11, జులై 2017, మంగళవారం

సమస్య - 2408 (చెడు పనియె సుమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట"
(లేదా...)
"చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్"
(శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలతో...)

89 కామెంట్‌లు:

 1. నల్ల మార్కెటు వర్ధిల్లు గుల్లగొట్టి
  గడుసరులు గుడుంబము నమ్మి చెడిచెదరొహొ
  చేతగాని పనుల నెప్డు చేయ రాదు
  చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్ సమూహంలోని వ్య్హాఖ్యను గమనించండి.

   తొలగించండి
 2. బడులకు పోవనెంచరిక పబ్బుల మబ్బులు క్రమ్మె సంస్కృతిన్
  గడగడ త్రాగుటే ఘనము గౌరవమై చెలగంగ, పూరుషుల్
  పడతులు వేరు వేరనెడి భావము లేకయె త్రాగు వేళలో
  చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్!!

  రిప్లయితొలగించండి
 3. జనుల ప్రాణములు నిలుపు, చాన తాళి
  బొట్టు పైబడు కన్నీటి బొట్లు తుడుపు
  సతులు మెచ్చెడి కార్యము సతతము తల-
  చెడు పనియె సుమ్ము మద్యనిషేధ మిడుట!!

  రిప్లయితొలగించండి
 4. నేటి తారల గాంచిన మేటి సొగసు
  సుధను గ్రోలుచు చిత్రముల్ జూజి నంత
  స్వర్గ సౌఖ్యము లెన్నెన్నొ స్వాగ తించ
  చెడుపనియె సుమ్ము మధ్య నిషేధ మిడుట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అక్కయ్యా,
   ఇప్పుడు చూస్తే నాకే నవ్వు వస్తోంది. అప్పుడు ఏ ఆలోచనలో ఉన్నానో... అలా వచ్చింది.
   (ఆ... గుర్తుకు వచ్చింది.. పాత సమస్యలను, వాటి పూరణలను సంకలనం చేస్తున్నాను. ఆ సమయంలో మీ పూరణలను, వాటిపై నా వ్యాఖ్యాలను చూస్తున్నాను. ప్రారంభంలో మిమ్మల్ని అలాగే సంబోధించాను కదా! అవి చదువుతున్న మూడ్‍లో ఉండి...

   తొలగించండి
  3. అలా పిలిస్తె నాకు అస్సలు అరగదు.
   అవునూ! అసలు నాపద్యాలు ప్రింటబుల్గా ఉన్నాయా అని. ? ఉంటే అదృష్ట వంతురాలిని . చిన్నప్పటి నుంచీ ఛందస్సుతో పద్యాలు రాయాలన్నకోరిక మీ దయవల్ల కొంత నెరవేరింది. ఇంకా చాలా నేర్చుకోవలసింది ఉంది. బహుస అందుకెనేమొ ఆస్పత్రినుంచి తిరిగి వచ్చాను. ధన్య వాదములు .

   తొలగించండి
 5. తాగి చీత్కారమొనరించు ధర్మ మనిన;
  తూగి తనవారి మర్యాద తొలగజేయు;
  మద్యపాయిల నందర మంచిగ మల
  చెడు పనియె సుమ్ము మద్యనిషేధ మిడుట.

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందరికీ శుభోదయం !
  చాలా కాలమైనది కలసి !

  అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  మద్య నిషేధమును మెచ్చే వారే గదా మగువ లన !
  (త్రాగుబోతు మహిళలకు వర్తించ దేమో మరి )

  01)
  _________________________________

  నడవడి చెడ్డనౌ మెదడు - నాశపు పాయిల కట్టు గట్టి కా
  చెడు పనియౌను మద్యము ని - షేధ మొనర్చుట ! మెచ్చ రంగనల్
  తడబడు త్రాగుబోతులకు - దాస్యము సేయగ భర్తగా ! నిలన్
  కడుపున బుట్టినట్టి కొడు - కైనను , భ్రాతను , జన్మ కారకున్
  చెడు సహవాసమున్ మరిగి - శీధువు త్రాగెడు వారి నెవ్వరిన్ !
  _________________________________
  పాయి = తాగుఁబోతు

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  మిడుకుటగును"రాజును భూమి మీద నేను
  కాకపోతిని; రాజునాఘడియ ద్రాగ"
  పామరులు, పండితులును యీ భ్రమల జెలగ
  చెడుపనియె సుమ్ము మద్య నిషేధమిడుట!

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  పడిపడి యార్భటమ్ములను పాటిగ నెంచుచు మంచి పేరుకై
  ఎడనెడ కొన్ని కర్మలను యింపుగ జేయ బ్రసిద్ధి దక్కునే?
  "గడగడ ద్రాగు వాడతడు గాద"న నూరక బేరుజేసికోన్;
  చెడుపనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చరంగనల్!
  (చెడు లేని చోటు లేదు.అదిఉంటేనే మంచి యెంచబడుతుంది.నాపతి త్రాగుబోతు కాడన్న పేరు గొప్పది.నిగ్రహం పాటించే పతినిగొనిన సతీమణుల సంఖ్య పెరగడమే అసలైన సంస్కరణ అన్నధ్వనితో)

  రిప్లయితొలగించండి
 9. ఆర్యా
  మొదటి పూరణలో ఆ కించిత్కాల భ్రమ జోలికి పోకుంటే ,ఆ నిగ్రహముంటే ఆదాయానికి గండిగొట్టే మద్యనిషేధం యొక్క ఆవశ్యకత ఉండదని భావము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'కర్మలను+ఇంపుగ = కర్మల నింపుగ' అవుతుంది. యడాగమం రాదు. *"కర్మలనె యింపుగ"* అనండి.

   తొలగించండి
 10. ఇల్లు గుల్లయు కాదు యోచించిచూడ.
  ధనము సమకూరు మర్యాద దరికిఁజేరు.
  మంచిఁగూరుచు నిజముగ నంచు మది, తల
  చెడు,పనియె సుమ్ము మద్యనిషేధమిడుట

  రిప్లయితొలగించండి
 11. డా.పిట్టా
  ఆర్యా,ఆన్లైన్లో ఒక సాహిత్య పరీక్ష ఉదా:ఒక పద్యం చదివి ,దాని భావాన్ని బ్లాగ్ ద్వారా సరియైనదన్న సమాధానరాకుంటే కంప్యూటర్ సారా బాటిల్ యివ్వదు.ఈ ప్రోగ్రాం తో సాహిత్య ఆస్వాదన పెరిగితే ఆ ఆనందం బాగు అనే భావన పెంపొందుతుంది.ఆనంద మార్గం తెలియక మద్యపానం నానాటికి పెరుగుతున్నది.ఎక్కువగా పద్యాలే ఉంటే అలనాటి ప్రాచుర్యం సాహిత్యానికి వస్తుంది.ఆ దిశలోనే సాగుతున్న మీ యజ్ఞము అభినందనీయము.

  రిప్లయితొలగించండి
 12. మానవుని దానవునిగ మార్చునిదియె
  నేస్తమా! మద్యపానము నిజముగ నది
  చెడుపనియె సుమ్ము , మద్య నిషేధ మిడుట
  క్షేమకరము లోకహితము శ్రీకరమ్ము

  బానిసై మత్తుకు మరచు బాధ్యతలను
  తాళినమ్ము, తుదకుతన యాలినమ్ము
  కాపురము గూల్చు మద్యమున్ గల్పమందు
  నిలువ రింపగ యొకటైన లలనలు తల
  చెడు పనియె సుమ్ము మద్యనిషేదమిడుట

  రిప్లయితొలగించండి
 13. హద్దులు మీరిన నేటి వ్యవస్థలో :

  02)
  _________________________________

  వడి గల కాలమిద్ది, గన - భార్యలు భర్తలు నేకమైయ్యహో
  చెడు సహవాసముల్ మరిగి - సీధువు గ్రోలుచు హుక్క బీల్చుచున్
  తడబడి నాట్య మాడుచును - తద్దయు ధర్మము వీడనాడుచు
  న్నడుసున బడ్డ పందు లటు - హైన్యము గా నిల పబ్బు లందునన్
  విడుచుచు శీల సంపదల - వీరిది వారిది యంచు నెంచకన్
  కడు వడి జోడు గూడెదరు - కప్పురగంధుల వీటిపట్టులన్
  పడుచుచు మత్తుమందులకు - బానిసలై చను నేటి నీతమున్
  చెడు పనియౌను మద్యము ని - షేధ మొనర్చుట మెచ్చ రంగనల్ !
  _________________________________
  వడి = వేగము
  సీధువు = శీధువు , మద్యము
  వీటిపట్టు = నగరము
  నీతము = నియమము ,కట్టుబాటు , వ్యవస్థ
  పడుచు = వ్యభిచరించు

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా !
  చిన్న సందేహం !
  ఏవి సరియైనవి?

  మద్యము + నిషేదము =
  మద్యపు నిషేదము
  మద్య నిషేదము
  మద్యము నిషేదము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'మద్యమ్' అకారాంత నపుంసకలింగ సంస్కృత శబ్దం. తెలుగులో ముప్రత్యయం చేరి మద్యము అయింది. సంస్కృత సమాసాలలో మద్యపానము, మద్యనిషేధము, మద్యపాత్ర, మద్యవిక్రయము, మద్యశాల ఇలా ఉంటాయి. మద్యము అనే తెలుగు పదాన్ని స్వీకరిస్తే పుంప్వాదేశాలతో 'మద్యపు నిషేధము, మద్యంపు నిషేధము' అవుతాయి.

   తొలగించండి
 15. మదిర పానమ్ము వలననే మహిమ గల్గు
  మృత సంజీవ నినినేర్పె ద్వైత గురువు
  నాడు కచునకు ,పరికించి చూడ నేడు
  "చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మృతసంజీవ' అన్నచోట గణదోషం. ద్వైత గురువు కాదు, దైత్య గురువు. సవరించండి.

   తొలగించండి
 16. ముఖ్యమంత్రి గారితో ఆర్థిక సలహాదారు:

  రాష్ట్ర విభజన తగ్గించె రాబడులిట
  నిప్పుడే మోయలేనన్ని యప్పులుండె
  కోలు కొనుదాక మనకది వీలుకాదు
  చెడు పనియె సుమ్మి మద్యనిషేధ మిపుడు

  రిప్లయితొలగించండి
 17. చెడుయని తెల్సియే భ్రుగుడు చేసెను సేవనమున్ గతమ్ములోన్,
  విడిచినచో కచుం డెటుల వేల్పుల కాచగలండు , కృష్ణుడున్
  చెడుయని తెల్సి గోకులపు సేనలు నాపిన వంశముండుగా,
  చెడుపని యౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చరంగనల్"

  రిప్లయితొలగించండి
 18. శంకరాభరణమ్మిదె శంకలేని
  మద్యపానమ్ము మధురాతి మధుర మోహొ!
  సుంకమన్నది లేదిట సుఖమె సుఖము
  చెడుపనియె సుమ్ము పద్యనిషేధ మిడుట

  ...సమస్యా పాదములో టైపాటు మన్నింప వలె...

  రిప్లయితొలగించండి
 19. విడుదల గాదె స్త్రీలకిక వేదన రోదన నుండి నిక్కమే
  నొడిదుడుకు ల్లనేకముల నోపి సుశీలముగా మనస్సు గె
  ల్చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట! మెచ్చ రంగనల్
  గడబిడ జేసి స్వార్థమున గాలిన దీపము బెట్టజూపినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిక్కమే। యొడుదుడుకుల్' అనండి. 'దుడుకుల్ + అనేకము' అన్నపుడు లకారద్విత్వం రాదు. అది కేవలం నకారానికే పరిమితం. "..యొడిదుడుకుల్ విశేషముగ..." అనండి.

   తొలగించండి
 20. చిత్తుగ గ్రోలి చీకుల జీకువారు
  మత్తున గ్రుంకి బాధల మరచువారు
  కుత్తుకలుగోసి ప్రాణుల గూల్చువారు
  గుత్తముగ మద్యదాసుల చిత్తము వగ
  చెడు పనియె సుమ్ము మద్యనిషేధమిడుట

  గుత్తముగ = నిశ్చయముగ, కచ్చితముగ
  శబ్దరత్నాకరము( బహుజనపల్లి సీతారామాచార్యులు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చిత్తుగన్ గ్రోలి... మత్తునన్ గ్రుంకి..." అనండి. లేకుంటే గణదోషం.
   (మొన్న అన్నయ్య గారు ఆశ్రమానికి వచ్చి కాసేపు ముచ్చటించి, సత్కరించి వెళ్ళారు. మాటల్లో మీ ప్రస్తావన కూడా వచ్చింది).

   తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు! అన్నయ్య ద్వారా మీ బ్లాగులో పరిచయమవడం చాల అదృష్టము! మాబోటి విశ్రాంత ఉద్యోగులకు సత్కాలక్షేపము! అన్నయ్య మిమ్ములను కలసినందులకు బహు సంతోషము!
   ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి
  3. చిత్తుగన్ గ్రోలి చీకుల జీకువారు
   మత్తునన్ గ్రుంకి బాధల మరచువారు
   కుత్తుకలుగోసి ప్రాణుల గూల్చువారు
   గుత్తముగ మద్యదాసుల చిత్తము వగ
   చెడు పనియె సుమ్ము మద్యనిషేధమిడుట

   తొలగించండి
 21. ప్రతిపక్ష నేతతో ఎన్నికల వ్యూహకర్త:

  పడయుము ఓటరన్నల యపార కృపానిధి పాదయాత్రలన్
  బడుగుల బాగుకైన మన వార్షిక రాబడి తగ్గియుండగన్
  చెడుపనియౌను మద్యము నిషేధమొనర్చుట మెచ్చరంగనల్
  తడవలుగా నిషేధమును తప్పక చేసెడు మాటనీయుమా

  రిప్లయితొలగించండి
 22. మద్యమును చేయుటకు ననుమతి నొసంగి
  సు౦కమును గొన ప్రభుతకు గొంకు లేదు
  గాన, మద్యము త్రాగుట మానుమనుట
  చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట

  రిప్లయితొలగించండి
 23. దేహ గేహ విత్తమ్ములు నాహుతి యగు
  మద్య పానానలము నందు మాన లాభ
  మందఱకు శ్రేయమగు, దీని నడ్డు కొనిన
  చెడుపనియె సుమ్ము, మద్యనిషేధ మిడుట


  అడుసది త్రొక్క నేల మరి యంఘ్రుల క్షాళన మేల వింతగం
  గడు కఠినమ్ము నైన నికఁ గల్లును గాచుట మాన్పనొప్పగున్
  వడి సృజియింప నొప్పుకొన బాడియె కావున మాన్పు సృష్టియే
  చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

   తొలగించండి
 24. చెడుయని మంత్రి పానపు నిషేధ మొనర్చిన మెచ్చి యంగనల్
  పడిపడి యోటులిత్తురని పద్ధతి లేకనె ఆజ్ఞనీయగన్
  కడచిరి నల్ల వీధులలొ కల్లును త్రాగిన వారు, కావునన్
  చెడు పనియౌను మద్యపు నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్...కోట శర్మ
  ప్రయత్నించాను. దోషములున్న తెలియజేయగలరు ������

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శివ శర్మ గారూ,
   'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెడుగని' అంటే బాగుంటుంది. 'వీధులలొ' అని లో ప్రత్య్హయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ "వీథులను' అనవచ్చు (షష్ఠ్యర్థంలో ద్వితీయ).

   తొలగించండి
  2. చెడుగని మంత్రి పానపు నిషేధ మొనర్చిన మెచ్చి యంగనల్
   పడిపడి యోటులిత్తురని పద్ధతి లేకనె ఆజ్ఞనీయగన్
   కడచిరి నల్ల వీధులను కల్లును త్రాగిన వారు, కావునన్
   చెడు పనియౌను మద్యపు నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్...కోట శర్మ

   తొలగించండి
 25. తప్ప త్రాగిపల్కెడు మాట తప్పుగాదు
  కావ్య సురలను గ్రోలుచు కవిత పొల్లు
  పడిన గణము, ప్రాస యతులు భంగ పడెను
  యనుచు పలుకవలదుసుమా ఆర్యు లెపుడు
  (నేను శంకరా భరణము మధ్య పానము చేయుచు శాస్త్రి గారికి గురువు గారికి క్షమాపణములతో సరదాగా వ్రాసిన పద్యము సుమా )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ సరదాపద్యం బాగుంది. "భంగపడె న।టంచు" అనండి.

   తొలగించండి
 26. పడతుల తాళి త్రెంపుచును పచ్చని కొంపల చిచ్చువెట్టు నా
  దుడు కుతనంపు మద్యమను దుష్టపిశాచికి మోకరిల్లుచున్
  పడిపడి దండముల్ నిడరె పాలకు లక్కట వారి యాశ ముం
  చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చరంగనల్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దండముల్ ఇడరె' అన్నచోట 'నిడరె' ఎలా వచ్చింది? అక్కడ "వందనా లిడరె" అందామా?

   తొలగించండి
 27. రేయి పవలును కష్టించి చేయినిండ
  ధనము సాధించియును మంచిదారి కనక
  మద్యముకు బానిసగు వారి మతి కనపరి
  చెడు పనియెసుమ్ము మద్యనిషేధమిడుట
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మద్యమునకు' అనడం సాధువు. 'మద్యముకు' అనరాదు.

   తొలగించండి
 28. ధన్యవాదములు శంకరయ్య గారూ. సవరించినందుకు చాలా సంతోషము. నేను మారుస్తాను.

  రిప్లయితొలగించండి
 29. పడతుల పుస్తెలమ్ముకుని భర్తలు మద్యము గ్రోలినంత యు
  గ్గడవుగ సంపదల్ పెరుగు, కాసులు రాల్చెడు కామధేనువున్
  విడుచుచు పాలకుండ్రిలను విజ్ఞతతో జన క్షేమమున్ దలం
  చెడు పనియౌను మద్యము నిషేధమొనర్చుట, మెచ్చరంగనల్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదాలు....మీ సూచన ప్రకారం
   జన సౌఖ్యమున్ దలం/ చెడు........అంటే సరిపోతుందనుకుంటాను గదండీ

   తొలగించండి
  3. ధన్యవాదాలు....మీ సూచన ప్రకారం
   జన సౌఖ్యమున్ దలం/ చెడు........అంటే సరిపోతుందనుకుంటాను గదండీ

   తొలగించండి
 30. క్రొవ్విడి వెంకట రాజారావు:
  గురువుగారికి నమస్కారములు. నేను గత మూడు రోజులుగా వేరే వ్యక్తిగత పనులలో మునిగి యుండుట వలన పూరణలు పంపలేదు. అయితే, వాటినిప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.
  09-07-2017:
  సరవిని గూడని కల్పన
  విరసంబగు; రచన యొప్పె వీనుల విందై
  విరివిగ మనోహరంబై
  యొరవగు నీతిని పరుచుచు నుద్దీపించన్
  10-07-2017:
  బాగుగ పఠియించుమురా
  భాగవతమ్మును; చదువుట పాపము సుమ్మీ
  ఆగమ ధర్మము లెంచక
  సాగెడి పుస్తకముల నిట సమ్మోదముతో!
  11-07-2017:
  సరకమునకై ధనము ఖర్చు బరచు టదియ
  చెడు పనియె సుమ్ము; మధ్య నిషేధ మిడుట
  పాటి గూర్చెడి చర్యయై పదురు గూడు;
  జనుల మేలు నాలోచించుటనఘమగును

  రిప్లయితొలగించండి
 31. సతిని కూతురు కొడుకుల సరకుగొనక
  సురభి గ్రోలుచు పనివీడి తిరుగునట్టి
  బడుగు వర్గాల చెడునల వాటును మల
  చెడు పనియె సుమ్ము మద్యనిషేధమిడుట

  రిప్లయితొలగించండి
 32. బడుగుల జీవితమ్ములిల బాగుపడంగ, సమృద్ధి నిచ్చ కాం
  చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట, మెచ్చరంగనల్
  విడిచిన, నోట్లుపొందగను ప్రీతిగ నేతలు చెప్పు మాటలన్
  చెడు వెస రాజకీయ ఘనజీవితముల్ లలనల్ చెలంగినన్

  రిప్లయితొలగించండి
 33. మద్యమే నేడు ప్రభుతకు మంచి తరువు
  కాయు నిత్యము కాసుల కరము పంట
  అన్ని పార్టీల నెన్నికలపుడు బ్రోచు
  చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట

  రిప్లయితొలగించండి

 34. పిన్నక నాగేశ్వరరావు.

  రోగములనిచ్చు,గొంపోవు రూకలన్ని

  మత్తు పానీయ మేదైన మనిషి గొనుట

  చెడు పనియె సుమ్ము ; మద్య నిషేధ
  మిడుట
  జన హితమ్మును కాంక్షించు సత్పథమ్ము
  .
  *****************************

  రిప్లయితొలగించండి
 35. ధనము పరువును కోల్పోయి పెనగులాడి
  దేహ మారోగ్యమున్ జెడి దీనుడవగ,
  భవితలో నిక వెతలేక పదుగురు నిల
  చెడు పనియె సుమ్ము! మద్యనిషేధమిడుట!

  రిప్లయితొలగించండి
 36. ఓ తాగుబోతు..😃
  త్రాగినంతనె యెనలేని ధైర్యమిచ్చు
  అకట కష్టాల కడదేర్చు నమ్మ గదర!
  గుండె లో బాధ దీర్చెడి గుమ్మ గదర!
  చెడు పనియె సుమ్ము మద్యనిషేద మిడుట!!

  2.కుడుతురమేరికాన నట!కుండలు కుండలు మద్యపానమున్
  చెడవట వారి మేనులవి శీతల దేశమునందు త్రావగన్
  పడతులు వారిపూరుషుల భ్రాంతి యొకింత యులేకనచ్చటన్!
  చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్

  రిప్లయితొలగించండి
 37. 9493846984  డా.బల్లూరి ఉమాదేవి.  మద్యపానము చెరచును మనుజు నెపుడు

  హాని గూర్చును సతతము నవని యందు

  చెడుపనియె సుమ్ము..మద్య నిషేధమిడుట

  సర్వసమ్మతమ్మిది ప్రజ సంతసింత్రు.


  మనిషిని మనసును చెరుపు మద్య పాన

  మేల?గొప్పని త్రాగిన నెల్ల పోవు

  చెడుపనియె సుమ్ము..మద్య నిషేధమిడుట

  నన్ని విధముల మంచిదటండ్రు బుధులు.


  కాపురమ్ములు కూల్చేటి కాలకూట

  విషము వంటి దీ మద్యము విశ్వమందు

  చెడుపనియె సుమ్ము..మద్య నిషేధమిడుట

  శుభకరమ్మని మెత్తురు సుదతు లెల్ల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మూడవ పూరణలో 'కూల్చేటి' అనడం వ్యావహారికం. 'కూల్చెడి' అనండి.

   తొలగించండి
 38. తడబడుచుండి నమ్ముచు ప్రధాని ప్రచార ప్రతిజ్ఞ లొప్పుగన్
  పడమర తూర్పునుత్తరము పన్నుగ దక్షిణమందు ప్రీతిగ
  న్నడుగడుకున్ కనంబడి ప్రయాసను దీర్చెడి కొట్లు మూయ బొ
  చ్చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్

  రిప్లయితొలగించండి
 39. జడియక తండ్రి తాతలకు జంకును గొంకును సిగ్గు వీడుచున్
  కడపటి రాత్రి వత్సరపు క్లబ్బున పార్టిని మందుగొట్టుచున్
  పడతులు భాగ్యనగ్రినిట భగ్గున మండుచు పల్కిరిట్టులన్:👇
  "చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట మెచ్చ రంగనల్" 😊

  రిప్లయితొలగించండి