16, జులై 2017, ఆదివారం

సమస్య - 2412 (ముదమున రాహుల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్"
(లేదా...)
"ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్"
(నేమాని సోమయాజులు గారికి ధన్యవాదాలతో...)

65 కామెంట్‌లు:

 1. తుదకున నోటుల రద్దే
  కదరా మోదీకి తనయ కన్నుల పండౌ
  పిదపన రాక్షస రీతిన
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్


  ...రాక్షస వివాహం:

  "అన్ని వివాహ పద్ధతులలో ఈ వివాహ పద్ధతి అతి నీచమైనదిగా పెద్దలు నిర్ణయించినారు. ఈ పద్ధతిలో వివాహమునకు బ్రాహ్మణ, వైశ్య వర్ణముల వారికి అనుమతి లేదు. ఈ పద్ధతిలో ఎవరికీ తెలియకుండా, దొంగచాటుగా మోసపూరిత ఆలోచనతో, కన్య యొక్క ఇష్టాఇష్టముల ప్రమేయము లేకుండా, కన్యను అపహరించి తీసుకొనిపోయి బలవంతముగా వివాహం చేసుకోవటం రాక్షస వివాహం. శూద్ర, క్షత్రియ వర్ణాల వారు మాత్రమే ఈ విధముగా వివాహము చేసు కోనుటకు అర్హులు. వారికి మాత్రమే ఈ రకమైన వివాహము చెల్లుబాటు అవుతుంది:

  https://te.m.wikipedia.org/wiki/పెళ్ళి"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. సనాతన ధర్మంలో కన్య ఇష్టం లేక వివాహం లేదు అది రాక్షసమైనా సరే! వికీలో ఉన్నదంతా నిజమని నమ్మకండి, నాలాటివారి పరిజ్ఞానమే అది. ఈ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెబుతున్నది కాదని మనవి.

   తొలగించండి
  2. కేవలం సమస్యా పూరణం కోసమే!

   ధన్యవాదములు!

   తొలగించండి
  3. తుదకున నోట్ల రద్దుల ప్రదూషిత కన్యయె మోడి కూతురే!
   వదలక సోని పుత్రుడు దభాలున ప్రేమ వివాహ వేదికన్
   ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్
   కదనము యూ.పి. లోనను చికాకు పడంగ విడాకు లిచ్చెరా!

   తొలగించండి
  4. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   నాకు తెలిసి రాక్షస వివాహమంటే కన్య యొక్క ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా పెళ్ళి చేసికొనడం. కన్య ఇష్టపడితే అది రాక్షస మెలా అవుతుంది?
   సూర్యరాయాంధ్ర నిఘంటువు - కన్యక యొక్క బంధువుల జయించి బలాత్కారమునఁ గన్య నపహరించికొని వచ్చి చేసికొనెడి వివాహము (ఎనిమిది విధములగు వివాహములలో నొకటి)
   బ్రౌన్ నిఘంటువు - A form of marriage in which the bride is carried away by force.
   శంకర నారాయణ నిఘంటువు - one of the eight forms of marriage, the violent seizure and rape of a girl after the defeat or destruction of her relatives.
   సాహిత్య అకాడెమీ నిఘంటువు - బలాత్కారమున కన్య నపహరించుకొనివచ్చి చేసికొనెడి పెండ్లి.

   తొలగించండి
  5. శాస్త్రి గారు నిన్నటి మీ సందేహానికి చక్కటి వివరణతో శ్యామల రావు గారు కూడ అంత్య లఘువులతో కూడా వృత్తములు కలవని దృఢపఱచి సంతోషము కలిగించారు.

   అయితే వారుదహరించిన సౌందర్యలహరీ శ్లోకము మాత్ర మంత్య లఘు వృత్తము కాదు.
   అది అత్యష్టి ఛందమునకు చెందిన శిఖరిణి సంస్కృత వృత్తము.

   శిఖరిణి పద్య లక్షణములు
   17 అక్షరములు ఉండును.
   4 పాదములు ఉండును.
   ప్రాస నియమం కలదు (సంస్కృత వృత్తమునకు వర్తించదు)
   ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
   ప్రతి పాదమునందు య , మ , న , స , భ , వ(లగ) గణములుండును.
   సంస్కృత ఛందస్సు లో గురు నిర్ణయమునకు ప్రత్యేక వసతులున్నవి. అవి:
   1. ప్ర, బ్ర, క్ర మూడు రేఫ సంయుక్తాక్షరములకు వెనుక నున్న లఘువు సందర్భానుసారము గురువుగా కాని లఘువు గా కాని తీసుకొన వచ్చును.
   ఇతర హల్లులకు(ప,బ లేక క కాకుండ) ర వత్తున్న యిది చెల్లదు. మన మిత్రులు కొందఱు వాడుచున్నారు తెలియక.

   2. హ తో మొదలగు యే సంయుక్తాక్షరమున కైన వెనుకనున్న లఘువు కూడ గురు లఘువులు గా అవసరార్థము తీసుకొన వచ్చును.

   3. పాదాంతమున నున్న లఘువు కూడ నవసరమును బట్టి గురువు లేక లఘువు గా వాడబడుతుంది.
   ఇవి కేవలము సంస్కృత శ్లోకములందు మాత్రమే.
   అయితే యిందులోని మొదటి సూత్రమును కొందరు పూర్వ కవులు తెలుగు పద్యములలో నుపయోగించిరి అత్యవసర సందర్భములలో (పద సౌందర్యమునకు కాబోలు). కనుక నామోద యోగ్యము.

   హరబ్రహ్మాదుల్ లో ర లఘువు గా భాగవతములో నారయ.
   ధరణిప్రజ లో ణి లఘువు గా భారతములో నన్నయ.

   సంస్కృత శ్లోకములలో మూడవ సూత్రము ననుసరించి పాదాంతపు లఘువును గురువుగా స్వీకరించ వచ్చు నవసరమును బట్టి.
   ఇట్టి ఉదాహరణలు చాలా శ్లోకములలో కలవు.

   తొలగించండి
  6. అయ్యా స్వామీ!

   చాలా సంతోషం! కానీ ఇవంతా నాకెటుల అర్ధం కాగలదు? ఈ బ్లాగును చదివే పండితోత్తములు చాలా మంది ఉన్నారు. వారికి ఉపయోగ పడునని సంతస మొందెదను.

   మీరు ఈ తడవ హైదరాబాదు వచ్చినపుడు నా ఈ-మైలుకు తెలియజేయండి. కలుస్తాను. మొన్న శంకరయ్య గారిని కలవడం నా అదృష్టం. వారు లీవులో ఉన్న మూడు వారాలూ (గత నవంబరులో) మీ సమీక్షలను నేను చాలా ఆనందించితిని.

   నమస్సులు!

   తొలగించండి
 2. వదినా వినరండోహో
  ముదమున రాహుల్ వరించె మోదీతనయన్!
  కధనము చక్కగనున్నది
  కధకులు నేమానివారు కాగను పంతుల్!

  పంతుల్= పెళ్ళి పెద్ద ( దర్శకుడు)

  రిప్లయితొలగించండి
 3. సదమల హృదయుడు తానని
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
  పదవికి తగడని తలియగ
  యెదలోయల పాతి బెట్టె యెవ్విధి తెలుపన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   తలియగ/ తెలియగ.

   తొలగించండి
  2. సదమల హృదయుడు తానని
   ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
   పదవికి తగడని తెలియగ
   యెదలోయల పాతి బెట్టె యెవ్విధి తెలుపన్

   తొలగించండి
 4. విదలేనివాడు పల్కెను
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్,
  ముదుసలి అద్వాని కిడెను
  పదిలపు రాష్ట్ర పతి పదవి భరతా వనిలోన్
  విద = తెలివి

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  కదనము కదనమె మదిలో
  మెదలే ప్రేమంబు గనదు మూకల గణనన్
  వదలడు దశమ గ్రహమై
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
  (10 వ గ్రహమై కూడ పీడించవచ్చునని రాహుల్ ఎత్తుగడ.బామ్మర్ది బామ్మర్దే పేకాట పేకాటే అన్న సామెత.ప్రతిపక్ష ధోరణి మారదుకదా!)

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  సదమలమైన'రద్ద'1పుడు శత్రువు మాదిరి యక్ష ప్రశ్నలన్
  వదలిన రాహులేమనడు వచ్చిన జీ.యెసి.టెం2త వంతయో
  కుదిరినదేదొ బంధమని కోవిదులెల్ల గణింప, నిక్కమే
  ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చగన్
  1 నోట్ల రద్దు,2G.S.T

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. డా.పిట్టా నుండి
   ఆర్యా,ధన్యవాదాలు.పుస్తకానికి ప్రచురణానుమతి యిచ్చాను.వారంరోజులో release కు సిద్ధం.

   తొలగించండి
 7. సుదతి బెనర్జి పుత్రిక కుశోభన మాయెను వంగ రాష్ట్రమున్
  ముదితకు మీస మొచ్చెనట మోమున యోగి తనూజ కెల్లడన్
  విద గలపిల్ల కాదుట నవీను కుమార్తె ఒడిస్స రాష్ట్రమున్
  పదిల ముగావి దేశము న బాంకు న నల్ల ధనమ్ము కాచగన్
  ముదము న రాహు లే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్

  మమతా బెనర్జీ , యోగి ఆదిత్య నాదు , నవీను పట్నాయిక్ ల పుత్రికలు తో సంబంధము వలదని మోడీ పుత్రికను రాహులు గాంధి పెండ్లాడెను అను భావన

  రిప్లయితొలగించండి
 8. సదమల కృషికుడు మోదీ
  సుదతీమణి శాంతతోడ సుందర నగరిన్
  సదయుడు కాపురముండగ
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. వదలిన "జశోద బెహను"ను
   సదమల హృదయుండు మోడి సధవగ జేయన్
   వదలుచు బుద్ధియు సుద్ధియు
   ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్


   జశోద బెహన్ = మోడీజీ భార్య

   తొలగించండి
 9. మదినిండ కలహమున్నను
  విధమై స్వచ్ఛత యె మోది బిడ్డగ జూడన్
  చదునుగ శుభ్రము జేయుచు
  ముదముగ రాహుల్ వరించె మోదీ తనయన్

  రిప్లయితొలగించండి
 10. వధువును వీడిన పథమున
  ప్రధాని యగుటన్, వివాహ వాంఛను మఱువన్
  తదనంతర వారసుడగు
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్!

  ('భార్యను వీడడము వల్లే ప్రధాని అయ్యాడన్న'
  భావనకు మోదీ తండ్రి అయితే
  అసలు పెళ్లే చేసుకోకుండా ఉండడము అనే భావనను తనయ గా భావించి రాహుల్ పెళ్లాడాడను భావము. అంటే పెళ్లే మానేయడం.)

  రిప్లయితొలగించండి
 11. పొదుపరి యగు మోదీకొక
  సుదతియు కలుగగ తనమది సురతం బొందెన్
  తదుపరి సోదరి సుతుడే
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్

  రిప్లయితొలగించండి
 12. గురువు గారికి నమో వాకములు
  మదిన మదనుడి సoదడి
  పదిలoబాయెన్,వలపుల పరిక్ష నoదున్
  బెదెరెను, సోదరి చెప్పగ
  ముదమున రాహుల్ వరిoచె మోది తనయన్
  P a r ee k s h a telugu లో టై పు చేయు ట రాలేదు.

  రిప్లయితొలగించండి
 13. గురువు గారికి నమో వాకములు
  మదిన మదనుడి సoదడి
  పదిలoబాయెన్,వలపుల పరిక్ష నoదున్
  బెదెరెను, సోదరి చెప్పగ
  ముదమున రాహుల్ వరిoచె మోది తనయన్
  P a r ee k s h a telugu లో టై పు చేయు ట రాలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పరిక్ష' అన్నచోట గణదోషం. సవరించండి.

   తొలగించండి
 14. (ఇది ఒక కల)
  సదమల నాయకులెల్లరు
  కదనము లెవ్వియు నెరుగక కలివిడి నుండన్
  మది భావించిన కలలో
  ముదమున రాహుల్ వరిoచె మోదీ తనయన్.

  రిప్లయితొలగించండి 15. సదమల గుణశీలి యనుచు

  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్

  హృదయము పులకించగ తా

  సదనమునకునేగి తల్లి సమ్మతి కోరెన్.

  రిప్లయితొలగించండి
 16. సదనమున 'మోది'నేతగ
  వదరెడి బందుగులునచట ప్రతిపక్షముగా
  బెదరించెడి అల్లుడుగా
  ముదమున 'రాహుల్' వరించె మోదీ తనయన్

  రిప్లయితొలగించండి
 17. పృధివినియశమును గాంచిన
  సదమల హృదయుండు మోది సంబంధమనన్
  పదిలంబుగనుండుననుచు
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్!!!

  రిప్లయితొలగించండి
 18. అదిరెను సామీ చెప్పుడు
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
  జదువగ నబ్బుర మగుచు
  న్నెద యంతయు జలదరించె నీక్షణ మునన్

  రిప్లయితొలగించండి
 19. ఇదియేమి చిత్రమో విను
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
  మదినెరుగ డితడు మోదిల
  సదమలమౌ బ్రహ్మచారి నన్మానితుడున్.

  రిప్లయితొలగించండి
 20. పద పదమున పరిపాలన
  వదలని మదిని ముదిమి తను వరియించిన యీ
  ముదురు వటువు జనకుండే!
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్!


  కదలక కూరుచుండి మమకారపు మిత్రుని వేడ నివ్విధిన్
  మదిని హరించు హాస్యము సమర్పణ సేయు మనంగఁ బల్కె దాఁ
  బదపద చూడఁ బెండ్లినికఁ బార్థివు లెల్లరు రాఁ జెలంగగన్
  ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

   తొలగించండి
 21. ఇదియెటు సాధ్యమై చనెను యెప్పృడు క్రోధ దవాగ్ని కీలలన్
  వదనము నందురుంజుచును వాక్కులె బాణములై చెలంగ నా
  ముదమును ద్రావినట్లుగను మోమును తిట్టుచునుండ నెవ్విధిన్
  ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చగన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 22. గదుముచు మామను తిట్టగ
  నిదియేసరి యతని పుత్రి నెలమినిగై కో
  నదనని పెండ్లాడంగను
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'వదనము నందురుంజుచును... గై కోనదనని...' ?

   తొలగించండి
 23. వదలక నసత్య వార్తల
  సదా ప్రసారమును జేయు చానలు చెప్పెన్
  బుధులెవ్వరు మెచ్చని తరి
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్

  అదిగద దేశసంపదల కద్భుత యూతము నిచ్చునంచు తా
  వదలక తెచ్చె నూత్నమగు పన్నువిధానము గాంచి నోరునే
  మెదపక తాను సైయ్యనుచు మెచ్చి విపక్షపు నేత జైయనన్
  ముదమున రాహులే వలచె మోదికుమార్తెను జైట్లి మెచ్చగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం.
   రెండవ పూరణలో 'అద్భుత యూతము' దుష్టసమాసం.

   తొలగించండి
 24. నిదురను నే కలగంటిని
  కద ! మోదీ కేది తనయ , కరమున బట్టన్
  ముదిమికి జేరెడు వయసున ?
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్ !

  రిప్లయితొలగించండి
 25. అదనపుకట్నమె గెలుపును
  తదుపరిఎన్నికల యందు తప్పకనిలుపన్
  గుదరగ?” కలలో గాంచితి
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్”|

  రిప్లయితొలగించండి
 26. అది మోదీ *హృదయాత్మజ*
  గదరా ! *వస్త్వేకశుల్క ఘన పద్ధతి* ! దా..
  నిది మెచ్చి సభాంతరమున
  ముదమున రాహుల్ వరించె మోదీ తనయన్ !!


  అదిగొ నరేంద్రమోది *హృదయాత్మజ*గా జనియించె దేశ సం..
  పదలను బెంచు క్రొత్తదగు *పన్నువిధానము* ! దాని మెచ్చుచున్
  పదుగురు జూచుచుండగ *సభన్ కరతాళరవమ్ములొప్పగా*
  ముదమున రాహులే వలచె మోది కుమార్తెను *జైట్లి* మెచ్చఁగన్ !!  ఎదిగెను వామనుండనగ నింతకునింత నరేంద్రమోది ! తా
  వదలడు పీఠమున్ ! తనకు భాగ్యము దక్కదటంచు గుందుచున్
  మది చెదరంగ లోకసభ మధ్యనె నిద్రను పొందగా కలన్
  ముదమున రాహులే వలచె మోదికుమార్తెను జైట్లి మెచ్చగన్
  పదవిక నాకు దక్కునని భ్రాంతిని బొందుచు నల్లుడౌటచే !!

  రిప్లయితొలగించండి
 27. వధువును వీడి దేశమును పాలన జేయు ప్రధాని యైన దా
  వదలిన పెళ్లినే తగెడు వారసుడౌదునటంచు భావనన్
  ముదమున రాహులే వలచె! మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్
  సదమున పన్ను లేకమగు సాధ్విగ నెంచుచు నొప్పిరెల్లరున్!

  రిప్లయితొలగించండి
 28. పదుగురు నవ్వరే యిటుల పప్పుడి పెండ్లికి నాహ్వనించుటన్: 👇
  "ముదమున రాహులే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్"
  చదువుము తప్పు దిద్దుచును చక్కని చుక్కవు పెండ్లికూతురా:👇
  "ముదమున రాఫెలే వలచె మోది కుమార్తెను జైట్లి మెచ్చఁగన్"

  రాఫెలు = rafale (fighter aircraft)

  రిప్లయితొలగించండి