19, జులై 2017, బుధవారం

సమస్య - 2414 (క్రూరులు దుష్టులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా"
(లేదా...)
"క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా"
(సహదేవుడు గారికి ధన్యవాదాలతో...)

85 కామెంట్‌లు:

  1. తారాబల దోషమనుచు
    భీరువులను మోసగించి భీభత్సముగన్
    నారుల దోచెడి కొందరు
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా

    రిప్లయితొలగించండి
  2. (క్రమాలంకారంలో)
    భారతదేశపు బహుముఖ
    గౌరవహానికి,ప్రగతికి కారకులెవరో
    వేరుగ జెప్పగ దలచిన
    క్రూరులు దుష్టులు ఖలులు; పురోహితులు గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని "గౌరవమున కర్హు లెవరొ" అనండి. అన్వయం బాగుంటుంది.

      తొలగించండి
  3. చారుల కర్థము లేమని
    కోరగ మతిహీను డొకడు గురునకు బలికెన్
    చోరులు, శూరులు, తారలు,
    క్రూరులు, దుష్టులు, ఖలులు, పురోహితులు గదా.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మతిహీనుని వాక్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    అందరూ కాదు కొందరే :

    01)
    __________________________

    వారే జూడగ సందు సందునను లా - భాపేక్ష భాసించగా
    ధీరోదాత్త విశేష వింత బిరుదుల్ - దిట్టంపు రుద్రాక్షలన్
    భారీకాయము పైన కట్టు కొనుచున్ - ప్రఙ్ఞానులం బోలుచున్
    నారీ శ్రేష్ఠుల మాయజేసి ధనము - న్నాచించు నిక్కాలమున్
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు వి - ద్రోహాత్తచిత్తుల్ గదా !
    __________________________
    ధీరుడు = విద్వాంసుఁడు
    తోడా = హస్త భూషావిశేషము
    నాచు = దొంగిలించు

    రిప్లయితొలగించండి
  5. మారెను లోకపు తీరట
    తీరని దాహపు దురాశ దేవుని ధనమున్
    నేరము గాదని చోరులు
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా !

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    జారులు చోరులు మూర్ఖులు
    కోరినప్రగతులను బడయ గురినిడ సలహాల్
    భీర ప్రజాతంత్రములో
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులగదా!
    (రాజా రాష్ట్రకృతం పాపం
    రాజపాపం పురోహితా
    భర్తాచ స్త్రీకృతం పాపం
    శిష్యపాపం గురుర్వ్రజేత్)

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    సారాచారవిశారదుల్ హితమతుల్ సౌభాగ్య స్రష్టల్ ఘనుల్
    పోరాడన్గదె పూర్ణ సత్వయుతమౌ భూరి ప్రజాతంత్ర మే
    పార"న్నింటను (ఉ)యుడ్ము జొచ్చి"నటులీ భాస్వంత భూమిన్ గనన్
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా
    (ఇంటిలో ఉడుముజొచ్చుట శకున శాస్త్ర ప్రకారం గొప్ప కీడుకు సూచన.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      శాస్త్రవ్యాక్యంతో సమర్థించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఇంటను+ఉడ్ము' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పార న్నింటను గోధి జొచ్చినటులీ" అందామా?

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా},ధన్యవాదాలు

      తొలగించండి
  8. వారా రజాకరులనగ
    క్రూరులు దుష్టులు ఖలులు, పురోహితులుగదా
    మీరక ధర్మపథమ్మును
    కోరెదరే జన హితమును కూరిమి తోడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వారు రజాకారు లనగ' అనండి.

      తొలగించండి
  9. కోరు గుడిలోన నగలను
    క్రూరులు దుష్టులు ఖలులు ,పురోహితులు గదా
    నోరార సురలను కొలచి
    ఊరు హితము కోరుచుండు యుల్లము నందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య కుమార్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కోరుచుందు రుల్లమునందున్" అనండి.

      తొలగించండి
  10. రారాజుద్ధతి తోడ నెంచె కురు సంగ్రామంబు గావించగన్
    తా రాధేయుని యండజూచి పలికెన్ దర్పంబు నొప్పారగన్
    మారాటంబున గెల్వగోరు హితులే మత్పక్షమందెల్లరున్
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా

    రిప్లయితొలగించండి
  11. వీరులధీరుల మనుచును
    వీరంగము జేయునెవరు వీధుల వెంటన్?
    పౌరహితము గోరునెవరు?
    క్రూరులు దుష్టులు ఖలులు; పురోహితులు గదా!

    రిప్లయితొలగించండి
  12. నేరముఁ జేసెడి వారలు ,
    చోరులు , జారులు , విశాల శుభ సూచకులున్
    ధారుణి నలుగురు వరుసగ
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా !!



    క్షీరమ్మున్ గరళమ్మనున్ విచలదగ్నిన్ మంచనున్ , మంచి క...
    ర్పూరమ్మున్ దగ పచ్చిమిర్చి యను, తాంబూలమ్ము మద్యంబుగా
    నీ రీతిన్ ప్రలపించు బుద్ధిగల
    వాడిట్లే యనున్ మిత్రమా !
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. దూరుచునుందురు సుజనుల
    క్రూరులు దుష్టులు ఖలులు, పురోహితులుగదా
    నారాయణుని భజించుచు
    తీరగు దరిఁ జూపుచుంద్రు దేవునిఁ జేరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ధారాళంబుగ మంత్రముల్ బలికి వేదంబుల్లు నశ్రాంతముగా
    నోరారంగను వల్లెవేసి భగవానుండే జగద్రక్ష కుడై
    సంరక్షించునుగా ప్రజావళి నిటన్ సంతోషముల్ కల్పించ గ నీ
    పారుoడెప్పుడు కారకుండ వడుగా పాలించు వాడీశ్వరడే
    భూరిక్కున్ననుచూ తలంచ క స్వలాభో పేక్ష కూడుచుం డు నా
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్త చిత్తుల్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో తప్ప మిగిలిన పాదాలలో గణదోషం. సవరించండి. 'జగత్త్రాతయై' అనండి. మీ పద్యానికి నా సవరణ...........
      ధారాళంబుగ మంత్రముల్ బలికి వేదంబుల్ సదా శ్రద్ధతో
      నోరారంగను వల్లెవేసి భగవానుండే జగత్త్రాతయై
      సంరక్షించునుగా ప్రజావళి నిటన్ సంతోషముల్ కల్పించ నీ
      పారుoడెప్పుడు కారకుం డవడుగా పాలించు వాడీశుడే
      భూరిక్కున్ననుచున్(?) తలంచక స్వలాభోపేక్షతో నుండు నా
      క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్త చిత్తుల్ గదా

      తొలగించండి
    2. గురువు గారు పొరబడ్డాను మరల శార్దూలము నన్ను మింగింది క్షమించండి

      తొలగించండి
  15. వీరలఁ గ్రమముగఁ జూడగ
    నేరికి నైన ననునిత్య మిలఁ దలపంగన్
    మారరు విన రరులు గురులు
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా


    ఘోరంబౌ బహుమాన దానము లిలన్ గుప్పించి మోసమ్మునం
    దోరంబౌ ముడుపుల్ భువిన్నొసఁగుచుం దోడ్పాటునుం గోరుచుం
    గీరమ్ముం బసఁ బల్కి చేయఁగను వే కీడుల్ నరశ్రేణికిం
    గ్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  16. ప్రహ్లాదుడికి హరికీర్తన నేర్పించారని పురోహితులపై హిరణ్యకశిపుని క్రోధం
    ఆరంభింతురు విద్యలంచు నెలమిన్నచ్చోటికిన్ పంపగన్
    చేరన్ వచ్చిన చిన్నవానికకటా శ్రీవిష్ణు గాధావళిన్
    కారుణ్యమ్మున నేర్పినారు గదరా కన్గోవగన్ ధారుణిన్
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహత్త చిత్తుల్ గదా
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  17. క్రమాలంకారంలో
    ఆరయ సాధు జనమ్ముల
    సారెకు హింసించు దుష్టచరితులు దనుజుల్
    చేరగ మేలు నొనర్చును
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. వీరాగ్రేసరుడైన భీష్ముడును, గంభీరాస్త్ర ధీ ద్రోణుడున్
    ధీరోదాత్తుల పాండవేయులను సాధించే ద రాధేయుడున్,
    వైరారోహమునందు నందరును నన్ వంచించి రేమందు నీ
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాధించే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. దాని తర్వాత 'ద' ఎందుకు?

      తొలగించండి
  19. ధారాళమ్ముగ రాహుకాల గణనల్ తారాబలమ్ముల్ తథా
    నోరూరంగ జపమ్ము పూజలు వృధా నోముల్ను జేయించుచున్
    కారాలున్ మిరియాలు నూరి ధనమున్ కాజేయు పాపాత్ములౌ
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా

    ...శార్దూలమ్మును నేను వ్రాసితినిగా సంతోష సౌభాగ్య మై 😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శ్రీ శంకరయ్య గారి సవరణ:

      *"నోముల్ దగన్ జేయుచున్"

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ వృత్త పూరణ ప్రశస్తంగా సలక్షణంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  20. మీరిటులనుటనునొప్పునె?
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులుగదా
    యారయ హితులే వారలు
    వారలుభువి లేనియెడలపర్వములుండౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పర్వము లెట్లౌ" అనండి.

      తొలగించండి
  21. ఫేరవులననెవరెవ్వరు?
    గౌరవమును బొందు నెవరు గాంచగ జగతిన్?
    తీరుగ జెప్పెద వినుము
    క్రూరులు దుష్టులు ఖలులు, పురోహితులుగదా!!!


    నారుల హింసించు వారిల
    క్రూరులు దుష్టులు ఖలులు, పురోహితులుగదా
    నారాయణునకు నరులకు
    తీరుగ తాముండి నడుమ దెలుపును హితమున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "తీరుగ జెప్పెదను వినుము" అనండి.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "నారుల హింసించు జనులె" అనండి.

      తొలగించండి
  22. నేరములు సలుప జూతురు
    క్రూరులు దుష్టులు ఖలులు; పురోహితులు గదా
    నారాయణ మంత్ర మొసగి
    పారాయణ జేయ జూచు పండిత వర్యుల్

    రిప్లయితొలగించండి
  23. రుక్మిణిని శ్రీకృష్ణుల వారు చేపట్టగా శిశుపాలుని
    మనోభావము:

    నేరమ్మందును రుక్మిణీ గమన మగ్నిద్యోతనుం డందుచున్
    గౌరీ పూజకు పెళ్లికూతురిగ నాగామిన్ గ్రహింపన్ వచో
    ధారాదత్తముఁ జేసి కృష్ణునకు సంధానించు కృత్యమ్ములన్ 
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా!

    రిప్లయితొలగించండి
  24. వారలు నగ్నిద్యోతను
    లీ రాక్షస రీతి హరిని ప్రియ రుక్మిణులన్
    జేరుచుటసదాచారమె?
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా!

    రిప్లయితొలగించండి

  25. పిన్నక నాగేశ్వరరావు.

    నేరస్థులలో నుందురు

    క్రూరులు,దుష్టులు,ఖలులు; పురోహితు
    లు గదా
    తీరుగ శుభాశుభమ్ములు

    వారము,నక్షత్ర,తిధి వివరముల
    దెలుపున్!

    ‌****************************

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాముని పట్టాభిషేకానికి, వనవాసానికి ముహూర్తం పెట్టినవాడు దశరథుడేనండీ.

      తొలగించండి
    2. వాల్మీకి రామాయణం ప్రకారం దశరథుడే ముహూర్తం నిర్ణయించి వశిష్టునికి తన నిర్ణయాన్ని తెలియజేశాడు.

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "ముహూర్తము నిడినది" అనండి.

      తొలగించండి
    4. పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించింది ఎవరో తరువాత చూస్తాను.

      తొలగించండి
    5. సమస్యాపూరణమున కైనను భగవానుఁడు వశిష్ట మహర్షిని తూలనాడడము భారతీయ సంస్కృతిని కించపరచడమే. అది భాగవత భారత రామాయణముల నందించిన తెలుగు సాహిత్య రంగములో ఘోరాపరాధమే.

      తొలగించండి
    6. దశరథ మహారాజు మాటలు:

      అహోస్మి పరమప్రీతః ప్రభావశ్చాతులో మమ.
      యన్మే జ్యేష్ఠం ప్రియం పుత్రం యౌవరాజ్యస్థమిచ్ఛథ৷৷2.3.2৷৷

      ఇతి ప్రత్యర్చ్య తాన్రాజా బ్రాహ్మణానిదమబ్రవీత్.
      వసిష్ఠం వామదేవం చ తేషామేవోపశృణ్వతామ్৷৷2.3.3৷৷

      చైత్రశ్శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః.
      యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్৷৷2.3.4৷৷

      రాజ్ఞస్తూపరతే వాక్యే జనఘోషో మహానభూత్.
      శనైస్తస్మిన్ప్రశాన్తే చ జనఘోషే జనాధిపః৷৷2.3.5৷৷

      వసిష్ఠం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్.
      అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదమ్৷৷2.3.6৷৷

      తదద్య భగవన్ సర్వమాజ్ఞాపయితు మర్హసి.

      తొలగించండి
    7. దశరథుఁడు రాముని తో అన్న మాటలు:
      శ్వః పుష్యయోగం నియతం వక్ష్యన్తే దైవచిన్తకాః৷৷2.4.21৷৷
      తతః పుష్యేభిషిఞ్చస్వ మనస్త్వరయతీవ మామ్.
      శ్వస్త్వాహమభిషేక్ష్యామి యౌవరాజ్యే పరన్తప!৷৷2.4.22৷৷

      తొలగించండి
    8. పూజ్యులు కామేశ్వరరావు గారికీ, సనాతన ఋషులందరికీ, సనాతన సాంప్రదాయానికి, తెలుగు సాహిత్యానికి వేనవేల క్షమార్పణలు!
      నాఈ ఘోరాపరాధానికి ప్రాయశ్చిత్తము తెలిపిన నాచరింతును!
      దశరథుని వంటి వారినికూడ సామాన్య మానవుని వలె నూహించి చేసిన యపరాధము! పెద్దలు శాంతింతురు గాక!
      అపరాధ సహస్రాణి క్రియంతేరహర్నిశం సోదరీ యితి క్షమస్య గురుదేవ!
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    9. పునరావృత్తము కాకుండా పశ్చాత్తాపము చెందుటయే ప్రాయశ్చిత్తము.

      తొలగించండి

  27. పిన్నక నాగేశ్వరరావు.
    (రెండవ పూరణము.)

    లేరెవ్వరు విప్రులలో

    క్రూరులు, దుష్టులు,ఖలులు; పురోహితు
    లు గదా
    భారత, భాగవతమ్ముల

    సారమ్మును దెల్పి ప్రజకు జ్ఞానము
    నిచ్చున్?
    ****************************

    రిప్లయితొలగించండి
  28. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *కారుణ్యస్ఫుటజన్మలక్షణులునిష్కామ్యాగమధ్యానులుల్*
    *క్షీరాజ్యప్రియసాధుభోజనులుసజ్జిహ్వాగ్రమంత్రోజ్జ్వలుల్*
    *వారిద్ధాత్రిపవిత్రులున్నతులుజిహ్వల్ పల్కశాపార్హమౌ*
    *క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు, విద్రోహాత్త చిత్తుల్ గదా!*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  29. ఊరున బడి దోచునెపుడు
    క్రూరులు దుష్టులు ఖలులు పురోహితులు గదా
    కూరిమి యెడ నాగరికుల
    పేరున వేలుపు దలంచి పెన్నిధి గోరున్

    రిప్లయితొలగించండి
  30. వైరులు శౌరికి యసురులు
    క్రూరులు,దుష్టులు,ఖలులు.పురోహితులు గదా
    తీరిన శుక్రాచార్యులు
    వారికి,శుభముల నొసంగ ప్రార్ధించు సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శౌరికి నసురులు" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులసూచనతో సవరించిన పద్యము
      వైరులు శౌరికి నసురులు
      క్రూరులు,దుష్టులు,ఖలులు.పురోహితులు గదా
      తీరిన శుక్రాచార్యులు
      వారికి,శుభముల నొసంగ ప్రార్ధించు సదా

      తొలగించండి
  31. వీరాగ్రేసరుడైన భీష్ముడును, గంభీరాస్త్ర ధీ ద్రోణుడున్
    ధీరోద్దారుడు స్నేహితోత్తముడు రాధేయుండు కూడన్నరే!
    వైరారోహమునందు నందరును నన్ వంచించి రేమందు నీ
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా

    గురవురులకు నమస్కారము ద= దాత, కర్ణుడు దాతగదా కాబట్టి గణభంగముగాకుండ ఉపయోగించాను. సరిదిద్దిన పద్యము వరిశీలించండి ధన్యవాదములు




    రిప్లయితొలగించండి
  32. ఘోరపు పనులున్ జేతురు
    క్రూరులు దుష్టులు ఖలులు; పురోహితులు గదా
    దారుణ కల్మషములనుని
    వారించుచుపుర హితంబు వాంచింత్రు సదా.

    రిప్లయితొలగించండి



  33. కారెప్పుడునర్చకులిల

    క్రూరులు దుష్టులు ఖలులు ,పురోహితులుగదా

    తారాబలమును చూచుచు

    నేరుపుతోలగ్నమిడుదు రేవేళేయైన్



    కారిల జూడుడు వారలు

    క్రూరులు దుష్టులు ఖలులు ,పురోహితులుగదా

    నారాయణుని స్మరియించు నౌమము సుమ్మీ.


    నౌముము=పురోహితుడు.

    రిప్లయితొలగించండి
  34. తారాచంద్రుల దోషరీతులనుచున్ దానమ్ము జేయించుచున్
    వారమ్ముల్ గ్రహశాంతి పూజ లనుచున్ వ్యాధుల్ శనైశ్చర్యులన్
    పారన్ ద్రోలుమటంచు శాస్త్ర పాండిత్యముల్ జూపెడిన్
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా

    రిప్లయితొలగించండి
  35. "ఆరంభించుచు నాతడింట వెగటౌ యాగాలు యజ్ఞాలనున్
    క్షౌరం జేయగ నాదు శీర్షమునయో ఘాటైన మంత్రాలతో
    తీరున్ తెన్నును లేక యెన్నికలనున్ తెప్పించు మున్ముందుకున్
    క్రూరుల్ దుష్టజనుల్ పురోహితులు విద్రోహాత్తచిత్తుల్ గదా!"

    రిప్లయితొలగించండి