కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్"
లేదా...
"భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్"
లేదా...
"భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండికార్యమకార్యం బెరుగదు
భార్యకునున్ మించు పద్య భావము గోరన్
ఆర్యుని గని ట్యాబును గొను
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిలేచిన వెంటనే ట్యాబుతో గడుపుతుంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. అది లాక్కోడానికి వచ్చే భార్యను చూసి భర్త పరుగులు పెట్టడం సహజమే. చక్కని పూరణ. అభినందనలు.
'భార్యకు, భార్యకున్, భార్యకును' అంతే... షష్ఠి మీద ద్వితీయ ఎందుకు? "భార్యామణి మించు..." అంటే ఎలా ఉంటుంది?
డా.పిట్టా
రిప్లయితొలగించండి"సూర్యుని గాంచవా బయట చుక్కలు లేచిన నైన జూడ వీ
కార్యము పద్య విద్య యని గంటలు గంటలు వ్రాయుచుందు వా
క్రౌర్యము మానవా సుగతి గానవు లెమ్మని కమ్మ జించు నా
భార్యను గాంచినట్టి పతి పర్వుల వెట్టెను భీతచిత్తుడై
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
క్రౌర్యము జూపుచు నుండగ
రిప్లయితొలగించండినార్యుడవా నీవటంచు నా రోకలితో
మర్యాద మరచి వచ్చెడి
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్.
క్రౌర్యము జూపుచుండి బహు కాలము నుండియు మద్యపానుడై
కార్యవిహీనుడై దిరుగు కాంతుని జూచుచు దండధారియై
యార్యుడ వెట్టు లౌదువని యాగ్రహ మూనుచు వచ్చు నట్టి దౌ
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై.
హ.వేం.స.నా.మూర్తి.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా ,భార్య ఒకవైపు,పద్య కవితా భావము మరొకవైపు నిల బెట్టినామనుకొండి.ఇప్పుడు కొలత వేస్తే భార్యను గూడా మించింది ప.క.తా భావం."నున్ ,కూడా, అనే అర్థం రావాలని అలా నోటికి వచ్చింది.మీ సవరణను తీసుకున్నాను.
డా.పిట్టా
రిప్లయితొలగించండి"నోట బల్కితి చేత నొనరంగ వ్రాసితి........నే కవీశ్వరుడగాను"శిద్దప్ప వరకవి పద్యం జ్ఞాపకం వచ్చింది,ఆర్యా
రిప్లయితొలగించండినిన్నే కంది వారు మెచ్చుకున్నారు, నా కందం చూడండని మా అయ్యరు గారితో అంటే :)
ఆర్యా ! అయ్యర్వాళ్! ఆ
శ్చర్యము ! నే వ్రాయు పద్య సౌరభమును, చా
తుర్యము గన రమ్మనియను
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్ :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఏదో.. భార్యలు టివి సీరియల్స్ చూసుకుంటూ భర్తను అతని మానాన అతణ్ణి వదిలేయాలి కాని పద్యాలు వినండని వెంటబడితే గురుడు పరుగులు పెట్టక ఏం చేస్తాడు పాపం!
చక్కని పూరణ. అభినందనలు!
తొలగించండికంది వారు
నమో నమహ్ :) మీరు కూడా జిలేబి ప్రతిపక్షమేస్మీ :) జేకే
నెనర్లు
ఆర్యులమాటలువినక య
రిప్లయితొలగించండికార్యములనుచేయుచుండకాంతలతోడన్
చర్యలకై యేతెంచిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై,
నార్యుల గాంచె,రాజువలె నా గుజరాతును నేలె, నేతయై
సౌర్యము, గట్టి వాక్పటిమ, చక్కగ నందరితో సమాఖ్య, చా
తుర్యము జేర్చి దేశమును తుంగము జేసె,జిలేబి మోదుడై !
హర హర మోడి :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
'తుంగము జేసె'...?
తొలగించండిదేశాన్ని కొండ వలె జేసాడన్న అర్థం లో వ్రాసా నండి
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై,
నార్యుల గాంచె,రాజువలె నా గుజరాతును నేలె, నేతయై
శౌర్యము, గట్టి వాక్పటిమ, చక్కగ నందరితో సమాఖ్య, చా
తుర్యము జేర్చి దేశమున దూకొనె గాద జిలేబి మోదియై !
జిలేబి
"కార్యేషు దాసి" యన విని
రిప్లయితొలగించండిసూర్యోదయ కాలమందు సురుసుర్రనుచున్
మిర్యాల చారు తెచ్చిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిపొద్దున్నే కాఫీకి బదులు మిరియాల చారు తెస్తే ఏ భర్త భయపడకుండా ఉంటాడు? మంచి పూరణ. అభినందనలు.
__/\__
తొలగించండిఆర్యుడు కార్యదక్షుడు మహాగుణవంతుడు నాదు భర్తకున్
రిప్లయితొలగించండికార్యములుండబోవు పరకాంతలతో యను భార్య చూచి సౌం
దర్యపురాశితో మగని త్రాచువలే బుసగొట్టి పైబడే
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుడై
అయ్యా నమస్తే. నా పూర్తి పేరు నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు. పాశ్చాత్యదేశంలో స్థిరపడ్డ తరువాత దాన్ని చిన్నదిగా చేయాల్సింది, ఇక్కడ వాళ్లకి పలకడం కోసం కాస్త సులభతరం చేద్దామని.
నేమాని సోమయాజులు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'వలే, పైబడే' అని వ్యావహారికాలను ప్రయోగించారు. "త్రాచువలెన్ బుసగొట్టి పైబడన్" అందామా?
తప్పకుండానండీ. ధన్యవాదములు.
తొలగించండిశౌర్యము చేత యుద్ధమున శత్రుల గూల్చుచు వారిచేవ ని
రిప్లయితొలగించండిర్వీర్యము జేసి మేటి సరి వీరులు లేరని చాటిచెప్పి యా
శ్చర్యము గొల్పురీతి బలజంబున నిల్చిన వీరభద్రునిన్
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై
వీరభద్రుడు = చాళుక్య వీరభద్రుడు, పతి = రాజు
ఫణికుమార్ తాతా గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
మీవల్ల 'బలజము' అన్న పదం కొత్తగా తెలిసింది.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిబిర్యాని,మందు,మగువ స
రిప్లయితొలగించండిపర్యల రంజిల్లి జూద వశుడై యుండన్
కార్యార్థిగఁ జని వచ్చిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
సహదేవుడు గారూ,
తొలగించండికార్యార్థియై వచ్చిన భార్య!... బాగుంది మీ పూరణ. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండికార్యార్ధియై జనగ నని
వార్యంబైన నెడబాటు బాధించంగన్
మర్యాద మరచి ప్రేమపు
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్యాతుతురత మనము వి
రిప్లయితొలగించండిపర్యయమై మైకమున నపస్మారమునం
బర్యంకము పైన పడిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
శౌర్యము జూపగా వలయు సంకట వేళల వెఱ్ఱివానిగం
గార్యము లందయిష్టులయి గంతులు వేసిన లాభ ముండునే
ధైర్య మొకింత చూపకయె, దయ్యము సత్వర మావహింపగన్
భార్యను, గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
'కార్యాతుతురత'...?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికార్యాతురతన్ మనము... అని నాభావము ఒక “తు” అధికముగా పడింది గమనించ లేదు. ధన్యవాదములు.
తొలగించండికార్యాతురతన్ మనము వి
పర్యయమై మైకమున నపస్మారమునం
బర్యంకము పైన పడిన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
భార్యా బాధిత సంఘపు
రిప్లయితొలగించండికార్యాలయ గడపను విడి కాలిడి నంతన్
పర్యవసానము దలచుచు
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిహాస్యస్ఫోరకంగా చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురువు గారికి వందనములు మఱియు ధన్యవాదములు.
తొలగించండిక్రౌర్యము జూపెను పతి యని
రిప్లయితొలగించండిఫిర్యాదున నిన్ను ఖైదు పెట్టించ గలన్
మర్యాదగ నగ కొనమను
భార్యను గాంచిన పెనిమిటి పరువులు పెట్టెన్
తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా లాలన జేయును
రిప్లయితొలగించండిభార్యను గాంచిన పెనిమిటి, పరుగులు వెట్టెన్
భార్యా భర్తలు సమముగ
సూర్యోదయ మగుట తోడ జూడగ శివునిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యం చదవగానే మొన్న రామేశ్వరంలో స్ఫటికలింగాన్ని దర్శించడానికి భార్యాభర్తలం పరుగెత్తిన విషయం గుర్తుకు వచ్చింది. సంతోషం!
భార్యకు పిచ్చియెక్కగను బంపగ వైద్యము జేయన త్తరిన్
రిప్లయితొలగించండిభార్యను గాంచినట్టి పతిపర్వులు వెట్టెను భీత చిత్తుడై
భార్య పరిస్ధితిన్గనుచు బావురు మంచును నేడ్వగా మరి
న్నార్యులు వచ్చి రయ్యెడను హాయిని గొల్పెడు మాటలా డెసూ
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కార్యము వీడియు మధ్యన
రిప్లయితొలగించండిమర్యాదను విడచి కల్లు మండువ కరిగెన్
ధైర్యముగ ద్రాగ కల్లట
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యుల సంస్కరణంబులె
రిప్లయితొలగించండిభార్యకు పట్టింపులేక బాధించుటచే
కార్యముజెడుననియే యా
భార్యను గాంచినపెనిమిటి పరుగులు వెట్టెన్|
2.ధైర్యము ధర్మవర్తన విధానమునందున మంచిబెంచు|నా
ధైర్య మదర్మమున్ దిరుగ?తగ్గును|దుర్వెసనాలుజేరగా
ఆర్యసమాజమందు వెలయాలియు పొందుపసందుజూడగా
భార్యను గాంచినట్టి పతి పర్వులువెట్టెనుభీత చిత్తుడై|
23.3.17.పద్యరచన
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధైర్యము వీడుచు వేగ,న
రిప్లయితొలగించండివార్యపు దయ్యంబు పూన,పటు భీకరమై
క్రౌర్యముఁజూపెడు వికృతపు
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కౌర్యము క్రోధము పలు దు
రిప్లయితొలగించండిశ్చర్యలె దినదినము సలుప ,సహచరి యిక నా
చర్యలు దుర్గగ గను మన
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు వెట్టెన్
నిన్నటి సమస్యకు నా పూరణ
ధరను తనపరభేదంబు తాను మరచి
కరముపరులను ప్రేమించగలుగు వాడు
పరుల మేలు గోరు నతడు; పతితుడు గద
పరుల సంపద తనదిగా బ్రతుకు వాడు
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్యుల కూర్చినట్టి వివహమ్మున కైకొని భార్యవీడి తా
రిప్లయితొలగించండిసూర్యకుమారిఁ గాంచి కడుఁ జొక్కుచు నింటికి రాకయుండినన్
దుర్యశుడైన భర్తఁగని దూరుచు రాగ స్వపత్నియుగ్రయై
భార్యను గాంచినట్టి పతి పర్వుల వెట్టెను భీతచిత్తుడై
రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫిర్యాదులేవి జూపని
రిప్లయితొలగించండిభార్యామణి కళ్ళుదిరిగి బడిపోవంగన్
కార్యమ్ములన్ని వదలుచు
భార్యను గాంచిన పెనిమిటి పరుగులు పెట్టెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Vijaya Durga
రిప్లయితొలగించండిto
అచ్చంగా తెలుగు
3 hrs ·
సమస్య -
తమన్నా - సమంతా - త్రిష - కాజల్
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో
తేటగీతి:
తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము
👆🏻తెలుగు భాషాభిమానులందరికి👆🏻
రచయిత ఎవరో తెలియదు
విజయ దుర్గ
రిప్లయితొలగించండిto
అచ్చంగా తెలుగు
3 hrs ·
సమస్య - దత్తపది
తమన్నా - సమంతా - త్రిష - కాజల్
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో
తేటగీతి:
తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము
👆🏻తెలుగు భాషాభిమానులందరికి👆🏻
రచయిత ఎవరో తెలియదు
తెలుగు దూరదర్శిని న్యూశ్ రీడర్ శ్రీమతి విజయ దుర్గ గారిచే ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడినది.
ఈ దత్తపదిని మన కవిమిత్రుడు మాచవోలు శ్రీ ధర రావు గారు, గత సంవత్సం ఉగాది ముందు జరిగిన ములుగు అంజయ్య గారి అష్టావధానంలో యిచ్చారు.
తొలగించండిఈ పద్య రచయిత మన కవిమిత్రులు శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారు .
తొలగించండి.... గుండా వేంకట సుబ్బ సహదేవుడు
సూర్యుడు లేవకుండగనె స్రుక్కుచు సోలుచు నిద్రలేచుచున్
రిప్లయితొలగించండికార్యము లందునన్ విరివి కక్షగ దక్షత నాస్వదించుచున్
మిర్యపు చారునున్ వడిగ మిక్కిలి శ్రద్ధను నిచ్చుచుండెడిన్
భార్యను గాంచినట్టి పతి పర్వులు వెట్టెను భీతచిత్తుఁడై :)