7, జులై 2017, శుక్రవారం

సమస్య - 2404 (శుకయోగికి నల్లుఁడయ్యె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే"
(లేదా...)
"శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్"

మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి పూరణ....

శుకమా! అయ్యది వేదశాస్త్రమహిమాస్తోకప్రభావాంశుకం
బకళంకంబగు వ్యాసభాగవతమే యౌరస్యమౌ నాస్తియౌ 
శుకయోగీంద్రున - కల్లుఁడయ్యెఁగద భీష్ముం డంద రుప్పొంగగన్,
ప్రకటింపంగను భారతాచ్యుతసహస్రం బందుటన్ మౌనికిన్!!!

41 కామెంట్‌లు:

 1. ఒకడెవరికి జనకుడు గురు
  వొ?కడే మాయెనుగ రాము డోహో తనకే?
  ఇక గాంగేయుం డెవరే?
  శుకయోగికి; నల్లుఁడయ్యె; సురనది కొడుకే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ********
   ఇది మార్చి నెలలో ఇచ్చిన సమస్యే. మరచిపోయి మళ్ళీ ఇచ్చాను. మతిమరుపు ఎక్కువైపోతున్నది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
 2. పికమది కాకికి సరసన
  బకముండును హంస వోలె బహు సుందరమౌ
  పికబకము లెవరి కెవరట
  శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే
  ------------------------------
  క్షమించాలి దీనికి ఏర్ధము లేదు .రాయాలని రాసాను అంతె

  రిప్లయితొలగించండి
 3. నకులా! వ్యాసుడెవనికి జ
  నకుండు? కృష్ణుండు కంసున కిలను వరుసే
  మి? కురుపితామహుడెవడన
  శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే.

  రిప్లయితొలగించండి
 4. సరదాగా పూరణ.

  తికమక సమస్య చూడగ
  వికటించెను బుద్ధి-మేథ వెలవెలఁబోయెన్
  సకలము శూన్యంబయ్యెను.
  శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   పూరణలో ఇది కూడా ఒక పద్ధతే! బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 5. డా.పిట్టా
  శుకమొక బ్రహ్మకుమారి(ధ్యానం వల్ల గనిన కన్యకను)ని
  బకమది నది ప్రక్క జపము బట్టగ నిచ్చెన్
  ఇక దినుటే పతి సతినిన్
  (అయోగ్య వరుడు)
  శుక యోగికి నల్లుడయ్యె సురనది కొడుకే!

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  శుకమోయోగిగ భావ కన్యకను తా శ్రోత్రుండునౌ పారుకున్(బాపనికి)
  అకలంకంబుగనిచ్చె గానడతడే యౌ ఘోటికా(ఆడ గుర్రం)త్ముండనన్
  సకలంబోడ్చిన వింత పెళ్ళి యదియే సంబంధమౌ చూడగన్
  శుకయోగీంద్రున కల్లుడాయెగద భీష్ముండందరున్ మెచ్చగన్

  రిప్లయితొలగించండి
 7. సుఖముల బడయగ నణుహుడు
  శుకయోగికి నల్లుడయ్యె, సురనది కొడుకే
  ప్రకటిత శపథ నిబద్దత
  వికలము గాకుండ గడిపె వీరుని రీతిన్

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. ప్రకటించన్ తన ప్రేమభావనను సద్భావంబు కీర్తిమతిన్
  సకలాశీర్వచనంబునన్నణుహుడే సంప్రీతి పెండ్లాడగా
  శుకయోగీంద్రున కల్లుడయ్యె, భీష్ముండందఱుప్పొంగగన్
  నకటా ఘోటక బ్రహ్మచారిగను, నాద్యంతంబు జీవించెనో

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. అకలంకుండగు వ్యాసరా డ్విభుడు నౌన్గదా తండ్రియు
  న్శుకయోగీంద్రునకల్లుడయ్యెగదభీష్ముండందరుప్పొంగగ
  న్నకటా భీష్ముడు భీకరముగా హా దాను నుద్వాహము
  న్నికజే బూననిబల్కగా నగునె నోయీ భీ ష్మకుం డల్లుగాన్

  రిప్లయితొలగించండి
 12. సుకవియగు వ్యాసు డెవ్వా
  నికి తండ్రి? రాముడు జనకునికి నేమగునో?
  అకళంకుండగు భీష్ముడొ?
  శుకయోగికి; నల్లుడయ్యె; సురనది కొడుకే.

  - భాగవత, రామాయణ, భారత పరంగా

  రిప్లయితొలగించండి
 13. అకటా యేమని వ్రాయుదు
  శుకయోగికి నల్లుడయ్యె జుమి భీష్ముండే
  తికమక గా నుండెను మరి
  శుక భీష్ముల కిడుదు నతులు సుమ్మీ యిపుడున్

  రిప్లయితొలగించండి
 14. అకలంకుండని దెలియన్
  ప్రకటించెను తోటి నటుని వరునిగ సుతకున్
  సకలురనిరి గత నాటక
  శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే!

  రిప్లయితొలగించండి
 15. వికచాబ్జానన తండ్రిగా నెవడికిన్ వేద్యుండు వ్యాసుండయెన్
  నకులుండేమగు సెల్లుకున్ దెలుపుమో నారీ, యెవండంటి తా
  సుఖభోగమ్ముల వీడె దండ్రికొరకై, చూడామణీ తెల్పుమా
  శుకయోగీంద్రున కల్లుడయ్యె గద భీష్ముండందరుప్పొంగగన్

  రిప్లయితొలగించండి
 16. సకలాంధ్ర కవుల కొఱకై
  రకమున కొకటౌ సమస్య ప్రతి దినమిడగా
  భృకుటి ముడిచి బలికె కవియె
  శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే

  రిప్లయితొలగించండి
 17. సుకరమ్ముగ నా యణుహుఁడు
  శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే
  శుకునకు పినతండ్రి మురియ
  సకల జన సమక్షమునను సంతోషముగన్


  శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్
  వికటంబౌ వచనమ్ము లాడఁ దగునే భీష్ముండు సూడంగ తం
  డ్రి కుమారుం డగు వ్యాస నందనుఁడు సంప్రీతమ్ముగన్ ధాత్రినిం
  బ్రకటంబే యిది యెల్ల వారలకు సద్బాంధవ్యముల్ దల్చవే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు సమీక్షించని 12/3/2017 నాటి నా పూరణ:

   ప్రకటమ భవకారకుఁ డా
   శుకయోగికి, నల్లుఁ డయ్యెఁ జుమి భీష్ముండే
   యకళంకు నగాధిపునకు
   నిక ముద మొసఁగఁగ నభవుఁడు హిమవంతునకున్

   [భీష్ముఁడు = శివుఁడు]


   వికలంబైన నిజేచ్ఛ పార్వతి గిరిం బ్రీతిన్ తపం బాచరిం
   చి కరంబా పరమేశ్వరున్ గుఱిచి తాఁ జిత్తంబు మెప్పించఁగం
   బ్రకటామ్నాయ విభాగుడే నుడివె నాద్వైపాయనుం డివ్విధిన్
   శుకయోగీంద్రున, కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద ఱుప్పొంగగన్

   [భీష్ముఁడు = శివుఁడు]

   తొలగించండి
 18. అకళంకంబగు భారతమ్ము ప్రభలన్నాద్యంతమున్ పొగడగా
  నొకడే చాలునటంచు వ్యాసముని తానొప్పారగా వ్రాయగన్
  సకలమ్మున్ పులకించె నుర్విజనముల్ సంతోషమున్ చెందగా
  శుకయోగీంద్రునకల్లుడయ్యెగద భీష్ముండందరుప్పొంగగన్
  అల్లుడయ్యె గద= శుకయోగీంద్రుణి అల్లుకు పోయాడు
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 19. చకితమ్మగు నీ పలుకులు
  ప్రకటింపగ సత్యదూరప్రాలపము తా
  నకటా భీష్మ ప్రతిజ్ఞుడు
  శుక యోగికి నల్లుడయ్యె సురనదికొడుకే
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 20. శకలక బేబీ యనుచును
  వికటపు గెంతులను వేయు భీరువు నడగన్
  తికమక పడుచును చెప్పెను
  శుకయోగినల్లుడయ్యె సురనది కొడుకే.

  రిప్లయితొలగించండి
 21. అకలంకుండని దెలియన్
  ప్రకటించెను తోటి నటుని వరునిగ సుతకున్
  సకలురనిరి గత నాటక
  శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే!

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. అకళంకునకు వినుతులివె,
  సుకృతుడు ద్రుపదునకు క్రీడి సొంపుగ నెవడౌ?.
  నిక కురువృద్ధు౦ డెవ్వడు?
  శుకయోగికి,నల్లుఁడయ్యె.సురనది కొడుకే.

  రిప్లయితొలగించండి
 24. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  ప్రయాణంలో ఉన్నాను. అందుకే స్పందించడం లేదు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 25. నికముగ వ్యాసు డెవరికి జ
  నకుడు ?ద్రుపదరాజునకిల నరుడేమగునో
  యి ?కురుపితామహుడెవ్వరు?
  శుకయోగికి, నల్లుడయ్యె, సురనది కొడుకే!!!

  నికము= సత్యము, నరుడు= అర్జునుడు

  రిప్లయితొలగించండి
 26. అకలంకుండని స్వానుభూతిఁ గని కల్యాణమ్ముఁ జేయంగఁ దా
  ప్రకటించెన్ నట నానువర్తి సుతకున్ ప్రాణేశుఁడౌనంచు ప్రే
  క్షక సందోహపు నాటకానుగత వాఖ్యానమ్ములిట్లుండునే
  శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్!

  రిప్లయితొలగించండి


 27. సకలము దెల్పెను వ్యాసుడు

  నకులుండేవరుసగు నాద్రుపదునకున్

  నకళంక చరితు డెవరన

  శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే.

  రిప్లయితొలగించండి
 28. స్థిరముగ షేక్స్పియరు బొమ్మ
  నరసిన నాతని మొగంబు నచ్చదు మనకున్;
  విరివిగ వచనము లెందుకు?
  విరసంబగు; రచన యొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదం మూడవ గణం జగణమయింది. బేసిగణంగా జగణం రాకూడదు కదా!

   తొలగించండి
 29. అకటా! కైపద మెట్టి ఘాతుకమహో! హైరాన గావించెనే!
  వికలమ్మాయెను నాదు మానసమయో వీర్యమ్ము గోల్పోతినే!
  సకియా! భార్యలు లేనివారలిలలో సారూప్య మొప్పారగా
  శుకయోగీంద్రున కల్లుఁడయ్యెఁ గద భీష్ముండందరుప్పొంగగన్!

  రిప్లయితొలగించండి