సందిత గారూ నమస్కారములు. సాహితీ సుధ కూడా మత్తు పదార్థమే. ఒక్కసారి రుచి చూసిన తర్వాత వదిలి పెట్టడం సాధ్యం కాదు. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు పద్యం ఒకసారి పరికించమని మనవి. అందులో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు అంటారు పోతనగారు. అంటే విష్ణు పాదారవింద చింతన అనే అమృత పానము మత్తును కలిగిస్తుంది అని చెబుతున్నారు కదా. ఇది కూడా అటువంటిదే అని నా భావన.
"చిత్ర సీమను ప్రముఖుడౌ పాత్రధారి" అన్నప్పుడు ప్రాసయతి సరిగ్గా లేదండీ. ప్రాసయతిని వేసేటప్పుడు ప్రాసపూర్వాక్షరం గురించి కూడా ఒక నియమం గమనించి పాటించాలి. ప్రాసపూర్వాక్షరం దీర్ఘాక్షరమైతే ప్రాసయతిలో కూడా యతిస్థానంలో కూడా దీర్ఘాక్షరం తప్పక ఉండాలి. ప్రాసపూర్వాక్షరం గురువైతే యతిస్థానంలో గురువు ఉన్నంతమాత్రాన సరిపోదు.
రెండవపాదం చివర మహిళఁహింస అన్నది సరైన సమాసంకాదు. మహిళాహింస అన్నదే సాధువు.
కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. "మగువ హింస" అనండి. ***** శ్యామల రావు గారూ, ధన్యవాదాలు. ఒక సందేహం... ఈ నియమం కేవలం ప్రాయయతికేనా? ప్రాసకు కూడానా? ***** లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉచ్చ నీచ ము లె రు గ ని తుచ్చ న రు డు మొరటు తనము న మె లు గ డే మూర్ఖుడ గు చు మద్య ము ను గ్రోలు వా డే పో ;మనుజు డి ల ను మంచి మర్యాద తెలిసి యు మ స లు చుండు
పద్యము నందు మక్కువను భాషల యందున కౌశలంబునున్
రిప్లయితొలగించండిహృద్యము నైన కావ్యముల సృజ్యము జేసెడి శక్తి గల్గియున్
సద్యము భారతీ జనని స్తన్యము నియ్యగ సాహితీ సుధా
మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా
ఫణికుమార్ గారూ,
తొలగించండిసాహితీ మద్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండికల్లు త్రాగినోడు పడును వెల్లకిలగ
రిప్లయితొలగించండిమందు గొట్టినోడు కులుకు తందనాలు
బండకాడి వారి మధురభావ మనెడు
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను
పూజ్యులు శంకరయ్య గారి సవరణలతో:
తొలగించండికల్లు త్రాగి యొకడు పడును వెల్లకిలగ
మందు గొట్టి యొకడు కుల్కు తందనాలు
బండకాడి వారి మధురభావ మనెడు
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(మనలో మాట.. ఈనాటి సమస్య నిచ్చిన అంజయ్య గారు మద్యం అమ్మేవారే!)
🙏🙏🙏
తొలగించండిశాస్ట్రీ గారూ, మొదటి పాదంలో గణదోషం తద్వారా యతి భంగం కలిగింది, సవరించగలరు.
తొలగించండిశ్రీయుతులు రఘురాం గారికి ధన్యవాదాలతో: ("శాస్ట్రీ" టైపాటు):
తొలగించండి🙏🙏🙏
కల్లు త్రాగి యొకడు పడె వెల్లకిలగ
మందు గొట్టి యొకడు కుల్కె తందనాలు
బండకాడి వారి మధురభావ మనెడు
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను
గద్య పద్య వినిర్మిత హృద్య సర్వ
రిప్లయితొలగించండికావ్య పఠన శ్రవణమున కల్గు మధుర
భావ రసభరితంబగు భావన గల
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను.
(మద్యము=ఆనందము)
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిహృద్యమైన పూరణ. అభినందనలు.
వేద్యము కాదె రక్కసుల వేషము? మానవ జాతి మిన్నయౌ!
రిప్లయితొలగించండిఆద్యము జూదమౌను వెలయాలిని కూడుచు పెద్ద చోరుడౌ
ఖాద్యమె సర్వమౌను పర కాంతల వేటకు వచ్చి దానవుల్
మద్యముఁ గ్రోలు, మానవుఁడె మానితకీర్తి గడించి మించురా!!
సత్యనారాయణ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
"...కాంతల బట్టెడి దానవుండు తా। మద్యము గ్రోలు.." అంటే అన్వయం బాగుంటుందేమో?
గురువుగారికి ధన్యవాదములు.
తొలగించండిసప్తవ్యసనములను దానవ లక్షణములుగా పేర్కొంటూ చేసిన పూరణ అది. "వేట" పదము తీయకుండా మీ సూచన అనుసరించి నా సవరించిన పూరణ:-
వేద్యము కాదె రక్కసుల వేషము? మానవ జాతి మిన్నయౌ!
ఆద్యము జూదమౌను వెలయాలిని కూడుచు పెద్ద చోరుడౌ
ఖాద్యమె సర్వమౌను పర కాంతల వేటరి దానవుండు తా
మద్యముఁ గ్రోలు, మానవుఁడె మానితకీర్తి గడించి మించురా!!
__/\__
తొలగించండి(పానశాల కావ్యప్రశస్తి)
రిప్లయితొలగించండిపారసీకకవికృతరుబాయతుల
రక్తి జదివిన దువ్వూరి రామిరెడ్డి
పానశాలగ తెనిగించె,పరగ పద్య
మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను,
బాపూజీ గారూ,
తొలగించండిదువ్వూరి వారి ప్రసక్తితో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
"రుబాయతులను" అనండి. లేకుంటే గణదోషం.
డా.పిట్టా
రిప్లయితొలగించండిచూడ శూద్రుడు బాపనసోది బట్టి
త్రాగకను పిల్ల పెల్లికి తపన పడగ
పూర్ణ తెలగాణలో వరున్ బొంద వశమె?
మద్యమును గ్రోలువాడె పో మనుజుడిలను
డా.పిట్టా
రిప్లయితొలగించండివిద్యలు వాని వాసియట విందున చప్పటి కూరగాయలే
పద్యము లోననైన యతి భంగము మాడ్కి గణించి వానికిన్
హృద్యమునైన బందుగుల హీనత గల్గగ కార్య ధుర్యుడే?!
మద్యము గ్రోలు మానవుడె మానిత కీర్తి గడించి మించురా!
డా.పిట్టానుండి
రిప్లయితొలగించండిఆర్యా,సవరణ
"పద్యము లోన బడ్డ యతి భంగము" గాచదువ గలరు.దీనితో"నైన"యొక్క పునరుక్తికి దోశశాంతి.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టానుండి
తొలగించండిఆర్యా},ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
తప్పతాగి అల్లర్లు హత్యలు చేసే రౌడీలకు
గూండాలకే గదా భయంతో గూడిన గౌరవం నేడు :
01)
_________________________________
వైద్యము రాకయున్న, శుభ - వాద్యము నేమియు నేర్వకున్న, నే
పద్యము రాకయున్న, చిటి - వ్రాయస మైనను రాకయున్న, నే
గద్యము వ్రాయకున్న, చిరు - ఖాద్యము సేద్యము సేయకున్న, నే
విద్యను నేర్వకున్న, శ్రుతి - వేద్యుని నెన్నదు వేడకున్న , నీ
మద్యముఁ గ్రోలు మానవుఁడె - మానితకీర్తి గడించి మించురా !
_________________________________
వ్రాయసము = దస్తూరి (సంతకము)
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్యసింహుని రాజ్యాన మద్యపాన
రిప్లయితొలగించండిమాద్య కృత్యంబు సర్వథా హృద్య మచటి
జనులు వచియింతు రీరీతి యనవరతము
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను.
హ.వేం.స.నా.మూర్తి.
మద్యము త్రాగువా డిటుల మాటలు ప్రేలుచు నుండు నిత్యమున్
రిప్లయితొలగించండిహృద్యము సత్య మియ్యది మహీస్థలి పైన సుఖంబు గూర్చు నా
కుద్యమ శక్తి నిచ్చు నెపు డుత్సుకతన్ గలిగించు కావునన్
మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా.
హ.వేం.స.నా.మూర్తి.
పద్యము సర్వకాలముల పాండితి బెంచును వాఙ్మయంబునం
రిప్లయితొలగించండిదాద్యములైన భావముల నందముగా సమకూర్చుచుండు తా
నద్యతనాద్బుతంబులకు నాస్పద మందలి సద్రసాఖ్యమౌ
మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "..రీతి ననవరతము" అనండి.
కామ క్రోధాది యారు పగతులు గల్గు
రిప్లయితొలగించండివాడు, లోపభూయిష్టుడు వాడు, కోరి
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను!
తత్సమస్తము మించు నాతడు మనీషి!
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను
రిప్లయితొలగించండిమద్యమందెంత మహిమయొ మాననీయ!
బుద్ధిజీవులు విహరించు భూమియైన
శంకరాభరణమునందు శంకలేక
పూరణకయినోచుకొనుచు పుణ్యమనగ
మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను!
మద్యం యెన్నివిధాల నిషేధించినా "సమస్యలు" తెచ్చిపెడుతూనే ఉంది!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిత్య నూతన నవభావ నివహమందు
రిప్లయితొలగించండిపద్య ధారా ప్రభంజన పథము నరసి
హృద్యమౌ గాన సందీప్తు లెగయు చుండు
"మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను!"
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హిరణ్యకశిప మరియు ప్రహ్లాద సంవాదం :
రిప్లయితొలగించండిబాల! హరి నామ కీర్తనమాలపించి
మత్తునందున తూలగన్ మనుజుడెట్లు?
వప్త! నారాయణామృత పానమనెడు
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆద్య మగ్ని వైద్యమ్మిటు లను జనులక
రిప్లయితొలగించండివేద్యము నవద్య వచన మబేద్యముగ క
ర మభినంద్యమును ననవద్య మగును సుమి
“మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను”
మద్యము బుద్ధి నాశకము మానుట మంచిది యెల్ల వారికిన్
వైద్య వినీత కర్షక సుపండిత యంత్ర వరజ్ఞ సంఘ మీ
మద్యముఁ గ్రోలు, మానవుఁడె మానిత కీర్తి గడించి మించురా
విద్యయు లేక యున్నను వివేకము గల్గి దయార్ద్రు డైనచో
26-2- 2016 నాటి నా పూరణ:
తొలగించండిసద్యపు స్ఫూర్తినిన్ వినయ సంపద లందుననుత్తముండునై
హృద్యము లైన కార్య తతు లింపుగ నేర్పున జక్క బెట్టుచున్
వైద్యవిశారదుండు నుడువన్నిక దప్పదటంచు నించుకన్
మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతింత్రు సజ్జనుల్
కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ లన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిశ్రీమతి జి సందిత బెంగుళూరు
రిప్లయితొలగించండిపద్యసమస్యవేదికలభ్రష్టముసేయగపట్టుబట్టిదు
ర్విద్యనదుస్సమస్యలకవీంద్రులకిచ్చుచువెక్కిరించుటౌ
చోద్యము!మ్లేచ్ఛులాకవులచూచివిషంబిమిడించి పోయుమా
మద్యముగ్రోలు!మానవుడె మానితకీర్తిగడించి మించురా
శ్రీమతి జి సందిత బెంగుళూరు
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మద్యము గురించి ఇలాంటి పాపపు సమస్య ఇచ్చిన వారికి మద్యంలోనే విషం కలిపి యిచ్చే మానవుడు కీర్తి గడించటం ఖాయం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ మన్నది ఒక సరదా ప్రక్రియ. అవధానాలలో పాపపు సమస్యలే కాదు అశ్లీల సమస్యలు కూడా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.
తొలగించండిచిలుక గోరింక కోకిల చీమ దోమ
రిప్లయితొలగించండిలేడి పులి పిల్లి సింహము
గాడిదయును
బీరు త్రాగి కారు నడిపి పారి పోవు...
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను!
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసేద్యము వృత్తిగా విమల శ్రీహరి గాథల పోతనార్యుడున్
రిప్లయితొలగించండిహృద్యము గా రచించె! ప్రభువిచ్చెడు కాన్కల వీడి పండెడున్
ఖాద్యమె చాలునంచు తన కావ్యరసామృత భక్తిసారమౌ
మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫణికుమార్ తాతా వారికి శ్రీమతి జి సందిత నమస్సులు
రిప్లయితొలగించండిసాహితీసుధ సుధ అంటే అమృతము మరి సుధా మద్యము అంటే అమృతాన్ని నింద్యం చేసినట్లౌతుంది కదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసందిత గారూ నమస్కారములు. సాహితీ సుధ కూడా మత్తు పదార్థమే. ఒక్కసారి రుచి చూసిన తర్వాత వదిలి పెట్టడం సాధ్యం కాదు. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు పద్యం ఒకసారి పరికించమని మనవి. అందులో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు అంటారు పోతనగారు. అంటే విష్ణు పాదారవింద చింతన అనే అమృత పానము మత్తును కలిగిస్తుంది అని చెబుతున్నారు కదా. ఇది కూడా అటువంటిదే అని నా భావన.
తొలగించండివిద్యనశింపదే భువి వివేకము తోడను వేల్పులందు తా
రిప్లయితొలగించండినాద్యుడుయైన శ్రీహరికి నాత్మ నివేదన జేసి భక్తి నై
వేద్యము కాగ గొల్చినను వేదన తీరును రామనామమున్
మద్యము గ్రోలు మానవుడె మానితకీర్తి గడించి మించురా
వీటూరి భాస్కరమ్మ
వ్యాధి మిక్కిలి తీవ్రమై బాధ గొలిపి
రిప్లయితొలగించండిఒడలు చల్లగ మారంగ నొడుపు తోన
నరసి వైద్యుడు బలుకగా నౌషదముగ
మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"తా నాద్యుడునైన..." అనండి.
అమృతమునుగ్రోల దివిజుల హక్కవగను
రిప్లయితొలగించండిరక్తమును త్రాగి రక్కసుల్ రాజిలగను
మత్తు సాధించు మార్గము మంచు జేర్చి
మద్యమును గ్రోలు వాడెపో మనుజు డిలను
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
మానవుల సేవయే పరమావధి యని
రోగులున్ వైద్యశాలయే లోకముగను
పనికి యంకితమై తాను వైద్యమనెడి
మద్యమును గ్రోలువాడె పో మనుజు
డిలను.
***************************
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పనికి నంకితమై..." అనండి.
చిత్ర సీమను ప్రముఖుడౌ పాత్రధారి
రిప్లయితొలగించండిమద్యమును , ధూమపానము , మహిళఁహింస
మంచి నటనను సమకూర్చు మాకని యనె
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను
సుధను మనసార గ్రోలిరి సురలు యెపుడొ
పొగను త్రాగనిచో దున్న పోతవంగ
మద్యసేవనమే లేక మనుజుడగునె!
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను
"చిత్ర సీమను ప్రముఖుడౌ పాత్రధారి" అన్నప్పుడు ప్రాసయతి సరిగ్గా లేదండీ. ప్రాసయతిని వేసేటప్పుడు ప్రాసపూర్వాక్షరం గురించి కూడా ఒక నియమం గమనించి పాటించాలి. ప్రాసపూర్వాక్షరం దీర్ఘాక్షరమైతే ప్రాసయతిలో కూడా యతిస్థానంలో కూడా దీర్ఘాక్షరం తప్పక ఉండాలి. ప్రాసపూర్వాక్షరం గురువైతే యతిస్థానంలో గురువు ఉన్నంతమాత్రాన సరిపోదు.
తొలగించండిరెండవపాదం చివర మహిళఁహింస అన్నది సరైన సమాసంకాదు. మహిళాహింస అన్నదే సాధువు.
పొట్టకై యన్య భాషలు పట్టుకొనిన
తొలగించండినమ్మ బాస కంటే భాష కమ్మ నుండు
తేన మాటల మూట యీ తెలుగులోని
మద్యమును గ్రోలువాడె పో మనుజు డిలను.
పొట్టకై యన్య భాషలు పట్టుకొనిన
తొలగించండినమ్మ బాస కంటే భాష కమ్మ నుండు
తేన మాటల మూట యీ తెలుగులోని
మద్యమును గ్రోలువాడె పో మనుజు డిలను.
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"మగువ హింస" అనండి.
*****
శ్యామల రావు గారూ,
ధన్యవాదాలు. ఒక సందేహం... ఈ నియమం కేవలం ప్రాయయతికేనా? ప్రాసకు కూడానా?
*****
లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాకు తెలిసినంత వరకు ఈ నియమము కేవలము ప్రాస యతి వరకే ఉంటుంది
తొలగించండినాకు తెలిసినంత వరకు ఈ నియమము కేవలము ప్రాస యతి వరకే ఉంటుంది
తొలగించండిప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
తొలగించండిస్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)
సిగరెటునుకాల్చెడునరుడుశివునికొడుకు కల్లు ద్రాగెడు వాడె శ్రీకాంతు సుతుడు పాలువెన్నలు తినువాడు పద్మ విభుడు మద్యమును గ్రోలువాడెపో మనుజుడిలను
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉచ్చ నీచ ము లె రు గ ని తుచ్చ న రు డు
రిప్లయితొలగించండిమొరటు తనము న మె లు గ డే మూర్ఖుడ గు చు
మద్య ము ను గ్రోలు వా డే పో ;మనుజు డి ల ను
మంచి మర్యాద తెలిసి యు మ స లు చుండు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహానిని కలుగ జేసెడి నప్రియమగు
రిప్లయితొలగించండిమద్యమును గ్రోలు వాడె పోమనుజుడిలను
నన్ని విధముల కష్టము లనుభవించ
వలసి యుండు గాన విడిన వాసి యగును.
పదిలముగ మదిని సతము పద్యములను
మద్యము గ్రోలు వాడెపో మనుజుడిలను
పనుల యొత్తిడి లోబడి బాధ పడెడి
మనుజుల కిది యే యౌషధ మండ్రు గాదె.
మద్యసింహుని రాజ్యాన మద్యపాన
రిప్లయితొలగించండిమాద్య కృత్యంబు సర్వథా హృద్య మచటి
జనులు వచియింతు రీరీతి యనవరతము
మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను.
హ.వేం.స.నా.మూర్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమద్యము మానెదన్ననుచు మాటలు చెప్పెడు మందబుద్ధియే
రిప్లయితొలగించండిమద్యముఁ గ్రోలు;...మానవుఁడె మానితకీర్తి గడించి మించురా
మద్యము నమ్ముచున్ విరివి మాన్యత నొందు విమాన వాహినిన్
చోద్యము మించగా నడిపి చుప్పున మూయుచు లండనేగగన్