కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాతికిఁ బుట్టినది కోఁతి రాముని వలెనే"
(లేదా...)
"రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్"
వేంకట రామకృష్ణ కవుల పూరణ....
ఖ్యాతి యెసంగ నంజనకుఁ గల్గిన శ్రీహనుమానుఁ జూచి సం
ప్రీతిని జెంది దేవతలు పేరిమిఁ జెప్పుకొనంగసాగి రా
భూతలమందు రావణుని బొల్పడఁగింపఁగ నిప్పు డంధకా
రాతికి గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్.
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథమునుండి)
సరదాగా...
రిప్లయితొలగించండిఆతడు రాముడు నేర్వగ
ప్రీతిగ శిల్పకళ నోహొ! ప్రిన్ స్టను నందున్
తాతను జేయగ క్రొత్తగ
రాతికిఁ బుట్టినది కోఁతి రాముని వలెనే
ప్రిన్ స్టను = Princeton College
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(ఆంజనేయజననం)
రిప్లయితొలగించండికాతరరహితుడు కేసరి
నేతకు;వికసితమతికి;వినిర్మలగతికిన్;
నీతివిదస్తుతదనుజా
రాతికి బుట్టినది కోతి రామునివలెనే.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోతుల నేతకున్ యుగళ కుంజర హంతకు దానవాంతకున్
రిప్లయితొలగించండిగౌతము కూతు భర్తకును కారణ జన్మునకున్ సువాదికిన్
నీతి నిబద్ద శాలికిని నిర్మల కేసరికిన్ నిశాచరా
రాతికిఁ గోఁతి పుట్టె రఘురామునికై, వడి సీతకై, వడిన్!!
వడి సీత = శౌర్యము గలిగిన సీత
వడిన్ = వేగముగా
సత్యనారాయణ గారూ,
తొలగించండిసీతారాముల కోసం మారుతి పుట్టుక! అద్భుతమైన ఊహ! చక్కని పూరణ. అభినందనలు.
నాతరమా వచియించగ
రిప్లయితొలగించండిజాతరలో జూపు నింద్ర జాలికు మహిమన్
జేతను దండము ద్రిప్పగ
రాతికి బుట్టినది కోతిరా! ముని వలెనే.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ విరుపు ఇంద్రజాలమే చేసింది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
గీత అను ప్రియురాలికి ప్రియుడు చెప్పేమాటలుగా
రిప్లయితొలగించండిగీతా! మూడెనిక సురా
రాతికి, బుట్టినది కోతి, రాముని వలెనే
పాతకి దశకంఠుండని
లో తానిక జచ్చునికను లోకము మురియున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో ఇక ద్విరుక్తమయింది. "తానిక జచ్చునంట" అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఉద్యోగార్థి "జవ పరీక్ష"(ఇంటర్వ్యూ)లోనిఉదంతము:
"మూతిని మీసము దొడ్డదె
జాతికి నొక కందపద్య జవముగనంగన్
జేతువె పాదము?" "సరియిదొ
రాతికి బుట్టినది కోతి రాముని వలెనే"
డా.పిట్టా.........గురు శిష్య సంవాదము
రిప్లయితొలగించండి"ఘాతములోర్చురాతికి దిగాలుగొనన్నొక రాజుకున్ ధరా
మాతకు నెట్టి పోలిక?" "తమాశ్రిత వృత్తులనొంచగాదె సు
ఖ్యాతి గడించిరీ వరుస గానగ సంతు,నెరుంగవా,గురూ!
రాతికనంగనంజనికి రాముని తండ్రికి భూమి కీగతిన్
రాతికి కోతిబుట్టె రఘురాముని కైవడి సీతకైవడిన్
డా.పిట్టా
రిప్లయితొలగించండితుది కైవడిన్ తరువాత ముగింపుకై " గుర్తు తప్పినది.సవరించ మనవి.,ఆర్యా,
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో కందపాదం చెప్పడం. అభినందనలు.
రెండవ పూరణలో "రాతికనంగ" అర్థం కాలేదు.
డా.పిట్టా
తొలగించండిఆర్యా,ఘాతములోర్చు రాతికి..కష్టం సహించే వ్యక్తికి..అంటే కోతికి జన్మనిచ్చిన రాతికి అని ప్రశ్నిస్తే candidate వివరిస్తూ..రాతి కనంగ నంజనికి(అంజనీదేవికి )అంటూ క్రమంగా సమాధానం యిచ్చాడు.దిగాలుగొన్న రాజు ..దశరథుడు.ఏక్ రోజ్ రాజా దశరథ.నే/దర్పణ్ మే అప్నా ముఖ్ దేఖా..ఆపై వయస్సు మీరెను, సంతానం లేదని దిగులు పడి పుత్రకామేష్టి యజ్ఞం జేసినాడట.ఇక సీతామాత ధరణినుండి వచ్చినదే. అంజనీదేవి వరపుత్రుడు.యాగపురుషుడిచ్చిన శ్రీరాముడు, నాగలిచాలున పుట్టిన సీత ల జన్మవృత్తాంతంలో"వలెనే"చెల్లేటట్లు జాగ్రత్త వహించాడా interview candidate.
ప్రీతిగ నొక్క శిల్పి కడు వేడుక రాముని మందిరమ్మునన్
రిప్లయితొలగించండివేతన మంది శిల్పములనే పలురీతులఁ జెక్కుచుండ నా
చేతులలో శిలల్ గడు విశేషముగా నిటు రూపుఁ దాల్చఁగా
రాతికి గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్.
రాతిలో రూపు దాల్చిన సీతారామ హనుమలను చక్కగా శిల్పించారు!!
తొలగించండి🙏🙏🙏🙏🙏🙏
గౌతమునిభార్య యొక్కతె
రిప్లయితొలగించండిరాతికిఁ బుట్టినది, కోఁతి రాముని వలెనే"
సీతను వెదకుట కువెడలి
ప్రీతిగ లంకను దహించి భీతిని గొల్పెన్
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతిగ దగిలెను పాదము
రిప్లయితొలగించండిరాతికి, బుట్టినది కోతి రామునివలెనే
హేతువు గొని భూతలమున
కాతరులను బ్రోవనణచగ ఖలుల నుధృతిన్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం||
రిప్లయితొలగించండిధాతా! విచిత్రమేమిది
రాతికిఁబుట్టినదికోఁతి,రామునివలెనే,
నాతిని కానల కంపెను,
నీతినివిడి, తగవులాడి, నీచుడె పతియున్
ముమ్మడి చంద్రశేఖరాచార్యులు. పెంట్లవెల్లి.
ముమ్మడి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీతి విహీన దుర్గుణుడు నిర్మల లక్షణ హీనడైన యా
రిప్లయితొలగించండిరాతికిఁ గోఁతి పుట్టె, రఘురాముని కైవడి సీత కైవడిన్
భూతలమందు నిత్యమును బూజల నందెడు రామభద్రు భూ
జాతకు పుట్టిరా లవకుశాగ్రులు ధీరులు పుత్రు లిద్దరున్.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లవకుశాఖ్యులు' అంటే బాగుంటుం దనుకుంటాను.
నాతుక యంజన మ్రొక్క కి
రిప్లయితొలగించండిరాతికిఁ బుట్టినది కోఁతి రాముని వలెనే
వాతాత్మజుఁడు సహస్రము
లా తిమిర చరుల వధించె నాశ్చర్యముగన్
[కిరాతి = పార్వతి]
నాతుల ధాత్రి నెల్లఱ ననాథులఁ జేసి హరించి మౌని సం
ఘాతము దల్లడిల్లగను గర్కశ బాధల ముంచు బ్రాహ్మణా
రాతి వరాతి దర్ప బల రావణ సంహర ణార్థ ముత్ప లా
రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిభూతలమందున జనులకు
రిప్లయితొలగించండిప్రీతిని గలిగించి, దునుమ ఫేరవులనిలన్
రాతను మార్చంగ సురా
రాతికి, బుట్టినది కోతి, రాముని వలెనే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి__/\__
తొలగించండిభీతిని గొల్పుచున్ వడిని పెంచుచు చెట్లను పెళ్ళిగింపుచున్
రిప్లయితొలగించండిచేతము ఖేదమొందగను చిత్తము ఘల్లుమనంగ నెల్లరిన్
యాతన పెట్టు గాలికి నయమ్ముగ బుట్టెను నందనుండు తా
రాతికి గోతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్
వీటూరి భాస్కరమ్మ
చేతమది పల్లవింపగ
రిప్లయితొలగించండిప్రీతిగ పెనుశిలను జేరి పెంపెసలారన్
ఖ్యాతిగ నులితో జెక్కగ
రాతికి బుట్టినది కోతి రాముని వలెనే
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆతఁడె యంశయనఁ బురా
రిప్లయితొలగించండిరాతికి, బుట్టినది కోతి, రాముని వలెనే
త్రేతాయుగమ్మునందున
యాతువులను జంప వడిగ నవనీతలమున్
యాతువుః రాక్షసుడు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
...................................................
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సీతను , మారుతిన్ , మరియు శ్రీరఘున౦దను
రాతిబ౦డపై
ఖ్యాతిని గన్న శిల్పులు మహత్తర మౌగతి
చెక్కి , నిల్పి రా
హా ! తిరమైన భద్రగిరి య౦దున భక్తులు
కొల్చు రీతిగా
రాతికి కోతి పుట్టె రఘురాముని కైవడి
సీత కైవడిన్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిబహుకాల దర్శనం!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
యాతన పెట్టుచుండగను యాతులు, మానవులన్ మునీంద్రులన్
రిప్లయితొలగించండిభూతలమందునంజనకు పుత్రునిగా, నిజయంశయై పురా
రాతికిఁ గోఁతి పుట్టె, రఘురామునికై వడి సీతకై వడిన్
ఖ్యాతిని పొందె యుద్ధమున నాసుర సంతతి రూపుమాపి తా
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యాతన పెట్టుచుండగను యాతులు, మానవులన్ మునీంద్రులన్
రిప్లయితొలగించండిభూతలమందునంజనకు పుత్రునిగా, నిజయంశయై పురా
రాతికిఁ గోఁతి పుట్టె, రఘురామునికై వడి సీతకై వడిన్
ఖ్యాతిని పొందె యుద్ధమున నాసుర సంతతి రూపుమాపి తా
చేతికి జిక్కిన శిలలను
రిప్లయితొలగించండినూతన రీతుల మలచుచు నొక్కులతోడన్
నాతిని జేయగ బూనగ
రాతికి బుట్టినది కోతి ,రామునివోలెన్
రాముడనే ఒక విద్యార్ధి
అయ్యవారిని చేయబోతే కోతి అయిందని సామెత!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోతరముగను దశముఖుడు
రిప్లయితొలగించండికోతులు,మానవులు తనను గూల్చ నశక్తుల్
గాతలపోయగత్రిపురా
రాతికి బుట్టినది కోతి రాముని వలెనే
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండియాతన పెట్టుచుండగను యాతులు, మానవులన్ మునీంద్రులన్
భూతలమందునంజనకు పుత్రునిగా, నిజయంశయై పురా
రాతికిఁ గోఁతి పుట్టె, రఘురామునికై వడి సీతకై వడిన్
ఖ్యాతిని పొందె యుద్ధమున నాసుర సంతతి రూపుమాపి తా
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాతా! మూడెను దేవా
రిప్లయితొలగించండిరాతికి, బుట్టినది కోతి రాముని వలనే
సీతన్ గనుగొనె లంకన
సేతువు గట్టించె పడతి చెరవిడి పింపన్
నాతి విలాపమే గద వినాశము దెచ్చెనుజూడగన్ సురా
రాతికి, గోతిబుట్టె రఘురామునికై వడి, సీతకై వడిన్
వాతసుతుండు తా జనెను వార్ధిని దాటి, పడంతి కోసమై
సేతువు గట్టి యట్టి కపి సేనల గైకొని బోయెపోరుకై
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచేతురు శివపూజ నెటుల
రిప్లయితొలగించండిభూతలమున నరుని రూపు బుట్టిన దెవడో
యాతడెటు సేతు వొనరిచె
రాతికిఁ/ బుట్టినది కోఁతి/ రాముని వలెనే
ఆతని పద తాడన మెట
నో తరుణియె వరమటంచు నొందెనెవని నే
భాతి నతడు సీత నెమకె
రాతికిఁ/ బుట్టినది కోఁతి/ రాముని వలెనే
పై రెండు పురాణములు క్రమాలంకారమున ఈ నాటి సమస్యను
పూరించుట కొనర్చిన సాహస యత్నమే
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు
రిప్లయితొలగించండిచాతుర్యముతో శిల్పులు
సీతాపతి విగ్రహమ్ము చెక్కిన పిదపన్
ద్యోతించుచు నట మిగిలిన
రాతికి బుట్టినది కోతి రాముని వలెనే!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భీతిల మది శంక సురా
రిప్లయితొలగించండిరాతికిఁ బుట్టినది, కోతి, రాముని వలెనే
నీతి యటంచు గనక నా
సీతను గొని లంకఁ గాల్చు సేవకుడంచున్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరాతిని చెక్కెడి శిల్పియు
సీతను నయమొప్పగాను చెక్కెను గుడిలో
ప్రీతిగ సౌమిత్రి,నటులే
రాతికి బుట్టినది కోతి రాముని వలెనే
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏతరి పూరణ జేతును
రిప్లయితొలగించండినీతీరుగ ప్రశ్నయుండ నిటలాక్షుండా!
రాతిరి కలలో వింటిని
"రాతికి బుట్టినది కోతి రాముని వలెనే"
2.భూతల మందుజీవులకు పుట్టువు లబ్బును పంచభూతముల్
దాతలు గాగ! పృచ్ఛకుడ! ధాత్రియు నందొక యాంశమౌను నీ
రీతిగ నెంచినన్ గురువరేణ్య!సమస్యిది తీరు నేర్పుగన్
రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్
పెళ్లి వేడుక విశేషాలు..సరదాగా..
3.చూతము రండు వేడుకని షోయబు ఖానుడు పిల్చె దేనికిన్
పీతల కూరవండిరట పెండ్లికి నయ్యవి పుట్టెనెందు,నే
రీతిగ నూత్న దంపతుల ప్రీతిగ గాంచిరి చూచువారు *బా
రాతికిఁ *గోతిఁబుట్టె *రఘురాముని కైవడి సీత కైవడిన్
బారాత్, బరాత్=ఊరేగింపు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిదూతగ నెల్లలోకముల దోయిలి నందెడు రీతి నంధకా
రాతికిఁ గోఁతి పుట్టె, రఘురాముని కైవడి సీత కైవడిన్
జోతలువెట్ట నెల్లరు యశోన్నతుడై చిరజీవిగామనెన్
వాత సుతుండు వ్యాకరణ పండితుడున్ బహు కార్యదక్షుడై
సీతను దెచ్చి వంశముకు చేటొనరించిన రావణాసురున్
రిప్లయితొలగించండిరాతను మార్చినట్టి యనిలాత్మజు పావన వీరగాధలన్
ప్రీతిగ తల్చునట్లు దగు రీతిని కోవెల నుండ మూర్తులన్
రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్
జాతి విశేషమున్ దెలిసి జన్నవు ధారిని తానటంచుచున్
రిప్లయితొలగించండిప్రీతిని వోటరుల్ కొరకు రివ్వున మారిన సంబరమ్ములో
రాతిని డింపులౌ మలచ రాముని భక్తుగ శిల్పశాలలో
రాతికిఁ గోఁతి పుట్టె రఘురాముని కైవడి సీత కైవడిన్