13, జూన్ 2017, మంగళవారం

సమస్య – 2384 (రైతు విలపించు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రైతు విలపించు రాజ్యమ్ము రాణకెక్కు"
(లేదా...)
"రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

66 కామెంట్‌లు:

  1. రాజకీయ నాయకులదె రాజ్యమెపుడు
    కరువు దినములలో రైతు కడుపు మండు
    ధరణి దయదాల్చి పండంగ ధరలు కూలి
    రైతు విలపించు; రాజ్యమ్ము రాణకెక్కు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      రైతు లేడుస్తుంటే రాజ్య వెలిగిపోతున్నదని నాయకులు ప్రకటించడాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. తరుణి కన్నీరు కార్చిన సిరులు పోవు ,
    పతనమై పోవు వసుధన భంగ పడుచు
    రైతు విలపించు రాజ్యమ్ము, రాణకెక్కు
    ఇంటి లోన సంతస మొంద ఇంతి యెపుడు,
    కర్ష కుండు కన్నీరును కార్చ కున్న
    రత్న గర్భలో రాజ్యమ్ము రాణకెక్కు

    రిప్లయితొలగించండి
  3. వర్ష పాతము యధికమై కర్ష కునకు
    పంట చేలన్ని మున్నీట మింట గలియ
    పస్తు లుండగ ప్రాణాలు పరమ పధము
    రైతు విలపించు రాజ్యమ్ము రాణ కెక్కు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాతము+అధికమై' అన్నపుడు సంధి నిత్యం. "పాతమె యధికమై" అనండి.

      తొలగించండి
    2. వర్ష పాతమె యధికమై కర్ష కునకు
      పంట చేలన్ని మున్నీట మింట గలియ
      పస్తు లుండగ ప్రాణాలు పరమ పధము
      రైతు విలపించు రాజ్యమ్ము రాణ కెక్కు

      తొలగించండి
  4. డా.పిట్టా
    అన్నదాత బిరుదు గాదె యరసి నార్తి
    గ్రుంగు వారి కష్టముగని కుంది మదిని
    రైతు విలపించు రాజ్యము రాణకెక్కు
    నౌ స్వయంపోషకత్వమే నైతికతయ!
    పొరుగు దేశాల యప్పుల పోరు దీర!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    కౌతుక మొప్పగా వరముగా బ్రతిచోట కరావలంబనన్
    సైతు నటన్నదా ప్రభుత సాలుకు పంటలు దేలకున్న వే
    నైతిక బాధ్యతల్ గనిన నాస్తి కృషీవలు దీక్ష,లించుకన్
    రైతులు దుఃఖమందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. యువతరమ్మును మత్తులో నుంచ నెంచి
    చట్టమునకుఁ జిక్కియుఁ జెరసాలఁ బడిన
    హీనుఁడైన గంజాయిఁ బండించునట్టి
    రైతు విలపించు; రాజ్యమ్ము రాణకెక్కు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రెండవ పూరణ....

      అన్నదాతయై కష్టమ్ము లనుభవించి
      పంట పండించు కృషికి సత్ఫలము లేక
      రైతు విలపించు దేశమ్ము రాణకెక్కు
      నా? ప్రభుత్వము వారల నాదుకొనఁగ
      నెన్నొ సంక్షేమ పథకమ్ము లెన్నవలెను.

      తొలగించండి
  8. నూతనములైన మార్గాల చేత మలర
    సేద్య మొప్పుగ జేయుచు సిరులు నింపి
    జాతి కభివృద్ధి పంచకపోతి ననుచు
    రైతు విలపించురాజ్యమ్ము రాణకెక్కు.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో టైపాట్లున్నవి. "ధర నదుల యనుసంధాన మరసి నేడు" అని కదా ఉండాలి?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. టైపాట్ల సవరణతో
      ధర నదుల యనుసంధాన మరసి నేడు
      నేతలెల్లరు సాధించ నిరతి మెరయ
      సాగు లాభదాయక మౌచు సంతసమున
      రైతు విలపించ రాజ్యమ్ము రాణకెక్కు

      తొలగించండి
  10. సస్యరమ దరహాస లాస్యముల నెచట
    ధరణిపులకించి తలయూపు, ధాన్యలక్ష్మి
    నింపు సిరులు ముదమున కన్నీరు జారి
    రైతు విలపించు, రాజ్యము రాణకెక్కు

    రిప్లయితొలగించండి

  11. జాతికినన్నదాతగను సాగు నొనర్చుచు నెల్లవేళలన్
    ఖ్యాతిగడించు కర్షకుడు కాలము మారిన వేళనక్కటా
    ఆతని బాధపెట్టిననయమ్ము పరిశ్రమ లేర్పడెన్ గదా
    రైతులు దుఃఖ మొందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  12. పూరణ క్రమాలంకారంలో
    అప్పృలెన్నియొనొనరించి ఆశ తోడ
    పంట వేయంగ వర్షమ్ము పాడుచేయ
    ప్రజల కష్టాల కడతేర్చి ప్రభువులేల
    రైతు విలపించు రాజ్యమ్ము రాణకెక్కు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  13. పంట భూముల కాజేసి పట్టణముల
    నింద్ర భవనాలు నిర్మించు యిభ్యు డున్న,
    రైతువిలపించు.రాజ్యమ్ము రాణ కెక్కు
    ప్రజల నిక్కట్ల పాల్జేయు ప్రభుతనంగ

    రిప్లయితొలగించండి
  14. మండు టెండను వరదను మడుల యందె
    బ్రతుకు సాగించి బంగారు పంట కొఱకు
    రైతు విలపించు; రాజ్యమ్ము రాణకెక్కు
    సకల సంపదలను గల్గి సాగె ననగ

    నిన్నటి సమస్యకు నా పూరణ

    అతుల ప్రేమ నిడిన నానాటి కృష్ణుడే
    రాధికాప్రియుండు ;రావణుండు
    రావాణాసురునకు చావు గుర్చినవాడు ,
    నామ మేదియైన నతడె చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'రావణుండు, రావణాసురుండు' అని పునరుక్తి?

      తొలగించండి
  15. ఆరుగాలము శ్రమియించి నాశపడగ
    నందుకోలేక ఫలితమ్ము నార్తితోడ
    రైతు విలపించు; రాజ్యమ్ము రాణకెక్కు
    రైతు సుఖియించు ఘడియనె రాకుమార!!

    రిప్లయితొలగించండి



  16. నిన్నటి పూరణలు




    వాసుదేవుడయ్యె  ద్వాపరమ్ము న తాను

    రాధికాప్రియుండు రావణుండు
    సీతను చెరపట్టి చెడెరామచంద్రుని

    చేత లంకలోన త్రేత యందు.


    దాశరథియె తాను ద్వాపరమున నయ్యె

    రాధికా ప్రియుండు;రావణుండు

    రాక్షసునిగ బుట్టి రమణి నపహరించి

    మరణమొందినాడు మహిని నాడు.


    *"రావణుఁడే కదా వలచి రాధిక మెచ్చు ప్రియుండు


    సూడఁగన్"*



    అవనిలోన జానకిని నంటుకొనేగిన దుష్టుడెవ్వడున్

    కావలి నున్నవారలకు కమ్మని నిద్రను గూర్చిబుట్టి బృం

    దావనిలోన వేణువును దా మధురమ్ముగ నూదు శ్రీహరే

    రావణుఁడే కదా వలచి రాధిక మెచ్చు ప్రియుండు

    సూడఁగన్.
    నేటి పూరణ

    అవని యందున వర్షమ్ము నధిక మవగ

    రైతు విలపించె; రాజ్యమ్ము రాణకెక్కు

    నెప్పుడన ప్రజలెల్లరు నిజముగాను

    హాయిగా బ్రతుకు గడుపు నపుడె గనుము.

    రిప్లయితొలగించండి
  17. సాతివృష్ట్యనావృష్టి మహాపదలను
    రైతు విలపించు, రాజ్యమ్ము రాణకెక్కు
    వాని నాప నిరంతర మీ నరప్ర
    భువులు యజ్ఞ యాగమ్ముల నవనిఁ జేసి


    రైతులె యన్న దాతలు నిరంతర ధార్మిక కర్మ జీవులే
    యే తఱి నైన వారి నవహేళన జేయగ రాదు సుమ్మిలన్
    రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే
    యీ తఱి వర్జనీయమని యిద్ధర సత్వర మెల్ల వారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. తలతిరుగుచుండెనాయేమి? ధరణి నెచట
    రైతు విలపించు రాజ్యమ్ము రాణ కెక్కు?
    కరువుకాటకములతోడ కాలిపోవు
    తిప్పలొదవును ప్రజలకు తిండికొరకు

    రిప్లయితొలగించండి
  19. సైతురు వానయెండలను సైతురు చేసిన యప్పు బాధలన్
    సైతురు చీడపీడలను సైతురు భూయజమాని లోభమున్
    సైతురె గిట్టుబాటుధర చాలమి పంట ఫలించ? నెట్టులీ
    రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే ?

    రిప్లయితొలగించండి
  20. అన్నదాత దేశమునకు నండ గాదె?
    అప్పు దీర్చలేక మరణ మాశ్రయించు
    రైతు విలపించు రాజ్యమ్ము రాణకెక్కు
    నె? యిలఁ మాయని మచ్చయై నిలిచిపోవు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మచ్చయై - మచ్చయి; ఈ రెంటిలో ఏది సరైనదో తెలియలేదు

      తొలగించండి
    2. రెండు సాధువులే. ఐ, అయి లు సమానార్థకములు.
      మొదటి దానిలో యడాగమము, రెండవ దానిలో అత్వ సంధి.
      బాల. వ్యా. క్రియా. 103.
      ఆచ్ఛికంబులం దయి యవులకు వక్రతమంబులు బహుళంబుగా నగు.
      అయిదు - ఐదు, అయిరేని - ఐరేని, అవుడు - ఔడు, గవుసెన - గౌసెన.

      తొలగించండి
    3. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      'మచ్చ+అయి' అన్నపుడు సంధి లేదని, యడాగమం వచ్చి 'మచ్చ యయి' అవుతుందని భావిస్తున్నాను.

      తొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సేద్య వసతుల ప్రేరేచు చెన్నమరక
    ఆరు గాలపు శ్రమకింత యాప్తి లేక
    రైతు విలపించు రాజ్యమ్ము రాణ కెక్కు
    రాజ్య మేలెడి సర్కారు రచ్చ కెక్కు



    రిప్లయితొలగించండి
  22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    *13-06-2017 (మంగళవారము)*

    *"రైతు విలపించు రాజ్యమ్ము రాణకెక్కు"*

    (లేదా...)

    *"రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే"*

    *భూతపిశాచమానసులుబూడ్చిరిపారెడినీటివాగులన్*
    *క్ష్మాతలమట్టిశత్రువులకైబడియుండదురూహచేయుచున్*
    *మేతలజంతువుల్ ప్రజలుమృత్యువుజిక్కుచులొంగిపోవనా*
    *"రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    కింద నున్న రాజ్యము వారికి నీరు రానీయకుండా పైనున్న రాజ్యమువారు కర్కశహృదయంతో వాగువంకలునదులనీరు పారేమార్గాలను బూడ్చి వేశారు.
    అలాచేయటం వలన తమ రాజ్యమునకు కింది రాజ్యము వారు లొంగి వచ్చుట ఆర్థికంగా బలహీనులగుట వలన తమరాజ్యము రాణకెక్కుతుందని కుట్ర

    ఆనాడు రాజుల రాజ్యాలు .ఈ నాడు రాష్ట్రాలు.ఆనకట్టల ఎత్తుపెంపులు.. దుఃఖమునందువారు రైతులేకదా!

    రిప్లయితొలగించండి
  23. సస్యలక్ష్మిని పండించి సాగునెవ్వ?
    డాత డిల వంత లందంగ నలమునేమి?
    పాడిపంటలు విలసిల్ల వరలునెట్లు?
    రైతు, విలపించు, రాజ్యమ్ము రాణకెక్కు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా వారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. సి నారాయణ రెడ్డి గారికి వారు వ్రాసిన పాటలతోనే చిరు అంజలి
    ఆ మబ్బు తెరలలో, ,అభినవ తారవో, అగు జరా జరా , అణువు అణువు,
    బంగారు గువ్వను, బతుకమ్మ బతుకమ్మ, చామంతి ఏమిటే, చంద్రుడు నిను,
    చిన్నారి మరదల్కి ,చిన్నారి కృష్ణయ్య, చిరునవ్వు లోహాయి, చిలిపి కనుల,
    చిత్రం భళారే విచిత్రం, కనుల ముందు నీవుంటే కవితయే, నీలి కనుల,


    నన్ను దోచు కొందువటె ఓ వన్నెల దొర,
    మాయ దారి సిన్నోడు నా మనసె దోచి ,
    నీలి కను ల నీడలలోన, నీవు నాకు
    రాజ, రావోయి రావోయి రాలు గాయి,



    వస్తాడు నారాజు , వస్తావు పోతావు, వగల రాణివి నీవు, వంగ తోట
    కాడ, యే తల్లినిన్ కన్నదో ,వూ అను, విరిసిన మరుమల్లి , విను విను నిను
    వదలను, వద్దన్నా వదలదు, విధి ఒక, గోరంత దీపము, గుమ్మ గుమ్మ
    గోగులు పూచెగో గులు పూచె ఓలమ్మ గుమ్మాడి, గోడకు, గుండు మల్లె,


    పలకరించి తేనె ఉలికి ఉలికి, గున్న
    మామిడీ కొమ్మ, ఇద్దరి మనసులు ఒక,
    మధుర భావాల సుమమాల, మనసు పలికె
    మౌన గీతి, మానవ జాతి ,మల్లె తీగ

    రిప్లయితొలగించండి
  25. ఘాతకులైనపాలకులు కర్షక సంఘము విన్నపమ్ములన్
    కాతరు చేయకుండ కడుఁ గర్కశ బుద్ధిని భూమిఁ బొందుచున్
    యాతనపెట్టుచుండ్రి పలుయాక్షలతోడుత నెవ్విధమ్ముగా
    రైతులు దుఃఖ మందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే ?
    బూతికి వచ్చు క్షామమిక భూతలమందున ముమ్మరమ్ముగా

    రిప్లయితొలగించండి
  26. చేతి పంటలు పోవగ చేవపోవ
    రైతు విలపించు, రాజ్యము రాణకెక్కు
    నా? ధరణి లోన కన దేశనాయకులిక
    వాని దుఃఖము తీర్చెడి బాగు కనక

    రిప్లయితొలగించండి
  27. రోగముల పుట్టగా జేసి రోజురోజు
    కాయువును తగ్గ జేయు గంజాయి వంటి
    పంటలను మాన్ప; లాభమున్ కంటగనక
    రైతు విలపించు ; రాజ్యము రాణకెక్కు

    రిప్లయితొలగించండి

  28. పిన్నక నాగేశ్వరరావు.

    ఆరుగాలము కష్టించి యాశ తోడ

    పంట పండించ ధర గిట్టుబాటు గాక

    రైతు విలపించు; రాజ్యమ్ము రాణకెక్కు

    నా ? ప్రభుత రైతులకు తగినట్టి పథక

    ములనమలు జేయుచున్ సాయ
    మలరకున్న.
    *****************************

    రిప్లయితొలగించండి
  29. ధాత్రి నన్నమ్ము పండించు దాత తాను
    పంట ధరలేక గుండెలే పగిలి, పొగిలి
    రైతు విలపించు; రాజ్యమ్ము రాణకెక్కు
    నెట్లు?రైతు రాజిట్లు వే, పాట్లు పడగ.

    రిప్లయితొలగించండి
  30. రైతులు దుఃఖమందిననె రాజ్యము సర్వము రాణకెక్కులే!
    ప్రీతిగ చెప్పెదన్ వినుము రీతుల నెవ్విధి? కంది శంకరా!
    రైతుల దుఃఖమార్పగను లక్షల కోటులు రాజ్యమీయగా
    నేతలు పంచుచున్నిసుము నీటుగ మొత్తము కొల్లగొట్టగా!

    రిప్లయితొలగించండి