26, జూన్ 2017, సోమవారం

సమస్య - 2395 (అల్లా కరుణించు మనుచు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లా కరుణించు మనుచు హరి ప్రార్థించెన్"
(లేదా...)
"అల్లా నన్ గరుణించు మంచు హరి తా నర్చించె సద్భక్తుఁడై"

69 కామెంట్‌లు:

  1. అల్లా! అశరీరుండవు!
    కల్లయు కపటమును లేని కరుణామయుడౌ!
    చెల్లక గూటిన జిక్కితి!
    అల్లా! కరుణించు మనుచు హరి ప్రార్థించెన్

    అల్లా = నిరాకారియైన ప్రభువు
    హరి = (శరీరమను పంజరములో చిక్కిన) చిలుక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కరుణాత్ముడవే" అనండి.

      తొలగించండి
  2. కల్లల్గానని దేవతా గణములిక్కట్లెన్నియో పొందగన్
    పెల్లౌ ఘోర రణాంగణంబెగయు తద్భీతావహంబాపగన్
    ముల్లోకంబులఁగాచి బ్రోచు ప్రభు,సంపూర్ణప్రభా భాస్కరు
    న్నల్లా!నన్ కరుణించుమంచు హరి తా నర్చించె సద్భక్తుడై
    హరి=ఇంద్రుడు అల్లా =నిరాకారుడు(దేవుడు)

    రిప్లయితొలగించండి
  3. అల్లీఖానుని మిత్రుం
    డుల్లాసము హద్దుమీరి యురకలు వేయన్
    తెల్లని టోపీ చేకొని
    యల్లా కరుణించు మనుచు హరి ప్రార్థించెన్.

    అల్లీఖాను డమేయ భక్తియుతుడై హర్షంబునం బల్కె నో
    యల్లా నన్ గరుణించు మంచు, హరి తా నర్చించె సద్భక్తుడై
    యెల్లర్ మెచ్చెడి స్నేహ బంధమున వా రెంతేని సన్మార్గులై
    యుల్లాసంబున సంఘసేవ కొరకై యుర్విన్ సదాచారులై.

    హ. వేం. స.నా. మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. తల్లియు,దండ్రియు కరువై
    పిల్లలనాథలుగమిగిలి ప్రీతినిగోరన్
    యుల్లముతోవారందరి
    నల్లా కరుణించుమనుచు హరి ప్రార్దించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గోరన్+ఉల్లము' అన్నపుడు యడాగమం రాదు. "ప్రీతి నిడగ దా। నుల్లమునన్..." అనండి.

      తొలగించండి
  5. డా.పిట్టా
    "అల్లా!హ్బక్బర"టనవిని
    చెల్లన్ తనకైన మృగ మచిర కాలములో
    "మెల్లన జేర్చవె యనుదిన
    మల్లా!కరుణించు" మనుచు హరి(సింహము) ప్రార్థించెన్!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    అల్లా మాలికటన్ననేమి ఘనుడౌ నాషిర్డి వాసుండు యే
    కల్లల్ గానడు సామరస్యమలరన్ గాపాడెనే తత్ప్రజన్
    పల్లా దుర్గన(దుర్గయ్య)యుర్దు భాష బడిలో బారాడినన్ పాండితీ
    కుల్లా గట్టె నిజాము, దేవళములన్ గూర్చెన్ గదా, బ్రహ్మమౌ
    అల్లా నన్ గరుణించుమంచు హరి(యముడు)తా నర్చించె సద్భక్తుడై
    పొల్లున్ బోవడు చంపు నెల్లరిని తా పూర్ణంపు ధర్మంబునన్!
    (శ్రీ పల్లా దుర్గయ్య,మడికొండ,వరంగల్ కవిO.U Hyd లో ఆచార్య పదవి నలంకరించెను నైజాం రాజ్యంలో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. పల్లా దుర్గయ్య గారిని ప్రస్తావించడం సంతోషాన్ని కలిగించింది. అభినందనలు.

      తొలగించండి
  7. ఎల్లరి దైవములొకటని
    యుల్లమ్ముననమ్మి గొలువ యుక్తంబనుచున్
    చల్లని రంజానుదినము
    అల్లా కరుణించుమనుచు హరి ప్రార్థించెన్!!!

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      సమకాలీనాంశంతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చెల్లడను సుబ్రమణ్యము
      కల్లోలపు టుగ్రవాద గమనము నెంచన్
      జెల్లఁగ నొమరుగ మారె
      న్నల్లా! రక్షించు మనుచు హరి ప్రార్తించెన్
      ( ఈ హరి, సుబ్రమణ్యం తండ్రి వేంకటనరసింహారావు)

      తొలగించండి
  9. నల్లని కిరి తోడ నబం
    బెల్లయు నిండ నెలవంక బింబమపుడు బె
    గ్గిల్లి తన యునికి నితెలుప
    "అల్లా కరుణించు మనుచు హరి ప్రార్థించెన్"

    చంద్రుడు కనిపించిన ముస్లిమ్ సోదరులు ఈద్ జరుపుకొందురు. ఆకాశము మేఘావృతమై తన ఉనికిని తెలియపరచకున్న ఈద్ జరగదని (హరి = చంద్రుడు) అల్లాను ప్రార్దించెను అను భావన


    రిప్లయితొలగించండి
  10. కల్లా కపటము నెఱుగని
    పిల్లా నారాయణమ్మ ప్రియసు తు డపుడు
    జల్లని చూపుల మమ్ముల
    యల్లా ! కరుణించు మనుచు హరి ప్రార్దించెన్


    రిప్లయితొలగించండి
  11. గురుదేవులకు వినయమండిత నమస్కారములు
    తల్లియు తండ్రియు నీవని
    తెల్లని వసతరముల నడుమ ధీనవదమునన్
    అల్లటము లెల్ల ధీరచెడి
    అల్లా కరుణించుమనుచు హరి ప్రార్థించెన్!!!
    అల్లటము= కష్టము
    వర ప్రసాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు మీ దర్శనం? సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరన్నట్లే టైపు దోషాలున్నవి 'వసతరముల'...? "దీనవదనులై... దీర్చెడి" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదాలు
      వస్త్రము = వసతరము ఐనది సార్
      నా మిత్రుడు హరినారాయణ ముస్లిం గా మరినాడు

      తొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పల్లటములడచు వారిల
    తెల్లనిదొర జతలగునని తీరగు దలపున్
    వెల్లిగొనెడి భక్తి నచట
    నల్లా! కరుణించ మంచు హరి ప్రార్థించెన్
    (తెల్లనిదొర= పరమేశ్వరుడు)

    రిప్లయితొలగించండి
  13. *అల్లాక్రీస్తుయు,రాముడన్న* *మదిలోనాశించు భేదంబులున్*
    *చెల్లైపోయెను,మానసాంతరపుపెంజీకట్లు నిర్వీర్యమై*
    *యుల్లంబంతయు కోటితారల విభావోన్మీల నద్వైతమై*
    *అల్లానన్కరుణించమంచు హరితానర్చించె సద్భక్తుడై*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్రీస్తును...' అనండి.

      తొలగించండి
  14. ఎల్లమ్మ జాతరకు చీ
    మల్లా హరి దండు యేగి మంటల చిక్కన్
    తల్లీ గావుము నీ పి
    ల్లల్లా , కరుణించు మనుచు హరి ప్రార్థించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దండు+ఏగి' అన్నపుడు యడాగమం రాదు. "దండు పోయి" అనండి

      తొలగించండి
  15. చంద్రుడు కనిపించిన ముస్లిమ్ సోదరులు ఈద్ జరుపుకొందురు. ఆకాశము మేఘావృతమై తన ఉనికిని తెలియపరచకున్న
    ఈద్ జరగదని (హరి = చంద్రుడు) అల్లాను ప్రార్దించెను అను భావన

    తెల్లారంగనె పండుగాయెనుగ, సందేహమ్ముతో ముస్లిముల్
    యుల్లాసంబుగ చేయకుండును గదా యుర్విపై రంజాను, మ
    బ్బుల్లoదే యొదిగెన్ మదీయ తనువున్, భూలోక ముస్లిమ్ములన్
    యుల్లాసంబుల తోడ నింపు, ఘనమౌ యోగమ్ము కల్పించు మా,
    అల్లానన్ గరుణించు మంచు హరి తానర్చించె సద్భక్తుఁడై"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముస్లిముల్+ఉల్లాసంబుగ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. ఉల్లాసంబుగా అని యతిని ఉర్వి అని మార్చ మందురా సలహా ఈయండి

      తొలగించండి
    3. ల - ళ కు ప్రాస మైత్రి:

      ప్రల్లదమేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రి తుల్యుఁడై
      త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజ మంబరం
      బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చె విస్మయో
      త్ఫుల్ల విశాలనేత్రు లయి భూపతులెల్లను జూచుచుండఁగన్‌.
      భార, సభా. 2.69

      తొలగించండి
    4. తెల్లారంగనె పండుగాయెనుగ, సందేహమ్ముతో ముస్లిముల్
      సల్లాపంబులఁ జేయ కుందురు గదా చక్కంగ రంజాను, నా
      యొళ్ళెల్లం గనిపించ కుండు నిట మబ్బుండంగ ముస్లిమ్ముల
      న్నుల్లాసంబుల తోడ నింపు, ఘనమౌ యోగమ్ము కల్పించు మా,
      యల్లా నం గరుణించు మంచు హరి తానర్చించె సద్భక్తుఁడై"

      తొలగించండి
    5. కృష్ణ సూర్య కుమార్ గారు మీ పూరణలోని దోషములు (గురువు గారు సూచించిన దాని కన్నా) గమనించండి.

      ముస్లిముల్ బహువచనము. చేయకుండును ఏకవచనపు క్రియ.
      “యుర్విపై” లో గణ దోషము. త గణమునకు బదులు ర గణ మున్నది.
      మబ్బుల్ + అందే మబ్బులందే అవుతుంది. అప్పుడు గణ దోషము.
      ముస్లిమ్ములన్ + ఉల్లాసంబు “ముస్లిముల న్నుల్లాసంబు” అనిన సరి.

      నా సవరణ చూడండి.

      తొలగించండి
    6. గురు తుల్యులు కామేశ్వర రావు గారికి నమస్కారములు మీ సూచనలు నాకు మంచి మార్గమును సూచించు చున్నవి. పద్య రచన లొ నర్సరీ నుంచి యల్ కె జి కి చేరుకున్నాను. వృత్త రచనలో ప్రస్తుతము నర్సరీ లోనే వున్నాను. పునాది లోనే మీరు నా తప్పులు సరిదిద్ద ప్రార్ధన. శ్రీ శంకరయ్య గారు మీరు కలసి నన్ను సరి అయిన మార్గమున నడిపించిన నేను మీకు సర్వదా ఋణగ్రస్తుడను. ధన్యవాదములతో పూసపాటి

      తొలగించండి
  16. ఉల్లమునతలచె జాఫరు
    అల్లా కరుణించు మనుచు, హరి ప్రార్థించెన్
    పుల్లసరోజపు నేత్రుని
    నల్లరిరక్కసులనుండి యాదుకొనగన్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఇల్లున్ వాకిలి వీడి కారడవిలో నీరీతి దాగుంటిమో
      ఫుల్లాబ్జాక్ష వృతాసురుండు మములున్ పొంకాన నోడింపగన్
      తల్లిన్ దండ్రివి నీవె దైవమికనాధారమ్ముగా నాదు చూ
      పల్లా నన్ గరుణించు మంచు హరి తా నర్చించె సద్భక్తుడై
      హరి - ఇంద్రుడు
      వీటూరి భాస్కరమ్మ

      తొలగించండి
  18. కల్లా కపటమ్మెరుగక
    చల్లగ నుండంగ మొసలి చంపగ వచ్చెన్
    మెల్లగ గడపెద నికపై
    నల్లా కరుణించు మనుచు హరి ప్రార్థించెన్
    హరి-ఏనుగు ,గజెంద్రమోక్షం ఘట్టం
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వృతాసురుడు (వృత్రాసురుడు)... మములున్...' సాధువులు కావు.

      తొలగించండి
  19. ముల్లోకమ్ముల కీశుడు
    తల్లీనుండై తమకము తనవెంటబడన్
    కల్లోలితుడై వగచుచు
    నల్లా! కరుణింపు మనుచు హరి ప్రార్ధించెన్!

    అల్లా = ఈశ్వరుడు

    రిప్లయితొలగించండి
  20. తల్లడిలి సీతఁ గానక
    యెల్లెడల వెదకఁగ లంక నిద్ధచరితఁ దా
    నుల్లమున జగన్మాతనె
    యల్లా! కరుణించు మనుచు హరి ప్రార్థించెన్

    [అల్ల = తల్లి; హరి = కపి, హనుమ]


    చల్లంగన్ హరి కృష్ణు లిద్దరును సత్సాంగత్యమే సల్పగం
    గల్లోలమ్ము చెలంగ నొక్కతరి దుఃఖంబెల్ల బాధింపగం
    దెల్లం బెల్లరకున్ మహర్షి భగవద్గీతన్ భువిన్ వ్రాసె నా
    యల్లా నం గరుణించు మంచు హరి తా నర్చించె సద్భక్తుఁడై

    [అల్లు + ఆనన్ అల్లానన్ ; అల్లు = అల్లిక]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      సహజంగానే మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  21. కల్లోల పఱచి హహలము
    తల్లడ పెట్టెను మహేశ!త్రాగి,జగంబుల్
    చల్లగ రక్షించి జనుల
    నల్లా కరుణించు మనుచు హరి ప్రార్దించెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హహలము' అన్న పదం లేదు. "పఱచి గరళము" అనండి.

      తొలగించండి
  22. ఉల్లంబున మత భేదము
    కల్లా కపటంబు లేని కవి, హరి, ప్రీతిన్
    బల్లె మజీదుకు వెళ్ళియు
    అల్లా కరుణించు మనుచు హరి ప్రార్థించెన్"

    రిప్లయితొలగించండి
  23. ఫెళ్ళున యెండలు గాయగ
    తల్లడిలగ జలచరములు తరువుల్నటులే
    జల్లున వానలు కురవగ
    నల్లా! కరుణింపు మనుచు హరి ప్రార్ధించెన్!

    హరి= కప్ప

    రిప్లయితొలగించండి
  24. ముల్లా వేడె నమాజున
    యల్లా కరుణించు మనుచు, హరిప్రార్థించెన్
    తల్లివి దండ్రివి నీవని
    యెల్లజగమ్ములను గాచెడీశుడవనుచున్

    ఉల్లమ్మందున నిల్పితిన్ భవహరా యోంకారరూపుండవే
    యెల్లల్ లేనివిధమ్మునన్ గొలిచితిన్నేకాంబరా బ్రోవరా
    మల్లెల్ దెచ్చితి పూజకై యవనికిన్ మమ్మేల రావేమిరా
    యల్లా నన్ గరుణించమంచు హరి తానర్చించె సద్భక్తుడై.

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    ఉల్లమునన్ యోచించుచు

    నెల్ల మతమ్ములొకటే యని జనుల
    క్షేమం
    బెల్లప్పుడు నరయుచు తా

    నల్లా! కరుణించమనుచు హరి
    ప్రార్ధించెన్.
    ( హరి యను భక్తుడు.)
    ****************************

    రిప్లయితొలగించండి
  26. ఇల్లాలైనను తల్లియైన పసరమ్మే యైన రక్షస్సుడే
    మళ్ళీ వచ్చిన పాదమంటి రఘురామా కావు మన్నన్ మరే
    యెల్లల్లేవు కదా భవత్కృపకు స్వామీ నాదుకై రాకలో
    నల్లా? నన్ గరుణించు మంచు హరి తా నర్చించె సద్భక్తుఁడై.

    హరి = కపి = హనుమంతుడు
    అల్లా = కొంచెము = మంద్యము

    రిప్లయితొలగించండి



  27. నిన్నటి పూరణలు

    ఇమ్ముగ మరదలగును నా

    తమ్ముని సతి తల్లియగు తత్త్వము దెలియన్

    న్నమ్ముదితయె తనసుతునకు

    కమ్మగ తినిపించుచుండు కథలను చెపుచున్.


    అమ్మకు చెల్లి మనకు పి

    న్నమ్మగుచు నెల్లరకును నాదరమొప్పన్

    న్నిమ్మహిలో గన తండిరి

    తమ్ముని సతి తల్లియగు తత్త్వము దెలియన్.
    నేటి పూరణ
    ముల్లా ప్రార్థన చేసెను
    అల్లా కరుణించు మనుచు:హరి ప్రార్థించె
    న్నెల్లర నిలగావు మనుచు
    ఫుల్లాక్షుని మనమునందు మురిపెము తోడన్.

    రిప్లయితొలగించండి
  28. తెల్లార్జామున లేచి పర్విడుచునా తెల్గాణ రాష్ట్రమ్ములో
    ముల్లాలందరు గొంతులెత్తి ముదమున్ ముమ్మార్లు రోదింతురే
    కల్లాకప్టము లేని వాణ్ణి దయతో కాపాడు నానిద్రనో!
    అల్లా!!! నన్ గరుణించు మంచు హరి తా నర్చించె సద్భక్తుఁడై

    హరి = కోతి (శబ్దరత్నాకరము)

    https://www.google.co.in/amp/s/amp.scroll.in/article/834934/i-am-against-the-use-of-loudspeakers-not-the-muslim-call-to-prayer-clarifies-sonu-nigam

    రిప్లయితొలగించండి