20, జులై 2017, గురువారం

సమస్య - 2415 (కుండలోనఁ జొచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు"
(లేదా...)
"కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే"
వేంకట రామకృష్ణ కవుల (19వ శతాబ్దం) పూరణ....

కొండలు రేగి లోకముల గుండలు సేయుచునుండఁ జూచి యా
ఖండలు డుద్ధతుండయి యఖండపరాక్రమ మొప్ప ఱెక్కలన్
జెండఁ గడంగుటం దెలిసి శీతనగాత్మజుఁ డబ్ధి వజ్రి రా
కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డిదే"

64 కామెంట్‌లు:

 1. (మైనాకుడు స్వీయరక్షణార్థం సముద్రంలో దాగటం)
  కొండరెక్కలన్ని కోసివేయగదలచి
  అరుగుదెంచె వజ్రి యమితకోపి;
  సాగరమ్ము గాంచి సత్వరమున నంద
  కుండ జొచ్చె మంచుకొండకొడుకు.

  రిప్లయితొలగించండి
 2. కొండ చరియ లోన నుండు బాబా రామ
  దేవు డమ్మె నెయ్యి తేనె నూనె
  మ్యేగి బదులు మనవె మేలైన నూడుల్సు:
  "కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు"

  రిప్లయితొలగించండి
 3. ఉత్తర గోగ్రహణ సందర్భములో ద్రోణుని పలుకులు:-

  కొండల వంటి పాండవులు కుంజర యూధము దోమ కుత్తకన్
  నిండుగ నిల్చినట్లు మరి నిల్చె విరాటుని కొల్వులోన, మా
  ర్తాండుని వోలె వచ్చెనిట ధర్మజు దమ్ముడు, నేటి దాక యా
  కుండను గొండ సొచ్చె, నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   అద్భుతంగా ఉంది మీ పూరణ. రెండు ప్రసిద్ధ పద్యాలను గుర్తుకు తెచ్చారు (కుంజరయూధమ్ము... సింగం బాకటితో...). అభినందనలు.

   తొలగించండి
 4. బండను ద్వారమందు నవబాధగ నిల్పి పురంబుకేగినన్
  దండన జేయనెంచి తన తమ్ముని జంపగ నిశ్చయించునా
  గండని జూచి కంపమున కాళ్ళకు కృత్యము జెప్పి వాలి రా
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణికుమార్ గారూ,
   వాలి, సుగ్రీవుల వైరాన్ని విషయంగా స్వీకరించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 5. డా.పిట్టా
  దైవభాషగాదె ధారుణి హిమనగం
  బిందు మ్లేచ్ఛ భాష యిమిడె దాని
  మూలమెవ్వడెంచె మొలలేని యాంగ్లపు
  కుండ జొచ్చె మంచు కొండ కొడుకు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   ఎవరెస్ట్ శిఖర నామకరణ విషయాన్ని గ్రహించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 6. ఆగ్రహమున వచ్చెడదితి సుతుని గాంచి
  భయము తోడ బాఱె పర్వతమ్ము
  సాగరమును జూచి శచిపతికిక యంద
  కుండఁ జొచ్చె మంచు కొండ కొడుకు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాట్సప్‍లో చేసిన సూచనలను గమనించండి.

   తొలగించండి
 7. డా.పిట్టా
  అండయె లేనినాడొకట నన్ని ప్రభుత్వపు నేలలన్నిటన్
  కుండయె బోల్చగా భువిని గొన్నది యా బ్రిటనప్పుడా దిశన్
  దండిగ నాంగ్లభాష నిక దైవతభాషను బోల్చి జెప్పగా
  కుండను గొండ సొచ్చె నిదిగో భయ విహ్వలతన్ గనుండదే!

  రిప్లయితొలగించండి
 8. అమ్మ తిట్టెననుచు నమ్మమ్మకున్ జెప్ప
  కుండఁ జేరె మంచు కొండ, కొడుకు
  విఘ్నపతి యటంచు వేనోళ్లు నిందించ
  బాధయని యపర్ణ బదులు పలికె!

  రిప్లయితొలగించండి
 9. చక్కనైన మానస సరోవరము గాంచ
  సాహసంబు జేసి చనెను దిట్ట
  అమ్మ నాన్నలెంత యన్న వద్దని విన
  కుండ జొచ్చె మంచు కొండ కొడుకు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.

   తొలగించండి
 10. చక్కనైన మానస సరోవరము గాంచ
  సాహసంబు జేసి చనెను దిట్ట
  అమ్మ నాన్నలెంత యన్న వద్దని విన
  కుండ జొచ్చె మంచు కొండ కొడుకు.

  రిప్లయితొలగించండి
 11. అండను రామలక్ష్మణుల నందక చేయుచు బిక్షువై యహో!
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే!
  గండరగండడైన తను కామమునందున జిక్కినంతటన్
  గండడు లేక చూచి తగ కాహళి పొందుకు వ్యూహమెంచడే?

  రిప్లయితొలగించండి
 12. దండిగ కుంతి మాద్రిలకు తా జనియించిరి పుత్రులంచు తా
  గుండెలు పొట్టబాదుకొని కుందుచు కౌరవమాత నేర్పుతో
  నండము లెల్ల భాండమున నక్కట పేర్చిన వేళ వింతగన్
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 13. అండ నిచ్చు చుండ ననిలుండు మెండుగ
  వెండి కొండ నుండ కుండ వెండి
  వెండి తిరిగి కడలిఁ గొండపరుఁడు సూడ
  కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు

  [కొండపరుఁడు ఇంద్రుఁడు; మంచుకొండ కొడుకు = మైనాకుఁడు]


  కొండ శరాసనుండు మఱి కొండకు నల్లుడు శంభు డంబరీ
  షుండు త్రిలోచనుండు శిత శూల ధరుండు పురారి సుప్రసా
  దుండు శివుండు దూఱె నట తొఱ్ఱ భయమ్మున వక్రుఁ జూడగం
  గుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు కామేశ్వరరావు మహోదయులకు నమస్సులు. బిందుపూర్వక డ కారావృత్తితో మీ పద్యం అమోఘం. మిక్కిలి శ్రవణానందదాయకం.ప్రతిదినము ఏదో ఒక ప్రత్యేకతతో పద్యపూరణ చేయడం మీకే సొంతం. సదా మీ ఆశీర్వచనాభిలాషి…. శర్మ.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   వృత్త్యనుప్రాసతో మొదటి పూరణ, పెక్కు నామాల శివుడు శనికి కనిపించకుండా దాగినాడన్న రెండవ పూరణ అద్భుతంగా ఉన్నవి. తోపెల్ల వారి ప్రశంసలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
   శర్మ గారు మీ యభిమానానికి గౌరవానికి ధన్యవాదములు.

   తొలగించండి
 14. ఎంతొ పగను గొనుచు నెదురైన శత్రువు
  జంపుననుచు మిగుల జంకు తోడ
  నాత్మ రక్షణకును నటువైపు వైరి రా
  కుండ జొచ్చె మంచుకొండ కొడుకు
  మంచుకొండ=ఒక వర్గపు ఇంటి పేరు
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మంచుకొండను ఇంటిపేరుగా చేసి చేసిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 15. బాబా రామదేవ్ ("పతంజలి"):

  దండిగ యోగసూత్రములు దానము జేయుచు ప్రీతిగన్ నభో
  మండల మంటెడిన్ ప్రతిభ మాతల సేవకు వాడుచున్నహా!
  వండుచు నూడులున్ మరియు
  వంటల నూనెల నమ్ముచున్ న.మో.
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుండదే

  న.మో. = నరేంద్ర మోడి

  రిప్లయితొలగించండి
 16. గిరులు నెగురుచుండ సురపతి కినుకతో
  చెక్కు చుండ వాని రెక్కలెల్ల
  వాయు సాయమొంది వైజయంతునికంద
  కుండజొచ్చె మంచు కొండ కొడుకు!!!


  రిప్లయితొలగించండి
 17. భండనమందు వాలి తన ప్రజ్ఞను జూపి జయమ్మునొంది రా
  కుండుట జూచి , సోదరుడు గూలెనటంచు దలంచి తమ్ము డో
  బండను నిల్పి యాగుహను, పారగ దల్చినయంత వైరి రా
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే

  రిప్లయితొలగించండి
 18. తాటి కల్లు ఎచట తలనుదాచుకొనెను,
  హిమ నగమ్ము పేరు సమము ఏది,
  హనుమ యేమి యగును అంజనీ దేవికి,
  కుండ జొచ్చె , మంచుకొండ, కొడుకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   క్రమాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కల్లు+ఎచట' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కల్లెట తన తలను.." అందామా?

   తొలగించండి
 19. తెగనరకుచునుండ నగముల రెక్కల
  నశనితోడుత హరి, యబ్దిలోన,
  దశశతాక్షు భిధికి తానపుడు దొరక
  కుండ, జొచ్చె మంచుకొండకొడుకు

  రిప్లయితొలగించండి
 20. చిన్నతనమునందు నన్న! నీవిక దాగు
  మనుచు హైమవతియు కనులు మూసి
  యొంట్లు లెక్క పెట్ట నుదధి గిక్కురుమన
  కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 21. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పక్షములను చెండు పాకారికి దొరక
  కుండ జొచ్చె మంచుకొండ కొడుకు
  పాథి నందు; తిరిగి పైకొచ్చి కనుపించె
  గాడ్పు కొడుకు లంక కరుగు నపుడు


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పైకి వచ్చి కనియె/తోచె" అందామా?

   తొలగించండి
 22. చండగ్రీష్మమందు జనులను జడిపించు
  మండుటెండనిండ మెండుగాను
  చలువకేంద్రమందు చక్కగా నిండిన
  కుండజొచ్చె మంచుకొండ కొడుకు!

  మంచుకొండ కొడుకు = మంచుగడ్డ
  Ice Cube

  రిప్లయితొలగించండి
 23. మంచు కొండ లాయె మాయింటి ఫ్రిడ్జులో
  నమ్మ గడ్డ పెరుగు నందు కొనుచు
  చిక్కగాఁ జిలుకఁగఁ చెక్కరతో లస్సి
  కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు

  రిప్లయితొలగించండి
 24. రెక్క లున్నకొండ లొక్క పెట్టున యెగుర
  వాసవుండు నరకె పక్షములను
  వార్ధి నాశ్రయించి పక్షయుగము తెగ
  కుండ జొచ్చె మంచు కొండ కొడుకు

  రిప్లయితొలగించండి
 25. మంచు ముక్క దెచ్చి మజ్జిగలో వేయ
  కుండఁ జొచ్చె మంచు ., కొండ కొడుకు
  గిరిజనుండొకండు గ్రీష్మమ్ములో దాని...
  నమ్మి తా గడించె నమిత ధనము !!


  భండనభీముడింద్రుడట పర్వతపక్షములన్ పవిన్ ద్విధా
  ఖండన జేయుచుండుటను గాంచె హిమాద్రి సుతుండు , గానరా....
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే"
  మండితరామభక్త హనుమంతునకాశ్రయమిచ్చె వార్ధిలో !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  సాహసమ్ము జేయ సన్నిహితుల తోడ

  నెక్కగ నెవరెస్టు నేగుచుంటి

  ననుచు,తల్లిదండ్రులనెడు మాటలు విన

  కుండ; జొచ్చె మంచుకొండ; కొడుకు.
  ****************************

  రిప్లయితొలగించండి 27. ఎక్కవలదటంచు నెంత చెప్పిన విన
  "కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు

  మాట వినక చాల మారాము చేయంగ

  తల్లి దండ్రులమది తల్లడిల్లె.

  రిప్లయితొలగించండి
 28. తల్లి యడిగి నంత తానది కాదన
  కుండ జొచ్చె మంచు కొండ; కొడుకు
  రావణుండు శివుని రంజిప మరమేశు
  దివ్య లింగ మొసగె భవ్యముగను

  రిప్లయితొలగించండి 29. భారత రణమందు పార్థ సుతుడు

  విన

  వాస స్థలమేది పశుపతికట

  కంతుడేవరుసగు కైటభవైరికి

  కుండ జొచ్చె ,మంచుకొండ,కొడుకు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాసస్థల' మన్నపుడు 'స' గురువై గణదోషం. "వాసముండు స్థలము పశుపతి కట" అందామా?

   తొలగించండి
 30. భండన భీమునిన్ తలచి భగ్గున మండెడి మత్సరమ్ముతో
  మెండుగ బంధు సోదరుల మృత్యుకు నాతడు దారితీయగా
  చండ ప్రచండ యోధుడహ చప్పుడు జేయక దాగె గుంటలో...
  కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుండదే!

  రిప్లయితొలగించండి