ప్రభాకర శాస్త్రి గారూ, పద్యం బాగుంది. ధన్యవాదాలు. 'రాజరాజు' ఉకారాంత శబ్దం కనుక 'ను' వస్తుంది. అక్కడ 'వోలెన్' అని గసడదవాదేశం రాదు. సరళాదేశం రావచ్చు. అందుకని "రాజరాజు సముండై" అనండి.
కృష్ణ సూర్య కుమార్ గారు. నమస్సులు. దైవ దత్తములైన మీ భావనా పటిమ, వ్యక్తీకరణ నైపుణ్యము, నుత్ప్రేక్ష ణాతిశయము, క్రమబద్దీకరణ చాతుర్యము, రచనోత్సాహము లమోఘములు నిస్సందేహముగా. ఈ గుణ గణాలకు తోడు మీరు వ్యాకరణమున దృష్టి బెట్టిన సుమధుర గళమునకు సంగీతము తోడైన గలుగు మహోన్నతి తో మీ పద్య రచనా ప్రాభవము దశ దిశల వ్యాపించుననుట లో నతిశయోక్తి యీషణ్మాత్రము లేదు. బాలవ్యాకరణము నంతర్జాలము నుండి గ్రహించి యవగాహన చేసుకున్న సత్ఫలిత ముంటుంది. ఆత్మన్యూనతా భావమును దరికి రానీకండి.
గురుతుల్యులు కామేశ్వర రావు గారికి ప్రణామములు. మీరు సెలవు యిచ్చినట్లుగా వ్యాకరణము నేర్చు కుంటాను. తేటగీతి ,కందము నల్లుట కొద్దిగా అలవాటు పడినాను. వృత్తములు ఈ మధ్యనే గురువు గారి ప్రోత్సాహముతో వ్రాయుట మొదలు పెట్టినాను. తెలుగులో నేనేమి చదువుకోలేదు. వృత్తి రీత్యా మెటీరియల్ మేనేజరుగా 44 వత్సరములు చేసి 63 వ సంవత్సరములో రిటైరు అయ్యాను. చిన్న నాటి పునాదితో ఈ ప్రయత్నము మొదలు పెట్టాను. అవకాశమున్న మీ మెయిలు ఐ డి ఇచ్చిన మీతో విషయాలు పంచుకుంటాను. ధన్యవాదములతో పూసపాటి
ఘురణము = ధ్వని మృదాకరము = పిడుగు అని ఉండాలి టైపాటు స్తనితము = గర్జించు అన్న అర్ధము తీసుకున్నాను. అంటే పదము స్తరణము తో మొదలైనది కాబట్టి యతీ కుడా స్త తో మొదలు అవ్వాలేమోనని స్తనితము అనవలసి వచ్చింది
భాస్కరమ్మ గారూ, మీ రెండు పద్యాలు చక్కగా ఉన్నవి. అభినందనలు. వృత్తం మొదటి పాదం చివర '..నంజలించుచున్' అన్నచోట టైపాటు. కందంలో 'కలుగన్+ఈ చిత్ర' మన్నచోట యడాగమం రాదు. "కలుగ। న్నీచిత్ర" మనవచ్చు.
దాచిన కవనము లన్నియు
రిప్లయితొలగించండిపూచిన మందారముల వలె పులకించ మదిన్
జూచిన గురువుల బ్లాగున
తోచె సమస్యల గణన చతుర్వింశతియై
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. ధన్యవాదాలు.
రెండవ పాదంలో గణదోషం. "పూచిన మందారములయి పులకించ..." అనండి.
దాచిన కవనము లన్నియు
తొలగించండిపూచిన మందారములయి పులకించ మదిన్
జూచిన గురువుల బ్లాగున
తోచె సమస్యల గణన చతుర్వింశతియై
వాచస్పతి శంకరుడే
రిప్లయితొలగించండిరాచరికము జేసి రాజరాజుని వోలెన్
మా చేతను పూరించగ
తోచె సమస్యల గణన చతుర్వింశతియై
* పూరింపగ ?
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిపద్యం బాగుంది. ధన్యవాదాలు.
'రాజరాజు' ఉకారాంత శబ్దం కనుక 'ను' వస్తుంది. అక్కడ 'వోలెన్' అని గసడదవాదేశం రాదు. సరళాదేశం రావచ్చు. అందుకని "రాజరాజు సముండై" అనండి.
🙏🙏🙏
తొలగించండిదోచెను పద్య ప్రియులహృది
రిప్లయితొలగించండివీచెను పద్య సుమగంధ వీచిక లంతన్
కాచెను పద్య పతన మని
తోచె సమస్యల గణన చతుర్వింశతియై.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూచెన్గవితా పుష్పము
రిప్లయితొలగించండివేచెన్గవి మధుపములవి వేగిరపడుచున్
వీచె స్నేహ సుగంధము
తోచె సమస్యల గణన చతుర్వింశతియై!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
మూడవ పాదంలో గణదోషం. "వీచెన్ స్నేహ..." అనండి. టైపాటు కావచ్చు!
గురువు గారికి నమస్సులు! అది టైపాటే!
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండిసూచిక యుండదు భావాల్
కాచినవా ఫలములాయె"కంది"వనమునన్
చూచినవింతగు నిపుడే
తోచె సమస్యల గణన చతుర్వింశతియై!!
.....సరస్వతీ దివ్యాశ్శీః ప్రాప్తిరస్తు!
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
డా.పిట్టా
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు
పరువులు వెట్టుచు న్గిరుల పర్వతపంక్తుల కొండగుట్టల న్చురుకుగ దాటుచు న్హొయలుజూపుచు జీవనదీప్రవాహమై యురికెడు శంకరాభరణ ముత్తమనిర్ఝరి దాని మార్గమం దిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్యలియ్యెడన్.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు ఒక భవనమైతే దాని మూలస్తంభాల్లో మీరూ ఒకరు. మీ పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
గురువుగారూ అలాఅనడం మీసౌజన్యత.
తొలగించండిఈ చిరు సాహితి వనమున
రిప్లయితొలగించండిపూచిన కమనీయ కవన పుష్పము లేగా
దోచెను రసజ్ఞుల మదిని
తోచె సమస్యల గణన చతుర్వింశతియై.
విరించి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
'సాహితీవనము' అన్నది సాధు సమాసం. అక్కడ "ఈ చిరు సాహిత్యవనిని" అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించండిబరువడి నొక్క పాదుననె బారెను తీగయ దాన మల్లెలే
చిరు చిరు తెల్ల పాత్రలన చేర్చె సుగంధము విశ్వమెల్లెడన్
ఇరుముడి వేసికోన్ శబరినీశుని దర్శన భాగ్యమబ్బగా
గురుకృప గాదె విస్తరణ గొన్నవి ప్రశ్నలు నోళ్ళు విప్పె నే
డిరువది నాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్!!
విద్యా వితరణ విశేష పుణ్య ఫల ప్రసాద సిద్ధిరస్తు......అభినందనలతో...
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
డాపిట్టానుండి
తొలగించండిఆర్యా, ధన్యవాదాలు
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా, నా కందపు రెండవ పాదం సవరణ
కాచినవా ఫలములవియ "కంది"వనమునన్..గా స్వీకరించండి
పుచెను పద్య సుమాలవి
రిప్లయితొలగించండిదోచెను రసహృదయములను ధూపము లగుచున్
కాచెను కమనీయముగా
తోచె సమస్యల గణన చతుర్వింశతియై
2. శంకరాభరణం...
వరములనీయు కల్పతరువై రసపోషణ సేయు భాండమై
మురిపెమొసంగు మా హృదయ మోహన ముద్దుల వీణపాణియై
స్వరముల నెన్నొ గూర్చి రసవాదుల పాలిటి రామనామ మై
యిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు హృద్యంగా ఉన్నవి. అభినందనలు.
దాచిన మేధో సంపద
రిప్లయితొలగించండిపూచెను శంకర వనమున బుష్పగడనమై
దోచగ దూర విదితులన్
"తోచె సమస్యల గణన చతుర్వింశతియై"
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నోచని జీవన మందున
రిప్లయితొలగించండితోచె సమస్యల గణన చతుర్వింశతియై
బ్రోచెడి శంకరు డుండగ
నా చిక్కులు సర్వము మరి నాశము గావే?
విరిగెను విల్లు కర్ణుడును వెన్నును చూపగ నిహ్నవంబునన్
తొలగించండివిరథుడ నైతి నేనిచట పెక్కురు జేరియు గూల్చినంతయు
న్నిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
శరములు వీడి యేను రథచక్రము దాల్చియు వీరిజంపెదన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు. ధన్యవాదాలు!
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండి*పూచిన సాహిత్య కుసుమము*
రిప్లయితొలగించండి*వీచినపూరణలగంధ వీడెము కవులన్*
*దోచెనురస పూరితమై*
*దోచె సమస్యల గణన చకుర్వింశతియై*
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "సాహిత్యసుమము" అనండి. 'గంధవీడెము' అంటే దుష్టసమాసం. "గంధవీడ్యము" అనండి.
దాచని పూల సుగంధము
రిప్లయితొలగించండివీచగ పద్యాల శోభ విచ్చెడి వనిలో
దోచెడి పూరణ లందున
తోచె సమస్యల గణన చతుర్వింశతియై!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివాచవికందువలగుచున్
తోచె సమస్యల గణన చతుర్వింశతియై"
మాచే వ్రాయించితిరిగ
నీచక్కని పద్యములను నిలశంకరులున్
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
మీచే నిడగ సమస్యలు
మాచే పూరించబడుచు మధురోహలతో
పూచెను పద్య సుమమ్ములు
తోచె సమస్యల గణన చతుర్వింశతియై.
****************************
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు!
సారస్వతారాధకులు
రిప్లయితొలగించండిశంకరాభరణం నిర్వాహకులు
శ్రీ కంది శంకరయ్య గారికి అభినందనలు... వందనములు
💐💐💐💐🙏🙏🙏🙏🙏
శ్రీ చంపకోత్పలాదులు
పూచిన యుపజాతి జాజి పూవుల సొబగుల్
మీచే శత గుణితంబై
తోచె సమస్యల గణన చతుర్వింశతియై"
ఇరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్"
భరమని యెంచబోక తన బాధ్యత గా దలపోసి శంకరా....
భరణసమూహమున్ నడిపి పద్యమరందము బంచు దిట్టకున్
కరములు మోడ్చి మ్రొక్కెదము కంది వరాన్వయ శంకరయ్యకున్ !!
మురళీకృష్ణ గారూ,
తొలగించండిమీ పద్యాలు మనోహరంగా ఉన్నవి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపూచెను పద్యపు సుమములు
దోచెను కవివర్యుల మది, తోడుగ నిలవన్
వాచస్పతి వరములిడుచు
తోచె సమస్యల గణన చతుర్వింశతియై"
వాచస్పతి= శ్రీ కంది శంకరయ్య గారు
వరప్రసాద్ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
మీచేపట్టిన బ్లాగున
రిప్లయితొలగించండిపూచె కవిత లతిక లందు పూవుల బెళుకుల్
వీచెను పరీమళమ్ములు
తోచె సమస్యల గణన చతుర్వింశతి యై
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమనోహరమైన పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు.
గురుకృప. కృతఙ్ఞతలు
తొలగించండిమెరుపుల వోలె కాంతినిడు మిస్సన పద్యము లీ వనమ్మునన్
రిప్లయితొలగించండిఉరుముల వోలె కోవిదపు యుర్విన కాముని పద్య మెప్పుడున్
ఘరణము చేయు, శాస్త్రి యొసగంగ మ్రుదాకరమైన పద్యముల్
వెరపున ద్రోసె నెప్పుడు కవీశుల, సుబ్బుని శైలి శోభతో
జరజర సాగు చుండునుగ సర్పపు చేష్టల వోలె, నెప్పుడున్
మురళి రవమ్ము నిచ్చునట మోహన కృష్ణుని పద్య భావముల్
సరస విరించి పుంగవుడు సంభ్రమ రీతిగ వ్రాయు, శంకరా
భరణ వనమ్ము లోన ఘన భాగవతుల్ల సుమమ్ము కృష్ణుడై
విరియగ భాస్కరమ్మయును వీచెను పద్యపు చందనంబులున్
మరుల జిలేబి నూతనపు మాటలు వాడి ఛలోక్తు లివ్వగా,
మురియుచు నెందరో కవులు మోదము తోడను చల్లె బీజముల్,
పెరుగుచు శంకరయ్య వని పేరును గాంచె స్వదేశ మంతయున్
తరువులు శాఖలవ్వుచు ప్రతాపము తోడ విదేశ మంతవి
స్తరణము నొంది కావ్య వని స్తన్నితము ల్నిడుచుండ దీప్తితో
ఇరువదినాల్గు వందలు గణింపగనొప్పె సమస్య లియ్యెడన్"
శంకరాభరణము బ్లాగులో కావ్య విత్తనములు చల్లి
సేద్యము చేయుచున్న కవి వరులకు
నమస్కారములతో
తప్పులున్న క్షమించ వలెను.
సూర్యకుమార్ గారూ,
తొలగించండికవిమిత్రులను పేర్కొంటూ చక్కని చంపకమాలికను అందించారు. ధన్యవాదాలు.
కొన్ని టైపాట్లున్నవి.
కృష్ణ సూర్య కుమార్ గారు. నమస్సులు.
తొలగించండిదైవ దత్తములైన మీ భావనా పటిమ, వ్యక్తీకరణ నైపుణ్యము, నుత్ప్రేక్ష ణాతిశయము, క్రమబద్దీకరణ చాతుర్యము, రచనోత్సాహము లమోఘములు నిస్సందేహముగా. ఈ గుణ గణాలకు తోడు మీరు వ్యాకరణమున దృష్టి బెట్టిన సుమధుర గళమునకు సంగీతము తోడైన గలుగు మహోన్నతి తో మీ పద్య రచనా ప్రాభవము దశ దిశల వ్యాపించుననుట లో నతిశయోక్తి యీషణ్మాత్రము లేదు. బాలవ్యాకరణము నంతర్జాలము నుండి గ్రహించి యవగాహన చేసుకున్న సత్ఫలిత ముంటుంది. ఆత్మన్యూనతా భావమును దరికి రానీకండి.
ఛందోబద్ధమై యలరారు తోంది మీ పూరణ. ఈ వ్యాకరణ సవరణలను గమనించండి.
తొలగించండివనమ్మునన్నురుముల; కోవిదపు టుర్వినఁ గాముని; “ఘరణము” అంటే యర్థము కాలేదు; ముదాకరమైన (సంతోషమునకు గని); సర్పపుఁ జేష్టల; నర పుంగవుడు, కవి పుంగవుఁడు (నరులలో/కవులలో శ్రేష్ఠుఁడు) అనవచ్చు. “విరించి సత్కవియ” అంటే సరి.; భాగవతంపు సుమమ్ము; తోడను జల్ల (చల్లె- ఏకవచనపు క్రియా రూపము కవులు బహు వచనము.); స్వదేశ మంతయుం / దరువులు; శాఖ లౌచును బ్రతాపము; “స్తన్నితము ల్నిడుచుండ” అంటే యర్థము కాలేదు, ”సన్నుతమైవెలుగొంద” అంటే బాగుంటుం దనుకుంటాను; దీప్తితో/ నిరువది.
గురుతుల్యులు కామేశ్వర రావు గారికి ప్రణామములు. మీరు సెలవు యిచ్చినట్లుగా వ్యాకరణము నేర్చు కుంటాను. తేటగీతి ,కందము నల్లుట కొద్దిగా అలవాటు పడినాను. వృత్తములు ఈ మధ్యనే
తొలగించండిగురువు గారి ప్రోత్సాహముతో వ్రాయుట మొదలు పెట్టినాను. తెలుగులో నేనేమి చదువుకోలేదు. వృత్తి రీత్యా మెటీరియల్ మేనేజరుగా 44 వత్సరములు చేసి 63 వ సంవత్సరములో రిటైరు అయ్యాను. చిన్న నాటి పునాదితో ఈ ప్రయత్నము మొదలు పెట్టాను. అవకాశమున్న మీ మెయిలు ఐ డి ఇచ్చిన మీతో విషయాలు పంచుకుంటాను. ధన్యవాదములతో పూసపాటి
ఘురణము = ధ్వని
తొలగించండిమృదాకరము = పిడుగు అని ఉండాలి టైపాటు
స్తనితము = గర్జించు అన్న అర్ధము తీసుకున్నాను. అంటే పదము స్తరణము తో మొదలైనది కాబట్టి యతీ కుడా స్త తో మొదలు అవ్వాలేమోనని స్తనితము అనవలసి వచ్చింది
kamesh_pochiraju@yahoo.co.in
తొలగించండికృష్ణకుమార్ గారూ మీసహృదయతకు నమస్సులు.
తొలగించండిఅరుదగురీతి శంకరులయధ్భుతసృష్టికి నంజలించపంచున్
రిప్లయితొలగించండిసరసత పూరణల్ సలిపె సంఖ్యకు మిక్కీలికాగ సత్కవుల్
చరణములాన నేనునొక చాతక పక్షినియై చకోరినై
మరి మరి వేచిచూచితిని మాన్యత పూరణసేయు కోరికన్
ఇరువదినాల్గువందలు గణింపగ నొప్పె సమస్యలియ్యెడన్
వీటూరి భాస్కరమ్మ
పూచె సమస్యల కలువలు
రిప్లయితొలగించండివేచెడి కవిచంద్రులకును వేడుక కలుగన్
యీ చిత్రమెట్లు పొగడెద
తోచెసమస్యల గణన చతుర్వింశతియై
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పద్యాలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
వృత్తం మొదటి పాదం చివర '..నంజలించుచున్' అన్నచోట టైపాటు. కందంలో 'కలుగన్+ఈ చిత్ర' మన్నచోట యడాగమం రాదు. "కలుగ। న్నీచిత్ర" మనవచ్చు.
ప్రోచఁగ హరియే శంకరు
రిప్లయితొలగించండిసాచివ్యం బది చిరముగఁ జన నోములనే
నోఁచ శతసహశ్రోత్తర,
తోఁచె సమస్యల గణన, చతుర్వింశతియై
అరయఁగఁ జిన్న నాఁడు వల దన్నను గల్గును విద్దె యాతనల్
పరువము నందుఁ జూడగను బట్టుఁ గుటుంబ విచార భారముల్
తరుణమె చూడ వార్ధక సుధారణ నమ్రుల కీయ పూరణల్
ఇరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవానృషి:.
తొలగించండితథా సర్గశతాన్పఞ్చ షట్కాణ్డాని తథోత్తరమ్ ৷৷1.4.2৷৷
కృత్వాపి తన్మహాప్రాజ్ఞస్సభవిష్యం సహోత్తరమ్.
చిన్తయామాస కోన్వేతత్ప్రయుఞ్జీయాదితి ప్రభు:৷৷1.4.3৷৷
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నవి మీ పద్యాలు. ధన్యవాదాలు!
"యిరువది" గా చదువ బ్రార్థన.
తొలగించండిసరస మనస్వి, సత్కవి, యుషఃస్మరణీయుడు, "కంది" -శంకరా
రిప్లయితొలగించండిభరణపు బ్లాగు నందు కవి పండిత హృష్టిగ నెన్ని యెన్నియో
నిరుపమ సత్సమస్యలిడె నేర్పుగ సత్కవులార! నేటికి
న్నిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
విజయకుమార్ గారూ,
తొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
కరముగ శంకరాభరణ కర్త మనోజ్ఞడు శంకరాఖ్యుడున్
రిప్లయితొలగించండితరచుగ బెంచ జ్ఞానమును దర్కవితర్క సమస్యలిచ్చిన
న్నరమర లేక పూరణములన్నికవీంద్రులు జేసిరిప్పుడా
యిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్"
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పద్యం హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.
ఎరుగను పద్యలక్షణము నేనరువై తరియించు నాటికి
రిప్లయితొలగించండిన్నిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్యలియ్యెడన్
గరువము కల్గుచున్నది సుఖమ్ముగ చేయుచు పూరణమ్ములన్
కరమగు తృప్తి తోడుతను కాంచుచునుంటిమి దేవలోకమున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిచక్కని పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు.
సమూహంలో సూచించిన సవరణ గమనించండి.
మాచేత నిరత మిచ్చట
రిప్లయితొలగించండిసూచనలన్ జేసి పద్య సుమధుర గంధాల్
వీచగ జేసెడి క్రమమున
దోచె సమస్యల గణన చతుర్వింశతియై.
నిరుపమ దీక్ష బూని యనునిత్యమవశ్యము గాగ నెంచుచున్
సురుచిర భావముల్ పలుకు సుందరమైన సుపద్య పంక్తులన్
గురువరులైన శంకరులు కూర్మిని జూపు క్రమంబు నందు నే
డిరువది నాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నవి. ధన్యవాదాలు.
నాచే మాచే పూచే
రిప్లయితొలగించండివీచే సాచే కవనము విచ్చెడి జిలుగున్
మీచే మెచ్చే వీచిన్
తోచె సమస్యల గణన చతుర్వింశతియై!
శిష్ట్లా వారూ,
తొలగించండిబాగుంది మీ పద్యం. ధన్యవాదాలు.
"పూచెడి వీచెడి సాచెడి మెచ్చెడి.." అనండి.
పూచె సుగంధ కుసుమములు
రిప్లయితొలగించండివీచె మలయ మారుతమన వేల సమస్యల్
నే చవి గొన జూడ మదికి
తోచె సమస్యల గణన చతుర్వింశతియై
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పద్యం మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.
ఒరులకసాధ్యమైనదిది! యోపికతోడ సమస్యలిచ్చుచున్
రిప్లయితొలగించండిగురువర! మీరు పూరణలు క్రొత్తగ వ్రాసెడి వారికోసమై
వరముగ శంకరాభరణ బ్లాగును నిత్యము నిర్వహించ నే
డిరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమంచి పద్యాన్ని అందించారు. ధన్యవాదాలు.
గురువగు కంది శంకరుడు గూడుగ మార్చె జనాళి నే సదా
రిప్లయితొలగించండికరుణ రసాన్వితాలయమకాముగమార్చెను బ్లాగునేగదా
ఇరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
తరుణముమీరవందలుగతాన్ని గణాంకము మారు మెచ్చగా
రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. ధన్యవాదాలు.
'ఆలయ మకాముగ'...?
మరులను గొల్పు శంకరుని మానస పుత్రి ప్రసిద్ధి నొందుచున్
రిప్లయితొలగించండివిరిసెను సాహితీ విరులు విజ్ఞుల మన్నన వొంది నేటికిన్
ఇరువది నాల్గు వందలు గణింపగ నొప్పె సమస్యలియ్యెడ
న్నరయగ నెంత భాగ్యమది యద్భుత మౌ యనుభూతి గల్గెనే.
విరించి గారూ,
తొలగించండిమీ పద్య పుష్పం మనోజ్ఞంగా ఉంది. ధన్యవాదాలు.
"విరిసెను పద్య పుష్పములు" అనండి.
శ్రీచరణాంచిత సుమమై
రిప్లయితొలగించండిప్రాచుర్యమునంద' శంకరాభరణ' మ్మై
సాచివ్యంబై కవులకుఁ
దోచె సమస్యల గణన చతుర్వింశతియై!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పద్యం చక్కగా ఉంది. ధన్యవాదాలు.
పూచెలతాంతములిచ్చట
రిప్లయితొలగించండివీచెను పలు సౌరభములు విందుగ నెపుడు
న్నాచిత్తంబలరారగ
తోచె సమస్యల గణన చతుర్వింశతియై!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మరువనిమంచిపద్యముల మాలనుబేర్చిన శంకరార్య|యే
రిప్లయితొలగించండిమెరుగనివారికైన తనమేధకు బంచెడియూహలెన్నియో
అరుదుగగానుపించుగద|యద్భుత పూరణలెన్నియోగనన్
ఇరువది నాల్గు వందలు గణింపగ నొప్పెసమస్యలియ్యెడన్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పద్యం మనోజ్ఞంగా ఉంది. ధన్యవాదాలు.
తరతమ భావమెన్నడు వితానమునందున జూపకుండినన్
రిప్లయితొలగించండిమెరిసిన పద్యరత్నముల మేటిగ నొప్పుచుఁ బ్రోత్సహించగన్
దొరలుచు 'శంకరాభరణ' తోరణమందు కవిత్వమొప్పుచున్
ఇరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్
పరుగిడుకాలవాహినిదిప్రాజ్ఞులువిజ్ఞులుశాస్త్రకోవిదుల్
రిప్లయితొలగించండిచెరగనిముద్రవేసిరిల,శ్రేయముగూర్చగనేర్పుతోడుతన్
స్థిరమతిశంకరార్యునివిశిష్టతపుణ్యతబ్లాగునేటితో
ఇరువదినాల్గువందలుగణింపగనొప్పెసమస్యలియ్యెడన్!!!
మీచాతుర్యము తోడను
రిప్లయితొలగించండిమాచేవ్రాయించినారు మధుర కవితలన్
మాచేతము లుల్లసిలగ
తోచె సమస్యల గణన చతుర్వింశతియై
రిప్లయితొలగించండిపరుగులు దీయుచున్ చనెను బద్యము వాహిని యట్లుగా నిటన్
సరగున రండు పూరణలు సక్రమ రీతిన చేసి చూపగన్
గురువులొసంగిరయ్య మనకుత్సుకతన్ కల్గశంకరార్యులీ
ఇరువదినాల్గు వందలు గణింపగ నొప్పె సమస్య లియ్యెడన్"