తియ్యటి యప్పములతో మీ భావము మధురాతి మధురముగా నున్నది. కాని వ్యాకరణదోషముతో మీ సమాసము చేదుగా నున్నది. స్వదేశ కేవల సంస్కృత పదము ఆపము (అప్పము) దేశ్యము యీ రెంటి సమాస మసాధువు. సమసించ దలచిన స్వదేశము-ఆపము: స్వదేశపుటాపము గా చేయ వచ్చును. మిమ్మలిని నిరాశ పరచి నందులకు విచారిస్తున్నాను. స్వచ్చమైన తెలుగు భాష మన యందఱి సంపద. నే నుడివినది తప్పైన గురువు గారు నన్ను సవరించ గలరు.
అన్నపరెడ్డి వారూ, మీరు, చింతా వారు, ప్రభాకర శాస్త్రి గారు ఆశ్రమానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సత్కరించి, ఆత్మీయంగ ముచ్చటించి మహదానందాన్ని కలిగించారు. అందరికీ ధన్యవాదాలు.
ప్రతి పాదములో మొదటి అక్షరము కలిపి చదువుకోవలెను 5,8,14,15 పాదాలలో రెండవ అక్షరము చదువు కోవలెను కవి మిత్రులారా ఇది ఒక చిన్ని ప్రయత్నము నూతన రీతిలో శుభాకాంక్షలు తెలుప దలిచాను. తప్పులు చూడకు సుమీ. ఇంకను ఎందరో కవి మిత్రుల అందరి పేర్లు ఇమడ్చ లేక పపోయాను అన్యధా భావిoచ వలదు ,
గుచ్చ కంబయ్యెనుగ మూర్తి కూర్పులన్ని రుక్కు లాయెను కామేశు చక్క నైన వు(ఉ)త్ప లమ్ములు ,శాస్త్రిచే ఉత్పతములు గాధ వోలె ప రవశించ, గరిత నేదు నూరి యల్లిక సతతము నుసుము నిడగ, (5) కిటుకు లొప్పు చుండుజిలేబి కేలు సృష్టి, జలధి సమము మిస్సన్నశైలి యెపుడు, సన్మతికి శర్మ పూర్ణ ముల్ సంతస మిడు, (8) దిట్ట ఐ నొప్పు పద్యముల్ పిట్ట వెపుడు, ననుచు చుండు బల్లూరి కవనము లెపుడు, శుక్తి తీర్ధమే సీతమ్మ సూక్ష్మ బుద్ధి , భావ యుక్తమౌ సహదేవు పదము లన్ని కాంతి నిడునుజిగురు వారి కల్పితములు దీక్ష గల మమ్ము కాచoగ దేవుడిచ్చు (14) సులువుగ శత వత్సరములు శోభ తోడ (15)
కవిపుంగవులు మధుసూదన్ గారికి నమస్సులు. గురువు గారి స్వాభావిక గుణ గణాల నింత చక్కగా వర్ణించుట మీకే సాధ్యము. గురువు గారి విషయములో నెంత చెప్పినా తక్కువే యగు ననడ మతిశయోక్తి కాదు. మీ పూరణలను తిలకించు భాగ్యము నుండి మమ్ము దూరము చేయకండి.
శ్రీయుతులు మధుసూదన రావు గారు, శ్రీయుతులు కామేశ్వర రావు గారూ, కవి మిత్రులూ:
కొన్ని గంటల క్రితం నేనూ, శ్రీయుతులు సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీయుతులు చింతా రామకృష్ణారావు గారూ, శ్రీమాన్ శంకరయ్య గారిని కలిసి కాసేపు ముచ్చటించి వచ్చితిమి. బహు సంతోషమైనది.
ఈశ్వరానుగ్రహం మూలాన మీరు కుటుంబక్షేమస్థేమాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ, ఇతోధికసాహితీసేవ కావిస్తూ మీ విద్యావంశానికి అమందానందాన్ని కలుగజేయాలని పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు!
🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸
రిప్లయితొలగించండిశ్రీయుతులు "శంకరాభరణం" శంకరయ్య గారికి:
జన్మదిన శుభాకాంక్షలు!
శతమానం భవతి....
🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపూజ్యగురుదేవు లుదయించె పుడమిమీద
శాంత సౌజన్యములు తన సంపదనుచు
పద్యవిద్యల గరపుచు ప్రీతిమీర
శంకరాభరణము బ్లాగు చక్కగాను
నూతనోత్సాహమున నిట్లునూరుకార్లు
నడుపవలయును గిన్నిసు నందుకొనగ
నాయురారోగ్య సంపదల్ యాత్మతృప్తి
శ్రీవిభుండొసగు సతము శ్రేయమొప్ప!
గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు! శతాధిక వందనములు!
సీతాదేవి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
"సంపద లాత్మతృప్తి" అనండి. అక్కడ యడాగమం రాదు.
"పునరపి జననం పునరపి మరణం
రిప్లయితొలగించండిపునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారే"
ఏడుచు జననమగునుర చూడ గాను...
ఏడుచు ముగియును నిదిర పాడు గాను
పండుగలు కేకులన్నియు దండుగేను
జన్మదిన మంచు నిడఁ దగు శాపములను
👏👏👏👏👏👏
😊😊😊😊😊😊
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జనన మరణాల నడిమి నాటకం దండుగే. అయినంతమాత్రాన శాపాలెందుకు?
🙏🙏🙏
తొలగించండిఏదో సరదాకి. మరో ప్రయత్నం చేస్తాను.
ఓసి నీ ముండమొయ్య! యు, ఓరి వెధవ!
తొలగించండిదుంప తెగ! పాడె గట్టర! కొంప గూల!
రాజమండ్రివి ముద్దుల పూజ లివ్వి !
శంకరయ్య శుభంకర! శాప మేల!
...వెధవ = వెయ్యేళ్ళు. ధనముతో. వర్ధిల్లు!
అనితర సాధ్యమగురీతి ఒక్కరై భాస్కర భాతి దివ్య ప్రభల తెలుగు భాషామతల్లికి అను నిత్యమూ పద్య ప్రసూనములను వికసింప జేయుచూ, సంసార సాగరమందు ఉవ్వెత్తున వచ్చెడి భయంకర అలల తాకిడికి తల యొగ్గక పటుతర దీక్షాదక్షతలతో దశాబ్ది కాలంగా “శంకరాభరణం” బ్లాగు నిర్వహించుచూ వందలాది ఔత్సాహిక పద్య రచయితలను తయారుచేయుచూ మితవచనముల హితవచనములు చెప్పుచూ ముందుకు సాగుచున్న నిగర్వులు, మృదుభాషి, మాన్య శ్రీ కంది శంకరయ్య గురువులకు నమఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ బ్లాగు పదాధికారి అగు శ్రీ శంకరుడు ఆయురారోగ్యభాగ్యములతో చల్లగా చూడవలెనని ప్రార్థించుచున్నాడను.
రిప్లయితొలగించండిబాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిపూజ్య గురువులకు జన్మదిన శుభాకాంక్షలు .నిండు నూరేళ్ళు శుఖ శాంతులతో వర్ధిల్లాలని దీవించి అక్క
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు!
గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండి***********************
దీపములార్పు డ్రింకులును దేహముఁ జంపెడి తిండి యేలకో
తీపిని జూపు లడ్డరిశ తీగ జిలేబియు జీడి ఫూర్ణముల్
బాపురె కజ్జి కాయలును పాయశ చోష్యములుండగన్ స్వదే
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్!!
స్వదేశ + ఆపము = స్వదేశాపము
ఆపము = అప్పము (అప్పచ్చి)
సత్యనారాయణ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
ఆహా! స్వదేశాపములతో మీ పూరణ రసవంతంగా ఉంది. అభినందనలు.
తియ్యటి యప్పములతో మీ భావము మధురాతి మధురముగా నున్నది. కాని వ్యాకరణదోషముతో మీ సమాసము చేదుగా నున్నది.
తొలగించండిస్వదేశ కేవల సంస్కృత పదము ఆపము (అప్పము) దేశ్యము యీ రెంటి సమాస మసాధువు.
సమసించ దలచిన స్వదేశము-ఆపము: స్వదేశపుటాపము గా చేయ వచ్చును. మిమ్మలిని నిరాశ పరచి నందులకు విచారిస్తున్నాను. స్వచ్చమైన తెలుగు భాష మన యందఱి సంపద.
నే నుడివినది తప్పైన గురువు గారు నన్ను సవరించ గలరు.
కామేశ్వర రావు గారికి నమస్కారములు,
తొలగించండినిజమె, తొందరలో అది దుష్టసమాసమని గమనించ లేదు.
తెలియజేసినందుకు ధన్యవాదములు
కామేశ్వర రావు గారూ,
తొలగించండి'ఆపము' అన్నది సంస్కృతపదమన్న భ్రమలో ఉండిపోయాను. వివరణకు ధన్యవాదాలు.
సత్యనారాయణగారు విచారింప నవసరము లేదు.అప్పములకు బదులు నీళ్ళని తీసుకుంటే మీ పూరణ మప్రతిహతమే.
తొలగించండిశంకరకవీంద్రులకు జన్మదినాభినందనలు
రిప్లయితొలగించండి(శివధనుర్భంగం చేసిన శ్రీరాముని గురించి పరశురాముడు క్రోధంతో)
పాపమటంచు చింతనము పద్దునకైనను నెంచకుండగా
చాపము చేతపట్టుకొని చయ్యన రెండుగ చేసినాడుగా!
పాపడ వీడు?రాముడని పట్టుగ పేరు ధరించినాడటే?
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్.
బాపూజీ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జన్మదినశుభాకాంక్షలన్నయ్యగారు.
రిప్లయితొలగించండిఉమాదేవి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిశంకరాభరణ రాగ దీప్తికి శ్రీమాన్ కంది శంకరయ్యగారికి షష్ట్యోత్తర వత్సర జన్మదిన శుభాకాంక్షల సుమాభిషేకమును సమర్పిస్తూ:
నరకులును రావణుల గొల్చు నయవిహీను
లెగిరిపడియు జల్సాలకు లెక్క యనుచు
సంబరంబుల జరిపిన సకల పాప
జన్మదినమంచు నిడదగు శాపములను
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆపుకొనంగ లేరవని నాడిన చేష్టలకైన యుత్సవాల్
బాపురె!దుష్ట పాలనకు బట్టె దినంబొక వత్సరమ్మనన్
యేపున జర్పుకోరె యిది యెట్టి సుసంస్కృతి యౌనొ వారికిన్
శాపము లిచ్చుటే తగును జన్మ దినోత్సవమందు నెల్లరున్
సత్యనారాయణ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'అనన్+ఏపున' అన్నపుడు యడాగమం రాదు. "వత్స్రరమ్మిదే।యేపున.../ వత్సరమ్మన। న్నేపున..." అనండి.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు.
శంకరార్యులకు జన్మదినోత్సవ సందర్భముగా నమ:పూర్వక శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిపలుక వలయును మిత్రుడౌ వాని జేరి
జరుపు కొను మిట్లె వందేళ్ళు సంతసముగ
జన్మదినమంచు, నిడదగు శాపములను
ధరణి పైనన్న వాక్యంబు తగదు జూడ.
కోపము జూపు టెల్లగతి కూరిమి బంచక మిత్ర కోటికిన్
శాపము లిచ్చుటే, తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్
శ్రీపతి దీవెనన్ సుఖము క్షిప్రజయంబుల నందు చుండు మా
యీ పృథివీతలంబుపయి నెప్పుడు నీవని పల్కు టేవిధిన్.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
విరుపుతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పద్యవిద్యనునేర్పెడుబ్లాగు తోడ
రిప్లయితొలగించండితెలుగుభాషామతల్లికి దీప్తి నొసగి
మొక్కవోని దీక్షనుజూపి మోదమలర
నిత్య యజ్ఞము జేసెడు నీకు జయము
శ్రీరామ్ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మాస్టరుగారికి జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిగోలి వారూ,
తొలగించండిధన్యవాదాలు.
గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు_🎂
రిప్లయితొలగించండికంది' గురుదేవులకు శుభకామనలను
జన్మదినమంచు నిడఁ దగు, శాపములను
దొలఁగ, ముదిమి జీవనఁపు సంతోషమంద,
నాలుమగల నొక్కటి జేయు నాశతోడ.
సహదేవుడు గారూ,
తొలగించండిశుభాకాంక్షాపూర్వకమైన పూరణ చెప్పరు. బాగుంది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. జన్మదిన శుభాకాంక్షాలు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీరు, చింతా వారు, ప్రభాకర శాస్త్రి గారు ఆశ్రమానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సత్కరించి, ఆత్మీయంగ ముచ్చటించి మహదానందాన్ని కలిగించారు. అందరికీ ధన్యవాదాలు.
పాపము! చెల్లెలిన్ మరియు బావను దా చెరసాలనుంచియున్
రిప్లయితొలగించండిపాపలు పుట్టినంతటనె పాశవికంబుగఁ జంప కం సుడున్
శాపము లిచ్చుటే తగును, జన్మదినోత్సవమంచు నెల్లరున్
గోప కులాగ్రజున్ మదిని గొల్చుచు నష్టమిపర్వమందునన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గురువరులకు
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు
శ్రీ కంది శంకరయ్య గురువరులకు
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలు
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
చంద్ర దోష ముండగ బోదు చవితి నాడు
రిప్లయితొలగించండినాదు సుతునిపూజలు చేయ ముదము తోడ,
ఎల్ల జనులు నుండ్రాళ్ళను ఈ సుతునకు
జన్మదిన మంచు నిడదగు ,శాపములను
కొలది వెసలుబాటు నిడి తెలిపె గౌరి
తనను వేడిన వేల్పుల తపన గాంచి
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది.
జంప కంసుని యష్టమిన్ జన్మనొంది
రిప్లయితొలగించండియష్ట కష్టములను పొందె నచ్యుతుండు
రక్కసులు జన్మ నొందగ రాదనంగ
జన్మదిన మంచు నిడఁ దగు శాపములను
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముట్ట నింక నే మద్య మెప్పట్టు నైన
రిప్లయితొలగించండినాశఁ జెంద నన్యాయంపు టాస్తి కనుచు
సార్థకంబై పఱంగఁగ సత్యముగను
జన్మదిన మంచు నిడఁ దగు శాపములను
[శాపము = ఒట్టు]
పాపము నీళ్ళు లేక జన వారిధి శోషిలి యుండ వచ్చునే
నీ పరిపక్వ భావముల నేర్పున గూర్పుము సౌఖ్య శాంతులం
గూపము లేవి లేవనుచుఁ గోరిరి కేంద్ర దయా విభాజి తాం
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్
[విభాజిత+అంశ+ఆపము = విభాజితాంశాపము]
పూజ్యులు శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు!
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిఆయు రారోగ్యమైశ్వర్య మందుకొనుచు
రిప్లయితొలగించండివిశ్వకీర్తి బొందమని దీవెనల నెల్ల
జన్మదినమంచు నిడదగు, శాపములను
పగతురకయిన నేమిరా! వలదు వినుము.
పాపియె యైన, వాడు నయ వంచకు డైనను కూడదందునే
తాపము జెంది శత్రువని దల్చుచు నాశము జేయగోరుచున్
శాపము లిచ్చుటే, తగును జన్మది నోత్సవ మంచు నెల్లరున్
గోపము వీడుచున్ హితము గోరుచు గూర్చుచు క్షేమలాభమున్.
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పుట్టిటిరట యీరోజున
రిప్లయితొలగించండిపుట్టిన యోసామి! మీకు పూర్వపుమీయీ
చట్టునిసుబ్బారావును
బిట్టుగనావందనములుబేర్మిని గొనుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
కోపముతోడ దిట్టుచును గొట్టెడి వానిని సంబరంబులో
రిప్లయితొలగించండిశాపము లిచ్చుటే తగును, జన్మదినోత్సవమంచు నెల్లరున్
పాపకు నివ్వదీవెనలు వచ్చిరి పాపము వారినట్టులన్
పాపకు తండ్రియే కుటిల పాతకు డట్టుల జేయు టొప్పునే.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
.......పూజ్య గురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు......
రిప్లయితొలగించండిప్రేమ తోడ పెద్దలకును పిన్నలకును
చెప్పవలెశుభాకాంక్షలు చెన్నుగాను
జన్మదినమంచు, నిడదగు శాపములను
ధరను నాశము జేసెడు దంభకులకు!!!
శైలజ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి జన్మ దిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిప్రతి పాదములో మొదటి అక్షరము కలిపి చదువుకోవలెను 5,8,14,15 పాదాలలో రెండవ అక్షరము చదువు కోవలెను కవి మిత్రులారా ఇది ఒక చిన్ని ప్రయత్నము నూతన రీతిలో శుభాకాంక్షలు తెలుప దలిచాను. తప్పులు చూడకు సుమీ. ఇంకను ఎందరో కవి మిత్రుల అందరి పేర్లు ఇమడ్చ లేక పపోయాను అన్యధా భావిoచ వలదు ,
గుచ్చ కంబయ్యెనుగ మూర్తి కూర్పులన్ని
రుక్కు లాయెను కామేశు చక్క నైన
వు(ఉ)త్ప లమ్ములు ,శాస్త్రిచే ఉత్పతములు
గాధ వోలె ప రవశించ, గరిత నేదు
నూరి యల్లిక సతతము నుసుము నిడగ, (5)
కిటుకు లొప్పు చుండుజిలేబి కేలు సృష్టి,
జలధి సమము మిస్సన్నశైలి యెపుడు,
సన్మతికి శర్మ పూర్ణ ముల్ సంతస మిడు, (8)
దిట్ట ఐ నొప్పు పద్యముల్ పిట్ట వెపుడు,
ననుచు చుండు బల్లూరి కవనము లెపుడు,
శుక్తి తీర్ధమే సీతమ్మ సూక్ష్మ బుద్ధి ,
భావ యుక్తమౌ సహదేవు పదము లన్ని
కాంతి నిడునుజిగురు వారి కల్పితములు
దీక్ష గల మమ్ము కాచoగ దేవుడిచ్చు (14)
సులువుగ శత వత్సరములు శోభ తోడ (15)
సూర్యకుమార్ గారూ,
తొలగించండిముందుగా ధన్యావాదాలు.
మీ ప్రయోగం ప్రశంసింపదగినది. పద్యంలో కొన్ని లోపాలున్నవి కాని ఇప్పుడిక్కడ ప్రస్తావించడం లేదు. అభినందనలు.
బాగుందండి.అభినందనలు మరియు ధన్యవాదములు
తొలగించండిdhanyvadamulu
తొలగించండిరామనవమిని పూజలు రాఘవునికి
రిప్లయితొలగించండిపానకము వడపప్పులు పంక్తిగూర్చి
జన్మదినమంచు నిడదగు, శాపములను
బాపుకొనుటకు శుభముల బడయగాను
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
17.07.2017.శంకరాభరణము
రిప్లయితొలగించండిసమస్య:శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమందు నెల్లరున్
పూరణ:పాపులు,దుర్నయుల్,ప్రజల బాధలు పెట్టెడి క్షుద్ర హింస్రులన్
శాపములిచ్చుటే తగును. జన్మదినోత్సవమందు నెల్లరున్
దీపము పెట్టి శాంకరికి తీర్థములాడగజేసి కోవెలన్
పాపహరున్ శంకరుని భక్తిని యర్చన సేయగా వలెన్
సమస్య:జన్మ దినమందు నిడదగు శాపములను
పూరణ:పుణ్యమూర్తులు సజ్జనుల్ పుట్టినపుడు
తీరుగన్ చిరజీవిగ దీవనలను
జన్మదినమందు నిడదగు.శాపములను
కీడు జేయంగ బూను ని కృష్టులకును
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
గురుదేవులకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండితిమ్మాజీరావు
ధన్యవాదాలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువుగారికి వారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మేలుబంతిగ చెలగుచు మెఱయు నట్టి
వాని నెంచి సత్కార సంభావనలను
జన్మదినమంచు నిడదగు; శాపములను
దుష్ట శీలుని కిడదగు దొసగు లెంచి
రాజారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువునకుఁ బురస్కారముఁ గరముతృప్తి
రిప్లయితొలగించండిజన్మదినమంచు నిడఁ దగు, శాపములను
పెట్టుచుంద్రు కుమతితోడ చెట్టగొనుచు
స్వార్థపరులైన శిష్యులు వాదులాఁడి
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆయు రారోగ్యమైశ్వర్య మందుకొనుచు
రిప్లయితొలగించండివిశ్వకీర్తి బొందమని దీవెనల నెల్ల
జన్మదినమంచు నిడదగు, శాపములను
పగతురకయిన నేమిరా! వలదు వినుము.
పాపియె యైన, వాడు నయ వంచకు డైనను కూడదందునే
తాపము జెంది శత్రువని దల్చుచు నాశము జేయగోరుచున్
శాపము లిచ్చుటే, తగును జన్మది నోత్సవ మంచు నెల్లరున్
గోపము వీడుచున్ హితము గోరుచు గూర్చుచు క్షేమలాభమున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాపము వైరి వర్గము శబాసని మెచ్చదు మంచిచేసినన్
రిప్లయితొలగించండిచూపదు యించుకంతదయ చోద్యముగా పగవాని యున్నతిన్
సైపదు వారి పోకడలు సర్వజనమ్ములు నీసడించినన్
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవ మందు నెల్లరున్
వీటూరి భాస్కరమ్మ
చిన్నవారలు యున్నతి చేరునపుడు
రిప్లయితొలగించండితనరి పొగడంగ నాయుష్షు తగ్గుననుచు
పెద్దలందురు కావున పెద్దలెపుడు
జన్మదినమందు నిడదగు శాపములను
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పాపమనస్కులై బ్రతుకు ప్రల్లదు లెప్పుడుఁ చేయు కార్యముల్
రిప్లయితొలగించండిశాపము లిచ్చుటే, తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్
చూపుచు నెయ్యమున్ కరము సోంపగు మాటలతోడ నెట్టిదౌ
లోపములెంచకుండగను రూఢిగ పెద్దలగౌరవించుటే
రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గారికి అరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించండిచం.
సకల గుణాన్వితోన్నతుఁడ, చారు సుకీర్తిత ధన్య జీవుఁడా,
వికసిత బుద్ధివైభవుఁడ, విజ్ఞుఁడ, శాంతుఁడ, జ్ఞానమూర్తి, స
త్ప్రకటిత పండితోత్తముఁడ, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
దొకరుఁడ కంది శంకర బుధోత్తమ, జన్మదినోత్సవాంజలుల్!
కం.
హృద్యములగు పద్యమ్ముల
నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
శ్రీద్యుతి చెన్నలరారన్
సద్యః ప్రభలొలుక రచన సాగించెదయా!
ఆ.వె.
ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
సుంతయేని విసువు వంత నిడదు!
ఇంత భావదీప్తి నెంతు నుతింతును
సాంతముగను జదివి సంతసింతు!
సీ.
బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో
రాణించి యెదిగిన రత్న మీవు;
శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి,
విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి,
తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి,
దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము
ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక
హితముఁ గల్గించు స్నేహితుఁడ వీవు;
కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు
చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్
రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!
తే.గీ.
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
పర సతీ మణులను దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!
*శుభం భూయాత్*
*మధురకవి గుండు మధుసూదన్*
మధుసూదన్ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మధు సూధన్ గారు చక్కగా మధువునో లేక సుధనో మాకు అందించారు. ధన్యవాదములు మధుసూ
రిప్లయితొలగించండిధన్ గారు.
సుకవి మిత్రులు కృష్ణ సూర్య కుమార్ గారూ నమస్సులు! మీ ఆదరణకు సహృదయతకు అభిమానమునకు కృతజ్ఞుడను. ధన్యవాదములు!
తొలగించండికవిపుంగవులు మధుసూదన్ గారికి నమస్సులు. గురువు గారి స్వాభావిక గుణ గణాల నింత చక్కగా వర్ణించుట మీకే సాధ్యము. గురువు గారి విషయములో నెంత చెప్పినా తక్కువే యగు ననడ మతిశయోక్తి కాదు.
తొలగించండిమీ పూరణలను తిలకించు భాగ్యము నుండి మమ్ము దూరము చేయకండి.
శ్రీయుతులు మధుసూదన రావు గారు, శ్రీయుతులు కామేశ్వర రావు గారూ, కవి మిత్రులూ:
తొలగించండికొన్ని గంటల క్రితం నేనూ, శ్రీయుతులు సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీయుతులు చింతా రామకృష్ణారావు గారూ, శ్రీమాన్ శంకరయ్య గారిని కలిసి కాసేపు ముచ్చటించి వచ్చితిమి. బహు సంతోషమైనది.
"సత్సంగత్వే నిస్సంగత్వం..."
ధన్యవాదాలండీ కామేశ్వర రావుగారూ! మీ అభిమానానికి కృతజ్ఞుడను!
తొలగించండిచాలా సంతోషమండీ శాస్త్రి గారూ!శంకరయ్య గారిని కలువగలిగినందుకు మీరు ధన్యులు! మీ అందరికీ అభినందనలు!
తొలగించండి
రిప్లయితొలగించండిగురువర్యులకు జన్మదినశుభాకాంక్షలు.
ఆ.వె:గౌరి శంకరుండు కైలాసముననుండి
భక్తజనుల బ్రోచు వాసిగాను
కంది శంకరయ్య కమ్మని బ్లాగుతో
ఛాత్ర తతిని ముంచు సంతసాన.
ఆ.వె:కంది శంకరులిట కమనీయమైనట్టి
హృద్యమైన పద్య పాదములను
నర్ధరాత్రులందు నలయక నిడుచుండ
పూర్తి చేయు వాంఛ ముందు కలుగు.
తే .గీ:పద్యవిద్యను నేర్పగ వసుధయందు
బ్లాగునొక్కటి తెరువంగ పద్యములను
వ్రాయ దలచిన కవులెల్ల వ్రాయుచుండ
యలుపు లేకసవరణలు సలుపుచుంద్రు.
ఉమాదేవి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మధుసూధన్ గారి పద్యాలు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ బల్లూరి వారూ!
తొలగించండిమాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
ఈశ్వరానుగ్రహం మూలాన మీరు కుటుంబక్షేమస్థేమాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ, ఇతోధికసాహితీసేవ కావిస్తూ మీ విద్యావంశానికి అమందానందాన్ని కలుగజేయాలని పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు!
ద్రుహిణాంభోజముఖీపదాబ్జయుగవిద్యోతార్తవౌఘంబుఁ బ్ర
త్యహముం గూర్చుచు “శంకరాభరణ” విద్యాహృద్యపద్యాకృతిన్
మహముం దీర్చు మహామహా! శుభము లింపారంగఁజేయన్ ముహు
ర్ముహురావృత్తిని వొందు నీ దినము సమ్మోదమ్ము దీపింపఁగన్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఏల్చూరి వారూ,
తొలగించండిధన్యుఁడనైతిని...
రిప్లయితొలగించండితే.గీ:పేద వారిని ప్రేమగ పిలిచి దాన
ములను చేయుచు నన్నియున్ ముదము తోడ
జన్మదినమంచు నిడదగు;శాపములను
తొలగ జేయుచు సుగతుల కలుగ చేయు.
తే.గీ:జన్మదినమంచు నిడగను శాపములను
దీవెనలటంచు నెంచుచు దీర్ఘ దండ
మిడగ శాపము గీపముల్ యిలను పరుగు
దీయ దైవకృపయు కల్గి దీవెనగును.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పద్యవిద్యనునేర్పెడుబ్లాగు తోడ
రిప్లయితొలగించండితెలుగుభాషామతల్లికి దీప్తి నొసగి
మొక్కవోని దీక్షనుజూపి మోదమలర
నిత్య యజ్ఞము జేసెడు నీకు జయము
కోపము తాపమున్ మదము క్రోధము మోహము ద్వేషభావమున్
రిప్లయితొలగించండిగోపన మోసమున్ కినుక క్రూరపు చింతన భేదభావమున్
పాపము శోకమున్ భవపు వ్యాధుల బాధల చంపుమా! యనిన్
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్!
పాపము జేయుమో తినుచు బంగరు కొండలు భారతమ్మునన్
రిప్లయితొలగించండికోపము జేయుమో కసిరి కొట్టగ వచ్చిన టాక్సువారినిన్
చూపుము కోటి రూప్యముల సుందర మండిత లాంఛనమ్ములన్...👇
శాపము లిచ్చుటే తగును జన్మదినోత్సవమంచు నెల్లరున్