28, జూన్ 2017, బుధవారం

సమస్య - 2396 (పతికిఁ జీరఁ గట్టె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున"
(లేదా...)
"భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్"
ఈ సమస్యను పంపిన భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు. 

72 కామెంట్‌లు:

  1. నగరమందు పెద్ద నౌకరి చేసెడు
    పడతి యెపుడు తిరుగు ప్యాంటు తొడగి
    ఇరుకు ప్యాంటు లన్న ఇష్టముండదనుచు
    పతికి, చీర గట్టె సతి ముదమున.

    రిప్లయితొలగించండి
  2. సత్యభామ కాగ సత్యనారాయణ
    కూచిపూడి వారి కూటమందు
    కులుకు లొలికి తాను కుచ్చిళ్ళు సవరించి
    పతికి చీరగట్టె సతి ముదమున


    సత్యనారాయణ = వేదాంతం సత్యనారాయణ (భామా కలాపం)
    కూటము = చావడి (శబ్ద
    రత్నాకరము)

    రిప్లయితొలగించండి
  3. పగటి వేష మనుచు పసివాని జడిపింప
    పతికి చీర గట్టె సతి ముదమున
    తల్లి దండ్రి నతడు తారుమారు గగాంచి
    తెల్ల బోయి తుదకు తల్ల డిల్లె

    రిప్లయితొలగించండి
  4. కాయ,పండ్లు,పూలు,కర్పూరములుఁదెచ్చి
    గుడికి పోవువేళ కూడవచ్చి
    పట్టుపంచెలిచ్చె కట్టుకొమ్మంచును
    పతికి,చీరగట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి
  5. నాటకంబులోన నారిగా నటియించ
    బూని జనుల మెప్పు పొందగోరి
    వేష ధారణాన బెంబేలు పడుచున్న
    పతికి చీర గట్టె సతి ముదమున.

    నర్తనశాల కేగుచును నాట్యము చేయగ సత్యభామయై
    వార్తల లోన దానగు నపార యశోవిభవా న్వితుండు నౌ
    మూర్తికి ప్రాణతుల్యుడయి మోదము గూర్చుచునుండు వానికిన్
    భర్తకు చీరగట్టనది భార్య కడుంగడు మోదమొందుచున్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. విరటుని గొలువందు వివిధ వేషాలతో
    పాండు సుతులుఁ జేర పడతి తోడ
    అబ్బృహన్నలగుచు నర్జునుండు నిలువ
    పతికి చీరగట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    మతి భ్రమించునట్లు మార్పేరులను వెట్టి
    వస్త్రరాశినమ్ము వాసి జెలగు
    "బాహుబలిది" యన్న బహుళప్రచారమౌ
    "పతికిచీర"1గట్టె సతి ముదమున!
    (1.చీరకుబెట్టిన క్రొత్తపేరు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మారు పేరుల బెట్టి" అనండి.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు.
      మారు పేరు ,మారునట్టి పేరన్న ధ్వని రాకూడదని అలా వాడినాను.సవరించుకున్నాను.కృతజ్ఞతలు.ఒకసారి చీరకా పేరు వస్తే ఇక మార్చకుంటేనే ఇంకొక పేరును ఇంకొక రకపు చీరకు పెడతారు.మనకేమీ అర్థంకాని పేర్లున్నాయి.గణదోషం వచ్చిందేమో!

      తొలగించండి


  8. ఆమె కిష్టమైన యంగవస్త్రములేయు
    చీర గట్ట దెపుడు భారమనుచు
    సకల జనులు గోర సంతసమును గూర్చ
    పతికి, చీర గట్టె సతి ముదమున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      విరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    నర్తన శిక్షణన్ బడయ నైన కుతూహలమున్న మేలు యా
    వర్తము,లెన్నొ భంగిమలు వర్తిలు "యోగ"కు దీటుగాగ సం
    వర్తిక1 బోలు నాడుదిగ వన్నెల గుల్క,కళాభిమానిగా
    భర్తకు చీరగట్టినది భార్య కడుంగడు మోదమొందుచున్
    (1క్రొత్త తామర పూరేఖ)

    రిప్లయితొలగించండి
  10. *సాంప్రదాయ వస్త్ర సందర్భ మేతెంచె*
    *స్వామిదర్శనమును సాధ్వి గోర*
    *విందుజేయ కనుల,వెళ్ళు నపుడు తిరు*
    *పతికి,చీర కట్టె సతి ముదమున*

    రిప్లయితొలగించండి
  11. సింహబలునిఁ జంపు చింతతో నర్తన
    శాల కంపగా కచములఁ దువ్వి
    ముచ్చట ముడిఁ గట్టి పూలతో సవరించి
    పతికి చీరగట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి
  12. పార్టి లోన పెట్టె ఫ్యాన్సి డ్రెస్ పోటీలు
    పడతి వోలె భర్త, భర్త వోలె
    భార్య మార దలచి పాల్గొన వలెనంచు
    పతికి చీర కట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి
  13. భీముడపుడు చాల ప్రీతుడై నోరార
    బుష్కలముగ స్తోత్రములను జదువ
    ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ
    పవనుడెల్ల జూచి పరవశించె.

    రిప్లయితొలగించండి
  14. వేషములను మార్చె విధిలేక పాండవుల్
    విరటు గొల్వు జేరు తరుణ మందు
    అర్జునుండుమార నంగనాకారుడై
    పతికిఁ చీరఁగట్టె సతి ముదమున!!!


    నాటకమున నొకడు బోటిగ నటియించ
    వేషమేయుచుండ వేడుకగను
    సాయపడగ నతని సహదర్మచారిణి
    పతికిఁ చీరఁగట్టె సతి ముదమున!!!

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె:నాటకమ్ము నందు నాతి వేషము వేయ
    నొప్పు కొనియె నొకడు నుర్వి యందు
    బొట్టు కుదిరె కోక కట్టు కుదరకున్న
    పతికి చీర కట్టె సతి ముదమున

    ఆ.వె:పంచె కండువాలు పదిలముగా నిచ్చి
    పతికి ,చీర గట్టె సతి ముదమున
    చెల్లి పెళ్ళి కనుచు శీఘ్రముగా తాము
    కదిలి వెళ్ళె జంట కారు లోన.

    ఆ.వె:మీసకట్టు ఛంద మెవరికి నిలలోన
    పెళ్ళి రోజు వధువు ప్రేమ తోడ
    నేది కట్టె భర్త కెట్టులొసంగెను
    పతికి చీర కట్టె సతి ముదమున.


    ఆ.వె:దుష్ట కీచకుండు ద్రోవదిన్ వాంఛించి
    వెతలు పెట్టు చుండ భీతి చెంద
    భామరూపుతోడ భీముడటకు రాగ
    పతికి చీర కట్టె సతి ముదమున.

    ఆ.వె:ప్యాంటు షర్టు దాల్చు పడతి, యిష్టమనుచు
    పతికి,చీరకట్టె సతి ముదమున
    మురిసి ప్రేమతోడ మోజుపడుచు తాను
    తెచ్చి కోక లొసగ పుచ్చు కొనియె.

    రిప్లయితొలగించండి
  16. చీర లోన జూడ గోరిక తోడన
    పతికి జీర గట్టె సతి ముదమున
    నాలు మగల బంధ మటుల నుండ గహర్ష
    మగును గ దిల మిగుల యార్య !మనకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..మగును జూడ మిగుల నార్య మనకు" అనండి.

      తొలగించండి
  17. ధూర్తుని చంపెదన్ వినుము, తోయజవైరి నభమ్ము చేరగన్
    నర్తనశాల లోన మరణమ్ము నొసంగెద నేడు, యిప్పుడే
    నేర్తును చీరకట్టు, యన నెమ్మిక భీముని కోర్కె దీర్చుచూ
    భర్తకుఁ జీరఁగట్ట నది భార్య కడుంగడు మోదమందుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నేడు నిప్పుడే... చీరకట్టు టన... దీర్చుచున్" అనండి.

      తొలగించండి
  18. పట్టణమ్ము నుండి పట్టువస్త్రాలనే
    తెచ్చె నింతి తాను మెచ్చి కొన్ని
    ప్రేమతోడ నిచ్చె పీతాంబ రమొకటి
    పతికి, చీర గట్టె సతిముదమున

    ఆర్తిగ జేరి కోమలి సహాయము గోరగ భీముడంతటన్
    నర్తనశాలయందు తను నారిగ నాటక మాడనెంచి స్త్రీ
    మూర్తిగ మారెడిన్ బతిని ముగ్దగ మార్చుటకై పడంతి యే
    భర్తకు చీరగట్టినది భార్య కడుంగడు మోదమొందుచున్

    రిప్లయితొలగించండి
  19. భారతావనిఁ గడు బావనదినము శ్రీ
    రామనవమి పూజల నలరంగ
    రఘుకుల తిలకుండు రాముండు జానకీ
    పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున

    [చీర = వస్త్రము]


    ఆర్తిని శైవ కీర్తనము నంచిత రీతిని చేయుచుం దమిన్
    వర్తన మందు తుల్య మట భామ కహల్యకు భక్తి నిచ్చి యీ
    కార్తిక మాస పూజలకుఁ గాంచన వర్ణపుఁ బట్టు బట్టలన్
    భర్తకుఁ, జీరఁ గట్టినది భార్య కడుంగడు మోద మందుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  20. ధూర్తుడు కీచకుండు కడు దుర్మతితోడచెలంగుచుండగా
    భర్తలు నిస్సహాయత నృపాలుని పంచవసించ, భీముడేన్
    నర్తనశాల సింహబలు నామమడంచెద నంచు పల్క, తా
    భర్తకు చీరగట్టనది భార్య కడుంగడు మోదమొందుచున్

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.

    నేడు గ్రామమందు నాడు నాటకమున

    వేయుచుంటి నొక్క వెలది పాత్ర

    చీర కట్టు విధము నేరుపు నాకన

    పతికి చీర గట్టె సతి ముదమున.

    ****************************

    రిప్లయితొలగించండి
  22. ఆర్తిని ద్రౌపదిన్ గలిసి యాదట పొందగ కీచకుండటన్
    నర్తనశాల వచ్చునని నాధుడు భీముని జేరరమ్మనన్
    ధూర్తుని జంపగన్ జెలఁగ తోయలి రూపును తీర్చిదిద్దగన్
    భర్తకు చీరగట్టనది భార్య కడుంగడు మోదమొందుచున్

    రిప్లయితొలగించండి
  23. భర్తకు సంతసంబగుట భామిని నూతన మొప్పగా దగన్
    భర్తకు జీర గట్టి నది భార్య కడుంగడు మోదమందుచున్
    భర్తలు మంచి వారయిన భార్యలు సంతస మొందురే గదా
    భర్తకు సాటిరారుగద భామిను లందరి కెవ్వరున్ ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒందుదురు'ను 'ఒందురు' అన్నారు. అక్కడ "సంతస మొంది పొంగరే" అందామా?

      తొలగించండి
  24. ప్రద్విషులకు వెఱచి భండనమ్ము మాని
    వీటి కేగుదెంచు విభుని గాంచి
    పసుపు చెందిరమ్ము,పారాణి పూయుచు
    పతికి జీర గట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి
  25. చీరదొంగలించి సిగ్గుల దొలగించు
    జీరలొసగు దానె సేమమలర
    చీరగానెపలుకు శ్రీమంతుడౌ రమా
    పతికి జీరకట్టె సతి ముదమున!

    రమాపతి విగ్రహానికి!

    రిప్లయితొలగించండి
  26. కొంటె తలపు లవియె కోమలిన్ జుట్టగా
    నిదుర బోవు మగని నింతి జేరి
    బొట్టు పెట్టి నుదుట బుగ్గ చుక్కను దిద్ది
    పతికి చీరగట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి
  27. అనుభవమ్ము లేక నానాటకమ్మున
    నేత చీర గట్ట చేత గాని
    పతిని జూచి తానె ఫక్కున నవ్వుచు
    పతికిఁ జీరఁ గట్టె సతి ముదమున

    భర్తకుఁ జీరఁ గట్టినది భార్య కడుంగడు మోద మందుచున్
    నర్తనశాలలో నిశిని నాతిగ నిల్చెడి భీమసేనుకున్,
    కర్తవు నీవె, బంపుమనె కాలుని వద్దకు కీచకాధమున్
    వార్తను విన్న సోదరియు భర్త విరాటుడు మూర్ఛబోవగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  28. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 

    పతికి చీరగట్టె సతి ముదమున. 


    పసిడిగాజులివ్వపట్టునువిడనాడె
    అత్తగారిజేరజిత్తగించె!
    పయనమాయెనపుడుపరువటుదక్కెనా
    పతికి !చీరగట్టె సతి ముదమున

    ( లేదా )....
    భర్తకు చీరగట్టనది భార్య కడుంగడు మోదమొందుచున్

    స్మార్తకుటుంబజాతతనమానసజేతయటంచుబల్కి రా
    మ్మూర్తి యబద్ధమాడియటుమోసముజేసెనుతల్లిదండ్రికిన్
    కీర్తన!సంప్రదాయమొలికించుచుచక్కగతగ్గతోడుయై
    భర్తకు చీరగట్టినది భార్య!! కడుంగడు మోదమొందుచున్

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
      'తోడునై' అనండి.

      తొలగించండి
  29. చక్కనైన జంట చలిమర గదిలోన
    పరవశింప , వచ్చి పాలవాడు
    తలుపుఁ దట్ట , పంచె దా సవరించియు
    పతికి , చీరఁ గట్టె సతి ముదమున !!


    ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ....

    కీర్తిత సద్గుణుండు నటకేసరియౌ మన నందమూరి ని...
    ర్వర్తిత పాత్రలో నడవిరాముడుగాగ , జయప్రదాఖ్య వ
    ర్షార్తిని వస్త్రముల్ దడువ నారగ చెట్టును చుట్టి , చాటుగా
    భర్తకు , చీరగట్టనది భార్య కడుంగడు మోదమందుచున్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. నార చీర దెచ్చి నాతి కైకేయిడ
    కట్టుకొనగ జూచు కాంతు గనుచు
    పట్టు గట్టువాని కెట్లు సాధ్యంబంచు
    పతికి చీరగట్టె సతి ముదమున

    రిప్లయితొలగించండి

  31. పిన్నక నాగేశ్వరరావు.

    ( నా రెండవ పూరణము.)

    ప్యాంటు,షర్టులు నలవాటుగ ప్రతిరోజు

    సతి ధరించు; నేడు సంకురాత్రి

    యిట్టి వస్త్ర ధారణిష్టము లేదంచు

    పతికి ; చీర గట్టె సతి ముదమున.

    *****************************

    రిప్లయితొలగించండి
  32. గురుదేవులకు వినమ్ర వందనములు,
    ధన్యవాదాలు
    టీవీ సిరియళ్ళ లో చాలా మంది మగవారు చీర గట్టి చిందులు వేయుట ను జుాచి
    ≠=====≠==========
    చీర గట్టిన పతి చిందులు వేయంగ
    సిరులు గురిసె నంత చిత్రము గను
    వాడవాడ లందు బలుక వందనములు
    పతికి చీర గట్టె సతి ముదమున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీరు 'జబర్దస్త్' కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టున్నారు పూరణ. చాలా బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  33. ఆర్తశరణ్యుడేశివుడు ఆదరమొప్పగ అర్ధనారిగా
    ఆర్తపరాయణా యధిపఆదరమౌపతికే సతీసదా
    భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్
    కర్తకు భార్యగా ముదము గాసగ భాగముగావునా సతీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని అన్వయదోషం ఉంది. విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  34. భర్తయు భార్య పోవగను బైటకు షైరున బెంగుళూరులో
    పూర్తిగ వానలో తడిసి పొందుగ రాగనె లాడ్జి రూమునన్
    భర్తది సూటుకేసునట వాసిగ చోరులు దొంగిలించగా
    భర్తకుఁ జీరఁ గట్టనది భార్య కడుంగడు మోద మందుచున్

    రిప్లయితొలగించండి