డా.పిట్టా (వరుని,వధువుల నామ/జన్మ నక్షత్రముల గణనకు 6,8 రావడం షష్టాష్టకము అంటారు.వీరికి జంట కూడదని శాస్త్రం.ఆర్యా,నేను వివాహ లగ్నముల లిస్టు ఇప్పటి వలె పంచాంగంలోయివ్వబడని నాడు లగ్న పత్రికను రూపొందించినాను1960 దశకంలో.పంచకరహితం చేసి శుభ లగ్న తేదీలు యిస్తున్నారీమధ్య.)
కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న మధ్యాహ్నం స్కూటర్‍పై బయలుదేరిన నేను దారిలో రాత్రి ఒక మిత్రుని ఇంట్లో పడుకొని ఉదయం బయలుదేరి ఈ మధ్యాహ్నం హైదరాబాదు సమీపంలోని వృద్ధాశ్రమం చేరుకున్నాను. ప్రయాణపు బడలిక ఎక్కువగా ఉంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకొని సాయంత్రం మీ పూరణలను పరిశీలిస్తాను. ఆలస్యానికి మన్నించండి.
భాస్కరమ్మ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'గర్భమందు తా। నష్టమి...' అనండి. రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. "వచియింప మనము శ్రేయ..." అనండి.
కష్టము లకునిల యమ్మని
రిప్లయితొలగించండిఅష్టమి తిధి,శుభకరమని యందురు విజ్ఞు
ల్లిష్టము గాదని నవమిని
షష్టిని కలహమ్మనుచు సప్తమి కోరన్
క్షమించాలి
తొలగించండిరెండవ పాదం మొదలు " యష్టమి తిధి " అని ఉండాలి
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విజ్ఞుల్+ఇష్టము' అన్నపుడు విజ్ఞు లిషము.. అవుతుంది. లకారద్విత్వం రాదు.
అష్టమి కృష్ణుని జన్మము;
రిప్లయితొలగించండిదుష్టుడు మహిషాసురుడను దుర్గాష్టమినన్
కష్టముల పాలు జేసిన
యష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శంకరాభరణం' సమూహంలో పెట్టిన సూచనను గమనించండి.
అష్టమి నాడు శుభుoడు గ
రిప్లయితొలగించండిద ష్టధుముడు, అమ తిది శోభ తమిళుల కిచ్చున్
కష్టపడి పనులు చేసిన
అష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్"
ష్టధుముడు = చంద్రుడు అమ = అమావాశ్య అష్టమి నాడు పూర్ణ చంద్రుడు శుభుడే అమావాశ్య తమిళులకు మంచిది గదా
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ష్టథుముడు ముందున్న ద గురువు కాదు. దానితో గణదోషం.
డా.పిట్టా
రిప్లయితొలగించండికష్టము "పంచకరహితము"1
అష్టమినే యొప్పుకొనిన నదియగులే ని
ర్దిష్టము పెళ్ళికి మాత్రము
అష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్!
(తిథి,వార,నక్షత్ర,యోగ,కరణముల తో గణింపు)
డా.పిట్టా
రిప్లయితొలగించండికష్టము,షష్ట మష్టకము గాంచని లెక్కకు నౌను జంట సు
స్పష్టము వారమున్ తిథియు పాదుగ తార(నక్షత్రం)యు యోగ, కర్ణ1 ని
ర్దిష్టము లగ్న నిర్ణయము దివ్యము ముఖ్యముగాను పెళ్ళికిన్
అష్టమి నాడు సేయదగు నన్నిపనుల్ శుభమండ్రు విజ్ఞులే!
1(అష్టమి తిథి,"పంచకరహిత"గణనకు యోగించును)
డా.పిట్టా
రిప్లయితొలగించండి(వరుని,వధువుల నామ/జన్మ నక్షత్రముల గణనకు 6,8 రావడం షష్టాష్టకము అంటారు.వీరికి జంట కూడదని శాస్త్రం.ఆర్యా,నేను వివాహ లగ్నముల లిస్టు ఇప్పటి వలె పంచాంగంలోయివ్వబడని నాడు లగ్న పత్రికను రూపొందించినాను1960 దశకంలో.పంచకరహితం చేసి శుభ లగ్న తేదీలు యిస్తున్నారీమధ్య.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పంచాంగ పరిజ్ఞానానికి నమస్సులు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డాపిట్టానుండి
తొలగించండిఆర్యా, ధన్యవాదాలు
నిన్నటిపద్యమోసారి చూడండి అన్నయ్యగారూ
రిప్లయితొలగించండిసకలము దెల్పెను వ్యాసుడు
నకులుండేవరుసగు నాద్రుపదునకున్
నకళంక చరితు డెవరన
శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే.
అష్టమి నాడే పుట్టెను
నిష్టముతో కంసు జంప నిలకృష్ణుండున్
నిష్టతొ పూజలుసలుపుట
కష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్"
యష్టభుజములను దాల్చుచు
నష్టమినాడే దునిమెను నావేశముతో
కష్టములిడుమహిషుని నా
యష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్"
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నా సూచనలను 'సమూహం'లో చూడండి.
నిష్ఠగ తలచిన కార్యము
రిప్లయితొలగించండినిష్టముగా జేయగోర నిలలో జూడన్
కష్టము లేరావని దు
ర్గాష్టమి తిథిశుభకరమని యందురు విజ్ఞుల్
కష్టములను దీర్చి సదా
రిప్లయితొలగించండియష్టైశ్వర్యముల నొసగు నమ్మయె మనకున్
నిష్ఠగ కొలువగ నాదు
ర్గాష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అష్టమి,నవమీ దశమని
రిప్లయితొలగించండినిష్టూరాలేలనీతిని విడక పనుల
న్నిష్టగ జేసిన వేళల
అష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దశమి+అని' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "నవమి దశమి యని" అనండి. నిష్ట/నిష్ఠ...?
కష్టము బాపగ జనులకు
రిప్లయితొలగించండినష్టభుజమ్ముల మహోజ్జ్వలాయుధతతితో
నిష్టముగ జనించెడి దు
ర్గాష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్.
బాపూజీ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
భ్రష్టాలోచనఁ బరులకు
రిప్లయితొలగించండినష్టము గలిగించుఁ బనుల నైపుణి జూపన్
దుష్టునకు ముహూర్తమ్మన
నష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్ !!
ఇష్టము వచ్చినట్లు , తమకే గుణదోష వివేచనమ్ము సం..
పుష్టిగ నున్నదంచనెడి బుద్ధిని వీడుము , శాస్త్రబద్ధమౌ
శిష్టజనోపదిష్టమగు శ్రీకర లగ్నసమన్వితమ్మునౌ
యష్టమి నాడు చేయదగునన్ని పనుల్ శుభమండ్రు విజ్ఞులే !!
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
అ ష్టమిని బుట్ట కృష్ణుడు
రిప్లయితొలగించండిఅష్టమ తిధి శుభకరమని యందురు విజ్ఞుల్
శి ష్టుల మాటల మృతములె
యిష్టమె యా తిది య మాకు నేపని కైనన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇష్టము తోడ చేయు ప్రజ ఏనుగు మోరపు వేల్పు పూ జలన్
రిప్లయితొలగించండిదుష్ట చతుర్ధమున్ , గుహుని తోరము చేతికి దాల్చు రెల్లరు
న్షష్టి దినమ్మునన్, నవమి సంబరముల్ నర జాతియంత ఉ
త్కృష్టము తోడ చేతురట, దృష్టుల నేక రకమ్ములిచ్చ టన్
అష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్శుభ మండ్రువి జ్ఞులే"
వినాయక “”చవితి “” సుబ్రహ్మణ్య “” షష్టి”” శ్రీరామ “”నవమి”” ఇవి అన్నియు దుష్ట తిదులే మరి ఘనముగ పండుగలు చేసుకుంటున్నాము.
సూర్యకుమార్ గారూ,
తొలగించండిచక్కని సమర్థతో మంచి పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి“దాల్తురెల్లరున్” అనండి. “చేయుదురు”సాధువు. ( నర జాతియంత) చేయునట అనండి.
తొలగించండిచవితి ని నాల్గవ దుష్ట తిథి గా చెప్పి మొదటి రెండవ దుష్ట తిథులు (షష్టి, నవములు) ప్రస్తావించి మూడవ దుష్ట తిథి (అష్టమి) చెప్పక పోవడము సమర్థన భంగమే యవుతుంది.
చతుర్థము = నాలుగవది. చతుష్కము = నాలుగు.
అష్టకములు మంగళమౌ
రిప్లయితొలగించండినష్టైశ్వర్యము లొసంగు నమ్మను గొలువన్
దుష్టుల శిక్షింపగదగు
నష్టమితిధి శుభకరమని యందురు విజ్ఞల్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అష్టమి నాడు జేయఁదగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే
రిప్లయితొలగించండియష్టమి మంచిదే యనుట నయ్యది విజ్ఞుల మాటగా వున
న్నిష్టము గల్గి మామదికి నేపని నైనను జేతు మప్పుడు న్
శిష్టుల మాటలే మనకు శీఘ్రము మంచిని జేయు నెప్పుడున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీమతి జి సందిత బెంగుళూరు
రిప్లయితొలగించండిఅష్టమికష్టమిచ్చుతిథియందురనేకులదెట్టులుండినన్ !
స్పష్టముసుమ్ము జ్యోతిషవిశారదులాడినమాటలెల్ల !సు
స్పష్టమదిద్దిచూడగప్రశస్తముపర్వదినంబుకృష్టజ
న్మాష్టమి నాడుచేయదగు నన్నిపనుల్ శుభమండ్రువిఙ్ఞులే
శ్రీమతి జి సందిత బెంగుళూరు .
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుష్టపుఁ జింతలు వీడి స
రిప్లయితొలగించండిమిష్టిగ నుండిన జనులు సమీప్సిత దినమై
కష్టములఁ దీర్చు నేకో
నాష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
[ఏకోనాష్టమి = సప్తమి]
అష్టమి నాడు సేయుదురు హ్లాదముగా జను లాయు ధార్చనల్
కష్టము దీర్ప నష్టమినిఁ గల్గెను గృష్ణుడు ద్వాపరమ్మున
న్నష్టమి యన్న నేల నిల నందరి కింత భయంబు దెల్పవే
యష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. సప్తనిని ఏకోనాష్టమి అనడం ప్రశంసనీయం. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిశ్రీమతి జి సందిత బెంగుళూరు
రిప్లయితొలగించండి8, జులై 2017, శనివారం
స్పష్టముమొదలిడకర్జము
కష్టములేయష్టమితిథికలిగించుధరన్
శిష్టజనరక్షకునిజ
న్మాష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
శ్రీమతి జి సందిత బెంగుళూరు
సందిత గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
దుష్టుడగు మహిషుడు తా
రిప్లయితొలగించండికష్టములొనరించి ప్రజల కాఱియపెట్టన్
శిష్టుల శివ రక్షించిన
యష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దుష్టుండగు...' అనండి.
గురువర్యుల సవరణకు ధన్యవాదములు.
తొలగించండికష్టము లందుంటివి గద
రిప్లయితొలగించండినిష్టగ గార్యమ్ము దశమి నేకాదశులన్
దృష్టి నిడి చేయ, వీడుచు
అష్టమి తిథి, శుభకరమని యందురు విజ్ఞుల్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిష్ట/ నిష్ఠ...?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :
తొలగించండికష్టము లందుంటివి గద
యిష్టఁపు గార్యమ్ము దశమి నేకాదశులన్
దృష్టి నిడి చేయ, వీడుచు
అష్టమి తిథి, శుభకరమని యందురు విజ్ఞుల్
శిష్టుల బాధలన్ నిలుపి శీఘ్రము గా సరిచేయ భూస్థితిన్
రిప్లయితొలగించండిదుష్ట పలాశిమూకలనుఁ దున్మి, మురారి జనించె సుమ్ము తా
నష్టమి నాడు, సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే
యిష్టఫలమ్మునొంద హరి కింపుగ పూజల సల్పి భక్తితో
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
, తిష్టలు వేసిన ప్రేమకు
రిప్లయితొలగించండిఅష్టమియేమడ్డుగాదు యాలోచించన్
నష్టమె ననుమానించగ|
అష్టమితిథి శుభకరమని యందురు విజ్ఞుల్
2.పుష్టిగ నున్నవాడిపరి పూర్ణత యోగముకాలయాపనే
నిష్టయు లేకనేబ్రతుకు|నిందలు వందలు వచ్చిజేరినన్
అష్టమి నాడుసేయదగు నన్నిపనుల్ శుభమండ్రు విజ్ఞులే|
కష్టము లున్నచో?తిథియు గాంచదగున్ ననుమానమందునే
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కాదు+ఆలోచింపన్ = కాదాలోచింపన్' అవుతుంది. యడాగమం రాదు. 'నష్టమె యనుమానించగ' అనండి.
అష్టమి వర్జనీయమని యార్యులు చెప్పిరి, యాదినంబునన్
రిప్లయితొలగించండికష్టము నష్టముల్ గలిగి కార్యపు విఘ్నత జెందునంచునే
స్పష్టము జేసినారనుచు సత్క్రియ లెల్లను మాననేమి దు
ర్గాష్టమి నాడు సేయదగు నన్ని పనుల్ శుభమండ్రు విజ్ఞులే.
విరించి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశిష్టులు పలికెద రనిశము
రిప్లయితొలగించండినష్టమి తిథి పెండ్లి కెపుడు నద్భుత మనుచున్
దుష్టము షష్ట్యాష్టమి లని
యష్టమి తిథి శుభకరమని , యందురు విజ్ఞుల్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పలికెద రనిశ। మ్మష్టమి... షష్ఠ్యాష్టములని" అనండి.
కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న మధ్యాహ్నం స్కూటర్‍పై బయలుదేరిన నేను దారిలో రాత్రి ఒక మిత్రుని ఇంట్లో పడుకొని ఉదయం బయలుదేరి ఈ మధ్యాహ్నం హైదరాబాదు సమీపంలోని వృద్ధాశ్రమం చేరుకున్నాను. ప్రయాణపు బడలిక ఎక్కువగా ఉంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకొని సాయంత్రం మీ పూరణలను పరిశీలిస్తాను. ఆలస్యానికి మన్నించండి.
రిప్లయితొలగించండిస్పష్టము చేసెదన్ వినుము ఛాందస భావనలన్ని వీడి ని
రిప్లయితొలగించండిర్దిష్ట విధమ్మునన్ గొలువు దిద్దిన మేలగు స్ఫూర్తితోడుత
న్నిష్టము జూపుచున్ మిగుల నిత్యము వృత్తి పరంబువైనయు
న్నష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్కూటరు మీదన పయనము
రిప్లయితొలగించండిమాటల?యోసామి!మీకు మంచిదియేనా?
మాటలుకాదది కష్టము
చోటది మరి చెప్పుడార్య!చూడగవత్తున్
సుబ్బారావు గారూ,
తొలగించండిఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నాను. ధన్యవాదాలు!
గురుదేవులకు ప్రణామములు.ఈ వయసులో స్కూటరు మీద అంత దూరము ప్రయాణించటము చాలా ప్రయాస.దేవుని దయవలన క్షేమముగా చేరుకెునుట సంతోషము కలిగించింది.
తొలగించండిసృష్టికి మోదమున్ గొలుప సొంపుగ దేవకి గర్భమందునన్
రిప్లయితొలగించండిఅష్టమి రోజునన్ పొడమె నా యదునందనుడైన కృష్ణు డా
దుష్టుడు కంసునిన్ దునుమ తొల్లి ధరాతలమందు జూడగా
నష్టమి నాడే జేయదగునన్ని పనుల్ శుభమంద్రు విజ్ఞులే
వీటూరి భాస్కరమ్మ
సృష్టిని గలిగిన తిధులవి
రిప్లయితొలగించండిశిష్టులు వచియింప శ్రేయమ్మొసగున్
షష్టియు చవితిని బోల్చగ
నష్టమి తిధి శుభకరమని యందురు విజ్ఞుల్
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'గర్భమందు తా। నష్టమి...' అనండి.
రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. "వచియింప మనము శ్రేయ..." అనండి.
ఇష్టముతో నొనరించిన
రిప్లయితొలగించండినష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
స్పష్టము, తిథులన్నియు నే
కష్టములొనగూర్చుబోవు కర్మేష్టులకున్.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...గూర్చబోవు'
డ్యూటీకి తగదు డుమ్మా,
రిప్లయితొలగించండిలేటుగ పరిశీలనమ్ము లేల తెలుపుమా,
స్వీటు సవరణల నిమ్మా
రొటీను ఎక్స్యూజ్ లు మాకు రుట్టు నిడునమ్మా
మలి సంధ్యలో స్కూటరు పైన ప్రయాణము వలదనుచు గురువు గారికి క్షమాపణములతో సరదాగా వ్రాసిన పద్యము అన్యధా భావించ వలదు
సూర్యకుమార్ గారూ,
తొలగించండిధన్యవాదాలు. మలిసంధ్యలో ప్రయాణం చేయలేదు. ఒక మిత్రుని ఇంట్లో ఉండి ఉదయం బయలుదేరాను.
కష్టం బిదియని యెంచక
రిప్లయితొలగించండియిష్టంబుగ దీక్ష బూని యేపని నైనన్
తుష్టిం బొందుచు జేసిన
నష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
కష్టముగా దలంచకను కార్యమునందున శ్రద్ధబూనుచున్
దుష్టిని గూర్చునందలపుతో చరియించుచు నుండి దానినే
యిష్టము గాగ నెంచినను యెల్లెడ సందియ మింత లేదుబో
యష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కష్టము లిడదట పనులకు
రిప్లయితొలగించండినష్టమి తిథి! శుభకరమని యందురు విఙ్ఞుల్
నష్టము లాభము లెంచక
నిష్టము తోడుత మొదలిడ నే దినమైనన్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
కష్టములు కలుగునంచును
నష్టమి రోజెట్టి పనియు గైకొనరెవరున్
నష్టము లేనట్టిది దు
ర్గాష్టమి తిథి శుభకరమని యందురు
విజ్ఞుల్.
***************************
కష్టము లని భావింతురు
రిప్లయితొలగించండిఅష్టమితిధులే గలవు శుభా తిధులు రెండు
అష్ట ములు దుర్గ కృష్ణా
అష్టమి తిథి శుభకరమని యందురు విజ్ఞుల్
తిష్టలు వేయుచున్ మురిసి తీరిక నొప్పుచు గప్పుకొట్టుచున్
రిప్లయితొలగించండిసుష్టుగ రాజభోగులను సూజియు హల్వను లూచి యాలునున్
కష్టము లేకయే తినుచు కల్కట వంగలు పండలందు దు
ర్గాష్టమి నాడు సేయఁ దగు నన్ని పనుల్ శుభ మండ్రు విజ్ఞులే