31, జులై 2017, సోమవారం

సమస్య - 2425 (ఇంద్రుఁడు సీతకై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఇంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్"

66 కామెంట్‌లు:

  1. చంద్రుని వంశజుండునగు శంతన పుత్రుడు యుద్ధమందు పా
    రీంద్రము వోలెఁబోర నమరేంద్రుని బుత్రుఁడు చాటునుండి ప్రా
    ణేంద్రియముల్ గతుల్కదల నేర్పున గొట్టగ కూలి పోవ నా
    యింద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్

    ఆత్మావై పుత్ర నామాసి. ఆఖరి పాదంలో ఇంద్రుడు అనగా అర్జునుడని నా భావన. సీత అంటే గంగ (నీరు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      అర్థవైవిధ్యంతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని అర్జునుడు భీష్మునికోసం గంగను తెచ్చినప్పటికి శల్యుడు చనిపోయాడు కదా!

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
      అర్జునుడు గంగను తెచ్చిన ఘట్టం భీష్మ పర్వము తృతీయాశ్వాసము లోనిది.

      శరవేదన సర్వాంగము
      లెరియఁగ నా కిపుడు పెదవు లెండెడుఁ దృష్ణా
      భర ముడుపఁదగిన నీళులు
      వెరవునఁ దే నేర్తు వీవ వే తెమ్మనఘా

      అని భీష్ముడు అర్జునునికి చెప్పాడు కదా.

      తొలగించండి
    3. చంద్రుని వంశజుండునగు శంతన పుత్రుడు యుద్ధమందు పా
      రీంద్రము వోలెఁబోరి నమరేంద్రుని బుత్రుని చేత కూలి ప్రా
      ణేంద్రియముల్ గతుల్కదల నీటిని కోరగ పాండుపుత్రుడౌ
      నింద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్

      తొలగించండి
    4. ఫణికుమార్ గారూ,
      పొరబడ్డాను.. మన్నించండి.. నేనింతకాలం ఆ ఘట్టం భారత యుద్ధానంతరం అనుకుంటున్నాను.
      దానిని సమర్థిస్తూ మీరు వ్రాసిన రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    5. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. మన్నించమనే మాట మీరు మాతో అనకూడదు. మేము వినకూడదు.

      తొలగించండి
  2. సంద్రములోని నుర్వున నసంగతవృత్రుని జంపె నెవ్వడో!
    మంద్రమహాధ్వనిన్ జనులమధ్యన రాముదొనర్చె నెద్దియో!
    చంద్రునివంశధీరులగు సద్గుణధుర్యుల ముద్దుమామయో!
    చంద్రిక నెక్కి తారకుని శార్వుడు నెవ్విధి రూపుమాపెనో!
    ఇంద్రుడు;సీతకై ధనువు నెత్తెను;శల్యుడు;మేలుమేలనన్.
    (అసంగత=శత్రువైన;చంద్రిక=నెమలి;శార్వుడు=కుమారస్వామి)

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  4. శుభోదయం !


    సంద్రము లో జనింపగను చంకుర మై గ్రహియించె నెవ్వడో ?
    మంద్రము గాను గాధిజుని మాటగ రాముడదేమి జేసెనో ?
    ఇంద్ర తనూజుడా రవిజునిన్ హత మార్చగ మెచ్చె నెవ్వడో ?
    ఇంద్రుఁడు; సీతకై ధనువు నెత్తెను; శల్యుఁడు మేలుమే లనన్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని మొదటి ప్రశ్న అర్థం కాలేదు.

      తొలగించండి

    2. కంది వారు

      నమో నమః !

      సముద్రము లో పుట్టినది ఐరావతము ; దానిని వాహనము గా ( చంకురముగా) గ్రహించినవాడు యింద్రుడు

      సరియే నా ?

      జిలేబి

      తొలగించండి
  5. చంద్రుని తండ్రి ధర్మజుడు, శైలజ జానకి నాయనమ్మ, యా
    సంద్రము దేవతా నగరి, సత్యమె పల్కు “శకార” వంశ్యుడన్
    సాంద్రము నాదు వాక్య మనిశంబని పల్కెనొకండు మిత్రు లా
    యింద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      ఇంతకాలం ఇటువంటి పూరణకు శకారుని తీసుకొనేవాళ్ళం. మీరు అతని వంశపు వాణ్ణి తీసుకొచ్చారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      'మిత్ర్రులు' అన్న పదానికి అన్వయం కుదరనట్టుంది. అక్కడ 'పల్కె నొకండు "మిత్రమా యింద్రుడు..." అంటే ఎలా ఉంటంది?

      తొలగించండి
  6. సాంద్రపరాక్రముండు గుణసత్తముఁ డాఢ్యుఁడు రామచంద్ర రా
    జేంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను; శల్యుఁడు మేలు మేలనన్
    జంద్రధర ప్రసాదము ఘనంబగు పాశుపతమ్ము గల్గు నా
    యింద్రసుతుండు కర్ణుని జయించెను సంగర రంగమందునన్.

    రిప్లయితొలగించండి
  7. చంద్రముఖి న్ అహల్య గ ని చంచలు డే వి ధి కోడి య య్యే నో ?
    సాంద్రబ లా న రాఘవుడు చా ప ము గాంచి యు నే మి చే సె నో ?
    ఇంద్రుడు మెచ్చకర్ణుడికి నే ప గి ది న్ ర థ ము న్ చ లించె నో ?
    ఇంద్రుడు 'సీత కై ధనువు నెత్తీను 'శల్యు డు మేలు మే ల న న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చంద్రముఖిన్ + అహల్య = చంద్రముఖి నహల్య... అవుతుంది. విసంధిగా వ్రాయరాదు కదా! అక్కడ "ఇంద్రు డహల్యకై చనియు నేవిధి కోడిగ మారి కూసెనో" అందామా?

      తొలగించండి
  8. చంద్రముఖీ! సురాధిపుడు సాధ్విసచీపతెవండు? రామునిన్
    సాంద్ర యశోమతిన్ పడతి జానకి యెలవరించె? యంగ రా
    జేంద్రుని యర్జునుండనిన యేలవధించెనొ చెప్పుమో యన
    న్నింద్రుడు సీతకై ధనువు నెత్తెను శల్యుడు మేలుమేలనన్ .

    చంద్రముఖీ! నరోత్తముడు సద్గుణ శీలుడతండయోధ్య రా
    జేంద్రుడు సీతకై ధనువు నెత్తెను, శల్యుడు మేలుమేలన
    న్నింద్రకుమారుడే చెఱగె, హీనకులాత్మజుడంచు దాన శీ
    లేంద్రుని తూలనాడగ మహీపతి కర్ణుడు కృంగి పోయెనే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "సాధ్వి శచీశు డెవండు" అనండి.

      తొలగించండి
  9. చంద్రుని ధిక్కరించు రహిచంద్రికల్జేగొన
    కోసలేంద్రుడున్
    సాంద్రత మూర్తిగొన్న బలశౌర్యుడు, బాలుడు రామచంద్ర వీ
    రేంద్రుడు సీతకై ధనువునెత్తెను ; శల్యుడు మేలుమేలనన్
    నింద్రతనూజుని న్బొగడె నీల్గుచు కర్ణుని ధైర్యమోడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చంద్రిక ల్జేగొన' అన్నచోట గణభంగం.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు!
      'చంద్రికలంగొన' యనిన సరిపోవునా?

      తొలగించండి
  10. మంద్ర గుణాభిరాముడు నమస్కృతులిచ్చి మునీశుకర్మిలిన్.
    చంద్రుని వెల్గులన్ వెలిగి సాగిను ముందుకయోధ్యదేశ రా
    జేంద్రుడు,సీతకై ధనువునెత్తెను,శల్యుడు మేలుమేలన
    న్నింద్ర తనూజుడేసె కరుణింపక కర్ణు రణాంగణమ్మునన్
    మంద్ర=గంభీరమైన స్వరము

    రిప్లయితొలగించండి
  11. ఇంద్రుడు సీతకైధనువు నెత్తెను శల్యుడు మేలుమేలన
    న్నింద్రుడు కాడుగా ధనువు నెత్తుట ,సీతకై దగన్
    మంద్రముతోడ భాసిలుచు మాన్యతనొందిన శంభువిల్లు దా
    నింద్రుడు దేవతల్ గనగ నెత్తెను రాజులు సంతసించగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ఇంద్రుని విషయంలో సమాధాన మిచ్చరు. మరి శల్యుని ఏం చేశారు?

      తొలగించండి
  12. ఇంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమేలనన్
    చంద్రుడు కాలికన్గనుచు సంతస మొందగ తాళి కట్టె, నా
    ఐంద్రికి రుక్మిణీ వెలది ఐహిక సౌఖ్యము లీయ, యోష సై
    రంద్రి మురారి కోరికను రమ్యగతిన్ సఫలంబును చేసెగా యనెన్
    మంద్రగతిన్ ఖలుండొకడు మౌలి జనంబులకున్ ముదమ్మిడెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      ఖలవాక్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. గురువు గారికి పాదాభి వందనము మీ యొక్క ఆశీస్సులతో నేటికి 100 సమస్యలు పూరించాను. నా కావ్య ప్రస్తానములో నాకు ఘన విజయము. వ్యాకరణ దోషములు కొన్ని ఉన్ననూ సహృదయతతో మీ బ్లాగు నాకు ఒక చక్కని అవకాశము ఇచ్చినది. మీ ఆశీస్సులు సహాయ సహకారములు సర్వదా కోరుచున్నాను. గురు తుల్యులు శ్రీ పోచిరాజు వారు బల వ్యాకరణము నేర్చుకోమని మంచి సలహా ఇచ్చ్చారు. అది మొదలు బెట్టాను. త్వరలో తప్పులు లేకుండా మీ బ్లాగులో పూరణము చేయాలని నా అభిలాష నాతప్పులు నిర్మోహమాటముగా మీరు, గురు తుల్యులు శ్రీ కామేశ్వర రావు గారు మిస్సన్న గారు, ఇతర మిత్రులు చూపించి నన్ను సరిఅయిన పంధాలో నడిపిమ్చగలరు. ధన్యవాదములతో

    రిప్లయితొలగించండి
  14. బాల వ్యాకరణము గా సరి చూడవలెను

    రిప్లయితొలగించండి
  15. చంద్ర కులైక భూషణుడు సద్గుణ రాముడు సర్వ రాజ సూ
    నేంద్రుడు సీతకై ధనువు నెత్తెను, శల్యుడు మేలు మేలన
    న్నింద్రతనూజుడా వితరణేంద్రుని కర్ణుని రాజదంగ రా
    జేంద్రుని యుద్ధమందు వధియించె మహాస్త్రము చే మహోగ్రుడై

    రిప్లయితొలగించండి
  16. సాంద్ర కథా రసామృతము జల్లెడు భారత, రామ గాథల
    న్నాంధ్ర కళా విశారదులు నాడిరి వేది, నయోధ్య రామ రా
    జేంద్రుడు సీతకై ధనువు నెత్తెను, శల్యుఁడు మేలు మేలనన్ 
    మంద్ర విరాజితుండు నటమాన్యుడు ప్రేక్షక మంత్రముగ్ధుడై! 

    రిప్లయితొలగించండి
  17. సంద్రము భంగి సాగెడిని సత్సమ రమ్మున మించి సూతవం
    శేంద్రుఁడు కర్ణు పాతమున కింద్ర సుతుండు కిరీటి చంద్ర వం
    శేంద్రుఁడు రాజ్య లక్ష్మి కొఱ, కెత్తిన భంగిని భవ్య సూర్య వం
    శేంద్రుఁడు సీతకై, ధనువు నెత్తెను శల్యుఁడు మేలు మేలనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూతు లిరువురు శుచిరోచిషుండొకడును
      కలిపి రాజేంద్రులుగ పాద ములను యల్లి
      పూరణమును చేసిన ఘన పోచిరాజు
      వారి కిన్బెట్టుచుం టిని వందనములు

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ఉత్తమమూ, మనోహరమూ అయిన పూరణ మీది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
      సూర్య కుమార్ గారికి, డా.సీతా దేవి గారికి ధన్యవాదములు. వందనములు.

      తొలగించండి
  18. సంద్రము పాలు జేసి పురుషాదుని,జన్నము గాచి, భానువం
    శేంద్రుడు సీతకై ధనువు నెత్తెను.శల్యుడు మేలు మేలన
    న్నింద్రసుతుండు భానుజుని నెక్కటి పోరున గూల్చె పాండవుల్
    సాంద్రత హెచ్చి ధ్వానములు 'జై'యని నర్జును ప్రస్తుతించుచున్

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. సాంద్రవిశా ల కాయుడ గు సార స నేత్రు డు రామచంద్రుడు న్
    మంద్ర ము లై న గా ధి సు తు మాటల నాజ్న గ నెంచుకొంచురా
    జేంధ్రుడు సీ త కై ధనువు నేత్తేను ;శల్యు డు మే లు మే ల న న్
    ఇంద్ర సు తుం డు పా ర్థు డు జ యిoపగ తోడ్పడేశక్తీ యుక్తి గ న్

    రిప్లయితొలగించండి
  21. ఇంద్రుడు నా సురాధిపుల నెందరినో భజియింప గోరి మౌ
    నీంద్రుడు యాగమున్ జరుపనెంత యునుగ్రత రక్త మాంసపున్
    సంద్రము హొమ కుండమున జార్చెడి రక్కసిమూక దున్మి రా
    జేంద్రుడు సీతకై ధనువు నెత్తెను శల్యుడు మేలమే లనన్
    వీటూరి భాస్కరమ్మ
    శల్యుడు=శల్యములు గలవాడు మానవుడు

    రిప్లయితొలగించండి
  22. ఇంద్రుడు గాదు జూడగ జితేంద్రియు డయ్యును ధర్మరక్ష లో
    కేంద్రుడు|రాక్షసాళి కలతేంద్రుడు|నీతిగ,రామచంద్ర రా
    జేంద్రుడు|సీతకై ధనువునెత్తెను”శల్యుడుమేలు మేలనన్
    ఇంద్రుని యంశ మర్జునిని కీర్తిని బెంచెను కర్ణ సారధై”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలతేద్రుడు'...?

      తొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చంద్రిలుడస్త్రమున్ పొదివి సన్నుతి జేయుచు రామచంద్ర రా
    జేంద్రుడు సీతకై ధనువు నెత్తెను; శల్యుడు మేలుమేలన
    న్నింద్రుని యాత్మసంభవుని యెడ్తెఱ నెంచుచు భానుజుండనిన్
    సాంద్రత గూడు శల్యముల సత్త్వము కోల్పడ జేసి నేసరెన్
    (చంద్రిలుడు=శివుడు; ఎడ్తెఱ=శౌర్యము; ఏసరు= అతిశయించు)




    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    పౌర్ణమినాడు మౌనీంద్రుడు సురేంద్రున కిచ్చిన సమస్య :

    01)
    _________________________________

    చంద్రుడు పూర్ణ బింబ మగు - చల్లని సంధ్య, విశాఖ వీడునన్
    సంద్రపు టొడ్డు నున్న ఘన - సద్మము నన్నవదాన వేది, మౌ
    నీంద్రుడు పృచ్చకుం డిడె , సు - రేంద్రున కీ తరి చిక్కు విప్పగ
    "న్నింద్రుఁడు సీతకై ధనువు - నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్ " !
    _________________________________
    వీడు = నగరము
    చిక్కు = సమస్య

    రిప్లయితొలగించండి


  25. చంద్రిక బోలు మోముగల జక్కని కాంతనుకోరెనెవ్వడున్

    సాంద్రము నందునొంటిగను చానయు నుండగ దొంగిలించరా

    జేంద్రుడదేమి జేసె నట నెవ్వరు మెచ్చగ జంపె జిష్ణుడున్

    ఇంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్
    సాంద్రము=అడవి

    రిప్లయితొలగించండి
  26. భద్రతసంతరించి మునివర్యులకున్ గహనమ్ములోన రా
    జేద్రుఁడు సీతకై ధనువు నెత్తెను, శల్యుఁడు మేలుమేలనన్
    చంద్రకులాన్వయండు ఘనశౌర్యముతోడుత చంపెచెచ్చెరన్
    శూద్రకులమ్మువాడనెడు సూతుని పుత్రుని యుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి
  27. మన్నించండి. రెండుపాదములలో బింధుపూర్వక ప్రాస వేయలేదు. రాత్రినిద్రపొయే సమయంలో వ్రాయటంవలన పొరపాటు జరిగిండి. మలర మార్పుచేస్తాను.

    రిప్లయితొలగించండి
  28. రుంద్రపరాక్రమమ్మునను రూఢిగ రక్కసిమూకఁ దున్మి రా
    జేంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను, శల్యుఁడు మేలుమేలనన్
    చంద్రకులాన్వయండు ఘనశౌర్యముతోడుత చంపె నంగరా
    జేంద్రుని యుద్ధరంగమున నింపుగ మెచ్చ చమూసమూహముల్

    రిప్లయితొలగించండి
  29. సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. గంద్రపుగోళ కైపదము గట్టిగ చించెద తుక్కుతుక్కుగా
    చింద్రపువంద్ర జేయుచును చిందులు ద్రొక్కెద పృచ్ఛకాధమా!
    చంద్రుడు భాగ్యనగ్రినిట చక్కగ నేలగ లేదసాధ్యమే:...
    ఇంద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమేలనన్ :)

    రిప్లయితొలగించండి