డా. సీతా దేవి గారు మీ పూరణ తప్త కాంచన భూషణము వలె ప్రకాశించుచున్నది. కరుణాసింధో (సంస్కృత సంబోధనా పదము) తో మరింత తనరారు చున్నది. అలాగే దీన బంధు విషయములో “దీన బంధూ” లేక “దీన బంధుడ” సంస్కృత సంబోధనా పరముగా నయితే దీన బంధో” లు సాధువులు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు. డా. సీతా దేవి గారు ధన్యవాదములు. మీ పూరణల మీద నా వ్యాఖ్యలు మీకు వ్యాకరణ విశేషముల నుత్సాహము కలిగించుటకే కాని యన్యథా కాదని గ్రహించ మనవి.
పోచిరాజు వారి ప్రేరణ తోడ సర్వ లఘు తేట గీత ప్రయోగం తప్పులు ఆర్యులు సూచించి మార్గము సుగమము చేయ వలయును కందమందు రెండు చోట్ల గురువులు తప్పని సరి. అందుకే గీత నేన్నుకొన్నాను. తగురీతిగా సలహా లీయగలరు
అరదము బువిన దిగబడి అణగి నడక చెడెను,దరమున హయముకు చెరపు కలిగె, మరణ మురజపు వినుకులు మరల మరల చెవుల వినబడె , గతమున చెడునడకల ఫలితమిది గద, గిరిధర బయిసి నిడుము యనుచు రవిసుతుడు పడెను దనువు వదలి.
రామమోహన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నాల్గవ పాదంలో మూడవ గణంగా భగణం వేశారు. అక్కడ నలము కాని జగణం కాని ఉండాలి కదా! "వరదుడు హృదయాపహారి..." అందామా?
అరవిందానన మాధవ!
రిప్లయితొలగించండిమురళీధర! దీనబంధు! మోహనరూపా!
కరుణాసింధో! ననుగా
వరయని ద్రౌపది పిలచెర వరలుచు సభలో!
వగచుచు సభలో యని చదవ ప్రార్ధన!
తొలగించండిబాగున్నది!
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. సీతా దేవి గారు మీ పూరణ తప్త కాంచన భూషణము వలె ప్రకాశించుచున్నది.
తొలగించండికరుణాసింధో (సంస్కృత సంబోధనా పదము) తో మరింత తనరారు చున్నది. అలాగే దీన బంధు విషయములో “దీన బంధూ” లేక “దీన బంధుడ” సంస్కృత సంబోధనా పరముగా నయితే దీన బంధో” లు సాధువులు.
పూజ్యులు కామేశ్వరరావుగారికి శతాధిక వందనములు! మీ ప్రశంస యొడలు పులకరింపజేసినది! కృతజ్ఞతాపూర్వక నమస్సులు!
తొలగించండిజ గణము కొరకు దీనబంధు యని వ్రాయవలసి వచ్చింది! దీనబంధో యని సంబోధన పూర్వకమైతేనే బాగుండేది!
ఇంకను విద్యార్ధిదశలోనే యున్నానుగదా!
ధన్యవాదములు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి“దీనవరద” అనండి బాగుంటుంది. అలాగే “పిలిచెర”
తొలగించండితప్పక సవరిస్తాను!🙏🙏🙏🙏
తొలగించండిఅరయగ మురళీధర! నీ
రిప్లయితొలగించండివరమదియే! చెరచకు పరపతి దయతోడన్!
కరుణించుము! పోరెద నీ
సురనది తనయుడను నేనె సుఖముగ కనుమా!
శాస్త్రిగారు బాగున్నది ఒకే పాదములో మూడు పదాలు మీకు వందనములు
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిసూర్యకుమార్ గారు ప్రశంసించినట్లు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
నమో నమః శంకరయ్య గారు, సూర్యకుమార్ గారు!
తొలగించండిఅరయ కౌరవ ద్యూతమే యరణి కాగ
రిప్లయితొలగించండిచిచ్చు చెరలాడె ద్రౌపది చీర లాగ
పరమ చండగదాధర ప్రతిభ కాల్చ
పాపము రణమందు నశించె పాండు భాత్ర!!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్యనారాయణగారు విచారింప నవసరము లేదు.అప్పములకు బదులు నీళ్ళని తీసుకుంటే మీ పూరణ మప్రతిహతమే.
తొలగించండిఅరయగ విరటుని కొలువున
రిప్లయితొలగించండిధర నేలెడి ప్రభువె యైన ధర్మజు డనగా
మురహరి కృపతో నాలుగు
చెరగుల మౌనము గనుండి శ్రేయము నొందెన్
అక్క గారు నమస్కారము ధర అన్యార్ధము ???
తొలగించండిఅక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
సూర్యకుమార్ గారూ,
ఈరోజు 'ధర' శబ్దాన్ని పెక్కురు స్వార్థంలోనే ప్రయోగించారు.
(ఉత్తరాయణసమయంలో దర్శనమిచ్చిన శ్రీకృష్ణునితో శరతల్పగతుడైన భీష్ముడు)
రిప్లయితొలగించండిఅరతెరచినకన్నులతో
చెరవిడిపింపగ దలచుచు జేమోడ్చుచు నో
మురళీమోహనరూపా!
ధరపై వేచితి,శుభాంగ!ధన్యుడ నైతిన్.
బాపూజీ గారు నమస్కారము దత్తపది అన్యార్ధములో ఉపయోగించ వలెనని నా అనుమానము
తొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిపద్యం బాగున్నది. కాని దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్న నియమాన్ని గమనించనట్టున్నారు.
అన్యార్ధం అన్న విషయము గమనించలేదండి.ఇలా సరిచేశాను.
తొలగించండిఅరవిందనయన!కృష్ణా!
చెరలాడితి నీబ్రతుకున చేతోగతితో,
మురళీమోహనరూపా!
గిరిధర!ముక్తునిసలుపుము,కేలున్ మోడ్తున్.
డా.పిట్టా
రిప్లయితొలగించండి*అర*కొర పరిపాలన ముం
*చెర* కొంపల, ధర్మనిరతి జిక్కని వ్యథ ము
న్నెరుగగ శుకయోగీంద్రా
*ధర*నిగళిత కథన*ముర!*యుదార చరితమౌ!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా ధన్యవాదాలు.
(అర)మరలు లేక చె(చ్చెర)
రిప్లయితొలగించండికురుపతి!సంధించ గలుగు కూరిమి కిలలో
(ధర)కట్టలే(ము ర)ణమిట
సరియైనది కాదటంచు శౌరి వచించెన్.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
అరదపు చక్రము దిగె వసు
రిప్లయితొలగించండిధ రణ మిది వదలుము శరము దయ వలదిక చె
చ్చెర కర్ణునిపై విజయా
మురకము గతియించి యముని ముంగిట వాలన్.
అర ధర చెర ముర పదములు
తొలగించండివరుసగ పాదముల మొదలు
పరుగులు దీయన్
సరసమగు కంద పద్యము
మెరియుచు వ్రాసితిరి మీరు మిస్సన్నన్నా!
మిస్సన్న గారు నమస్కారము . శివునకు మూడు నేత్రములు లాగ మీరు, శాస్త్రి గారు, పోచిరాజు వారు శంకరాభరణ కన్యకు కన్నులు కొట్టు చున్నారు ధన్యవాదములు
తొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
జి.పి.శాస్త్రిగారికి,కృష్ణసూర్యకుమార్గారికి ధన్యవాదములు. మీపద్యాలుకూడా మవోహరంగాఉండి అలరిస్తున్నాయి.
తొలగించండిగురువుగారికి ధన్యవాదాలు.
తొలగించండిఅరఁటాకుఁ బోలు నూర్వశిఁ
రిప్లయితొలగించండిబరువము వడ్డించ వలచి వచ్చెర నరుఁడా!
మురఁకాడవౌదు వేల? య
ధర సుధలూరు జవరాలిఁ దాకఁగఁ దగవా?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మహిమగల యరంగమములన్ని నిర్వీర్య
రిప్లయితొలగించండిములగుచుండె మరణ మురజ ఘోష
నాదు వీనులకున్విన బడుచుండె ధరణీ
సుoడు సారధి యయ్యె, శోభ తోడ
రణభూమిలోన అరదమును రయముగ
నడుపగ నా పాండునంద నుండు
శత్రుసంహారమ్ము న్సలుపు చుండగా
శల్యసారధ్యము సంశయంబు
గలుగు చుండెను మదిలోన, గెలుపు కోరి
పాండవులు సారధిగ నాకు పంపి యుండ
వచ్చు, చెరపు నితడు చేయ వచ్చు ననుచు
సూత పుత్రుడు వగచెను శోభ తప్పి
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరణీసురడు'...?
అరయుము శ్రీహరి కృష్ణా!
రిప్లయితొలగించండిచెరచెర రావేల నాదు చింతనుదీర్చన్
మురభిదుడ మకరి బట్టెను
గిరిధర కరుణించుమయ్య గిడిగిళ్ళివియే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారు సవరణ చేసిన పాదము తో మరల
రిప్లయితొలగించండిమహిమగల యరంగమము లన్ని నిర్వీర్య
ములగుచుండె మరణ మురజ ఘోష
నాదువీనులకు న్వినబడుచుండె ధరణo
బాయెను సారధి పదవి హరికి,
రణభూమిలోన అరదమును రయముగ
నడుపగ నా పాండునంద నుండు
శత్రుసంహారమ్ము న్సలుపు చుండగా
శల్యసారధ్యము సంశయంబు
గలుగు చుండెను మదిలోన, గెలుపు కోరి
పాండవులు సారధిగ నాకు పంపి యుండ
వచ్చు, చెరపు నితడు చేయ వచ్చు ననుచు
సూత పుత్రుడు వగచెను శోభ తప్పి
అధరము లదరఁగ మురముర
రిప్లయితొలగించండివిధమున ములుగుచు దలచెర బిసరుహ నయనుం
గుధర ధరు ద్రుపద విభు సుత
విధికృత మరయ విఫల మయి వినయముగ మదిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ సర్వలఘు కంద పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
సర్వలఘు కందం మాకు కొత్త ప్రయోగము! అద్భుతము!!👏👏👏👏🙏🙏🙏🙏
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిడా. సీతా దేవి గారు ధన్యవాదములు. మీ పూరణల మీద నా వ్యాఖ్యలు మీకు వ్యాకరణ విశేషముల నుత్సాహము కలిగించుటకే కాని యన్యథా కాదని గ్రహించ మనవి.
అయ్యో యెంతమాట! మీవంటి పెద్దలు శ్రద్ధ తీసుకొని సవరించడము మా అదృష్టము'!
తొలగించండిఒక అధ్యాపకురాలిగా నేను నిత్యవిద్యార్ధినే!
మీ సూచనలమూల్యము!🙏🙏🙏🙏
కుధరముల్ రెండు డీకొను విధము ,రజని,
రిప్లయితొలగించండిభీమ కీచక పోరు పెంపెసగె గాని
అరచుటకు వీలు లేక వారిరువు రకట
తోచె రసితము లేనట్టి దురము వోలె
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
అరకొర నిధులతో నభివృద్ధి పనులెట్లు
రిప్లయితొలగించండి.....లంచాల బరిలోన రక్ష యెట్లు
చెరచు వారిని బట్టి శిక్షింప కది యెట్లు
.....మంచి వారల కిట మనుగ డెట్లు
ధరణాల సమ్మెల తగ్గించు టది యెట్లు
.....తెరచాటు పనులకు తెరపి యెట్లు
మురళించు నేతల మురడించు టిక యెట్లు
.....రాజకీయాలలో రాణ యెట్లు
నల్లడబ్బు లేదను మాట నమ్ము టెట్లు
చీకటిబజారు మనుషుల చెండు టెట్లు
ఇట్టి దుస్థితి నరికట్టి యిలను పెంచి
ఘనత భారతార్థమ్మును గాచు టెట్లు.
మిస్సన్న గారూ,
తొలగించండిభారతార్థం అంటే భారత(దేశ) ప్రయోజనమనే అర్థాంతరంతో మీ సీసపద్య పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
నమోనమః
తొలగించండిమురళి ధరుండు కృష్ణునకు ముద్దులచెల్లి సుభద్ర నీకు తా నరయగ నీడు జోడు విజయా చనుమంచును నగ్రజుండుయౌ
రిప్లయితొలగించండిధరణి వరుండు పంపగను తద్దయు వేడుక పార్థడేగ బూ
చెర సమధూక మాలికల చెన్నలరారుచు రాగవల్లరుల్
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...నగ్రజుండు నౌ' అనండి.
రాజసూయానంతరము శ్రీకృష్ణునికి అగ్రపూజ జేయు సందర్భములోనిది
రిప్లయితొలగించండిఅరయగ ధరణిని గలుగరు
మురహరి సరియగు ప్రభువులు ముదమున చెలిమిన్
నరవర కడుగర పదముల,
చెరగున దుడువర ,సుమముల చెలువున గొలువన్!
పోచిరాజువారి ప్రేరణతో సర్వలఘు కంద ప్రయోగము! తప్పులు మన్నింతురు గాక!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ ప్రయోగాసక్తి మిక్కిలి ప్రశంసనీయము. ప్రథమ ప్రయత్నంలోనే సర్వలఘుకందాన్ని వ్రాసి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
గురువుగారికి ప్రణామాలు! ధన్యవాదములు! మీ శంకరాభరణ వేదిక అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తున్నది'!! అంతా గురుదేవుల ఆశీఃఫలమే!🙏🙏🙏🙏
తొలగించండితానరణ్యమునఁ బడిన తాపములను
రిప్లయితొలగించండితెలిపి మురరిపువునకును తెల్లముగను
యుద్ధ రంగమునకు చన సిద్ధమయ్యె
భీమసేనుడు చెచ్చెర వీకతోడ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయ నధరమున మురళి నాట్యమాడ
రిప్లయితొలగించండిచెరగు లూడగ వనితకు సేమ మొసగి
( లేదా )
( చీరలిడి గాచి జెచ్చెర చెల్లెలికట )
నరదమును తోలె క్రీడికై యనిని నాడు
యెవ్వడన విజ్ఞులయ్యది యెరుగ బోరె !
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. "మురళీ యాటలాడ" అందామా?
పోచిరాజు వారి ప్రేరణ తోడ సర్వ లఘు తేట గీత ప్రయోగం తప్పులు ఆర్యులు సూచించి మార్గము సుగమము చేయ వలయును కందమందు రెండు చోట్ల గురువులు తప్పని సరి. అందుకే గీత నేన్నుకొన్నాను. తగురీతిగా సలహా లీయగలరు
రిప్లయితొలగించండిఅరదము బువిన దిగబడి అణగి నడక
చెడెను,దరమున హయముకు చెరపు కలిగె,
మరణ మురజపు వినుకులు మరల మరల
చెవుల వినబడె , గతమున చెడునడకల
ఫలితమిది గద, గిరిధర బయిసి నిడుము
యనుచు రవిసుతుడు పడెను దనువు వదలి.
బయిసి = దయ
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ సర్వలఘు తేటగీతి చక్కగా ఉంది. అభినందనలు.
"బయిసి నిడు మ।టంచు రవిసుతుడు..." అనండి.
బయిసి నిడు (మటంచు) మరల గురువు వస్తోంది గురువు గారు
తొలగించండిఅరదము భువిలో కృంగె బ
రిప్లయితొలగించండివరమున్నాపుము రథమును బైకెత్తెద శ్రీ
ధర! యని కర్ణుండడిగిన
నరసియు గురిపించె రథికు డతి శస్త్రములన్
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరవిందాయతనేత్రా !
రిప్లయితొలగించండిమురళీధర ! కృష్ణ ! విశ్వమోహన ! నను గా...
వర ! యనుచును దలచుచు బిలి...
చెర సభలో ద్రుపదతనయ చింతాకులయై !!
శ్రీకృష్ణుని జూచిన రారాజు....
అరయన్ కన్నులు మూసియుండెనిది నిద్రా? లేక మాయావి తా
గురకన్ బెంచె రవమ్ము , నన్ గనగ సంకోచమ్మొ ? పార్థుండు రాన్
జరిగెన్ ప్రక్కకు లేచినట్లు ! తొలుతన్ శస్త్రాస్త్రముల్ గోరగా
వరమిచ్చెన్ మురళీధరప్రథితుడున్ వాత్సల్యమేపారగన్ !!
"అర - చెర - ధర - ముర"
తొలగించండి.....(భారతము)...
మురళీకృష్ణుడ నీదు పద్యములు మామూలున్ గనున్నుండవో
చెరచెన్ నాదు మనస్సు నీ దినము నాచేతన్ రచించెన్నహో
ధరణీ వల్లభుడేను నా మదికి నాధారమ్మవున్ గాడొహో
నరవన్ భారతమాత నేడు నను గానంగా మహాక్రుద్ధయై
😊😊😊
...ప్రభాకర శాస్త్రి
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అర విరిసిన కమలాక్షియు
రిప్లయితొలగించండిమురియుచు నగధర రథంబు ముచ్చట జేరన్
చెరగుల పరుగిడె భయమున
ధరణీశులు రుక్మి హితులు తమలము నందున్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅరదము నెక్కి మురరిపువు
పరచిన మార్గము నటించి పార్ధుడు పోరున్
జరుపుచు ధరణీశుల నట
శరములతో నొంచె రగులు చండము తోడన్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
చెరపట్టి వలువలూడ్చగ
ధరణీశు డరమర లేక దర్పంబున; చె
చ్చెర నను కాపాడమనుచు
మొర వెట్టెను ద్రుపద తనయ మురళీ
ధరునిన్.
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరచె రమణి దుశ్శాసను
రిప్లయితొలగించండిగరకు కరముల దన కురుల గైకొని లాగ
న్నరములు త్రెగు బాధ సయిచి
తెరగుకు నధరము రమాపతిని స్మరియించెన్
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయఁగ బంధుల గురులన్
రిప్లయితొలగించండిమురహర! యుద్ధమున జంపఁ బూనఁగ లేన
న్నరునకు బోధించె రణమె
శరణ్యము ధనుర్ధర! రథి !సాగుమటంచున్! !
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...జంపఁ బూన ననఁగ నా। నరునకు..." అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండిఅరయఁగ బంధుల గురులన్
మురహర! యుద్ధమున జంపఁ బూనఁననఁగ నా
నరునకు బోధించె రణమె
శరణ్యము ధనుర్ధర! రథి !సాగుమటంచున్! !
రిప్లయితొలగించండిధరణీపతి బావమరిది
మురకుండై సుదతిని గని మోహముతోడన్
చెరచెర నర్తన శాలకు
నరయుచు నేతెంచె తాను నాయువు మూడన్.
అరయుచు కనలుచు కవ్వడి
చెరచెర సైంధవునిబట్టి శిక్షించంగా
ధరలో..నావే శముతో
మురహరుడు నడుప రథమును మునుమును సాగెన్.
పాండు సుతుల నరయ పంపగ రారాజు
ధరను మల్లు డొకడు తాను రాగ
చీల్చె వాని యురము చెచ్చెర భీముడు
మురకటించి వాని మూలద్రోసె.
అరమరికలేల చెలియా
ధరణీరాజ్యం బొసగెద దరికిటు తరుణీ
చెరచెర రమ్మిటు నీకిక
మురకమ్మదియేల బాల మురిపించగదే.
అరయగరమ్మా యోముర
హర కాపాడుజగదీశ యనవరతంబున్
చెరలో మ్రగ్గగ జాలము
ధరణీధరకావుమయ్య దయతో మమ్మున్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో "శిక్షింపంగన్" అనండి.
అరమరికలేని రుక్మిణి
రిప్లయితొలగించండిమురళీధరపాణిగోరి మురిపెము కాగన్
చెరవిడిపించగవచ్చెను
వరదుడు మానస చోరుడు వరియింపంగన్
రామమోహన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో మూడవ గణంగా భగణం వేశారు. అక్కడ నలము కాని జగణం కాని ఉండాలి కదా! "వరదుడు హృదయాపహారి..." అందామా?
ధన్యవాదాలండి. కృతజ్ఞతలు..
తొలగించండిమరొక పద్యం చూడండి...
మధురన్చెరవిడి మహిమను
మధురంబుగ యదుకులంబు మాధవుడెదగన్
వధియించెను కంసునరగి
మధుమురళీధర మురారి మగధీరుండై