6, జూన్ 2017, మంగళవారం

సమస్య - 2378 (హర్యక్షము జింకఁ గాంచి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్"
(లేదా...)
"హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్"

52 కామెంట్‌లు:

  1. ధైర్యము వహించి రావణు
    కార్యము జేయగ నరిగెను కాననమునకా
    శ్చర్యము మారీచుండవ,
    హర్యక్షము, జింకఁ, గాంచి యడలుచుఁ బాఱెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      పద్యం బాగుంది. కాని కొంత అన్వయలోప మున్నట్టుంది. చివరి రెండు పాదాలలో మీ భావం?

      తొలగించండి
  2. వర్యుడు యుద్ధము నందు
    న్నార్యుడమెరికనుడు పారె నౌరాయనగన్
    శౌర్యము వీడి వియత్నామ్:
    "హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్"

    Vast America defeated by tiny Vietnam in Vietnam War (1964-75)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వియత్నామ్ అన్నచోట కొంత అన్వయలోపం ఉంది.

      తొలగించండి
  3. పర్యంకముపై వనితను
    శౌర్యము తోజూచి భర్త సంతస మొందెన్
    క్రౌర్యపు చూపుల సతిగని
    హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్



    రిప్లయితొలగించండి
  4. మర్యాదన్ ప్రహ్లదుని
    హర్యక్ష నరావతారమగు శ్రీహరి,ధీ
    వర్యునిఁజూచిన--కశిపుడు
    హర్యక్షము--జింకఁగాంచి యడరుచుఁబాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      పూరణ బాగున్నది. కాని కొంత అన్వయలోపం ఉన్నది. ఇక్కడ హిరణ్యకశిపుడు హర్యక్షమా? జింకయా?

      తొలగించండి
    2. అయ్యా!నమస్కారము.హిరణ్యకశిపుడు హర్యక్షము ప్రహ్లాదుడు జింక--కశిపుడు హశ్యక్షము--
      కశిపుడు రాక్షసరాజు కనుక హర్యక్షమే!!
      ఒక సందేహము తెలిసికొనుటకడుగుచున్నాను.నివృత్తిజేయ
      ప్రార్థన
      పద్యంలో మొదటి పాదం గురువుతో
      ప్రారంభిస్తేనే మిగతా 3పాదాల గురలఘువైతేవే ఉండాలి.ఈ నియము ఉందా?

      తొలగించండి
    3. గురువైతే అన్నీ గురువులు,లఘువైతే అన్నీ లఘువులు ఉండాలనే నయమం ఉందా?

      తొలగించండి
    4. తేటగీతి, ఆటవెలది, సీస పద్యాల్లో తప్ప మిగిలిన పద్యాల్లో మొదటి పాదం మొదటి అక్షరం గురువైతే మిగిలిన అన్ని పాదాలు గురువుతోనే ప్రారంభించాలి. లేదా అన్ని పాదాల మొదటి అక్షరాలు లఘువులై ఉండాలి.

      తొలగించండి
  5. డా.పిట్టా
    చర్యయె జన్మకు హేతువు
    క్రౌర్యపు "హరి" అప్పు పడెను కలికి"హరిణి"కా
    శ్చర్యము తన గత మెరిగిన
    హర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    బరితెగి కాపు సార గను బట్టిని బెట్టిన పంతులయ్య తా
    నెర వణకించు బాలకుల నేస్తము వీడిన1నందు శిష్యుడౌ
    సరియధికారి తారసిల చప్పున బట్టునటన్న ధ్యాసతో
    హరిణము గాంచి సింహము భయంబున బారె వడంకుచున్ వడిన్!
    1.సేవానివృత్తిని బొందగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా ధన్యవాదాలు

      తొలగించండి
  7. కెరలె దవానలమ్ము ఘన కీలలతో వనమెల్లఁ గాల్చుచున్
    గర మనురక్తి నిప్పు చెలికాఁడు సహాయముఁ జేయ వచ్చె సం
    బరమున వాయుదేవునకు వాహనమై చెలరేగునట్టి యా
    హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వాయుదేవుని వాహనము లేడి యని విశదపఱచుచు చేసిన మీ పూరణ మనోహరముగ నున్నది. వాయుదేవుని బలమున లేడి కూడ దుర్వారామే.

      చిన్న సందేహము. “సహాయము” (సాహాయ్యము నకు) పదము వాడుకలో ప్రశస్తమైన గ్రామ్యమని నా యనుమానము. “సహాయతఁ జేయ..” అనిన నెట్లుండును?

      తొలగించండి
  8. భార్యలనుచు లేమల నా
    చార్యుడు పీడించ యొకతె, చతురత తోడన్
    వీర్యమిడు నంగము కొరికె ,
    హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      కొంత ఆశ్లీలార్థం గోచరిస్తున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *06-06-2017 (మంగళవారము)*
    *సమస్యా పూరణము*

    💐🌺💐

    *"హర్యక్షము జింకఁ !గాంచి యడలుచుఁ బాఱెన్"*
    కం.

    *సూర్యుండొరిగెన్ పడమటఁ*
    *ధైర్యంబదిలుప్తమయ్యె ధాత్రిసురునకున్*
    *క్రౌర్యోద్ధతిన్ వధింపగఁ*
    *"హర్యక్షము జింకఁ !గాంచి యడలుచుఁ బాఱెన్"*


    🌺🌺🌺
    🌸🌸🌸🌸🌸🌸🌸🌸

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      అడవిలో జింకను చంపిన సింహాన్ని చూచి బ్రాహ్మణుడు భయంతో పారిపోయాడు. చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  10. మర్యాద పూర్వ కమ్ముగ
    కార్యము సాధించ జూడ కలహము గోర
    న్నార్యు నహింసకు జడిసిరి
    హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్

    రిప్లయితొలగించండి
  11. ఆర్యా నాథుని వర బల
    పర్యవసానమున సైంధవ మృగం బాపెన్
    వీర్యోద్ధత కురు హరులన్
    హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్!!!


    హరిణ చమూరు వానర గజాహి గుహాశయ జంతు జాలమున్
    హరి కలకంఠ గృధ్ర చట కాళి చకోర విహంగ రాజులన్
    స్థిరముగఁ గాన నన్య మొక చిత్రపు భీకర సింహ రాజమున్
    హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్

    [హరిణము = తెల్లనిది; రాజి = పఙ్త్కి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  12. ఆర్యా యేమీ చిత్రము
    హర్యక్షముజింకగాంచి యడలుచుబారెన్
    శౌర్యము గల యా సింహపు
    చర్యలు మరి యుండెననుట సముచిత మగునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చర్య లటుల నుండె ననుట...' అనండి. బాగుంటుంది.

      తొలగించండి
  13. ఆర్యుడ వీవా యంచును
    క్రౌర్యముతో నరచుచుండి కవచాన్విత యై
    ధైర్యంబు జూపుదానిని
    హర్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్.

    నిరుపమమైనభీతి ననునిత్యము గాంచిన ప్రక్కత్రోవలన్
    పరుగిడు భీరువయ్యు బహుభంగుల దిట్టుచు కాలుడోయనన్
    చరిచెద నంచు వచ్చుటను సత్వమొ, మాయయొ యెంచలేక యా
    హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.

    హ.వేం.స.నా.మూర్తి.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా నున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. మర్యాదనుజూపుమునుత
    శౌర్యముదోడకరిమీద స్వారీ ఘనమౌ
    కార్సముజేసి పిపీలక
    హర్యక్షము జింక గాంచియడలుచు బారెన్


    పిపీలక హర్యక్షము=గండుచీమ

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హర్యక్షమును గనిన వడి
    ధైర్యము వీడక హరిణము దాను చగల గాం
    భీర్యత జూపుచు నుండగ
    హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
    (చగల గాంభీర్యత= మేకపోతు గాంభీర్యము)

    రిప్లయితొలగించండి
  16. విరించి గారి పూరణలు.....

    కరుణ యెలేని క్రూరపు మృగమ్ము వనమ్ము జరించు వేళలో
    నరుచుచు పైకి దూకినది యాకలి బాధను తాళలేక నా
    హరిణము గాంచి సింహము . భయంబున బారె వ డం కుచున్
    మరణము తప్పుతెట్లనుచు మందను జేరగ నెంచి జింకయే

    క్రౌర్యము తో పై దూకెను
    హర్యక్షము జింక గాంచి . య డలుచు బారె
    న్నా ర్యుమ్ డా దృశ్యము గని
    ధైర్యము గోల్పోయి తాను దర మే జేరం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కొన్ని టైపాట్లున్నవి.

      తొలగించండి
  17. పర్యాటక ప్రాంతమ్మున
    భార్యామణి తోడ తిరుఁగ, పరుగులు బెట్టన్
    క్రౌర్యమ్మున వెంటబడఁగ
    హర్యక్షము జింకఁ! గాంచి యడలుచుఁ బాఱెన్

    రిప్లయితొలగించండి
  18. హర్యక్షము నాయకు డయి
    పర్యయమెరుగని హరిణముప్రజలై నొకచో
    ధైర్యమ్ముగ నెదిరించిన
    హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రజలై యొకచో" అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
      హర్యక్షము నాయకు డయి
      పర్యయమెరుగని హరిణముప్రజలై యొకచో
      ధైర్యమ్ముగ నెదిరించిన
      హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్

      తొలగించండి
  19. పరిణయ మెంచి మీరి 'శశి'బాలను లక్ష్మణు డంత జేరుచున్
    సరసము లాడబోయి చెలి చక్కని మోమున దా ఘటోత్కచున్
    దరిశనమంది సత్యమని తాళెనె? రాక్షస మాయలోనిదౌ
    హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్

    రిప్లయితొలగించండి



  20. క్రౌర్యపు చూపుల పైబడ

    హర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్

    శౌర్యముగని చూపరులా

    శ్చర్యంబులు ముప్పిరిగొన నాగిరి భీతిన్

    రిప్లయితొలగించండి
  21. ఆర్యా సినిమాకువెడలె
    ఆర్యుడొకడుతాను ప్రేమహారికతో నా
    శ్చర్యము! భార్యనుగనియట!
    హార్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్

    2 ధరణి తలంబునన్ విలయ తాండవమాడియు తెల్లవారులున్
    తరణి, శశాంకు జూచిదిగు తానటు పశ్చిమదిక్కు సంధ్యలో
    తరుణము బట్టి మారునిల ధైర్యమధైర్యము తావులందునన్
    హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్

    రిప్లయితొలగించండి
  22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    *తరలెనుశస్త్రహస్తములతన్మనుజేంద్రునిసైన్యమట్లుభీ*
    *కరనినదోగ్రశబ్ధపరికంపితగాఢవనాంతరంబునన్*
    *శరమునగూల్చెభూవిభుడుచంపగఁదామదినెంచినట్టి యా*
    *హరిణముఁ !గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  23. ఆర్యుడ! హరిణం బొక్కటి
    పర్యావరణమ్ము గాచు పాలకు వెంటన్
    ధైర్యముగా నడయాడన్
    హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్!

    రిప్లయితొలగించండి
  24. ధరణిని నేలు యాంధ్రులిట దంచుచు మొత్తుచు త్రొక్కుచుండగా
    హరిణులవోలు బిడ్డలను హాయి తెలంగణ మాతృభూమిలో
    తిరముగ కల్వకుంటడిట తీరుగ కుమ్ముచు పారద్రోలగా
    హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్!

    రిప్లయితొలగించండి