9, జులై 2017, ఆదివారం

సమస్య - 2406 (విరసంబగు రచన...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విరసంబగు రచన యొప్పె వీనుల విందై"
(లేదా...)
"విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్"

96 కామెంట్‌లు:

 1. సరసము రామాయణమౌ
  కిరికిరి జేయుచు ద్రవిడుల కీమాయణమున్
  గురు రామసామి చెప్పగ
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై


  "...His work inspired a play called Keemayanam in which Rama was a drunkard and Sita was a woman of loose character..."

  http://nptel.ac.in/courses/109104050/lecture34/34_4.htm

  Periyar EV Ramasami Naicker

  (రామసామి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. స్థిరముగ షేక్స్పియరుబొమ్మ
   నరసిన నాతని మొగంబు నచ్చదు మనకున్;
   విరివిగ వచనములెందుకు
   విరసంబగు;రచన యొప్పె వీనులవిందై.

   తొలగించండి
 2. పరుసము పైడిగ జేయుచు
  మురిపించును ముదిత మనసు మోదం బందున్
  సరసము వికటించిన తరి
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించండి
 3. డా.పిట్టా
  సరసులు నెంచగ రసముల
  కురిపించిరి తొమ్మిదనిరి కూడగ గనలే
  నిరసంబౌ పోతన మా
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  కరకర గోసి పుష్పపు సుకన్యల రేకులు విప్పి లోనివౌ
  వర,వధు రేణు సద్భరణి వర్ణన గద్యమునందు జెల్లగా
  సరియని సూక్ష్మ దర్శినిని చప్పున గాంచిరిదేమి వింతయో?!
  విరసపు గావ్యమొప్పినది వీనుల విందయి మెచ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టానుండి
  ఆర్యా, వృత్తపు ప్రథమ పాదంలో చివర "లోనిదౌ" గా చదువ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టానుండి
   ఆర్యా,గురువందనములతో,ధన్యవాదాలు}

   తొలగించండి
 6. నిరతానందదు డౌచును
  స్థిరయశములు గూర్చునట్టి శ్రీపతి కరుణన్
  సురుచిరమై వెలుగొందుచు
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

  అరయగ నొక్కకాలమున నాకవి ముఖ్యుడు భక్తి యుక్తుడై
  స్థిరమతి యౌచు శ్రద్ధగొని శ్రీపతి గొల్చుచు నాకొసంగవే
  నిరుపమసద్యశంబు లను నిత్య మనన్ హరియా శిషంబునన్
  విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. మూర్తి గారు నిరుపమసద్యశంబు లను నిత్యము గోరు నా కవివరు పేరు ప్రస్తావించిన సమస్యకు నిండు దనము సేకూరుతుంది గదా.
   ఆశిషము (ఆశీస్సు?) పదము నొక్క సారి పరిశీలించండి.
   “ఆశిషమ్” ఆశీస్సు (స కారాంత స్త్రీ లింగము) నకు నేకవచన ద్వితీయా విభక్తి.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు.

   తొలగించండి
  4. ఆర్యా!
   పొరపాటు జరిగినది. క్షమించ ప్రార్థన.
   ఈవిధముగా మార్చుచున్నాను.

   అరయగ నొక్కకాలమున నాకవి ముఖ్యుడు భక్తి యుక్తుడై
   స్థిరమతి యౌచు శ్రద్ధగొని శ్రీపతి గొల్చుచు నాకొసంగవే
   నిరుపమసద్యశంబు లను నిత్య మనన్ వనమాలి సత్కృపన్
   విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్.

   ధన్యవాదములు.

   తొలగించండి
 7. నిరసన కలిగించునుగద
  విరసంబగు రచన, యొప్పె వీనులవిందై
  పరితోషము కలిగించును
  సరసంబగు కావ్యపఠన సభికుల కెపుడున్!!!

  రిప్లయితొలగించండి
 8. అందరకూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు

  సురలోక పారిజాతపు
  విరి రుక్మిణి కొసఁగెనంచు వేదనమీరన్
  దొరలిన సత్యాకృష్ణుల
  విరసంబౌ కావ్యమొప్పె వీనులవిందై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   పారిజాతాపహరణ ప్రస్తావనతో సరసమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. సురముని సత్యభామఁ గని సొంపగు సూనము పారిజాతమున్
   హరి తన రుక్మిణీమణికి నందగఁ జేసెనటంచు జెప్పినన్
   సురసుర లాడుచున్నలుగ శోక గృహమ్మున వేడుకోలుతో
   విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్

   తొలగించండి
  3. సహదేవుడు గారూ,
   మీ రెండవ పూరణ రసవత్తరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  4. సవరించిన పూరణ

   సురముని సత్యభామఁ గని సొంపగు సూనము పారిజాతమున్
   హరి తన రుక్మిణీ సతికి నందగఁ జేసెనటంచు జెప్పినన్
   సురసుర లాడుచున్నలుగ శోక గృహమ్మున వేడుకోలుతో
   విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్

   తొలగించండి
 9. సరసులు మెచ్చరు నిజమిది
  విరసంబగురచన, యొప్పు వీనుల విందై
  చిరుకవితైనను చిత్రపు
  విరుపులు సామాజిక మగు వృత్తమె యున్నన్.

  రిప్లయితొలగించండి
 10. అరయగ చార్వాకుమొదలు
  విరివిగ రామాయణ విషవృక్షము వరకున్
  వెరపుగ" దయ్యపు కూతలు"
  విరసంబగు రచన యొప్పె వీనులవిందై!

  శాటానిక్ వర్సెస్ = దయ్యపు కూతలు
  విరసం = విప్లవ రచయితల సంఘం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు! వందన శతములు!💐💐💐🙏🙏🙏

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   విషవృక్షాన్ని ఎవరు ప్రస్తావిస్తారా అని ఎదురు చూస్తున్నా. దానితో పాటు చార్వాకుణ్ణి, సల్మాన్ రషేని ప్రస్తావించిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  3. గురువుగారికి నమస్సులు! మీ ప్రశంస యందుకున్నరోజు పండుగే! కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు!🙏🙏🙏🙏

   తొలగించండి
  4. అన్నయ్యా! నీ పద్యమే స్ఫూర్తి! ధన్యవాదములు!🙏🙏🙏🙏

   తొలగించండి

 11. పరుషపు దూషణములతో
  పురుషులు దద్దమ్మ లనెడు పోకడ సినిమా
  తెరపై నేడు కనబడెడు
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై

  రిప్లయితొలగించండి
 12. అరమరలేకను గవితల
  కరమొప్పగ వ్రాయువారు కలరీ ధరలో
  పరమోన్నతా సినారె క
  వి రసంబగు రచన యొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించండి
 13. గురువులకు నమస్సులతో...

  కిరికిరి మాటల పాటను
  సరిగా బాణీనిగట్టి చక్కగ పాడన్
  ఉరుకుల పరుగుల యువతకు
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

  రిప్లయితొలగించండి
 14. పరమాత్ముని లీలలతో
  పరవశమును నింపెభాగ వతమును మహిలో
  చిరయశములపోతన*మా
  వి*రసంబగు రచన యొప్పె వీనుల విందై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టా
   పరవశత,భాగవతములో ,చిరయశుడయ్యె..ఈ అనుసంధానమును గూర్చి పేర్చండి.పరశమును పొందేది పాఠకుడు కదా,చిరయశముల అనే విశేషణము కంటె చిరయశమును పొందెనన్న అర్థం రావాలి.తొందరలో ఇలా జరుగుతుంది.శ్రీరాం గారూ,Please revise before writing.

   తొలగించండి
 15. ధరలో పోతన తెనుగున

  సరసముగా భాగవతమును చక్కగ వ్రాయన్

  మరులుగొలుప మదికది మా

  వి రసంబగు రచనయొప్పె వీనుల విందై.


  నిరసింతురు భువిలోపల

  విరసంబగు రచన;యొప్పె వీనులవిందై

  సరసుల నెల్లను సతతము

  పరవశులను చేసి కూర్చు పరితోషంబున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 16. కురచపు దుస్తులెప్పుడును కూరిమి నిచ్చును చిత్రసీమకున్ ,
  పరువును తీయు కుంచితపు భావప్రయోగములే ధనంబిడున్,
  కరుణయె లేని నాయికలు కాసులు దెచ్చును చిత్రరంగమున్ ,
  వెరయుచు చిత్రలోకమున వీడుచు యున్నత భావజాలముల్
  మరుగున దాచి నేడు సినిమా కవి శ్రేష్టులు రచించుచుండగా
  విరసఁపుఁ గావ్యమొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్"

  నేటి చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతల ఒత్తిళ్లకు లోనై కవులు స్వేచ్చ మరచి రచించు విరసపు రచనలు కీర్తి నొందుచుండెను గదా అన్న భావన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వీడుచు నున్నత..." అనండి. ఐదవ పాదంలో గణదోషం. "సినిమా కవు లెల్ల రచించుచుండగా" అనండి.

   తొలగించండి
 17. గురుపూర్ణిమ శుభదినమున
  గురువులకుంజేతునతులుగూరిమితోడన్
  గురువన శంకరుడేగద
  విరులంబూజించయిచ్చువేలుగసిరులన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   ధన్యవాదాలు. గురువన శంకరుడే గద... ఆ ఆదిశంకరులకు నమస్సులు!

   తొలగించండి
 18. గురువర్యులకు నమస్సులు మఱియు గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
  నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
  కష్టము లిడదట పనులకు
  నష్టమి తిథి! శుభకరమని యందురు విఙ్ఞుల్
  నష్టము లాభము లెంచక
  నిష్టము తోడుత మొదలిడ నే దినమైనన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "లాభము లెంచక । యిష్టము..." అనండి.

   తొలగించండి
 19. విరసము సరసపు ట ర్ధము
  లెరుగని నొక పామరుండు నేర్వక చదువు
  న్నరకొ ర తెలివిని నిట్లనె
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   పూరణ బాగుంది. రెండవ పాదంలో యతి తప్పింది. ఎరుగని+ఒక = ఎరుగని యొక.. అవుతుంది. "సరసపు టర్థము । నెరుగని యొక పామరుండు నేర్వక... (అఖండయతి)" అనండి.

   తొలగించండి
 20. పున్నమి దినమున గురువుల
  సన్నిధి యిచ్చును ముదమ్ము సతతము వసుధన్,
  సన్నుతి లివియే శంకర,
  విన్నపములు తీర్చవలయు వేగము తోడన్

  రిప్లయితొలగించండి
 21. సరసమ్ముగ,వ్యంగ్యభరిత
  విరసోక్తుల 'వికటకవిగ'విశ్రుతుడైనన్
  వరపాండురంగచరిత,భు
  వి,రసంబగు రచన యొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించండి
 22. వర శబ్దార్థాలంకా
  ర రుతచ్ఛందో సుబద్ధ రమణీయ కవీ
  శ్వర వినుత పరాజిత కుక
  వి రసంబగు రచన యొప్పె వీనుల విందై

  [రుతము= ధ్వని; రసంబగు =నవ రసములతో నున్న]


  పరమును గోరి బమ్మెర సువంశజ పోతన సత్కవీంద్రుఁడే
  కరివర పాలకుండు హరి కైటభ వైరి చరిత్ర వ్రాయగన్
  వరకవి సన్నుతమ్మును సభావ ముదాత్త పదార్తవంపుఁ దా
  వి రసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   (ఇంతకు ముందే ప్రభాకర శాస్త్రి గారు ఆశ్రమానికి వచ్చి కలిసి వెళ్ళారు. మాటల్లో మీ సోదరుల ప్రస్తావన వచ్చింది).

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు. గురుపుంగవులకు గురుపూర్ణిమా శుభాభినందనలతో నమశ్శతములు.
   ప్రభాకర శాస్త్రి గారు హైదరాబాదు లోనే యుంటారా! మీ యాశ్రమ వాస వార్త యేలనో మనస్సును గలత పెట్టుచున్నది.

   తొలగించండి
  3. రావు గారూ, ధన్యవాదాలు.
   శాస్త్రి గారు హైదరాబాదులోనే మా ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటారు. అన్నపరెడ్డి వారికి మరీ దగ్గరగా ఉంటారు.
   ఈ ఆశ్రమవాసం నేను ఇష్టంగా, మనస్ఫూర్తిగా ఏరి కోరుకున్న వానప్రస్థం. నాకిక్కడే ప్రశాంతంగా హాయిగా ఉన్నది.

   తొలగించండి
  4. చిన్న సవరణ:

   వర శబ్దార్థాలంకా
   ర రుతచ్ఛందస్సుబద్ధ రమణీయ కవీ
   శ్వర వినుత పరాజిత కుక
   వి రసంబగు రచన యొప్పె వీనుల విందై

   తొలగించండి
 23. ఉరుకుచు తెనాలి రాముడు
  విరసంబగు కైత బలికి వింతలు గొలిపెన్
  సరసమ్మగు రచనల యెడ
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై ;

  రిప్లయితొలగించండి
 24. సరస సమున్నతోజ్వల రసాన్వితమై విలసిల్లు రీతిగన్
  సరళతరమ్ముగన్ రచన సారెకు జేయగ మేటియౌ కవీ
  శ్వరుడు ముదమ్మునన్ పఠన వాసిగ జేయగనుల్లసిల్లె తా
  వి రసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్
  ..వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 25. స్థిరముగ షేక్స్పియరు బొమ్మ
  నరసిన నాతని మొగంబు నచ్చదు మనకున్;
  విరివిగ వచనములెందుకు?
  విరసంబగు;రచన యొప్పె వీనులవిందై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   పూరణ బాగున్నది. కాని మొదటిపాదం మూడవ (బేసి) గణంగా జగణం వచ్చింది.

   తొలగించండి
 26. సరసముగ గోపకాంతలు
  దరిచేరగ మీటె మురళి తా కృష్ణుండా
  సురుచిర రాగముగన మో
  వి రసంబగు రచన యొప్పె వీనులవిందై
  ..వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 27. అరసపు కవులు రచించిన
  యరసపు రచనలు రహించె నభ్యుదయ గతిన్
  విరసపు కవి తాఁబాడిన
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై

  (వి= విశేషమైన అన్న అర్థంలో)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విజయకుమార్ గారూ,
   ఉపసర్గను విశేషార్థంలో వినియోగించుకొన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. ధరణియె విశ్వమూలమని ధారుణిమానవులెల్ల రూఢిగన్
  విరచితిరాపురాణకథ వీనులవిందుగ బైబులందుఁగా
  ని రుసి గెలీలియో యిల దినేంద్రునిఁజూప వధించె నాడు, నా
  విరసపుఁగావ్యమొప్పినది వీనులవిందయి మెచ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కర రామిరెడ్డి గారూ,
   ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! చాలా సంతోషం.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   విరచించారు అనే అర్థంలో 'విరచితిరి' అన్నట్టున్నారు. అక్కడ "విరచన చేసి రట్టి కథ వీనుల.." అంటే ఎలా ఉంటుంది?
   'శంకరాభరణం' బ్లాగులోని సమస్యాపూరణను ఏర్చి కూర్చి ఒక సంపుటిగా ముద్రించాలని సంకల్పం. అందుకని ప్రారంభం నుండి సమస్యలను, ప్రతి సమస్యకు వైవిధ్యంగా ఉండే నాలుగు పూరణలను ఎన్నుకొంటూ పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాను. ఇప్పటికి ఎన్నిక చేసిన వందకు పైగా సమస్యల పూరణలలో మీ పూరణలు రెండు ఉన్నవి.)

   తొలగించండి
  2. గురువుగారూ, ఆఫీసు, ఇంటి పనులతో సతమతవుతూ జీవితంగడిచిపోతుంది.కానీ ఏదైనా వ్రాయాలన్నా అనాసక్తి ముందు కుర్చీలో కూర్చోవడంవల్ల యిటువైపు రావడమే లేదు.దీనితోటి బ్లాగులో ఏమైనా వ్రాయాలన్నా మనసులోనుంచి భావాలు పెల్లుబకటంలేదు. నిన్న శనివారము కావడంతో అంతర్జాలంలో తిరుగుతూ ఇక్కడనుంచి మొదలెడదామని ఇటువచ్చి ఆ పూరణ చేశాను.

   నేను ఇక్కడ చేసిన సమస్యాపూరణలు మూడు,నాలుగుంటాయేమో.అందులోనుంచి రెండింటిని ఎన్నుకొన్నందుకు ధన్యవాదాలు.

   మీరన్నట్లు విరచితి రనే పదాన్ని ఆ అర్థంలోనే వాడాను. సవరణ చాలా బాగుంది. సవరించిన పద్యము.

   ధరణియె విశ్వమూలమని ధారుణిమానవులెల్ల రూఢిగన్
   విరచన చేసి రట్టి కథ వీనులవిందుగ బైబులందు గా
   ని రుసి గెలీలియో యిల దినేంద్రునిఁజూప వధించె నాడు, నా
   విరసపుఁగావ్యమొప్పినది వీనులవిందయి మెచ్చిరెల్లరున్

   తొలగించండి
 29. సరసపు గైతలం బొదివి చక్కని వర్ణనలన్ వెలార్చుచున్
  తరుణుల సోయగమ్ములను దాచక చూపిన చప్పరించి వా
  తెరలను భేషు భేషనుచు దెల్పిరి " తీయన కన్నె లేతమో
  వి రసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి" మెచ్చి రెల్లరున్.

  రిప్లయితొలగించండి
 30. గురువులకు గురుపూర్ణిమ వందనములు.

  రిప్లయితొలగించండి
 31. సరసంబగు భావ కవిత
  లఱ వాకిటిలో పరుండ నంతనె యిచటన్
  శర వేగమ్ముగ వచ్చిన
  విరసంబగు రచన యొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించండి
 32. సరసము శ్రుతి మించినచో
  విరసంబగు, రచన యొప్పె వీనులవిందై
  సురుచిరమగు భావముతో
  మరులుగొలిపి సున్నితమగు మాధుర్యమిడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   సురుచిర భావంతో మీ పూరణ మధురంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

   తొలగించండి
 33. గురువు గారికి నమస్కారములు. మీ బ్లాగులో ఎదో తేడా కనిపిమ్చుతోంది ఇంతకూ మునుపు కుడి ప్రక్క వర్గాలు లోకి వెళ్లి సమస్యా పూరణము అన్న డాని మీద క్లిక్ చేస్తే నేటి సమస్య ప్రత్యక్ష మయ్యేది. కానీ 7 వ తారీకు నుంచి (శుకయోగి) విండో నుంచి కొత్త సమస్య విండో ఓపెన్ కావటము లేదు. శుకయోగి సమస్యలను మొత్తము చూచి చివరిలో కొత్త పోస్ట్ మీద క్లిక్ చేస్తే 8 వతారికు సమష్య అష్టమి నాడు విండో కనిపించింది. మరల మొత్తము చూచి కొత్త పోస్ట్ మెడ మరల క్లిక్ చేస్తే ఈ రోజు సమస్య విరసంబగు విండో ఓపెన్ అయ్యింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్ధము కావటము లేడు. మీరే పరిష్కారము చేయవలెను ధన్యవాదములతో పూసపాటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   సరి చేశాను. ఇక ఆ ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలు.

   తొలగించండి
 34. స్థిరమగు ప్రజ్ఞ తోడుతను సేద్యము చేయుచు వ్రాసె నిచ్ఛతో
  సురుచిర భావయుక్తముగ సుందరభాగవతమ్మునా కవీ
  శ్వరుడగు పోతనార్యుడు ప్రశాంతమనస్కుడు తియ్యనైన మా
  వి రసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 35. స్మరియించఁ గాళికాంబను
  నిరక్షరుని నాల్కపైన నింపగ స్వరముల్
  బిరబిర దొరలఁ బ్రబంధ క
  వి రసంబగు రచన యొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించండి
 36. స్మరియించఁ గాళికాంబను
  నిరక్షరుని నాల్కపైన నింపగ స్వరముల్
  బిరబిర దొరలఁ బ్రబంధ క
  వి రసంబగు రచన యొప్పె వీనుల విందై!

  రిప్లయితొలగించండి
 37. అరయగ షేకుస్పీయరుది హామ్లెటు నంచొక నాటకమ్మునన్
  కరవగ రాణి రాజులును కన్నటి పుత్రుని వింతరీతినిన్
  కురిసెను రక్త పాతములు గుంపులు గుంపుగ చచ్చిరెల్లరున్...
  విరసఁపుఁ గావ్య మొప్పినది వీనుల విందయి మెచ్చి రెల్లరున్!

  రిప్లయితొలగించండి
 38. "భామయు భామయున్ గలియ..." సమస్యకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణ:

  శ్రీమతి లేఖ పంపినది, కార్యముచేయడు మామ, తానట
  గ్రామణియైన యల్లుడొక రాతిరి తానొక చెల్మికత్తెయై
  మామ గృహంబు జేరి తన మానిని గూడెను, అయసత్య పుం
  భామయు, భామయుంగలియ బాలుడు పుట్టెను సత్య భామకున్.

  రిప్లయితొలగించండి