21, మార్చి 2017, మంగళవారం

పద్యరచన - 1230

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

33 కామెంట్‌లు:

 1. కొట్టకుమీ సెల్ఫీలను
  నెట్టకుమీ పీటనుండి నెచ్చెలి నైనన్
  తిట్టకుమీ మన మందున
  కట్టకుమీ తాలి నెపుడు కదలెడు సతికిన్

  రిప్లయితొలగించండి
 2. చరవాణి
  కం. శ్రీపతియు చంద్రశేఖరు
  డా పరమేష్ఠియును గూడి యతి వత్సలురై
  యీ పృథ్వికి నిను బంపిరి
  చూపగ నీశక్తియు సొగసులు చరవాణీ! ౧.

  కం. పిన్నలు పెద్దలు చదువరు
  లెన్నంగా పామరాళి యెల్ల జగానన్
  నిన్నే దలచుచు నుందురు
  మున్నెన్నడు లేని చందమున చరవాణీ! ౨.

  కం. ఇందు గల వందు లేవను
  సందేహము గూర్చబోక సర్వత్ర భువిన్
  సౌందర్యంబును చాటుచు
  నుందువు నత్యాప్త వౌచు నో చరవాణీ! ౩.

  కం. నీవుండినచో నుండును
  భావములో హర్షదీప్తి బహుభంగులుగా
  నీవే సర్వాధారవు
  జీవనమున నేడు జూడ చినచరవాణీ! ౪.

  కం. పలుకులకే పరిమిత వయి
  యిలలో యశమంది యుంటి వెంతేనియు నీ
  వలనాడు నేడు చూడగ
  తలపుల కనురూప వందు తగ చరవాణీ! ౫.

  కం. పిట్టగ కొంచెం బైనను
  బిట్టగు నద్దాని కూత విను డనురీతిన్
  పట్టెదవు చేతి లోపల
  నెట్టన నతులితము శక్తి యిక చరవాణీ! ౬.

  కం. నీయందు విశ్వ మంతయు
  స్వీయాకృతి చేర్చియుండు స్థిరముగ నెపుడున్
  శ్రేయంబులు సమకూర్చుట
  కో యన మము జేరియుందు వో చరవాణీ! ౭.

  కం. ఛాయాచిత్రము లందుట
  యీ యవనిని గష్టకార్య మింతకు పూర్వం
  బీయుగమున నీ యునికిని
  స్వీయములే సాధ్య మయ్యె విను చరవాణీ! ౮.

  కం. హస్తంబున నీవుండిన
  పుస్తకముల నందబోరు పుడమిని ఛాత్రుల్
  వాస్తవ మిది యిలపైగల
  వస్తువు లన్నింట బ్రియవు భళి! చరవాణీ! ౯.

  కం. నీరాహారము లెవ్వరు
  కోరరు నిన్నందిరేని కువలయమందున్
  చీరెదరు నిన్నె సఖునిగ
  నౌరా! నీమహిమము కననగు చరవాణీ! ౧౦.

  కం. నీవుండిన కరమందున
  నేవిధి సుముహూర్తమందు నేవధు వైనన్
  పావన మంగళ సూత్రమె
  జీవన మని దాల్చగలదు చిరు చరవాణీ! ౧౧.

  కం. చిత్రమున గాంచు మాతం
  డాత్రంబుగ జూచుచుండె నాయమ మెడలో
  సూత్రంబు గట్ట గోరుచు
  చిత్రము! వధువు నిచట దలచిన చరవాణీ! ౧౨.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   'చరవాణీ' మకుటంతో వ్రాసిన మీ పన్నెండు పద్యాలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   పదిహేను పద్యాలు కలిపి 'చరవాణీ తారావళి' అనో, ఇంకా పొడిగించి 'చరవాణీ శతకము'నో వ్రాసి మమ్ము ఆనందింప జేయవలసిందిగా విజ్ఞప్తి!

   తొలగించండి
  2. అదొక చక్కని 'అధిక్షేప శతకం' అవుతుంది.

   తొలగించండి
  3. మూర్తిగారు చరవాణీ యని మీ మధుర వాణి వినిపించి మమ్మెల్లఱ నానందాబ్ధిలో ముంచెత్తితిరి. ముగ్ధ మనోహరపు టందమైన కందములు. భళీ. పూజ్యులు గురువు గారు కోరినట్లు “చరవాణీ” శతకము వ్రాయ గలరు!

   తొలగించండి
  4. ఆర్యు లిరువురకు ధన్యవాదపూర్వక నమశ్శతములు.

   తొలగించండి
 3. నెట్టున చిత్రములుంచగ
  పెట్టగ ఫోజులను వధువు ప్రీతిగ చెలితో
  కట్టంగతాళి జేతన్
  బట్టుకు గూర్చుండె వరుడు భళిరే సెల్ఫీ!!!

  రిప్లయితొలగించండి
 4. తాళిని నాజవరా ళ్ళెగ
  తాళిగ నెంచి యసమాన దరహాసమునన్
  హేళా లీల స్వీయ క
  రాళ ప్రతిరూప మంద లాలసలు సుమీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   తాళిని ఎగతాళి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన మీ పద్యం ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి


 5. నీ తాళి యేల మగడా
  మాతరు ణులకున్ జిలేబి మగువలకును సె
  ల్ఫీ తెచ్చును లైకులలున్
  యేతా వాతా పెనిమిటి యేబ్రాసియె బో :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   బాగుంది మీ పద్యం. అభినందనలు.
   'లైకులలున్'...? "లైకులనే" అనండి.

   తొలగించండి
 6. ఒరవడి మారెన్నిలలో
  నురవడి యన్నింటిలోన నూపగ జనులన్
  సురముడి మరముడి జేయుచు
  కరమిడె చరవాణి నిడగ గాఢపు చెలిమిన్!

  సురముడి=మాంగల్యము. మరముడి= యాంత్రికమైన ముడి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.

   తొలగించండి
  2. గురువుగారికి వందన శతములు!
   ఇంత మంచి ప్రశంస యెప్పుడూ మీ నుంచి రాలేదు! చాల ఆనందంగా ఉంది!
   ధన్యవాదములు!

   తొలగించండి
 7. ఇంతుల రీతులు తెలియక
  వింతగ జూసెద వదేల, వినుమా వత్సా!
  శాంతము దాంతము మరి వే
  దాంతము నేర్చంగ వలయు దారను వొందన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   చక్కని పద్యం. అభినందనలు.
   'నేర్వంగ వలయు' అనండి.

   తొలగించండి


 8. లలనామణులటు సెల్ఫీ
  లలో కబుర్లాడు ముద్దు లలరెడు రీతి
  న్నలవోక గనుచు పెండ్లి క
  లల దేలు రమణుని జూడు లావణ్యవతీ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పుడె యేమైనదిరోయ్
   ముప్పులు ముందున్నవోయి ముప్పది లక్షల్
   చెప్పుల దెబ్బల కోర్వక
   "తప్పులు మన్నించు" మనుట తప్పదు నీకున్

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ కందాలకు జోహారులు!

   తొలగించండి
 9. వళ్ళేమరచెను సెల్లును
  కళ్ళింతగ చేసి చూచి కళ్యాణమునన్
  పెళ్ళైన పిదప దీనికి
  కళ్ళెమ్మే వేయకున్న కడుపును మాడ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   చక్కని పద్యం. అభినందనలు.
   చివరి రెండు పాదాలు నన్ను బాగా నవ్వించాయి సుమా!

   తొలగించండి
  2. నిజంగా నిజం!
   కవిగారికి అభినందనలు!

   తొలగించండి
  3. ధన్యవాదాలు మాష్టారు,సీతాదేవిగారికి జి.పి శాస్త్రిగారికి ధన్యవాదాలు

   తొలగించండి
 10. తాళి గట్టలేడు తనకున్నవధువుకు
  ఫోనుకున్న శక్తిపొందునట్టి
  చూపులందుకున్నసొగసరి యెగతాళి
  కట్టగలడ వరుడు పట్టుదలగ|  రిప్లయితొలగించండి
 11. *చిత్రానికనువైన పద్యము*

  అక్కరకురాని మోజులె
  మిక్కుటముగ పెరిగిపోయె మేధిని యందున్
  ప్రక్కన నవ వరుడున్నను
  లెక్కింపక సెల్ఫి దిగెడు లీలను గనుమా!!

  రిప్లయితొలగించండి
 12. తారావళి దిగివచ్చిన
  మారరు జవరాండ్రు సెల్లు మానరు చూడన్
  నోరెళ్లబెట్టి చూడర!
  దారయ్యెడు భామ తాళి దాల్చెడు దాకన్!!

  రిప్లయితొలగించండి