4, జులై 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 44 (ఏ-కా-ద-శి)


అంశము- తొలి ఏకాదశి
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.

69 కామెంట్‌లు:

 1. ఏలువాడయి విష్ణువు లీల లలర
  కాలమందున శయనించి పాలకడలి
  దరిని యాషాఢ మాసాన దయను జూప
  శిరసు వంచుక గొల్ల్తు రోచిష్ణు జిష్ణు!

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. ఏకమేవాద్వితీయమ్మనేక విధము
   కామ మోహాది బంధమ్ము కాన రాని
   దహర మందుండు హరిహర దర్శ నమిడి
   శివము నొనరించు నేకాదశిదియె నేడు

   ...కిట్టింపు...

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఏకాదశి+ఇదియె' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "ఏకాదశి యిదె నేడు" అనండి.

   తొలగించండి
 3. ఏడు గడయని ప్రీతిగ యెదను నమ్మి
  కాల మంతయు స్వప్నమై కరగి పోయె
  దశమి పూజలు విజయమై దిశను మార్చ
  శివుని గొలిచిన నీవైన జిష్ణు వనుచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ప్రీతిగ నెదను' అనండి.

   తొలగించండి
  2. ఏడు గడయని ప్రీతిగ నెదను నమ్మి
   కాల మంతయు స్వప్నమై కరగి పోయె
   దశమి పూకలు విజయమై దిశను మార్చి
   శివుని గొలిచిన నీవైన జిష్ణు వనుచు

   తొలగించండి
 4. డా.పిట్టా
  ఏడు, హేవళంబికి తొలి నేక పర్వ
  కాలమే, యమ్మకొనగ దిగాలు పొడమె
  "దశయె నాది,నోట్లకు రద్దు దనరె న"నుచు
  శివము నెత్తెను జీయెస్టి(GST)భవుడు 'మోది'!
  (ఏడు..ఏడ్వుము,సం॥రము.మోది..మోదము నందినవాడు,మోదీ)

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  నాళం కృష్ణారావు,"మీగడ తరగలు"పద్య కథా సంపుటిలోని మాటలు.ఒక పిసినారి ఉవాచ తీరులో ఈ పద్యము
  "ఏమి చెప్పుదు నరువది యేళ్ళు గడచె
  కాల మేఘాలు గ్రమ్మెనా గడవ జూతు
  దడలు,పన్నులు,రద్దులె ధర్మ చయము?
  శివ, శివా!! రమ్ము నిద్రించె సిరుల విభుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "తొలి యేక.." అనండి.

   తొలగించండి
  2. డా.పిట్టానుండి ,ఆర్యాధన్యవాదాలు

   తొలగించండి
 6. ఏరువాకను సాగించి నారు పోయు
  కాల మిదియంచు వరుణుండు కరుణజూపు
  దక్షిణాయన మరుదెంచు తరుణమిదియె
  శివసఖుడు విష్ణువుశయనించెడు దినమ్ము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   సార్థకమైన చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 7. ఏది పావనమైన రోజీధరిత్రి?
  కాళికాదేవి సహజుడు కడలిపైన
  దశమి తదుపరి శయనించు తనివితోడ
  శివము కల్గునాడు హరికి సేవఁజేయ

  రిప్లయితొలగించండి
 8. ఏటి తొలిపండు గేతెంచె యేతమిడగ
  కాలమిదియె క్షేత్రములను కలయదున్న
  దయను వరుణుడు దగినంత ధారగురియ
  శివము నివ్వగ విష్ణుండు శీఘ్రముగను!

  రిప్లయితొలగించండి
 9. ఏడు మొదటన పండుగ వేడుకగను
  కాలపురుషుని స్మరియింప కదలివచ్చె
  దయనుగోరుచు బూజించ రయము రండు
  శివము గలిగించు విష్ణునే చింతజేయ.

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. ఏల నిదురించఁ బూనెదో యెరుక మాకు
   కాల గతిఁదెల్పి యారోగ్యకరమటంచుఁ
   దలఁపు లందున నుపవాస ధర్మతతుల
   శిరముఁ దాల్చఁగ కేశవా! ధరణి జనులు

   తొలగించండి
 11. ఏవిధమ్ముగ నీలీల హేలలందు
  కార్యకారణ నియతిస క్రమము నొందు
  దయనుజూపుచు బ్రోవగ ధర్మమార్గ
  శివము,కేశవభేదని శ్శేష మందు

  రిప్లయితొలగించండి
 12. ఏరు వాకను సాగించి నారు పోయు
  కాల మీ దినమ్మె ,రైతులు కాడి పట్టి
  దరులు దున్నుచు భూమిని చాలు మధ్య
  శి వుని దలచుచు విత్తులు శీఘ్ర మేయు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "కాల మీరోజె రైతులు కాడి పట్టి" అనండి.

   తొలగించండి
 13. ఏ విధమ్మున నుతియింప నెవరికైన
  కామితమ్ముల నెరవేర్చు ఘనుడు నిదుర
  దశను విడనాడి మేల్కాంచు తరుణమిదియె
  శివుడు, విష్ణువు తానెయై చెలువు మీరి
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 14. ఏల కానఁ దర్కము శిరో ౽ హితము నేల
  కానఁ దర్శించు శయనంపు ఘస్ర మనుచు
  దళ శిఖి హరికి ముర దైత్య దళనమునకు
  శివ మిడంగ నేకాదశి యవని వెలసె


  (ఏ)ల (కా)నఁ (ద)ర్కము (శి) రో ౽ హితము నేల
  (కా)నఁ (ద)ర్ (శిం) చు శయనంపు ఘస్ర మనుచు
  (ద)ళ (శి)ఖి హరికి ముర దైత్య దళనమునకు
  (శి)వ మిడంగన్ (ఏకాదశి) యవని వెలసె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జై జయమ్ము పోచిరాజు కామేశ్వర
   రావు! పూరణములను రమ్యముగను
   చేసి మాకు ముదముఁ జేకూర్చు సత్కవి
   వయ్య! నాదు నుతుల నందుకొనుము.

   అనితర సాధ్యమైన అక్షరవిన్యాసంతో అద్భుతమైన పూరణ చెప్పినారు. అభినందనలు, మీ ప్రతిభకు వందనములు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యసామాన్యాభినందనలకు మిక్కిలి ధన్యుఁడ నయ్యాను. ధన్యవాదములు.

   తొలగించండి
  3. మాన్యులు, కవిరాజులు కామేశ్వరరావు గారికి నమస్సులు! దయచేసి మీ పూరణకు అర్ధ వివరణ చేయగలరు!
   మొదటి యొకటిన్నర పాదము అర్ధం కాలేదు!
   వివరించిన కృతార్ధులము!!

   తొలగించండి
  4. నా దృష్టి అంతా అక్షర చమత్కృతి, ఛందస్సు మీదనే. సీతాదేవి గారి వ్యాఖ్యను చూసి పద్యాన్ని రెండు మూడు సార్లు చదివాను. నారికేళ పాకమే!
   కామేశ్వర రావు గారూ, దయచేసి వివరణ ఇవ్వండి.

   తొలగించండి
  5. తర్కము (నిజమా కాదాయని) సూడనేల? శిరః+అహితము: శిరమున కహిత మేల? (తలనొప్పి), కావున హరికి [పత్రమున శిరమున్న (వట పత్రశాయి)] మురాసురుని ఖండించుటకు శయనపు దినము గా చూడు. ఆ రోజే (తొలి) యేకాదశి గా శుభముల నీయ వెలసినది ధరలో.
   మొదటి కాన అంటే చూడగా; రెండవ కాన అంటే కావున.
   శిఖము = అగ్రము/ చివర, ఇక్కడ తల, శిఖి = అగ్రము కలవాడు.

   యోగ్యాయోగ్యములు పరిశీలించ గురువు గారికి విన్నపము.

   తొలగించండి
  6. వివరణకు ధన్యవాదాలు!!🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  7. డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 15. శ్రీమతి జి సందిత బెంగుళూరు

  *ఏ*లొకో యోగ నిద్ర మమ్మేలకుండ?
  *కా*నగన్ త్రిజగమ్ములు కనలుచుండ
  *ద*నుజతత్త్వంబు తీండ్రించి తరుముచుండ
  *శి*ష్టులల్లాడుచుండనో శ్రీనివాస?

  రిప్లయితొలగించండి
 16. ఏడు లోకాల నేలెడు ఱేడు నేడు
  కాస్త నలసిపండును పాలకడలిపైన
  దశమి మరుసటి దినమున తన్మయముగ
  శివము లొసగగ జగతికి శ్రీవరుండు!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కాస్త యలసి" అనండి. నిజానికి 'కాస్త' సాధువు కాదు.

   తొలగించండి
 17. ఏలి యార్తుల నెల్లర జాలి పొంగి
  కాలు పాలికి బంపించి కంటకులను
  దశవిధాకృతుల్ ధరియించి దనుజవైరి
  శిష్టు లలరగ శయనించె శేషునిపయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   శిష్ట మనోల్లాసకరమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 18. ఏల ఏకాదశలు మనకెక్కువనగ?
  కాలరాత్రులు కరిగించ కలువరేడు
  దశ విధాలుగ భక్తి మీదరికి జేర్చు|
  శిరి మగనికిష్టమౌ “వేడుశిరమువంచు
  భక్తి భావంబు బంచెడి పర్వదినము”|

  రిప్లయితొలగించండి
 19. ఏరువాక సాగించగ కోరుకొనుచు
  కాడి పట్టుకు నడిచె, నాషాఢ శుద్ధ
  దశమి మరునాడె నీ రైతు తన్మయమున
  శిరము వంచి భువిని తాక చెన్ను గొలుపె!

  రిప్లయితొలగించండి
 20. ఏల శయనింతువో స్వామి యీదినమ్ము
  కారణమెరుగ కున్నను కలినిజనులు
  దమ్మమునుగోరుచు నుపవాసమ్ము జేసి
  శివములిడు నిను గొల్తురు శ్రీకరముగ!!!

  రిప్లయితొలగించండి
 21. ఏలికగువాడు శయనించు నేవళముగ
  కాలకడలిని కడుపున గప్పిపుచ్చి
  దక్షిణపథమ్ము బట్టగ దరణిదాను
  శివుని యర్చించు జీవులు చింతదొలగ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. డా. సీతా దేవి గారు
   కాల కడలి: కాలము (సమయము) కేవల సంస్కృత పదము, కడలి దేశ్యము. సమాసము చేయరాదు. కడలి కి బదులు వేరొక తత్సమ పదమును వాడండి. లేదా “కాలపుఁ గడలిఁ గడుపున” అనవచ్చును.

   తొలగించండి
  3. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు! మీ సవరణలు శిరోధార్యము! ధన్యవాదములు! పాలకడలి లాగ కాలకడలి యని వ్రాసేశాను! కాలజలధిని యనవచ్చునా?
   యేదో కీర్తనలో పాలజలనిధిలోన పవళించు యని చదివాను. జలధి సంస్కృత పదమేనా? జలనిధి తెలుగు పదమా?
   పరిష్కరించగలరు!

   తొలగించండి
  4. సీతా దేవి గారు:

   మీరు ఈక్రింది లింకు లో నున్న:

   ఆంధ్ర భారతి నిఘంటు శోధన వాడండి:

   http://www.andhrabharati.com/dictionary/

   దానిలో అడిగిన పదములకు అర్ధములే గాక అవి సంస్కృత సమములో దేశ్యములో వ్యావహారికములో మాండలికములో తెలియ గలరు:


   కాలము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

   [Skt.] n.
   1. Time, occasion, period.


   జలధి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

   సం. వి. ఇ. పుం.
   సముద్రము;


   కడలి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

   దే. వి.
   మున్నీరు, సముద్రము.

   ****************************
   ఆంధ్ర భారతి పరిచయం నాకు శ్రీ కామేశ్వర రావు గారి వలననే లభించినది.

   తొలగించండి
  5. జలము- అ కారాంత నపుంసక లింగము; , నిధి- ఇ కారాంత పుం.
   రెండు సంస్కృత పదములు.
   పాల కడలి, పాల జలనిధి, కాల జలనిధి, క్షీర సముద్రము: సాధువులు.
   క్షీర కడలి, కాల కడలి, క్షీర సంద్రము: అసాధువులు.

   తొలగించండి
  6. సమయం వెచ్చించి నా సందేహాలను నివృత్తి చేసినందులకు గురువులకు ప్రణామములు! ధన్యవాదములు!

   తొలగించండి
 22. ఏకపొత్తుశయనమున కేగు దినము
  కాడి గట్టగా రైతుకు కాలమిదియె
  దక్షిణాయనమాసంపు ధర్మ దినము
  శిష్ట నియమమ్ము పాటించు శ్రేష్ఠదినము

  రిప్లయితొలగించండి 23. ఏలికయ్యెనుహరి గన నీజగమున

  కాళములకైన మనుజులకైన

  దరిశనమొసగుచును బ్రోచు దైవమనగ

  శిరసువంచి మ్రొక్కుదురెల్ల జీవులితని.


  ఏక చిత్తముతోడననేకమార్లు

  కాకవెలుగు నేత్రంబుగాగలిగినట్టి

  దనుజ మర్ధనుడైనట్టి దానవారి

  శివము కల్గించును సతము శ్రీశుడితడె.


  ఏడుగడయు నీవనుచును నిత్యము నను

  కావుమనుచు ప్రార్థన సల్ప గడియలోన

  దరిశనమొసగిన మురారి దయను జూపు

  శివసతి యగునుమ యితని సేవ చేసె.


  ఏలువాడవు నీవయ్య యీజగమును

  కావుమనుచును వేడెద జ్ఞానరూప

  దరిశనమొసంగి ముదము/మోక్షముతప్ప కొసగి

  శివము కూర్చుము మాకిల శ్రీనివాస.


  ఏవిధినిను గొలుతునయ్య నిలను నిన్ను

  కరుణజూపు మనుచు మోడ్తు కరములనిట

  దయగలవాడవనుచును దెలిసినంత

  శిరసు వంచి వేడంగ వచ్చితిని స్వామి.

  రిప్లయితొలగించండి
 24. ఏరు దాటగ జూడగా పారు నీరు
  కాలు మోపగ లేనట్టి గతిని సాగ
  దనకు దారేది యని గుండె దడదడ యన
  శివ శివా గావు మీవని జీరె నొకడు


  నిన్నటి సమస్యకు నాపూరణ

  పొద్దు గ్రుంకి నంత పోట్ల కాయను త్రుంచ
  పడతి చేరి నంత పందిరి కడ
  తిట్లు ,కొట్లు ,మొట్లె తిరముగ గల్ల చీ
  కట్లపాము చేరి కౌగిలించె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని ఎక్కడా 'తొలి ఏకాదశి' ప్రస్తావన లేదు.
   మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. ఏడు కొండల కేగుదు రీదినమున
  కాలి నడకతో మొదటి యేకాదశియని
  దర్శనమ్ముకై భక్తులు తరలి పోయి
  శివుని హరిని స్మరింతురు చిత్తమలర

  రిప్లయితొలగించండి

 26. పిన్నక నాగేశ్వరరావు.

  ఏమి భాగ్యమో శ్రీవేంకటేశ! మమ్ము

  కావగా సప్త గిరులపై కాలిడితివి

  దర్శనమునకు మేము నీ దరికి జేరి

  శిరసు వంచి మ్రొక్కిడుదుమో శ్రీనివాస!

  ****************************

  రిప్లయితొలగించండి
 27. ఏల పూజలు వ్రతములవేలనయ్య
  కాని దీక్షలు సలుపుట దేనికయ్య
  దవ్వునకు ద్రోయు సిరులకై తపన మాని
  శివుని పద సన్నిధిని కోర భవము వెలుగు

  రిప్లయితొలగించండి