27, జులై 2017, గురువారం

సమస్య - 2421 (కాముం డెనుఁబోతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాముం డెనుఁబోతు విఘ్ననాథుఁడు కపియౌ"
(లేదా...)
"కాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్"
(యతిమైత్రిని గమనించండి)

శ్రీరాం వీరభ్రహ్మ కవి (1885-1970) గారి పూరణ....

హైమవతీసతీశు నయనాగ్ని నశించె నెవండు? సుంతయున్
బ్రేముడి లేని కాలుఁడు చరించుట కెయ్యది వాహనంబు? దై
త్యామర మానవాళి తొలి యర్చన లందెడి వేల్పెవండు? శ్రీ
రామపదాబ్జసేవల విరాజిలు నెవ్వఁ డనన్ గ్రమంబునన్
కాముఁడు; దున్నపోతు; గణనాథుఁడు; మర్కటమూర్తి యారయన్"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథము నుండి)

82 కామెంట్‌లు:

  1. "ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ"

    ... శ్వేతాశ్వర ఉపనిషద్



    రాముని బంటున, పోతున ,
    కాముని, కరివదను, హృదిని కర్తగ తానై
    గోముగ నాత్మయె యుండన్
    కాముం డెనుఁబోతు విఘ్ననాథుఁడు కపియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు నమస్సులు!

      సీతాదేవి గారికి ధన్యవాదములు!

      తొలగించండి
    3. ఇందు గల డందు లేడను సందేహము వలదు - చాలా బాగున్నదండి.

      తొలగించండి
    4. శాస్త్రి గారు చక్కటి ఉపనిషద్వచనములతో బహు చక్కటి పూరణ. ఇక్కడ కపి యెవరు మీ యూహలో?

      తొలగించండి
    5. మొదటి పాదం మొదటిలోనే ఉన్నాడని నా అభిప్రాయము.

      "రాముని బంటు"

      తప్పైతే క్షమించండి.

      ఇది క్రమాలంకారని నేననలేదు. ప్రాస కోసం తంటాలు. "అందరిలో" పరమాత్మ ఉన్నాడని ఉపనిషద్ అంటోంది గా.

      తొలగించండి
    6. విష్ణు వన్న యర్థము తీసుకున్న నన్వయము చక్కగా సరిపోతుంది. అందఱు విష్ణురూపులేయని.

      తొలగించండి
    7. పూజ్యులు కామేశ్వర రావు గారు:

      పై పద్యంలో భావం సరియైతే అన్వయం సవరించమని నా ప్రార్ధన. భావమే తప్పైతే కృష్ణార్పణం.

      కుకవులలోనూ ఆ పరమాత్మయే కర్తగా నున్నాడుగా పాపం :)

      "ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
      భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"

      తొలగించండి
    8. కపి కి విష్ణువన్న యర్థము కూడా యుంది కాబట్టి యన్వయము చక్కగా నుంది మీ పూరణలో.

      తొలగించండి
  2. తామర తూపరి యెవ్వరు,
    యేమియముని వాహనమ్ము యెల్కపతినిలన్
    యేమను,కిగి నేమందుము,
    కాముం ,డెనుఁబోతు, విఘ్ననాథుఁడు ,కపియౌ"

    రిప్లయితొలగించండి
  3. గీమున బొమ్మల జేయగ
    గోముగ మంటిని మథింప గుదిరిక మీరన్
    రాముడు భీముడు సోముడు
    కాముం డెనుబోతు విఘ్ననాథుడు కపియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాముడు భీముడు శివుడు
      న్గాముం డెనుబోతు విఘ్ననాథుడు కపియౌ

      - అని సరి చేశాను.

      తొలగించండి
  4. రామాయణ గీతాదుల
    నామంబును బలుకనట్టి నాస్తిక ప్రజకున్
    భూమిని సర్వవిధాల
    న్గాముం డెనుబోతు, విఘ్ననాథుడు కపియౌ.

    ధీమతులార! మేల్కొనుడు దెల్పెద మీశ్రుతి శాస్త్ర సంగతుల్
    భూమి నసత్య మంచు కడు పోడిమితో వచియించు చుండి యా
    నామము లైన బల్కకను నాస్తికులై చరియించు వారికి
    న్గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ, సమస్యా పాదంలో (కందం) యతి లేదు గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదాంతంలో ద్రుతం చేర్చండి....యతి సరియగును...

      తొలగించండి
    2. ఓహో, పరిష్కారంలో ఇది కూడా ఒక భాగమే అన్నమారా. శాస్త్రి గారు, ధన్యోస్మి

      తొలగించండి
    3. ఒకప్పుడు బిందువును మనం వ్రాస్తున్న విధంగా కాక సంయుక్తాక్షరరూపంలో వ్రాసే సంప్రదాయం కూడా ఉండేది. మీకు తెలుసునో లేదో కొందరు పంచాంగము అని 'సున్నా'లతో వ్రాయటం అంత శుభం కాదని
      పఞ్చాఙ్గము అని వ్రాసేవారు! సమస్యతో‌పాటు ఇచ్చిన పూరణలోని చివరి భాగాన్ని
      .................................గ్రమంబున
      న్కాముఁడు; దున్నపోతు; గణనాథుఁడు; మర్కటమూర్తి యారయన్

      అని వ్రాయవచ్చునన్న మాట. ఇప్పుడు యతిమైత్రి సరిపోతోంది కదా? ఒక్కోసారి అనుస్వారాన్ని ప్రధమాక్షరంలోనూ‌ యతిమైత్రిస్థానంలోనూ‌ కూడా ఇదే విధంగా వ్రాసి 'న'కారంతో‌ యతిమైత్రిని చెల్లించటం కూడా కద్దు. ఇందులో ఇబ్బంది ఏమీ‌ లేదు. కవిప్రయోగాలు కొల్లలుకొల్లలు

      తొలగించండి
  6. రాము oడన గా నె వ డ ని
    తా మ సు డైదై వ ము ల ను దా సీ న ము గా
    పా మ రు విధము న ప లు క
    న్గాముండెను పో తు విఘ్ననా ధుడెక పి యౌ

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. ఆమనిచెలి యనగనెవరు?
      సామాన్యుని రథమదేది? సతిసుతుడెవరే?
      రాముని బంటెవ్వరనన్?
      కాముం;డెనుబోతు; విఘ్ననాథుడు; కపియౌ!

      డా।। జి. పి. శాస్త్రిగారి సవరణలకు ధన్యవాదాలతో!🙏🙏🙏

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. సోముడు కోపమున్ బడసి చూడగ నెవ్వడు అంతమయ్యెనో,
    యేమది మోయు చుండునట యిష్టము తోడ పరేతరాజునిన్,
    భీమ సుతుండనే మనుచు బిల్చి జనంబులు పూజ జేతురో,
    రాముని బంటు రూపమును రమ్యము గా పిలు వన్ గ్రమంబున
    న్గాముడు, దున్నపోతు,గణనాథుఁడు , మర్కట మూర్తియా రయన్

    సోముడు = శివుడు
    పరేతరాజు = యముడు
    భీమ = పార్వతి






    రిప్లయితొలగించండి
  9. ………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ప్రేమ లతా౦తముల్ విసరు వీరు డదెవ్వరు ?

    . . . . . .కాల వాహన౦

    బేమి ? జగాల , విఘ్నముల నెల్ల నడ౦చుచు

    . . . . . . . గాచు నట్టి యా

    స్వామి యెవ౦డు ? పావని యెవ్వ ?

    . . . . . రనన్ :- గ్రమ౦బునన్ =

    గాముడు | దున్నపోతు | గణనాధుడు |

    . . . మర్కటమూర్తి | యారయన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "స్వామి యనంగ నెవ్వడొకొ? పావని యెవ్వరనన్ గ్రమంబునన్" అనండి.

      తొలగించండి
  10. మీ మీ పూర్వాభినయము
    లేమూలకు చాలునయ్య? యెటులీ పాత్రల్
    ప్రాముఖ్యముఁగొను? నరయన్
    కాముండెనుఁబోతు! విఘ్న నాథుఁడు కపియౌ!

    రిప్లయితొలగించండి
  11. వామనయన గణముల పె
    న్గాముం డెనుఁబోతు, విఘ్ననాథుఁడు కపియౌ
    నీ మనుజుల కెల్లఁ గొలువ
    వేమరు మది భక్తి నిల్పి వినయంబలరన్
    [కపి = విష్ణువు]


    యేమని నమ్మ నేర్తు నితడే నిజ మారుతి యౌననంగ ము
    న్నే మహి వింటి రాక్షసులు నేర్పున రూపములన్ ధరింతురే
    యా మహితాసురుండు దమి నౌనికఁ దాల్చగఁ గామ రూపము
    న్గాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  12. రావణబ్రహ్మతో సతీమణి మండోదరి:

    సేమముఁ గాదు సీతనిట చింతిలఁ జేయఁగ మిన్నకుండునే
    రాముఁడు! దానవాంతకుడు! ప్రాజ్ఞతవీడ భ్రమింప జేసెడు
    న్గాముడు దున్నపోతు! గణనాథుఁడు మర్కటమూర్తి! యారయన్
    లేమను జూచి లంకఁ జిరిఁ రేపుచుఁ గూర్చెనె దొల్లి విఘ్నమున్!!

    రిప్లయితొలగించండి
  13. శ్రీమతి జి సందిత బెంగుళూరు

    27, జులై 2017, గురువారం
    *"కాముం డెనుఁబోతు విఘ్ననాథుఁడు కపియౌ"*

    (లేదా...)
    కాముడు శిల్పి శిష్యుడువికారముగామలచన్ గనుంగొనెన్
    సీమప్రతాపరెడ్డినిలిచెన్ గొనిపోవగణేశశిల్పమున్
    మామరియాదపోవువినుమా తమకిచ్చినవిగ్రహమ్మునేన్
    *"కాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్"*

    శిల్పి తన శిష్యుడు గణపతి విగ్రహాన్ని మలచితే అది మర్కట మూర్తిగా కనిపిస్తోందని తన శిష్యుడు కామున్ని దున్నపోతు అని ప్రేమావేశంతో తిట్టిన సందర్భం

    రిప్లయితొలగించండి
  14. శ్రీమంతుని సుతుడెవరు? త్రి
    ధాముని వహనమన నేది,?దాక్షిసుతుడనన్?
    రాముని సేవకు డెవ్వరు?
    కాముం,డెనుబోతు, విఘ్ననాధుడు,కపియౌ!!!

    రిప్లయితొలగించండి
  15. ధీమతి నొక్క రాక్షసుడు ద్వేషము తోడను వేల్పులందరిన్
    తా మనమందు రోయుచును తద్దయు దూషణ జేయు చుండడే
    వేమరు నిట్లు బల్కు తగ విష్ణువు గాడిద శంభుడెద్దుయున్
    కాముడు దున్నపోతు గణనాథుడు మర్కటమూర్తి యారయన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  16. ఏమని చెప్పుదు లాలూ?
    వేమారు చెఱంబడినను వేసటలేదే?
    పామరుడ!పరుల ధనము
    న్గాముండెనుబోతు! విఘ్ననాథుడు! కపియౌ!

    విఘ్ననాథుడు = పనులు చెడగొట్టువాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      ప్రతీకాత్మకమైన చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  17. ఏమి విచిత్రదృశ్యములు|యెవ్వరు జూడ విచిత్ర శాలలో {మ్యూజియం}
    ఏమదికైన వింతయగు|యేలన?యుంచిన యద్దమందునన్
    కాముడుదున్నపోతుగ|గణనాథుడు మర్కటమూర్తియారయన్
    సోముడు చిట్లియుండు|నొకసుందరినెంచ?కురూపియచ్చటన్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దృశ్యమది యెవ్వరు.. వింతయగు నేలన నుంచిన..." అనండి.

      తొలగించండి
  18. ప్రేమయె విఫలంబై చన
    నోమనుజూడు ఖేదపడుచు నొప్పృగ బలికెన్
    భామలు కఠినాత్ములిలన్
    కాముండెనుబోతు విఘ్ననాధుడు కపియౌ
    ---వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. ఏ ముందీ శిల ననరే !
    రాముండో భాస్క రుండొ రతి మగడయిన
    న్నీ మహి నాస్తిక తతికి
    న్గా ముం డెనుఁబోతు విఘ్ననాథుఁడు కపియౌ

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    రయము నే తెంచి లంక నా రామనెరిగి
    భయము గొల్పగ నసురులు పరుగులెత్త
    నయము మీరగ హన్మ వానరుడ నేను
    జయము నీకనె రావణ చావు కతన

    రిప్లయితొలగించండి
  20. సోముని కసి బొందెనవరొ? యామృత్యువువాహ్యమేది? హరుసుతుడెవరో? రాముని ప్రియభక్తుడన న్గాముండెనుబోతు విఘ్న నాథుడు కపియౌ

    రిప్లయితొలగించండి
  21. సవరణతో.... గురువు గారికి ధన్యవాదాలతో....

    ఏమనియెదరా రతిపతి,
    నేమృగమున్నెక్కును యము, డెవరిని గొలువన్
    క్షేమము, కీశ మ్మెవరన
    న్గాముం_డెనుబోతు -విఘ్ననాథుడు- కపియే!

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.

    ప్రేమను సృజియించు నెవం

    డే?మృగమున్నెక్కు యముడు?
    నీశుని సుతుని
    న్నేమందురు? కోతి యన

    న్గాముండె,నుబోతు,విఘ్ననాథుడు,
    కపియౌ.

    రిప్లయితొలగించండి
  23. [7/27, 6:59 PM] sreeramaraochepuri: ఏమనిజెప్పెదన్నతని హేలలు, నల్వురు పుత్రులన్గనెన్
    నీమములేనివారి,నతినేర్పుగ నల్లరి జేయువారినిన్
    ధీమతి కానివారి బహుతీరుల మూర్ఖుల పిల్చెరీతిగ
    న్కాముడు,దున్నపోతు,గణనాధుడు,మర్కటమూర్తి ఆరయన్
    [7/27, 7:04 PM] sreeramaraochepuri: అవోరకం ముద్దుపేర్లు వారి ముఖ లక్షణాలనుబట్టి

    రిప్లయితొలగించండి
  24. క్రమాలంకారం....

    ప్రేమల్ పుట్టించునతడు,
    కామితముగ యముడును తిరుగాడు తురగమున్,
    సామజముఖుడనిలజుడన్
    కాముండె, నుబోతు , విఘ్ననాథుడు , కపియే !!


    6వ.ప్రశ్న. జతపరచుము 4 మార్కులు

    అ) కాముడు ........ .. కపి ( ఆ)
    ఆ) విఘ్నపతి...పూలబాణం(ఈ)
    ఇ) రాముడు....ఎనుబోతు ( అ)
    ఈ) యముడు..... ఎలుక ( ఇ)

    ( ఇ... అ.... ఈ.... ఆ... సరియైనవి)


    ఏమిది? జతపరుచుటయా !
    నీ మొగమేమియును గాదొ ! నిక్కమ్మౌనే ?
    యేమని గుణములనిత్తున్
    కాముండెనుబోతు విఘ్ననాథుడు కపియే?

    ఏమిది చిత్రలేఖనమొ ! యెక్కగ గన్పడుచుండునట్లుగాన్
    కాముడు దున్నబోతు ! గణనాథుడు మర్కటమూర్తి యారయన్ !
    ప్రేమగ గీచినారెవరొ వింతగ మార్చుచు తోక తొండముల్ !
    నా మతిబోయె జూడగను నవ్వితి ! మీరును జూచి నవ్వరే !!


    ఏమీ? రెండుశరమ్ముల
    మోమున రచియింప , తొండమును వెనుకిడగా
    కాముడు గణపతి మారెన్
    కాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ పూరణ లన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి



  25. కోమలశరములెవ్వరివి

    హైమవతియు దానెవరిని యంతము చేసెన్

    శ్యామల సుతుడు,ప్లవమన

    న్గాముండెనుబోతు విఘ్ననాథుడు కపియ


    కోమలపూబాణు డెవరు

    శ్యామలపతి వాహనంబు సరిగా చెపుమా

    వాముని సుతుడే హరియ

    న్గాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ.

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. ఆ మనసిజుడెవ్వడు?యము
    డేమృగమును నెక్కి తిరుగు? హేరుకుడెవడో?
    రాముని భక్తుండెవడన్?
    కాముం,డెనుబోతు, విఘ్ననాథుడు, కపియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాముని భక్తు డెవడన। న్గాముం డెనుబోతు..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన తో సవరించిన పద్యము
      ఆ మనసిజుడెవ్వడు?యము
      డేమృగమును నెక్కి తిరుగు? హేరుకుడెవడో?
      రాముని భక్తు డెవడన
      న్గాము౦,డెనుబోతు, విఘ్ననాథుడు, కపియే.

      తొలగించండి
  28. శంకరాభరణం లో ఇచ్చిన సమస్య- " కాముం డెనుబోతు న్
    ప్రేమించు నతడు దక్కిన ,
    చో మోటు మనుజుడు దక్క, స్థూలశరీరుం
    డో మరి కురూపి దక్కిన
    కాముండెనుబోతు దేవగణపతి కపియౌ
    (ప్రేమించే వాడు దక్కితే మన్మథుడు. మోటు మనిషి దక్కితే ఎనుబోతు. లావుపాటి వాడు దక్కితే వినాయకుడు.అందం లేని వాడు దక్కితే కోతి. క్రమాలంకారం )

    రిప్లయితొలగించండి
  29. అయ్యా ! ఈ సమస్యలో యతి లేదు కదండీ . అందుకే నా పూరణలో " కాముండెనుబోతు దేవ గణపతి పతియౌ" అని వ్రాశాను. పై పాదం లో ఒక అరసున్న ఉంచితే యతి సరిపోతుందంటారా ?

    రిప్లయితొలగించండి
  30. ప్రేమించు నతడు దక్కిన ,
    చో మోటు మనుజుడు దక్క, స్థూలశరీరుం
    డో మరి కురూపి దక్కిన
    గాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ
    (ప్రేమించే వాడు దక్కితే మన్మథుడు. మోటు మనిషి దక్కితే ఎనుబోతు. లావుపాటి వాడు దక్కితే వినాయకుడు.అందం లేని వాడు దక్కితే కోతి. క్రమాలంకారం )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ వారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగుంది. కాని చివరి పాదం యతి మీద దృష్టి పెట్టలేదు. "కురూపి దొరక। న్గాముం డెనుబోతు..." అంటే యతి సరిపోతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదం . ఇక్కడ ఎడిటింగ్ కుదరటం లేదు . ఇది ఏ అవధానం లో ఇచ్చారో కానీ అసలు సమస్యని ఇలా ఇవ్వటం సంప్రదాయమేనా ? అనేది నా సందేహం. ఇచ్చిన సమస్యలో యతి సరిపోయి ఉండాలి.

      తొలగించండి
    3. ధనికొండ వారూ,
      సమస్యను ఇలా ఇవ్వడం సంప్రదాయమే. గతంలో ఎన్నో అవధానలలో ఇచ్చారు కూడా. అవధాని తన ప్రతిభతో యతిదోషాన్ని పరిహరిస్తూ పూరణ చెప్తాడు.
      పైని ఇచ్చిన (వృత్త) సమస్య శ్రీరాం వీరభ్రహ్మం కవి ఒకానొక అవధానంలో ఎదుర్కొన్నదే. వారి పూరణ కూడా పైన ఇచ్చాను. గమనించండి.
      ఒక ఉదాహరణ చూడండి... "యమున కేది సాటి ధరణియందు" అని సమస్య ఉందనుకోండి. ఇక్కడ య-ధ లకు యతి కుదరదు. ప్రాసయతి కూడా లేదు. పూరించే కవి "... స।త్యమున కేది సాటి ధరణియందు" అని పూరిస్తాడు.

      తొలగించండి
  31. షామిరు పేటనున్ మరియు సంజివ రెడ్డి యమీరు పేటనున్
    దోమల గూడనున్ మరియు తుమ్మల బస్తిని చార్మినారునున్
    గోముగ వోటరన్నలిట గొప్పగ చెప్పెద భాగ్యనగ్రినిన్:👇
    కాముఁడు దున్నపోతు గణనాథుఁడు మర్కటమూర్తి యారయన్ :)

    రిప్లయితొలగించండి