31, జులై 2017, సోమవారం

ఆహ్వానము (గ్రంథావిష్కరణము)


సమస్య - 2425 (ఇంద్రుఁడు సీతకై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఇంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్"

30, జులై 2017, ఆదివారం

ఆహ్వానము (గ్రంధావిష్కరణము)


సమస్య - 2424 (భక్ష్యముల నాముదముతోడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భక్ష్యముల నాముదముతోడ వండఁ దగును"

29, జులై 2017, శనివారం

సమస్య - 2423 (దంష్ట్రలపై శంకరుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దంష్ట్రలపై శంకరుండు తాండవ మాడెన్"
నా పూరణ....
దంష్ట్రయనఁ గోరపల్లఁట
దంష్ట్రలు గలవార లన్న దనుజులె గాదా?
దంష్ట్రలతో పద్యమ? యే
దంష్త్రలపై శంకరుండు తాండవ మాడెన్?

28, జులై 2017, శుక్రవారం

సమస్య - 2422 (మునిఁ గన్గొన ముదిత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్"
శ్రీరాం వీరబ్రహ్మ కవి పూరణ....
అనఘాత్ము విప్రవరుఁ బ్రవ
రునిఁ గని మోహాంధయై వరూధిని వలద
న్నను వీడక యా గుణధా
మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథమునుండి)

27, జులై 2017, గురువారం

సమస్య - 2421 (కాముం డెనుఁబోతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాముం డెనుఁబోతు విఘ్ననాథుఁడు కపియౌ"
(లేదా...)
"కాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్"
(యతిమైత్రిని గమనించండి)

శ్రీరాం వీరభ్రహ్మ కవి (1885-1970) గారి పూరణ....

హైమవతీసతీశు నయనాగ్ని నశించె నెవండు? సుంతయున్
బ్రేముడి లేని కాలుఁడు చరించుట కెయ్యది వాహనంబు? దై
త్యామర మానవాళి తొలి యర్చన లందెడి వేల్పెవండు? శ్రీ
రామపదాబ్జసేవల విరాజిలు నెవ్వఁ డనన్ గ్రమంబునన్
కాముఁడు; దున్నపోతు; గణనాథుఁడు; మర్కటమూర్తి యారయన్"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథము నుండి)

26, జులై 2017, బుధవారం

దత్తపది - 120 (రయము-భయము-జయము-నయము)

రయము - భయము - జయము - నయము
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

25, జులై 2017, మంగళవారం

సమస్య - 2420 (మద్యమును గ్రోలువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను"
(లేదా...)
"మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా"
ఈ సమస్యను పంపిన బండకాడి అంజయ్య గారికి ధన్యవాదాలు. 

24, జులై 2017, సోమవారం

సమస్య - 2419 (ప్రేమ పొంగిపొరలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రేమ పొంగిపొరలె వీథులందు"
(లేదా...)
"ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్"
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

23, జులై 2017, ఆదివారం

సమస్య - 2418 (యమునకె తప్పదుగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్"
(లేదా...)
"యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా"

శ్రీరాం వీరబ్రహ్మ కవి గారి పూరణ....
విమలాంబర రత్నాభర
ణముల నలంకృతము గాంచి నవ షడ్రరసభో
జ్యములన్ బెఱిగిన యీ కా
యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథంనుండి)

22, జులై 2017, శనివారం

సమస్య - 2417 (పతిని సహోదర యనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్"
(లేదా...)
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్.

వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో వారిచ్చిన పూరణ....
సతి విను భారతార్థములు శ్రద్ధమెయిన్ వివరింతునంచు సం
గతి శివు డిట్లు పల్కె - మసకంబున ద్రౌపది వల్వలూడ్చుచో
పతులను వేడికొంచు నగుబాటయి తా నెలుగెత్తి  రుక్మిణీ
పతిని సహోదరా! యనుచు, పార్వతి! పిల్చెను భారతమ్మునన్.

21, జులై 2017, శుక్రవారం

సమస్య - 2416 (రాతికిఁ బుట్టినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాతికిఁ బుట్టినది కోఁతి రాముని వలెనే"
(లేదా...)
"రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్"

వేంకట రామకృష్ణ కవుల పూరణ....
ఖ్యాతి యెసంగ నంజనకుఁ గల్గిన శ్రీహనుమానుఁ జూచి సం
ప్రీతిని జెంది దేవతలు పేరిమిఁ జెప్పుకొనంగసాగి రా
భూతలమందు రావణుని బొల్పడఁగింపఁగ నిప్పు డంధకా
రాతికి గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్.
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథమునుండి)

20, జులై 2017, గురువారం

సమస్య - 2415 (కుండలోనఁ జొచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు"
(లేదా...)
"కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే"
వేంకట రామకృష్ణ కవుల (19వ శతాబ్దం) పూరణ....

కొండలు రేగి లోకముల గుండలు సేయుచునుండఁ జూచి యా
ఖండలు డుద్ధతుండయి యఖండపరాక్రమ మొప్ప ఱెక్కలన్
జెండఁ గడంగుటం దెలిసి శీతనగాత్మజుఁ డబ్ధి వజ్రి రా
కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డిదే"

19, జులై 2017, బుధవారం

సమస్య - 2414 (క్రూరులు దుష్టులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా"
(లేదా...)
"క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా"
(సహదేవుడు గారికి ధన్యవాదాలతో...)

18, జులై 2017, మంగళవారం

దత్తపది - 119 (అర-చెర-ధర-ముర)

"అర - చెర - ధర - ముర"
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

17, జులై 2017, సోమవారం

సమస్య - 2413 (జన్మదిన మంచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జన్మదిన మంచు నిడఁ దగు శాపములను"
(లేదా...)
"శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్"

16, జులై 2017, ఆదివారం

సమస్య - 2412 (ముదమున రాహుల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్"
(లేదా...)
"ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్"
(నేమాని సోమయాజులు గారికి ధన్యవాదాలతో...)

15, జులై 2017, శనివారం

సమస్య - 2411 (పట్టుదల యున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు"
(లేదా...)
"ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో"

14, జులై 2017, శుక్రవారం

ఆహ్వానము (అష్టావధానము)


సమస్య - 2410 (సీతాపతి యన్న నెవఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ"
(లేదా...)
"సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా శ్రీకంఠుఁడే శంభుఁడే"

13, జులై 2017, గురువారం

సమస్య - 2409 (కానరు కాకులను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కానరు కాకులను నేఁడు గానలలోనన్"
(లేదా...)
"కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

12, జులై 2017, బుధవారం

దత్తపది - 118 (అన్నము-జావ-గంజి-తోప)

"అన్నము - జావ - గంజి - తోప"
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

11, జులై 2017, మంగళవారం

సమస్య - 2408 (చెడు పనియె సుమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట"
(లేదా...)
"చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్"
(శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలతో...)

10, జులై 2017, సోమవారం

సమస్య - 2407 (భాగవతమ్మును జదువుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ"
(లేదా...)
"భాగవతమ్మునున్ జదువఁ బాప మపారము చేకుఱున్ జుమీ"

9, జులై 2017, ఆదివారం

సమస్య - 2406 (విరసంబగు రచన...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విరసంబగు రచన యొప్పె వీనుల విందై"
(లేదా...)
"విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్"

8, జులై 2017, శనివారం

సమస్య - 2405 (అష్టమి తిథి శుభకరమని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్"
(లేదా...)
"అష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే" 

7, జులై 2017, శుక్రవారం

సమస్య - 2404 (శుకయోగికి నల్లుఁడయ్యె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే"
(లేదా...)
"శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్"

మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి పూరణ....

శుకమా! అయ్యది వేదశాస్త్రమహిమాస్తోకప్రభావాంశుకం
బకళంకంబగు వ్యాసభాగవతమే యౌరస్యమౌ నాస్తియౌ 
శుకయోగీంద్రున - కల్లుఁడయ్యెఁగద భీష్ముం డంద రుప్పొంగగన్,
ప్రకటింపంగను భారతాచ్యుతసహస్రం బందుటన్ మౌనికిన్!!!

6, జులై 2017, గురువారం

సమస్య - 2403 (మద్యమె బలవర్ధకమ్ము...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మద్యమె బలవర్ధకమ్ము మనుజుల కెల్లన్"
(లేదా...)
"మద్యమె మానవాళికి సమంచిత బుద్ధి బలమ్ము లిచ్చురా"

5, జులై 2017, బుధవారం

సమస్య - 2402 (దున్నపాలు పిండ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దున్నపాలు పిండ దుత్తఁ దెమ్ము"
(లేదా...)
"దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్"
(ఎన్నో అవధానాలలో అడిగిన ప్రసిద్ధమైన సమస్య ఇది)

4, జులై 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 44 (ఏ-కా-ద-శి)


అంశము- తొలి ఏకాదశి
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.

3, జులై 2017, సోమవారం

సమస్య - 2401 (కట్లపాము చేరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కట్లపాము చేరి కౌగిలించె"
(లేదా...)
"స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

2, జులై 2017, ఆదివారం

'శంకరాభరణం' ప్రస్థానం!

కవిమిత్రులారా!
అందరికీ నమస్కృతులు.
మరొక ఐదు రోజుల్లో రిటైర్ కాబోతూ విశ్రాంత జీవనాన్ని ఎలా గడపాలా అని ఆలోచిస్తున్న నాకు ఆంధ్రజోతి దినపత్రిక ఆదివారం సంచికలో బ్లాగుల గురించి ఒక వ్యాసం కనిపించింది. బ్లాగు ప్రారంభించి ఏదో ఒకటి వ్రాస్తూ కాలక్షేపం చేయవచ్చు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే 'KANDI SHANKARAIAH BLOG' అన్న పేరుతో బ్లాగును ప్రారంభించి 26-7-2008 నాడు మొదటి పోస్టుగా తెనాలి రామకృష్ణుని చాటుపద్యం "నరసింహ కృష్ణరాయల..." పద్యాన్ని ప్రతిపదార్థ తాత్పర్యాలతో ప్రకటించాను. ఆ తరువాత ఏం చెయ్యాలో తోచలేదు. దాదాపు రెండేళ్ళ వరకు మళ్ళీ బ్లాగు జోలికి వెళ్ళలేదు.
ఈమధ్య కాలంలో ఆంధ్రామృతం, రౌడీరాజ్యం, ఊకదంపుడు, తురుపుముక్క, డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగుల్లో అడపా దడపా ఇచ్చే సమస్యలను పూరించేవాణ్ణి. ఆ బ్లాగు నిర్వాహకులు "పూరణ బాగున్న"దని మెచ్చుకున్నపుడు సంతోషం, తృప్తి కలిగేవి. అయితే ఆ బ్లాగుల్లో సమస్యలను ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. రోజూ ఆ బ్లాగులను తెరిచి ఎవరూ సమస్యలు ఇవ్వకపోవడంతో నిరుత్సాహపడేవాణ్ణి. నాలాగే సమస్యలకోసం ఎదురు చూసేవాళ్ళు కొందరున్నారని తెలుసుకొన్నాను.
ప్రతిరోజూ సమస్యాపూరణలకు ప్రాధాన్యం ఇస్తూ పద్యసాహిత్యంపై పోస్టులు పెడుతూ నేనే ఒక బ్లాగును ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది.
అయితే బ్లాగుకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచించాను. నా పేరు వచ్చే విధంగా "శంకరాభరణం" అన్న పేరును ఎన్నుకున్నాను. నిజానికి ఈ పేరును సంగీతానికి లేదా భక్తికి సంబంధించిన బ్లాగుకు పెట్టాలి. బ్లాగు పేరుకు, బ్లాగులోని విషయాలకు సంబంధం లేకుండా ఉంది. అయినా "నా బ్లాగు నాకు అలంకారం" అని సర్దిపెట్టుకున్నాను. ఆ విధంగా 'KANDI SHANKARAIAH BLOG' పేరును 'శంకరాభరణం'గా మార్చాను.
1-6-2010 నాడు బ్లాగును పునఃప్రారంభించాను. ఆరోజు నేను చిన్నప్పుడు వ్రాసిన ఏకాక్షర పద్యాన్ని పోస్ట్ చేశాను.
2-6-2010 నాడు మొదటి సమస్యను (మందు త్రాగి పొందె మరణ మతఁడు) పోస్ట్ చేశాను. నా బ్లాగులో మొట్టమొదటి పూరణ చేసిన వ్యక్తి 'సుమిత్ర' గారు. ఆరోజు అదొక్కటే వచ్చింది. కొన్ని రోజులు రోజుకు ఒకటి, రెండు చొప్పున పూరణలు వచ్చేవి. ఈలోగా బ్లాగును కూడలి మొదలైన అగ్రిగేటర్లలో చేర్చాను. బ్లాగు గురించి అందరికీ తెలిసింది. మెల్లమెల్లగా పూరించే కవుల సంఖ్య పెరిగింది.
ప్రతిరోజూ సమస్య ఇవ్వాలనే నియమం పెట్టుకున్నాను. ఈ ఏడు సంవత్సరాలలో రెండు మూడు సందర్భాలలో తప్ప అనారోగ్యంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఈతి బాధలతో సతమతమైనా సమస్యలు ఇవ్వడం మాత్రం మానలేదు. చివరికి మా అమ్మానాన్నలు మరణించిన రోజుల్లోను సమస్యలు ఇచ్చాను (అవి అంతకు ముందురోజు షేడ్యూల్ చేసి ఉన్నాను కనుక).
సమస్యాపూరణలే కాకుండా చమత్కార పద్యాలు, ఛందోవ్యాకరణ పాఠాలు, పద్యరచన తదితర శీర్షికలు కూడా నిర్వహించాను.
ఈ ఏడేళ్ళలో ఎన్నో అనుభవాలు... గౌరవాలు... అవమానాలు... దూషణ భూషణ తిరస్కారాలు... పొగడ్తలకు పొంగి, అవమానాలకు క్రింగిపోవడమో, కోపం తెచ్చుకోవడమో ఎన్నడూ లేదు.
పూరణలు చేసేవారిలో లబ్ధప్రతిష్ఠులైన గొప్పకవులున్నారు. ఔత్సాహికులున్నారు. అప్పుడే పద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నవారూ ఉన్నారు. నేను స్థాయీభేదం పాటించకుండా అందరితోనూ సమానంగా ప్రవర్తిస్తున్నాను.
కీ.శే. శ్రీమాన్ పండిత రామజోగి సన్యాసి రావు గారు ఈ బ్లాగు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. వారికి పాదాభివందనాలు!
ఈ మధ్యకాలంలో మిత్రులు అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకున్నారు. 2011లో నాకు కంప్యూటర్ లేదని తెలిసి జ్యోతి వలబోజు గారి అధ్వర్యంలో నాకు కంప్యూటర్ కొనిచ్చారు. ఒకానొక సందర్భంలో అవసరార్థం బ్లాగు మిత్రుల వద్ద అప్పుగా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లింపలేకపోయాను. ఈ విషయంలో కొందరికి మనస్తాపాన్ని కలిగించినందుకు సిగ్గుపడుతున్నాను. నా అర్థిక పరిస్థితి అలాంటిది!
ఈరోజుతో సమస్యల సంఖ్య 2400 చేరుకున్నది. నిజానికి ఇంతకంటే ఎక్కువే. కొంతకాలంగా ఒకే భావంతో వృత్తంలోను, జాత్యుపజాతుల్లోను సమస్యలు ఇస్తూ వాటికి ఒకే సంఖ్యను కేటాయిస్తున్నాను. వాటిని పరిగణిస్తే ఇప్పటికి 2500 దాటి ఉంటాయి.
2500 సమస్యలు... సగటున ఒక్కొక్క సమస్యకు 15 పూరణలు అనుకుంటే 37500 పూరణలు. ఇవి కాక దత్తపదులు, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి (200x15) 3000 పూరణలు. పద్యరచన శీర్షికలో దాదాపు 25000 పద్యాలు... అంతేకాక కవులు తమ స్పందనలు తెలియజేస్తూ సందర్భానుసారం చెప్పిన పద్యాలు... అన్నీ కలిసి దాదాపుగా 70000 పద్యాల వరకు ఉండవచ్చు. ఇదంతా కవిమిత్రుల సహకారం వల్లనే సాధ్యమయింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
ఏదో కాలక్షేపానికి ప్రారంభించిన బ్లాగు ఈ స్థితికి వచ్చింది. ఈ బ్లాగు కారణంగా నాకు ఒక గుర్తింపు వచ్చింది. కొందరు నన్ను ఆత్మీయంగా ఆహ్వానించి సన్మానాలు చేశారు. ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ తప్పక పోస్టులు ఉండే బ్లాగుగా అంతర్జాలంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రయత్నించలేదు కాని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తదితరాలలో నమోదై ఉండేది. పత్రికలలోను మన బ్లాగు ప్రస్తావింపబడింది.
కొందరు మిత్రుల కోరికపై కొన్ని మంచి సమస్యలను ఏరి ఒక్కొక్క సమస్యకు నలుగురి వైవిధ్యమైన పూరణలు ఎన్నుకొంటూ ఒక పుస్తకం తయారు చేస్తున్నాను. ఇప్పటికి 100 సమస్యలను, పూరణలను సిద్ధంచేశాను. పుస్తకంలో 500 లేదా 1000 సమస్యలు ఉండేవిధంగా తయారు చేస్తున్నాను. ఏదైనా స్వచ్ఛంద సాహితీ సంస్థ ముందుకు వచ్చి ప్రచురిస్తే పుస్తక రూపంలో వస్తుంది. లేదా ebook రూపంలో విడుదల చేస్తాను.
నా ఆరోగ్యం సహకరించినంతవరకు, ఓపిక ఉన్నంతవరకు ఈ బ్లాగు ఇలాగే మీ సహాకారంతో నిర్విరామంగా కొనసాగుతుంది.
ఎన్నో చెప్పాలనుకున్నాను. కొన్ని మరిచిపోయాను. అనుకున్నట్లుగా మనస్సు విప్పి వివరంగా చెప్పలేకపోయాను.
అందరికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

సమస్య - 2400 (ఇరువదినాల్గు వందలు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తోచె సమస్యల గణన చతుర్వింశతియై"
(లేదా...)
"ఇరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్"
(నేటితో 'శంకరాభరణం'లో సమస్యల సంఖ్య 2400 అయిన సందర్భంగా...)

1, జులై 2017, శనివారం

సమస్య - 2399 (ఇతఁ డితఁడే యితఁడె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే"
(లేదా...)
"ఇతఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే"