20, మార్చి 2017, సోమవారం

సమస్య - 2313 (గాంగేయుం డన్న నెవఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"గాంగేయుం డన్న నెవఁడు గంగాపతియే"
లేదా...
"గాంగేయుం డెవఁడన్న నా కెఱుక గంగావల్లభుండే సుమీ"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. గురువు గారికి వందనములు. మీ యాత్ర విజయవంతంగా జరిగినందుకు చాలా సంతోషంఅయింది. నిన్నటి నా పూరణ పరిశీలించ గోరుతాను. ధన్యవాదాలు,
    శ్రీధర రావు.
    నిన్నటి సమస్య: రామాంతకుడయ్యె హనుమ రాక్షసు లేడ్వన్!
    కోమలి సీతకు రాముని
    సేమంబు దెలిపి మఱలుచు శీఘ్రము తోడన్
    ధామముల గూళ్చి దనుజా
    రామాంతకుడయ్యె హనుమ రాక్షసు లేడ్వన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      దనుజారామ ధ్వంసియైన హనుమను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మీరు శుభప్రదముగా దక్షిణభారత యాత్ర ముగించుకొని వచ్చినందులకు సంతోషమైనది.అభినందనలు.నమస్సులు.

    రిప్లయితొలగించండి
  3. గంగా దేవికి సుతుడట
    గాంగేయుం డన్న , నెవఁడు గంగా పతియే
    భంగము పడిన ప్రదీపుడు
    సంగమముగ నదీ జలధి శంతను డయ్యెన్
    -----------------------------------
    గురువులు పుణ్య క్షేత్రాలను దర్సించిన భాగ్యము పొంది నందులకు చాలా సంతోషముగా నున్నది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. చివరిపాదంలో గణదోషం. అంతేకాదు.. కొంత అన్వయదోషం, భావాస్పష్టత ఉన్నట్టున్నవి.

      తొలగించండి
  4. సంగమున పత్ని యొసగిన
    బంగరు పుత్రుండు వేరు బంధువు గాడే
    హంగుల నిజ రూపుండే...
    గాంగేయుం డన్న నెవఁడు గంగాపతియే!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    గంగను జుంగనె బ్రిటిషరు
    అంగబలంబున్న కతన నది రూఢి యయెన్
    భంగపడున్ విజ్ఞుండును
    గాంగేయుండన్ననెవరు గంగాపతియే
    (ఆంగ్లేయులు Kanchanjungaఅని రికార్డులలోకి యెక్కించారు.ఇప్పటికి పేరు అదే.ధనికునిమాట ధర జెల్లినది.వాడేమన్నాదానిని ఒప్పుకున్న వైనం మెదలింది.అసలు, ఆహిమవత్శిఖరము పేరు "కాంచన గంగ".)

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    భంగును ద్రావిన గురువను
    "గాంగేయుండన్న నెవడు గంగాపతియే"
    సంగంబున బెత్తముగని
    అంగబలంబన్నరీతి నసిగిరి శిష్యుల్

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    సంగముగని మెదలగవలె
    పొంగకు మిది కాదటంచు పోకడలేలా?
    గంగందురు ప్రవహించిన
    గాంగేయుండన్న నెవరు గంగా పతియే.(ఏమో ఇదీ నిజమేనేమో అనేbenefit of doubt పరిశోధనకు దారితీసి విజ్ఞానార్జనకు దోహద పడుతుంది.వెంటనే కొట్టి వేయలేముగదా!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ మూడు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. రంగడు తనసతి నడిగెను
    కంగారుగ నామె చెప్పె కను డాప్రశ్నన్
    సంగీత యుత్తరంబును
    గాంగేయుం డన్న నెవడు? గంగా పతియే.

    రంగారావు నెరుంగగోరి యడిగెన్ రాజీవ పత్రాక్షియౌ
    సంగీతాసఖి వాడు పల్కెనపుడున్ సర్వజ్ఞు డేనుండ గా
    కంగా రేలనె నీకటంచు వినుడ క్కల్యాణితో నివ్విధిన్
    గాంగేయుం డెవడన్న నాకెరుక గంగావల్లభుండే సుమీ

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    "గంగా!"వల్లభు డన్ననే ప్రియుడువాగర్థంబు దీపింపగన్
    గంగా పుత్రుడు భీష్ముడన్న'యియ'తో గాదచ్చటన్ ‌సంధి నా
    గాంగేయమ్మసలైన స్వర్ణము సుమీ గ్రాహ్యంబులీ మొత్తముల్
    గాంగేయుండెవడన్న నాకెరుక గంగా వల్లభుండే సుమీ!

    రిప్లయితొలగించండి
  10. రంగా! గంగా తనయుడె
    గాంగేయుండన్న, నెవడు గంగా పతియే
    కంగారెందుకు చెప్పగ
    జంగమ దేవుడుశివుడని జనులందురుగా.

    రంగారావును మిత్రుడొక్కడట గోరన్ జెప్పెనీరీతిగా
    గంగాశంతను ముద్దుబిడ్డడు గదా గంభీరుడౌభీష్ముడే
    గాంగేయుండెవడన్న నాకెఱుక గంగావల్లభుండేసుమీ
    కంగారెందుకు భీష్ముడే యతడె యా కైలాసవాసుండెగా

    రిప్లయితొలగించండి
  11. విరించి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. రంగండాంగ్లము నేర్చియు
    మంగళ రూపుని మహేశు మహిమఁ దెలుపుచున్
    సింగెనిటుల్ భూతమ్ముల
    'గాంగేయుడన్న నెవడు గంగాపతియే'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. గంగిక తనయుడు గాదే
    గాంగేయుండన్న, నెవడు గంగాపతియే
    మంగా! జెప్పెద నిప్పుడె
    పింగళుడౌ సాంబశివుని బిల్చెదరటులన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గంగకు తనయుడు' అని ఉండాలి కదా!

      తొలగించండి
  14. సంగర భీముడు ధీరుడు
    గాంగేయుం డన్న నెవఁడు, గంగాపతియే!
    భంగ మ్మగు నీవచనము
    గంగాసతి భార్య యౌను గఱకంఠునకున్

    [గంగా+ అపతి = గంగాపతి; అపతి = అనాథ]


    శృంగారం బన నొప్పునే ధరణి విచ్చేయంగ మూర్ధమ్మునన్
    గంగాదేవినిఁ దాల్చె నంత శివు డాకాంక్షించి తా బార్వతీ
    సాంగత్యంబున సంతసించుచు మహాశ్చర్యంబునన్ భస్మ రా
    గాంగేయుం డెవఁడన్న నా కెఱుక గంగావల్లభుండే సుమీ

    [భస్మరాగ+అంగ +ఈయుఁడు = భస్మారాగాంగేయుఁడు; అంగేయుఁడు = అంగము కూడుకున్నవాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భస్మరాగంం అంంటే భస్మంం ఎరుపు ఉంండదు
      భస్మరాగంం అంంటే భస్మీకృృతరాగ కదూ
      పూరణ అంంద్భుతఃః

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. మధుసూదన్ రాజు గారు నమస్సులు. ధన్యవాదములు. రాగము అంటే ఇక్కడ రంగు అని అర్థము. బూడిదరంగు అని భావము.
      పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  15. గంగా! చెప్పుమ యియ్యది
    గాంగేయుండనగనెవడు.గంగాపతియే
    రంగని రూపున కంసుని
    నంగాంగము తునకలుగను నంతము జేసెన్

    రిప్లయితొలగించండి
  16. గంగా సుతు భీష్మండే
    గాంగేయుండన్న, నెవడు, గంగాపతి యే
    యంగనను వలచెనో యా
    యంగనతో పెండ్లి జేసె నతడే వాడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. "గంగాసుతుండు భీష్ముడె" అనండి.

      తొలగించండి
  17. *సహస్రకవిరత్న,కవిభూషణ* *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *సహస్రకవిరత్న,కవిభూషణ*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    [20/03, 12:29 AM]

    రంగారెడ్డినెఱుంగుదున్ తెలుగుజిల్లాతెలంగాణలో
    సంగారెడ్డినెఱుంగుదున్ తిరిగిచూశా తెలంగాణలో
    హంగామావినభారతంబనగబాహాటంబయెన్ భీష్ముడా
    *"గాంగేయుం డెవఁడన్న ?నా కెఱుక గంగావల్లభుండే సుమీ"*


    *సహస్రకవిరత్న,కవిభూషణ*
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    [20/03, 12:29 AM]

    రిప్లయితొలగించండి
  18. శివపురాణంం లాంంటి గ్రంంధాలుమాత్రమే చదివిన ఓ శివభక్తుడైైన తెలంంగాణాలో స్థిరపడ్డ తెలుగుభక్తుడు మహాభారతగాధలు ప్రసంంగాలలో విన్నారు గాంంగేయుడు భీష్ముడంంటే అతనికి పూర్తిగా అర్థంంచేసుకోగలిగినంంత పాంండిత్యంం అతనికి లేదు వచ్చి తెలుగు పంండితుడైైన తన అన్న గారితో ఇలా వాపోయాడు.ॐ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి, రెండవ పాదాలలో గణదోషం. "జిల్లాయే తెలంగాణలో..." అనండి. 'చూశా' అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  19. అంగన సాంగత్య మొదలి
    నంగీకృత బ్రహ్మచారి ఔన్నత్యమునన్
    సంగర మందున ధీరతను
    గాంగేయు డనగ నెవరు గంగాపతియే

    గంగాపతి= సముద్రుడు ధీరసముద్రుడని భావన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒదలి' అనడం గ్రామ్యం. "సాంగత్యము విడి" అనండి.

      తొలగించండి
  20. సంగర మందున ధీరుడు. యని చదవ ప్రార్ధన!

    రిప్లయితొలగించండి
  21. గాంగుడ, సుబ్రహ్మణ్యుడ
    గాంగేయుండన్న నెవరు ? గంగా పతియే
    యంగజహరుండు, ముదమున
    గంగ శివునివీర్యముఁ గొని గాంగేయుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టా
    "గంగా!"వల్లభు డన్ననే ప్రియుడువాగర్థంబు దీపింపగన్
    గంగా పుత్రుడు భీష్ముడన్న'యియ'తో గాదచ్చటన్ ‌సంధి నా
    గాంగేయమ్మసలైన స్వర్ణము సుమీ గ్రాహ్యంబులీ మొత్తముల్
    గాంగేయుండెవడన్న నాకెరుక గంగా వల్లభుండే సుమీ!

    రిప్లయితొలగించండి