కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్"
(లేదా...)
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్.
వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో వారిచ్చిన పూరణ....
సతి విను భారతార్థములు శ్రద్ధమెయిన్ వివరింతునంచు సం
గతి శివు డిట్లు పల్కె - మసకంబున ద్రౌపది వల్వలూడ్చుచో
పతులను వేడికొంచు నగుబాటయి తా నెలుగెత్తి రుక్మిణీ
పతిని సహోదరా! యనుచు, పార్వతి! పిల్చెను భారతమ్మునన్.
పతి గానివాడు భ్రాతయె
రిప్లయితొలగించండిమతమిది భారత పుడమిది
మహనీయమ్మౌ...
అతివను వెదకెడి సీతా
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్
* దుష్ట సమాసము (భారత పుడమి) ను మన్నించవలె. విన సొంపు అనిపించినది.
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిశుభోదయం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భరతావని యిది" అనండి.
🙏🙏🙏
తొలగించండిఇతిహాసమ్ములు తెలిసిన
రిప్లయితొలగించండియతి సులభము గద సమస్య లాలోచనలే
ల? తరుణి సాగర పుత్రిక
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తెలిసిన నతిసులభము..." అనండి.
కతికితె యతకదు మనువని
రిప్లయితొలగించండిసతమత మాయెను సుదతులు సారూప్యము నన్
వెతలను మరచియె తారా
పతిని సహోదర ! యనుచు భవానియె పిలిచెన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మతిచెడి భస్మాసురు డురు
రిప్లయితొలగించండిగతి దరుముచు హరుదల నిడ గరమును జాపన్
బతి కాపద బాపగ శ్రీ
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిసుతలనిరి "బ్రదరు బ్రదర"ని
వెతలను గాపాడ నందు వెలయును పతియే
జతగూడక ముందరనా
పతిని సహోదర యనుచు "పార్వతి"Parvati"(ఫ్యార్ వఠి)పిలిచెన్!(ఆంగ్ల ఉచ్ఛారణ ()లలో
డా.పిట్టా
రిప్లయితొలగించండిజతగొన బ్రదరే కజినౌ(cousin)
మతినాంగ్లపు వావివరుస మాన్యమె సుమ్మీ!
అతిగానొక మత మార్పిడి
పతిని సహోదర యనుచు"భవాని"యె పిలిచెన్!(భవాని,పార్వతి కాదు,వ్యక్తిగత నామము)
డా.పిట్టా
రిప్లయితొలగించండిసతమతమాయె భూతములు చల్లగ జేరగ గర్భమందు నా
ర్జితగతి నుండ భూతపతి జీవసహంపుదరుండు నాశివుం
డతడె పతౌట నిక్కమని డాసె తపంబున ; వ్యాప్తి నెంచి తా
పతిని సహోదరా(సహ॥ఉదర# పొట్టకొట్టవచ్చినట్లు పైకి గనపడువాడు)యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్!
డా. పిట్టా వారూ,
తొలగించండివైవిధ్యమైన మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు
రిప్లయితొలగించండిఅతులిత ప్రేమము తోడను
పతితోనేతెంచి శేషి పరిణయమునకున్
తా తోషముతో లక్ష్మీ
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతులిత వాత్సల్యంబున
రిప్లయితొలగించండిక్షితి జని గజదైత్యుద్రుంచి శివునిం గావన్
నుతగుణు నార్తిహరున్ శ్రీ
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
శృతులన్ విధాత బాసాడు
రిప్లయితొలగించండికృతులన్ సoగీత విభావ గురుడే పలుకన్
మతులే వరమగు మాలిని
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
పూరణ సవరిoచ వలెనని మనవి.
రావు గారూ, (మీ పూర్తి పేరు ఏమిటి?),
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని మొదటి రెండు పాదాలలో గణదోషం. రెండవ పాదంలో యతి తప్పింది. మీ భావం స్పష్టంగా లేదు. అందువల్ల పద్యానికి సవరణ సూచించలేకున్నాను. మరో ప్రయత్నం చేయండి.
మితిమీరిన భస్మాసురుఁ
రిప్లయితొలగించండిజతురమతీ! గాల్చి మగని సంరక్షించన్
నుతులివె కొనుమంచు రమా
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏🙏
తొలగించండికుతకుతల విషమెగయ తము
రిప్లయితొలగించండిచతుర్గతిగ గిరిని మోయ సాగరమున నా
పతిని గొనుమంటినని శ్రీ
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్
సహదేవుడు గారూ,
తొలగించండిబాగున్నది మీ పూరణ. అభినందనలు.
🙏🙏🙏🙏
తొలగించండిస్తుతులకు మెచ్చి గజాస్రువు
రిప్లయితొలగించండిని తుందమున గూరుచుండె నీబావ,బహి
ర్గతునిగ గావింపవె శ్రీ
పతి! సహోదర! యనుచు భవానియె పిలిచెన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గజాసురుని... శ్రీపతిని...' అన్నచోట టైపాట్లు.
గురుదేవులకువందనములు టైపు పొరపాట్లను
తొలగించండిసవరించిన పద్యము
స్తుతులకు మెచ్చి గజాసురు
ని తుందమున గూరుచుండె నీబావ,బహి
ర్గతునిగ గావింపవె శ్రీ
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్
వెతలవి యెన్నినాళ్ళు విను వీపున నొప్పికి లేవు హోమియో
రిప్లయితొలగించండిపతిని సరైన మందు లిక వాడకు డబ్బు వృథా కదా రమా
పతి కడ కేగి పొందు తగు వైద్యము వింటివె తగ్గు నేచురో
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్.
(సరదాగా.....ఇక్కడ పార్వతి అనే అమ్మాయి...భారతం అంటే మన దేశంలో)
మిస్సన్న గారూ,
తొలగించండిమీ రూటే సపరేటు అని గతంలో ఎన్నోసార్లు అన్నాను. అన్నట్టే మీ పూరణలు వైవిద్యంగా, క్రొత్త పోకడలతో, ఔత్సాహిక కవులకు మార్గదర్శకంగా ఉంటాయి.
అద్భుతమైన పూరణ. అభినందనలు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
తొలగించండిహితముగ కావలినిడు గణ
రిప్లయితొలగించండిపతిని సరిగొన జడధారి పరికేదముతో
సుతుని బతికించమని శ్రీ
పతిని సహోదర!యనుచు భవానియె బిలిచెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపతి రక్కసు యదరంబున
వెతనుబడుచు నుండె నాదు వేదన కనుమా,
పతిబిక్ష నిడుమనిరమా
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
గజాసురుని ఉదరాము నుమ్చి శివుని రక్ష్మించమని హరిని పార్వతి ప్రార్ధించెను
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రక్కసు నుదరంబున' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపతి పెట్టెడు భాధల నా
తొలగించండిసతి కుంది యిక భరియించఁ జాలక దుఃఖా
వృత మనమున ఘోరపు టా
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
[ఆపతి =ఆపద]
సతతము మాకు నండగ విచారము లెల్లయు బాప నేర్తువే
పతితము ధార్త రాష్ట్ర కృత పాప విచారము ఘోర మీ దురా
గతమున నుండి కావు మని కంస నిషూదనుఁ గృష్ణు రుక్మిణీ
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్.
[పార్వతి = ద్రౌపది]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅబ్బురపరచే విరుపులతో సమస్యలను వినూత్నంగా, మనోహరంగా పూరించడంలో మీరు సిద్ధహస్తులు.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిడా.పిట్టానుండి
తొలగించండిఆర్యా,"దురాగతమున నుండి" కి సమానార్థము "దురాగతమునుండి"గా గ్రహించితి మీ ప్రయోగము చేయ వచ్చునని.
ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్తములు ప్రాయికంబుగ నగు.
తొలగించండివనమునుండి వచ్చె - వనమందుండి వచ్చె. ఊరినుండి వచ్చె - ఊరనుండి వచ్చె.
సప్తమి యందు “”అందు, న” అనునవి రెండు కలవు. కావున రెండు వచ్చును. వనమందుండి; వనమున నుండి.
వనమునుంచి, ధనమునుంచి యని యుంచి శబ్దాను ప్రయోగంబుతోఁ గొందఱు వ్యవహరించెదరు. గాని యది సాధుకవి ప్రయోగారూఢంబుగాదని యెఱుంగునది.
అతి వైభవమ్ముగను తన
రిప్లయితొలగించండిపతిసోదరి పెండ్లి జేసి వావులు గూర్చన్
సతిచేబట్టిన సీతా
పతిని సహోదర యనుచు భవానియె పిలచెన్!
లౌకిక సీత, భవానులు
వావులు= చుట్టరికము ( వావి వరుసలు)
'ఓరచూపు జూచేది న్యాయమా' యనేకీర్తనలో వావులు యనే మాటను శ్రీత్యాగరాజ స్వామి వాడారు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతివను గూడి రాముడు జలాశ యతీరమునందు నీశునిన్
రిప్లయితొలగించండిసతమత మౌచు బ్రాహ్మణుని చంపె నటంచు క్షమింప గోరగన్
వెతలిక వీడుమా! వలదు వేదన నీకని వల్కి జానకీ
పతిని సహోదరా! యనుచు, పార్వతి పిల్చెను భారతమ్మునన్.
భారతమ్మునన్ = భారత దేశమందు
ఈ రామేశ్వరధామ పురాణము అవాల్మీకమని, తులసీదాసు రామాయణమందున్నదనీ వినికిడి.
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఋతమే గద ముమ్మాటికి
రిప్లయితొలగించండిసతి పశుపతి నొకశరీర సగభాగములి
ట్లుతలచి సబబనుచున్ తా
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
2.సతితను గెల్వ నెవ్వరిని సాహస రీతిన పోరె గాలుచే
నతడు విశాఖు నేమనుచునార్తిగ బిల్చు ను నా జటాధరున్
బతిగను బొంద గోరుచును ప్రార్ధన జేయుచు బిల్చె నెవ్వరా
సతిపతి గొల్చి పాశుపత సాధన జేసె కిరీటి యేకథన్
*పతిని* సహోదరా యనుచు* పార్వతి పిల్చెను *భారతంబునన్
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువు గారి పాదములకు నమస్సులు.
రిప్లయితొలగించండిహితమగు వాణీసుత దయ
మతిరాజశ్రీయగునది మాన్యoబె సం
తతమిచ్చు హాస సీతా
పతిని సహోదర యనుచు భవానియె పలికెన్
భవదీయుడు
పoచరత్నం వేoకటనారాయణ రావు
వేంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాడము చివరి గణము?
తొలగించండిమాన్యంబగు సం
తతము అంటే సరిపోతుందేమో!
పాదము
తొలగించండికుతకముతో సుభద్రనటు కోమలి పార్వతితోడ చోల్చుచున్
రిప్లయితొలగించండిసతతము ముద్దు జేయుగద శౌరి ప్రమోబదము మీర పార్థుడే
యతిగను వచ్చెనం చెరిగియాతని సేవకు బంప నిందిరా
పతినిసహోదరా యనుచు పార్వతి బిల్చెన్ భారతమ్మునన్
వీటూరి భారతమ్మునన్
మన్నించండి భాస్కరమ్మ
రిప్లయితొలగించండికుతకమున హాలహాలమ్మును
రిప్లయితొలగించండిసతతము మ్రింగంగ బ్రదుకు జగములటంచున్
నుతియించు నట్టి లక్ష్మీ
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈరోజు టైపు దోషాలెక్కువయ్యాయి...'కుతుకము..బోల్చుచున్..ప్రమోదము...హాలహలమును'
గతి తప్పిన భస్మాసురు
రిప్లయితొలగించండిచతురతతో సంహరించి శంభుని బ్రోవన్
యతులిత భక్తిన్ లక్ష్మీ
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..బ్రోవ। న్నతులిత...' అనండి.
గురువర్యులకు వందనములు.సవరిస్తానండి, ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోయలి' అన్నచోట 'దోయిలి' అని ఉండాలనుకుంటాను.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండిదూతగ నెల్లలోకముల దోయిలి నందెడు రీతి నంధకా
రాతికిఁ గోఁతి పుట్టె, రఘురాముని కైవడి సీత కైవడిన్
జోతలువెట్ట నెల్లరు యశోన్నతుడై చిరజీవిగామనెన్
వాత సుతుండు వ్యాకరణ పండితుడున్ బహు కార్యదక్షుడై
సతులందరు పిలుతురు పర
రిప్లయితొలగించండిపతిని సహోదర యనుచు భవానియె పిలిచె
న్నితరులతోబాటుగ దన
పతి నిన్ దా బిలిచె నట్లు పరిహాసమునన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పరిహాస పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిసమ్మోదంబున పశు
రిప్లయితొలగించండిపతిగూడుచు శుభముగ తన పరిణయ వేళన్
సతితో నేతెంచిన నగ
పతిని సహోదర యనుచు భవానియె బిలచెన్!
నగపతి= మైనాకుడు
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇతరుల భార్యలు పురుషుల
రిప్లయితొలగించండికతి ప్రియమగు చెల్లెలలయి కనుపించు ; నుమా
పతికిన్ బావగు నాశ్రీ
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సతమతమైతి కౌరవుని సాహసమున్ సభ నోర్చినంతటన్!
రిప్లయితొలగించండిపతుల శిరమ్ములీ పగిది వాలగ నేలకు, దిక్కులేక యా
శ్రితజన రక్షకా! రయమె శ్రీకర! కావుమటంచు రుక్మిణీ
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్
( పార్వతి = ద్రౌపది )
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మతకరి జూదమందునను మామకతమ్ము నుధిష్టిరుండ ధో
రిప్లయితొలగించండిగతికిచనన్, దురాత్ముడగు కౌరవ మూర్ఖుడు రెచ్చిపోవుచున్
పతుల సమక్షమందున సభాభవనమ్మున చీర లాగ శ్రీ
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపతులా ముగ్గురు గిరిజా
పతి నింటను కూడిన వడి పద్మ నడుగుచున్
స్థితి నెఱిగి మురిసి లక్ష్మీ
పతిని సహోదర యనుచు భవానియె పిలిచెన్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండిసతతము వరముల నొసగుచు
దితిసుతులకునంతులేక దేవీపతియున్
వెతలతనికెరాగా శ్రీ
పతిని సహోదర యనుచు భవానియొ పిలిచెన్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అతనికి ప్రేమ పంచి వివహంబును జేస్కొనె, కాపురంబునన్
రిప్లయితొలగించండిప్రతిహతి గల్గు వార్తెఱుక బర్చెను యాకశ రామనెవ్వడో
పితరుని తమ్ము భార్యకును పెద్దయ పుత్రుడటంచు దెల్పగా
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్౹౹
పార్వతి= ఒక స్త్రీ; భారతంబు = భారతదేశం
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జేస్కొనె' అనడం సాధువు కాదు.
పతులును మాయ జూతమున వంచన నోడగ దుస్ససేన దు
రిప్లయితొలగించండిర్మతిగని ధర్మనిర్ణయ సులభ్యత జిక్కక భీష్ముడుండినన్
పతితులు నిండు కూటమున వస్త్రము లూడ్వగ కావుమంచు శ్రీ
పతిని సహోదరా! యనుచు పార్వతి పిల్చెను భారతంబునన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కయ్య సీతాదేవి గారికి
రిప్లయితొలగించండినమస్సులు.
దోషమును సవరిoచి నoదులకు ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షితిపై రఘుకుల భూషణు
రిప్లయితొలగించండిడతులిత పట్టమ్ము నందు నాహ్వానము స్వా
గతమన జని ప్రభు సీతా
పతిని సహోదర! యనుచు భవానియె పిలిచెన్