15, జులై 2017, శనివారం

సమస్య - 2411 (పట్టుదల యున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు"
(లేదా...)
"ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో"

91 కామెంట్‌లు:

 1. మొట్టి కాయలు తినితిని గట్టి గాను
  కొట్ట గలడె శివుని విల్లు పట్టు బట్టి?
  శంకరుని దయ లేకున్న జయము లేదు;
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   గెలుపుకు పట్టుదలతో పాటు దైవకృప ఉండాలన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో
  కూరిమి గల్గియుండి కడు గొప్పలు జెప్పక నెంత మాత్రమున్
  పోరును సల్పకున్న పరిపూర్ణ సుఖంబులు గల్గునట్టులే
  కారణ మెద్దిలేక పరిఘంబుల వట్టిన నష్టమే గదా

  రిప్లయితొలగించండి
 3. కర్ణునితో శల్యుడు పలికిన పలుకులు:-

  తేరది భూమిఁ గ్రుంగె, గురుదేవుని శాపము చేటుఁ దెచ్చె నా
  తీరమునందు ఫల్గుణుఁడు తేజము హెచ్చెగ నిల్చె దానిపై
  సారథి కృష్ణుఁడుండె, మరి సాధ్యమె? నీవిక నాలకింపుమా
  యోరిమితోడఁ, బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   శల్యసారథ్యం అంశంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తేజము హెచ్చగ' అని ఉండాలి. అయినా 'హెచ్చగ' ప్రయోగం ఎందుకో వినసొంపుగా లేదు. "తేజము మీరగ" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. గురువుగారికి ధన్యవాదములు
   సవరణతో..
   తేరది భూమిఁ గ్రుంగె, గురుదేవుని శాపము చేటుఁ దెచ్చె నా
   తీరమునందు ఫల్గుణుఁడు తేజము మీరగ నిల్చె దానిపై
   సారథి కృష్ణుఁడుండె, మరి సాధ్యమె? నీవిక నాలకింపుమా
   యోరిమితోడఁ, బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో!!

   తొలగించండి
 4. కట్టు కధలను జెప్పుచు గట్టి గాను
  సత్య సంధుని వలెపల్కి సాహ సమున
  ప్రజ్ఞ లేకున్న బింకము ప్రాజ్ఞు డనుచు
  పట్టు దలయున్న జయముఁ జేపట్టు టెట్లు

  రిప్లయితొలగించండి
 5. నారదుడు విశ్వామిత్రునితో
  నీవు బ్రహ్మర్షిగా మార నిశ్చయించి
  భిన్నరీతుల తపముల నెన్నొ చేసి
  చపలుడవయి యోడితివి;యాచరణ లేని
  పట్టుదల యున్న జయము జేపట్టు టెట్లు?

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  కలిసిరాకనె కర్ణుడు కాలమహిమ
  నారు కారణములచేత ననిని గ్రుంగె
  జవము లాఘవములనున్న జనుడునయ్యు
  పట్టుదల యున్న, జయము జేపట్టుటెట్లు?

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   కర్ణుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. డా.పిట్టా
  భారత జాతి రత్నమన భాసిలు నేతయె లాల్బహద్దు రే
  పారగ నాధిపత్యమును బాయడె రైలుప్రయాణమంత్రియై
  వారధిగ్రుంగ, రైలుబడ వాసిన ప్రాణుల బాధ్యతన్ గనన్
  ఓరిమి తోడ బట్టుదల యున్న జయంబు లభించుటెట్టులో?!
  (T.S.లోని జనగామ చెంత నున్న యశ్వంత పుర వాగు పైని వారధి పడిపోయిన ఉదంతము.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   వసంతవాగు ప్రమాద ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   (ఒక సందేహం... ఈ వసంతవాగు అన్నది జనగామ సమీపంలో ఉన్నదా? లేక ఆలేరు ప్రక్కన ఉన్నదా? చిన్నప్పుడు ఆ ప్రమాదం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. మాకు మూడవ తరగతిలోనో, నాలుగవ తరగతిలోనో ఆ ప్రమాదం గురించిన పాఠం ఉంది. ఆ పాఠం చెప్పిన మాస్టారు రెండు విషయాలు చెప్పారు. సికింద్రాబాదులోని ఒక సంపన్నుడు రైలు తప్పిపోతే కారులో వేగంగా ఘట్కేసర్ స్టేషనుకు వచ్చి ఆ రైలును అందుకొని ప్రమాదంలో మరణించాడట! మట్టెవాడ హైస్కూల్ సైన్స్ మాస్టారు సైన్స్ లాబ్ పరికరాలు కొని తెస్తూ కొంత సామాను రైలెక్కించి మరికొన్ని ఎక్కించేలోగా రైలు కదలి ఎక్కలేకపోయాడు. ఆ విధంగా బ్రతికిపోయాడట!)

   తొలగించండి
  2. డా.పిట్టా
   ఆర్యా, మీరుదహరించిన కథనము నేను బాలునిగావిన్నాను.స్థలం:
   "ఎంత ఘోరమిది, ఎంత ఘోరమిది యసంతపురి వాగూ
   జనగాం చెంతనుండు వాగూ" అనేది పాడేవారు.మీరన్నట్టు ఆలేరుకు దగ్గరదే.అదిexpress train. జనగాం లో హాల్టు.జనగాం పేరుతోనే పాడుకుకున్నారు.వరద ఉద్ధృతి తీవ్రముకావచ్చు.అయినా ఆbridge ఎత్తు ఎక్కువ.195౦ దశకం లో జరిగింది.ధన్యవాదాలు.

   తొలగించండి
 9. తెలివి గుమ్మడి కాయంత, తెగువ పుచ్చ
  కాయ కన్న యధికమాయె,కాని లేదు
  ఆవ గింజెడ దృష్టము అవని లోన
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు"


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అదృష్టము+అవని' అని విసంధిగా వ్రాయరాదు. "అదృష్టమీ యవనిలోన" అనండి.

   తొలగించండి
 10. అలవిగాని సమయమున నధికమైన
  పట్టుదల యున్న జయము జేపట్టు టెట్లు?
  సరియగు తరుణమును జూసి జరుపఁ పనుల
  కలుగు విజయము భువిలోన కచ్చితముగ

  రిప్లయితొలగించండి
 11. కార్యసాధన కెంతయు కావలయును
  ప్రబలతరమైన కృషియు సౌభాగ్యగరిమ
  ఒడుపుగా దైవకృప గాని యొక్క మంకు
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు?

  నేను హైదరాబాదు వచ్చాను. మీ నంబరు మారినట్లుంది. కాల్ కనెక్ట్ అవటంలేదు.
  నా ఇండియా నంబరు 9897317215. మీ నంబరు, అడ్రసు ఇవ్వగలరు. వీలైతే తప్పక కలుస్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేమాని వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నన్ను కలవాలని ఆసక్తి చూపడం ఆనందాన్ని కలిగించింది. తప్పకుండా కలుద్దాం.

   తొలగించండి
 12. ఏకలవ్యుడు పూనిక నేకధాటి
  నేర్చెవిద్యలను మిగుల నేర్పుగాను
  గురువు గోరగ నంగుళి గోలు పోయె
  పట్టుదలయున్న జయముజేపట్టుటెట్లు?

  రిప్లయితొలగించండి
 13. నేను నేనన్న గర్వమ్ము మేను నిండ
  నింగియే నాకు హద్దని నేర్పు లేక
  మానవ ప్రయత్నమే చేయ మఱచి,యొట్టి
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు?

  రిప్లయితొలగించండి
 14. నా గురించే
  కోరుచు పద్యముల్ ఘనత కూడగ వ్రాసితి, పొందలేదుగా
  నేరుగ స్యోనమెప్పుడును, నీరస మొందిన నేమికల్గునో,
  తీరును మార్చగా వలయు, దీటుగ వ్యాకరణమ్మునంతయూ
  ధారణ చేయకన్ చిలిపి తప్పుల యల్లిక పూరణమ్ములన్
  మేరునగమ్ము లెప్పుడును మెచ్చగ లేవుగ పూసపాటి, నీ
  " ఓరిమి తోడఁబట్టుదల యున్న జయంబులభించు టెట్టులో"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   స్వవిషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్యోనము'..? "వ్యాకరణమ్ము నెంతయున్" అనండి.

   తొలగించండి
 15. గురువు గారికి నమస్కారములు స్యోనము = సంతోషము

  రిప్లయితొలగించండి
 16. దోర వయస్సునన్ వధువు తోడ వరుండొక పెళ్లి సందడిన్
  సారస నేత్రులందరును సంబరమందగ మేలమాడుచున్
  దీరుచు కేళిలో సరస దృష్టిని శ్రీమతి చేత నోడెడు
  న్నోరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో?

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పూర్తగు విధివిధానమ్ము పూంచకుండి
  నెఱియు నైపుణ్యతలు లేక నిలచి యుండి
  నూతనావిష్కృతిని జేయు నాతనికిట
  పట్టుదలయున్న జయము జేపట్టుటెట్లు?

  రిప్లయితొలగించండి
 18. పట్టు పట్ట రాదని దెల్ప పట్టు విడువ
  కూడదనిమురారిననిన కూర్మి తోడ
  పనులు చక్కoబడునని పలుక మoకు
  పట్టుదల యున్న జయము జేపట్టు టెట్లు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "చక్కంబడు నటంచు" అనండి.

   తొలగించండి
 19. చెట్టు నున్నటి ఫలమును చేత బట్ట
  పట్టుదల యున్న నయ్యది పట్టు బడునె
  గట్టి కృషి తొడ యత్నము కఱవు గాగ !
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు

  రిప్లయితొలగించండి
 20. కట్టి నట్టి పుట్టమ్మికఁ గట్ట నన్న
  మట్టి ముట్ట నెప్పట్టున మెట్టి నింట
  చుట్ట మెట్టి దిట్టగు మొట్ట వట్టి గట్టి
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు


  క్రూరులు వన్ను వ్యూహములు కుంభిని సత్ఫలితమ్ము లిచ్చునే
  వీరులు ద్రోణ భీష్ములు నభేద్యులు దుర్గతి జెందరే యనిన్
  ధారుణి కౌరవాన్వయులు ధర్మము దైవ బలంబు లేనిచో
  నోరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పదములు ముదమ్మునందిoచ పద్య కదన
   మందు మెదడును యడిదపు పొందు వోలె
   ముదలకిoచి మదిని దోచి మోదము నిడు
   యాధునికత పొందుపరచి హ్లాద వృష్టి
   బుధుల డెందమ్ము పై త్రోయు మధుర మైన
   నీదు సృష్టిని పొందెడు నేర్పు దాత్రి
   నందు కొలది మందికి కూడు సుందరముగ
   అందుకొనుము కామేశ్వర, వందనములు

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. పట్టుపుట్టము గోరగ పట్టదేమొ
   పుట్టినింటికి బంపుట వట్టిమాట
   పుట్టు కోపిష్ఠి యెప్పుడు బెట్టుజేయు
   పట్టుదలయున్న జాయ జేపట్టుటెట్లు?

   పూజ్యులు కామేశ్వరరావుగారికి, గురువులు శంకరయ్యగారికి క్షమార్పణలతో కేవలం సరదా కోసం వ్రాయబడినది!

   తొలగించండి
  4. అయ్యా కామేశ్వర రావు గారు:

   జయహో!!!

   ఒక విషయం చెప్పండి:

   నాకు తెలిసిన నాలుగైదు వృత్త పద్యపాదములన్నియు గురువుల తోనే అంతమౌతాయి. దీనికేదైనా ప్రత్యేక కారణమున్నదా?

   తొలగించండి
  5. శాస్త్రి గారు మీ పరిశోధనాసక్త మనస్సు చిందులు వేయడములో నాశ్చర్యము లేదు. మీరడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానము లేదు.
   బహుస సనాతన భాషాప్రవీణ/ ఉభయ భాషా ప్రవీణులు చెప్పగల రనుకుంటాను. ప్రస్తుత కళాశాలలో ఆంగ్లీకృతాంధ్రమే కనపడు చున్నది.
   అయిన నేను కనుగొన్న విషయములు చూడండి.
   ప్రతిష్ఠ ఛందపు లలిత వృత్తము 4 అక్షరములు, సర్వ లఘువులు.
   అనుష్టుప్పు ఛందపు నారాయణ వృత్తము 8 అక్షరములు, “ర త గల” తో చివర లఘువు.
   చంచల: 16 అక్షరములు, సర్వ లఘువులు

   అతివినయ: 17 ల 1గ; కనకలత: 20 ల 1 గ ; రమణకము: 28ల 1 గ;

   మా అన్న గారు భాషాప్రవీణ చదువు రోజుల్లో ఆయన ఛందస్సు చదువు తున్నప్పుడు నే నప్పు డప్పుడు వింటూ యుండే వాన్ని.
   వృత్తములు ఛందము బట్టి మొదట సర్వ గురువులు వేసి తరువాత యొక క్రమ ప్రకారము లఘువులు ఆదేశము చేసి వృత్త భేదములను కల్పించి నట్లు విన్నట్లు గుర్తు. అందు చేత చివర ప్రాయికముగా గురుశేష మయి యుండ వచ్చును.

   తొలగించండి
  6. వృత్తాలు సంస్కృత ఛందస్సులు. సంస్కృతంలో ఉన్న నియమం‌ ప్రకారం పాదమధ్యంలో ఒక విరామం (అది యతిస్థానం అన్నమాట) పాదాంతం‌ ఒక విరామం. సాధారణంగా వృత్తలక్షణాలన్నీ పాదాంతంలో గురువును కలిగి ఉంటాయి. ఐతే పాదాంతవిరామంగా మాత్రం లఘువు కూడా ఉండవచ్చును. ఒక ఉదాహరణ కోసం సౌందర్యలహరీస్తోత్రంలో మొదటి శ్లోకం చూడండి:

   శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్
   న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి
   అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి
   ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి

   ఈ శ్లోకంలో మొదటిపాదం తప్ప మిగతా మూడుపాదాలూ లఘువులతోనే పరిపూర్ణం అవుతున్నాయి.
   సంస్కృత వృత్తాల్లో పాదంచివర ఉన్న పదం పూర్తి అయితీరాలి. తరువాతి పాదంలోనికి కొనసాగకూడదు. తెలుగులో మాత్రం ఆసౌలభ్యం ఉంది. అలాగే సంస్కృతంలో యతిమైత్రి అంటూ లేదు - యతిస్థానంలో కొత్తపదం ప్రారంభం‌ కావాలి - యతి మైత్రి మనప్రత్యేకత. అలాగే పదాంతపద విరామం తెలుగులో నియమం కాదు. పాదంచివర సలక్షణంగా గురువు ఉండితీరవలసిందే. అది సాధించేందుకు అవసరమైతే చివరిపదం ఒక పాదం చివరినుండి మరొకపాదంలోకి చొచ్చుకుపోవచ్చును.

   తొలగించండి
  7. పూజ్యులు కామేశ్వర రావు, శ్యామల రావు గార్లకు నమోవాకములు.

   నా పని ఎలా ఉన్నాదంటే:

   మినీ స్విమ్మింగ్ పూల్ వరమడిగితే దేవుడు ప్రత్యక్షమై హుస్సేన్ సాగరు నంతా ఇచ్చినట్లయినది.

   ఊరుకోనుండదు గదా ఈ వక్ర బుద్ధి!

   🙏🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  8. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు (ముఖ్యంగా వృత్త్యనుప్రాసతో మొదటిది) అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   ఈరోజు కొంత ఛందశ్శాస్త్ర చర్చ జరిగింది సంతోషం.
   *****
   శ్యామల రావు గారూ,
   ఎంతో ఓపికతో శాస్త్రీయంగా వివరాలందించినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
  9. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
   కృష్ణసూర్య కుమార్ గారు వందనములు.
   డా. సీతా దేవి గారు బాగుంది మీ పద్యము.

   తొలగించండి
 21. ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో
  నేరుపుగా వచించి కడు నిర్మలమైన ప్రధాని పీవి తా
  ఘోరపు రూపులోన వెసకూలుచు నున్న వ్యవస్థ కాంచుచున్
  తీరుగ తెచ్చెమార్పులను దిద్దగ నార్థిక క్షోభ చెచ్చెరన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   ఆర్ధికక్షోభ వద్ద గణభంగమైనట్టుందండీ
   ఈ పాఠం పరిశీలించవలసిందిగా మనవి:

   ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో
   నేరుపుఁజూపడే కఠిన నిర్ణయముల్ గొని "మౌని" పీవి తా
   ఘోరపు రూపులోన వెసకూలుచు నున్న వ్యవస్థఁ బట్టియే
   తీరుగ తెచ్చి మార్పులను దిద్దెయె ఆర్ధికదుర్గతిన్ ధృతిన్
   భవదీయుడు

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
   మారము శంకరాభరణ మందున జేయక యెట్టిప్రొద్దునన్
   గారవమొప్ప నీస్థలిని కందలు నా.వెలు తేటగీతులన్
   గోరికతీర వృత్తములు కొన్నియు, మెచ్చగ వ్రాసినా రహో!
   ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టిట్టులే!
   🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  4. ఆర్థిక క్షోభ - పలికి నప్పుడు క మీద క్షో నుండి వత్తిడి లేదండీ. అందువలన క గురువు కాదనుకుంటాను.

   తొలగించండి
  5. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఆర్థిక క్షోభ' అన్నపుడు 'క' తప్పక గురువవుతుంది అది సమాసం కనుక.

   తొలగించండి
  6. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 22. పోరున రావణాసురుడు పొందుచు నుండెను కూలినట్టి కే
  నారములన్నియున్ తిరిగి నాశన మొందక. అమృతంబుతో
  చేరెను బాoడువం బొకటి, చెంతను కల్గగ ఓటమెప్పుడున్
  కూరుకొనంగ బోదు సుమి, కుక్షికి బాణమ్ము లెక్కుబెట్టగా
  మారక మున్గల్గు ననగ, పౌషము న్యాయము తోడజేయునీ
  శ్రీ రఘు రాముడంచు కపి శ్రేణుల వాంఛను కొట్టి వేయగా
  ఓరిమి తోడఁ బ ట్టుదల యున్నజయంబులభించు టెట్టులో

  యుద్ధములో రావనుడు అమృత భామ్డము పొట్టలో ఉన్న కారణమున తలలు తెగినా తిరిగి తిరిగి అతుకు చుండ పొట్టపై బాణము లెక్కు బెట్టమని సూచన లిచ్చిన తప్పు యనుచు యుద్ధము చేయ గెలుపు ఎట్లు కలుగు

  రిప్లయితొలగించండి
 23. ఓరిమితోడ పట్టుదలయున్న జయమ్ము లభించుటెట్టులో
  సారెకునంచు రిచ్చవడి సాధన చేయక నూరకుండినన్
  చేరగబోరు యున్నతిని చేతులు కట్టుకు కూరుచుండినన్
  చేరరు గమ్యమున్ గెలుపు చేతికి చిక్కదు లోకమందునన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 24. "క్రియా సిద్ధిస్సత్వే భవతి మహతాన్నోప కరణే"


  వారధి గట్టె రాముడొహొ! వానర దండుల చిందులెన్నకన్
  సారధి జూడబో తొడలు సైతము లేకనె సూర్యుడేగెనో
  మారుడు రూపమే విడిచి మానస మంతయు దోచుచుండడే...
  ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మారము శంకరాభరణ మందున జేయుచు కంది వారినిన్
   కారగ కంటి నీరములు కందలు నాటలు తేటగీతులన్
   కోరిక తీరనుత్పలము కొందరు మెచ్చగ వ్రాసితి న్నహా!
   ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో


   మారము, మారాము = teasing, annoying

   తొలగించండి
  2. మారము శంకరాభరణ మందున జేయుచు నెల్లవారినిన్
   గారవమొప్ప నీస్థలిని కందలు నా.వెలు తేటగీతులన్
   గోరికతీర వృత్తములు కొన్నియు, మెచ్చగ వ్రాసితి రహో!
   ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టిట్టులే!

   తొలగించండి
  3. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

   వ్రాసినారహో అంటానండీ
   మారము శంకరాభరణ మందున జేయుచు నెల్లవారినిన్
   గారవమొప్ప నీస్థలిని కందలు నా.వెలు తేటగీతులన్
   గోరికతీర వృత్తములు కొన్నియు, మెచ్చగ వ్రాసినా రహో!
   ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టిట్టులే!

   🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 25. అరయ బడులందు నొజ్జల కొరత గల్గె
  పాఠముల బోధపరుచంగ పంతులేడి
  పెద్ద చదువులు చదువంగ పిల్లలకును
  పట్టుదలయున్న జయము లభించుటెట్టు
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 26. జీవితంబున విజయము జేకొనుటకు
  వలెను తెలివితేటలు, గృషి, వాంఛ, విడని
  పట్టుదలయు, న్నజయము జేపట్టు టెట్లు
  నేర్వవలెను పాఠంబది నిక్కముగను

  (పట్టుదలయున్ + అజయము)

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. కొండలను పిండిజేసెడు కుంతిసుతుడు
  ధర్మమార్గము దప్పని ధర్మజుండు
  మరి పరాక్రమ వంతులు మాద్రిసుతులు
  వెన్నుదన్నుగ నుండగ , చెన్నుగాను
  సూత్రధారియె ముందుండ, సూతసుతుడ!
  విజయశంఖమ్ము పూరించు విజయు గనుమ
  యిట్టి వీరుల గెలువంగ వట్టిమాట
  పట్టుదలయున్న జయముఁజేపట్టుటెట్లు?
  ననుచు శల్యుడు బల్కెను నార్కితోడ!!!

  రిప్లయితొలగించండి
 29. శక్తియుక్తులు కరువైన సన్నకారు
  రైతు బిడ్డయె యాశించె రాష్ట్రపతిగ
  పదవి బొందగ వలెనంచు పగలురాత్రి
  పట్టుదలయున్న జయముఁ జేపట్టు టెట్లు.


  కోరిన కోర్కెలెల్ల సమకూరుట కష్టమసాధ్యమంచు నే
  జేరితి నీదు సన్నిధిని చెప్పుము విజ్ఞుడ వోయి సోదరా
  యోరిమి తోడ బట్టుదల యున్న జయంబులభించుటెట్టులో
  మీరిది నాకు దెల్పినను మీరక సాధన జేతునే సదా.

  రిప్లయితొలగించండి
 30. శక్తియుక్తులు కరువైన సన్నకారు
  రైతు బిడ్డయె యాశించె రాష్ట్రపతిగ
  పదవి బొందగ వలెనంచు పగలురాత్రి
  పట్టుదలయున్న జయముఁ జేపట్టు టెట్లు.


  కోరిన కోర్కెలెల్ల సమకూరుట కష్టమసాధ్యమంచు నే
  జేరితి నీదు సన్నిధిని చెప్పుము విజ్ఞుడ వోయి సోదరా
  యోరిమి తోడ బట్టుదల యున్న జయంబులభించుటెట్టులో
  మీరిది నాకు దెల్పినను మీరక సాధన జేతునే సదా.

  రిప్లయితొలగించండి
 31. గురువు గారికి నమస్సులు
  మరొక పూరణ.దోషములను సవరిoపుము.
  కూళ చిత్తులు జగమున కూడ బలుక
  వ్యాళ సoస్కృతి నoతట వ్యాప్తి జెందె
  దేశ మేరేతి వృద్ధిచెందేను? మoకు
  పట్టుదల యున్న జయము జేపట్టుట టెట్లు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అందేను' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
 32. ప్రాగ్దిశందున విజ్ఞాన భాను డుదయ
  మయ్యె మనకేల పడమర యనువు లనుచు
  త్రోసిపుచ్చి యాధునికత రోసి,మొండి
  పట్టుదలయున్న జయముఁజేపట్టుటెట్లు?

  రిప్లయితొలగించండి
 33. పట్టు దలయంటె పనినిచే పట్టి మిగుల
  సంకటములున్న వెరవక సాగి నపుడు
  తప్పకను నీకు జయమబ్బు, తనుకు వీడు
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు?

  రిప్లయితొలగించండి
 34. కవిమిత్రులారా,
  అమెరికా నుండి వచ్చిన కవిమిత్రులు నేమాని సోమయాజులు (సోం నేమాని) గారు ఈరోజు హైదరాబాదులో కలిసారు. చాలాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నాము. అందువల్ల మధ్యాహం నుండి బ్లాగుకు అందుబాటులో లేను.

  రిప్లయితొలగించండి
 35. పట్టుదలయున్న జయము చేపట్టుటెట్లు

  ననెడి సందియమ్ము వలదు నవనియందు

  పట్టుదల తోడ శ్రమకనపరి నంత

  జయము వరియించ కలుగును సంతసమ్ము.  శక్తియేమాత్రమును లేక జగతి యందు

  పట్టుదలయున్న జయము చేపట్టుటెట్లు

  శక్తియుక్తులు వలయును జయమునంద

  కాని యెడల నధికమగు కష్టములును.


  కష్ట పడుచును నేర్చెను కర్ణుడన్ని

  యస్త్ర శస్త్రములను తాను నవనియందు

  దైవకృపయును శూన్యమై తాపమొదవె

  పట్టుదలయున్న జయము చేపట్టుటెట్లు.

  రిప్లయితొలగించండి
 36. వైద్య సాంకేతికములైన విద్యలందు
  సూక్ష్మతర విషయమ్ముల సునిశితముగ
  జూచి నేర్చుకొనని , లక్ష్యశుద్ధి లేని
  పట్టుదల యున్న జయముఁ జేపట్టు టెట్లు !


  ధారుణి సర్వసమ్మత విధానమహింస , తదాయుధమ్ముగా
  ధీరత గాంధి జాతిపిత దెచ్చె స్వతంత్రత ! మానవాళిలో
  నోరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో
  కూరిమి యున్న వైరములు గూలుట యన్నది గూడ యట్టులే !!

  రిప్లయితొలగించండి
 37. ఓరిమితోడఁ బట్టుదల యున్న జయంబు లభించు టెట్టులో?👇
  కూరిమి తోడ వోటరుల కొప్పుల బెట్టుచు కల్ల పూవులన్
  తోరపు బొజ్జ పెంచుచును తుండము తోడను దుడ్డు గ్రోలుచున్
  భారత కీర్తి దీయుచును బంగరు భూమిని కొల్లగొట్టగా...

  రిప్లయితొలగించండి