'సని' అంత ప్రసిద్ధమైన పదం కాదు. కేవలం పర్యాయపద నిఘంటువు తప్ప మరే నిఘంటువు ఆ పదాన్ని పేర్కొన లేదు. 'సని'కి బహువచన రూపం 'సనులు'. అక్కడ "వే।దాంగార్చన శౌచమందు..." అనవచ్చు గదా!
బాపూజీ గారూ, మీ పూరణ బాగున్నది. కాని మొదటి పాదాన్ని లఘువుతో ప్రారంభించారు. కందపద్యంలో పాదాద్యక్షరాల గురులఘు సామ్యాన్ని పాటించాలి. అంటే మొదటి పాదం గురువుతో మొదలైతే మిగిలిన పాదాలు గురువుతోనే మొదలు కావాలి. మొదటి పాదం లఘువుతో మొదలైతే మిగిలిన పాదాలు లఘువుతోనే మొదలు కావాలి. "ఆ గిరిధరు జేరగలవు" అందామా?
భగవంంతునిభాగవతంంపైైన ఇలాంంటి వెకిలి సమస్యనిచ్చినవాడు అనుమతింంచిన వారు భాగవతమును చదివినప్పటికి పాపమును పొంందుగాక! అని గురువుగారుశపింంచినంంత పని చేశారన్నమాఠ!
రోగముతో మూల్గు పతికి
రిప్లయితొలగించండియోగము మంత్రము జపమ్ము
యోగ్యమ్మనుచున్
గూగులులో వేదాంతము
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
మూలుగు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
(రూ. మూల్గు).
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దాగిన శత్రు రీతి పెడ దారులు చూపుచు వేద భావమున్
రిప్లయితొలగించండిలాగక స్వంత లాభముల లాలస హెచ్హి కుతర్క వాదముల్
సాగగ వ్యర్థ భావములఁ జాటుచు నాటుచు హేళనంబుగా
భాగవతమ్ముఁ బల్కిన నపారముగా సమకూరుఁ బాపముల్!!
దాగిన శత్రు రీతి పెడ దారులు చూపుచు వేద భావమున్
తొలగించండిలాగక స్వంత లాభముల లాలస హెచ్చి కుతర్క వాదముల్
సాగగ వ్యర్థ భావములఁ జాటుచు నాటుచు హేళనంబుగా
భాగవతమ్ముఁ బల్కిన నపారముగా సమకూరుఁ బాపముల్!!
సత్యనారాయణ గారూ,
తొలగించండిముందుగా సమస్యలోని గణభంగాన్ని పరోక్షంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సవరించాను.
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
యోగమ్మది యోచింపగ
రిప్లయితొలగించండిభాగవతమ్మును జదువుట; పాపము జుమ్మీ
భాగవతుల బీడించుట;
యోగుల సేవించుట యొక యోగము జుమ్మీ!
సీతాదేవి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
భోగముల నొందు మార్గము
రిప్లయితొలగించండి"భాగవతమ్మును జదువుట, పాపము సుమ్మీ"
ఆగమ శాస్త్ర పఠన,వే
దాoగ సనిలు శౌచమందు దక్షత తోడన్
సని = పూజ
సూర్యకుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సనిలు'...?
సని = పూజ బహువచనము అర్ధము కాలేదు గురువు గారు సనిలు అన వచ్చునా
తొలగించండి'సని' అంత ప్రసిద్ధమైన పదం కాదు. కేవలం పర్యాయపద నిఘంటువు తప్ప మరే నిఘంటువు ఆ పదాన్ని పేర్కొన లేదు. 'సని'కి బహువచన రూపం 'సనులు'. అక్కడ "వే।దాంగార్చన శౌచమందు..." అనవచ్చు గదా!
తొలగించండిధన్యవాదములు గురువు గారు
తొలగించండినమస్సులు.
తొలగించండిభోగ, భాగ, ఆగ,
దాంగ?
శాస్త్రి గారు నమస్కారములు తప్పులున్న సరిచేయండి
తొలగించండిశాస్త్రి గారూ, నిజమే.. ప్రాస దోషాన్ని గమనించలేదు. ధన్యవాదాలు.
తొలగించండి******
సూర్య కుమార్ గారూ,
సవరించండి.
సని : ఇ, ఈ ( పుం, స్త్రీ.) కారాంత సంస్కృత పదము.
తొలగించండిబహుమతి, అర్చన, చతుర్థ భాగము (ఆకాశములో) నానార్థములు.
సనికామ, సనిమత్ రూప విశేషములు.
భగవంతుని చేరగలవు
రిప్లయితొలగించండిభాగవతమ్మును నిరతము పఠనము సలుపన్;
భోగపు పురుషుల రంకుల
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ!
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని మొదటి పాదాన్ని లఘువుతో ప్రారంభించారు. కందపద్యంలో పాదాద్యక్షరాల గురులఘు సామ్యాన్ని పాటించాలి. అంటే మొదటి పాదం గురువుతో మొదలైతే మిగిలిన పాదాలు గురువుతోనే మొదలు కావాలి. మొదటి పాదం లఘువుతో మొదలైతే మిగిలిన పాదాలు లఘువుతోనే మొదలు కావాలి.
"ఆ గిరిధరు జేరగలవు" అందామా?
అలాగేనండి.ధన్యవాదాలు.
తొలగించండియాగఫలతుల్యమదియే
రిప్లయితొలగించండిభాగవతమ్మును జదువుట, పాపము సుమ్మీ
భోగపు వాడలు దిరుగుట
భాగవతులగించపరచి భాగ్యము గుడువన్.
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిబాగునని పఠనమునన్
వాగర్థాచారచయము భక్తియు విశ్వా
సాగమ గౌరవ హీనుడు
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
"ఇదంతే నాతపస్కాయ నాభక్తాయ కదాచన
నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యో2భ్యసూయతి" భ.గీత,18--67.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆగక పొంగు "నాస్తికత" యందును భౌతికవాద వ్యాప్తి వే
దాంగ విశిష్టతా జడిమ దండివి యాశలు దేహ భ్రాంతినిన్
త్రాగుడు లోని మత్తొకటె తన్మయతా తపమన్నవాడు యీ
భాగవతమ్మునున్ జదువ బాపమపారము చేకురున్ జుమీ!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
డా.పిట్టా
తొలగించండిఆర్యా, "బాగగునని"అనుకొనగా టైపాటును గమనించలేదు.ధన్యవాదాలు}
ఆగోవిందుడు శత్రువు
రిప్లయితొలగించండిభాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
రేగెను హిరణ్యకశిపుడు
వేగమె నాపేయు మింక వినలేననుచున్
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆపేయుము' సాధువు కాదు.
రాగము లాలపించగనె రాళ్ళు పగుళ్ళును పొందె ధాత్రిలోన్,
రిప్లయితొలగించండియాగము భూమిపై జరుగ ఆపక వర్షము లిచ్చె మేఘముల్,
భోగము లిచ్చు చుండునట భూతల వాసుల కెప్పుడైన శ్రీ
భాగవతమ్మునున్ జదువఁ , బాపమపారము చేకుఱున్ జుమీ
ఆగమ శాస్త్రముల్ చదువ అంతక,జాతక సూతకమ్ములన్
సూర్య కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దాగిన నిజమును దెలియక
రిప్లయితొలగించండియోగీశ్వరునందుకొనెడు యోగ్యత కరువై
మూగగ రంధ్రాన్వేషణ
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈగతి పరమత గురువులు
రిప్లయితొలగించండివాగిరి తమ చుట్టునున్న భక్తులతోడన్
జాగరత భారతమ్మును
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భోగులు బలుకుదు రిట్లని
రిప్లయితొలగించండిభాగవతమ్మును జదువుట పాపముసుమ్మీ
భాగవత మెది యొ తెలియక
వాగుదురే యిట్లువారు వసుధను సామీ !
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యోగ మహేశుని కృష్ణుని
రిప్లయితొలగించండిభోగి యనుచు మోహి యనుచు భూర్యజ్ఞతతో
రాగద్వేష ఖలాంధులు
భాగవతమ్మును జదువగ పాపము సుమ్మీ
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారూ సవరించిన పద్యము
రిప్లయితొలగించండిభోగములనొందు మార్గము
"భాగవతమ్మును జదువుట, పాపము సుమ్మీ"
ఆగమ శాస్త్ర పఠనము
మాగు వలువలను ధరించి మందిర మందున్
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "శాస్త్రపు పఠనము" అందామా?
టై పాటు
తొలగించండిదాగిన సత్యమేదియొ నిదానముగన్ గ్రహియించలేక యా
రిప్లయితొలగించండియోగి యనంతునిన్ బడయు యోగ్యత నొందు ప్రయత్నలేమితో
మూగగ న్యూన భావమది బుద్ధిని, గొప్పగ జూచువారికై
భాగవతమ్మునున్ జదువఁ బాప మపారము చేకుఱున్ జుమీ!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాగవతమ్మునున్జ దువపాపమపారము చేకురున్ జుమీ
రిప్లయితొలగించండిభోగుల మాటయే యదియ ,పోకిరి గా నటు పల్కుచుందురే
భాగవతమ్మనన్నిలను బావన మైనది గాదలంతుమే
వాగుడు కాయలే యవియ వాటిని లెక్కకు వద్దులే సుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లెక్కిడవద్దులే" అనండి.
జాగారము మోక్షము కని
రిప్లయితొలగించండిపోగూడని చోట్ల కేగి పొంది ఋజుల నా
రోగాల విముక్తి కొఱకు
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
సాగుచు మధు సేవను తను
వూగగ పలుగంతు లేసి పురవీధుల లో
జాగార మనుచు పల్లెల
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
బాగొనగూర్చ మానవుల పాపములన్ నశియింపజేయ తా
రిప్లయితొలగించండిబాగుగ వ్రాసినాడు కద బమ్మెర పోతన విష్ణు భక్తుడా
భాగవతంబె నీకొసగు భక్తి బఠించిన బుణ్యమన్య మే
భాగవతమ్మునున్ జదువఁ బాప మపారము చేకుఱున్ జుమీ
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాగునె యిన శశి గతులును
రిప్లయితొలగించండిసాగునె ధర జీవ కోటి చలనము దలుపన్
భోగములఁ గించ పఱచుచు
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
ప్రోగులు ప్రోగులుం గవితలున్ మతి హీనుల భావ జాలముల్
వేగమ ముంచు చిత్తమును వెఱ్ఱి తలంపుల నర్థ శూన్యమై
తూగవు దుష్ట మానవుల తోరపు వ్రాతలు దల్పనెందునుం
భాగవతమ్మునుం, జదువఁ బాప మపారము చేకుఱుం జుమీ
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిభోగపిపాసులై నరులు పోకిరి చేష్టల తోడవారిలన్
రిప్లయితొలగించండిబాగరి స్త్రీల జేరుచు పాపపు కృత్యములాచరించుచున్
భోగవిలాసజీవితము పొందగ దుడ్డును గోర నెంచుచున్
భాగవతమ్మునున్ జదువ పాపమపారము జేకుఱున్.
రెంండోపాదంంలో రెంండు మూడవ గణములు స్త్రీలజేరుచును
తొలగించండివిరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాగును జీవితమ్మిలను సంతసమొందుచు, నిష్ఠతోడుతన్
రిప్లయితొలగించండిభాగవతమ్ముఁ బల్కిన, నపారముగా సమకూరుఁ బాపముల్
భోగమె ముఖ్యమంచునిల ముద్దియ సంగతిలో చెలంగుచున్
యోగుల హించపెట్టెడి యయోగ్యుల గుంపుకు నిశ్చయమ్ముగా
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాగెను నాస్తికులిద్దరు
రిప్లయితొలగించండివాగగ సంభాషణమ్ము వాసిగనొక డా
యాగము భోగమసత్యము
భాగవతమ్మును చదువుట పాపము సుమ్మీ
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సాగిరి" అనండి.
యోగీశు మహిమ దెలియక
రిప్లయితొలగించండిరాగ ద్వేషాల దోష లాలస విడకన్
భోగముల వీఁగు మనమున
భాగవతమ్మును జదువగ పాపము సుమ్మీ!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గరుడుండు వాహనము చెన్నలరారగ లక్ష్మిపత్నిగన్
రిప్లయితొలగించండితా గణుతింప శంఖమును తద్దయు చక్రము కేల దాల్చి తా
నాగము పాన్పుగన్ తనరు నాభగవంతు నశౌచవేళలన్ భాగవతమ్మునున్ జదువ పాపమపారము చేకురున్ జుమి
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండి🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*బాగోగెంచక నివ్విధి*
*"భాగవతమ్మును జదువుట బాపము సుమ్మీ"*
*బ్లాగునసమస్యయైనను*
*వేగమెఖండింపకున్న పెద్దరికంబే?*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
రిప్లయితొలగించండి🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*బ్లాగొకటుండగన్ వెసులు బాటుకనుంగొనినీచుడెవ్వడో*
*వాగఁసమస్యయంచుతలవాయఁ జివాట్లనుపెట్టినెట్టకన్*
*వేగమెపెట్టినట్టితుళువెవ్వడొపొందునుహీనజన్మముల్*
*భాగవతమ్మునున్ జదువ పాపమపారము జేకుఱున్*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భగవంంతునిభాగవతంంపైైన ఇలాంంటి వెకిలి సమస్యనిచ్చినవాడు అనుమతింంచిన వారు భాగవతమును చదివినప్పటికి పాపమును పొంందుగాక!
రిప్లయితొలగించండిఅని గురువుగారుశపింంచినంంత పని చేశారన్నమాఠ!
సమస్యాపూరణలో ఇదీ ఒక పద్ధతే లెండి.
తొలగించండియోగంబగు జనులకిలను
రిప్లయితొలగించండిభాగవతమ్మును జదువుట, పాపము సుమ్మీ
ఆగమములనిందించిన
సాగునె మనజీవనమ్ము సంతోషముగన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా గారాబు సహోదరు
రిప్లయితొలగించండినా గరుడధ్వజుండు జంపి యహితుండాయెన్
భాగవత మతనికథయట
భాగవతమ్మును జదువుట పాపము సుమ్మీ
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భోగమదియె దినము విడక
రిప్లయితొలగించండిభాగవతమ్మును చదువుట! పాపము సుమ్మీ
యాగడముల, హింసల చెల
రేగు కథల జనుల గూల్చు రీతులు జూడన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జాగృతులై నిశాచరుల సంగము చేరియు నన్ని వేళలన్
రిప్లయితొలగించండిత్రాగిన మైకమందు చపలంబున జిష్ణుని నిందజేయుచున్
వేగిర పాటునం దగు వివేచన లేకయు వక్రదృష్టినన్
భాగవతమ్మునున్ జదువఁ బాప మపారము చేకుఱున్ జుమీ
రిప్లయితొలగించండిరాగము కలుగును మనసుకు
భాగవతము చదువుట,పాపము సుమ్మీ
భాగవతుల దిట్ట గలుగు
రోగములని యండ్రుబుధులు రుషతో నెపుడున్.
శ్రీమతి జి సందిత బెంగుళూరు
రిప్లయితొలగించండిఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
*"చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట"*
కష్టతరమైనప్రభుతకునష్టమైన
పేదకాపురములపాలిపీడయగుట
బుద్ధిమంతులుమెచ్చగన్ పూనుచు తల
*"చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట"*
(లేదా...)
గుడులసమీపమందునెలకొల్పదుకాణముకల్లునమ్మగన్
బడులసమీపమందునెలకొల్పదుకాణముబీడిలమ్మగన్
గుడిసెలమధ్యలోననెలకొల్పగలాటరికొట్టు లట్టుఁ"మె
చ్చెడు పనియౌను మద్యము నిషేధ మొనర్చుట" -మెచ్చ రంగనల్"
రోగము తీవ్రమై మగడు రొప్పుచు రోజుచు మూల్గుచుండగా
రిప్లయితొలగించండియోగపు ప్రౌఢిమల్ జపపు యోగ్యత మెచ్చుచు సుద్దులిచ్చుచున్
గూగులు దేవుచున్నెగసి గొప్పగ నొప్పుచు పోతనార్యుదౌ
భాగవతమ్మునున్ జదువఁ బాప మపారము చేకుఱున్ జుమీ
వాగుచు వ్యర్థ పండితులు భక్తియు రక్తియు లేనివారలై
రిప్లయితొలగించండిభాగవతార్థమున్ విడిచి వ్యాకరణమ్మును నమ్మువారలై
బాగుగ దోషముల్ వెదకు భండన భీములు పోతనార్యుదౌ
భాగవతమ్మునున్ జదువఁ బాప మపారము చేకుఱున్ జుమీ!