున స్రుక్కగఁ జేసి పలాశి సేనలన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిగురుదేవుగురుదేవుల యాత్ర నిరాటంకంగా సాగినందులకు
రిప్లయితొలగించండిచాలా సంతోషము.
ధన్యవాదాలు!
తొలగించండిరాముని నామ స్మరణము
రిప్లయితొలగించండినా మారుతి జేసి లంక నవనిజ గాంచెన్
సేమమెరిగి వహ్నిని యా
రామాంతకుఁ డయ్యె హనుమ రాక్షసు లేడ్వన్
నిన్నటి సమస్యకు నా పూరణ
పురుషు లిద్దఱు గలియఁగఁ బుట్టె సుతుఁడు
పత్నిగా హరి పతిగ కపర్థి కాగ
ఇరుముడిని గొని పలువురు పరుగు లిడరె !
నేత్ర పర్వ మటంచు నా క్షేత్రమునకు
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కామాతుర రావణుడు
రిప్లయితొలగించండిన్నా మారుతి తోకఁ గాల్చ నావేశమునన్
హోమము జేసెను లంకన్
రామా! న్తకుడయ్యె హనుమ రాక్షసులేడ్వన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని 'రామా! న్తకుడు'...?
గురుదేవులకు ధన్యవాదములు. రామా! లంకను బుగ్గిజేసి నాశకుడైనాడు హనుమ అని తెలియచెప్పినారను భావనతో వ్రాశాను.పరిశీలించ ప్రార్థన.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. రామా! లంకను బుగ్గిజేసి నాశకుడైనాడు హనుమ అని తెలియచెప్పినారను భావనతో వ్రాశాను.పరిశీలించ ప్రార్థన.
తొలగించండిభావం సరే! `రామా!' అన్నది సంబోధన అయితే దానితో అంతకుడు శబ్దాన్ని సంధి చేయడం కుదరదు. 'రామా! యంతకుఁడు...' అని యడాగమం వస్తుంది. అదీ నా అభ్యంతరం.
తొలగించండిడా.పిట్టానుండిఆర్యా,నమస్సులు,కృతజ్ఞతలు,సమస్యలను తప్పక మాకివ్వడమే విశేషం.మీస్పందన రాలేదని అనిపించలేదు.ఈ పద్య విద్య కికనైనా మీద.భా యాత్రతో శనీశ్వరుని కృప ఉండాలని ఆశిస్తున్నాను.ఎంతచాటుమాటుగా మాకై శ్రమించారో మేమూహించగలం.బహుధా కృతజ్ఞులము!
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన :
రిప్లయితొలగించండికామాతుర రావణుడు
న్నా మారుతి తోకఁ గాల్చ నావేశమునన్
హోమము చేయుచు లంకా
రామాంతకుడయ్య హనుమ రాక్షసులేడ్వన్