కవిమిత్రులారా!
అందరికీ నమస్కృతులు.
మరొక ఐదు రోజుల్లో రిటైర్ కాబోతూ విశ్రాంత జీవనాన్ని ఎలా గడపాలా అని ఆలోచిస్తున్న నాకు ఆంధ్రజోతి దినపత్రిక ఆదివారం సంచికలో బ్లాగుల గురించి ఒక వ్యాసం కనిపించింది. బ్లాగు ప్రారంభించి ఏదో ఒకటి వ్రాస్తూ కాలక్షేపం చేయవచ్చు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే 'KANDI SHANKARAIAH BLOG' అన్న పేరుతో బ్లాగును ప్రారంభించి 26-7-2008 నాడు మొదటి పోస్టుగా తెనాలి రామకృష్ణుని చాటుపద్యం "నరసింహ కృష్ణరాయల..." పద్యాన్ని ప్రతిపదార్థ తాత్పర్యాలతో ప్రకటించాను. ఆ తరువాత ఏం చెయ్యాలో తోచలేదు. దాదాపు రెండేళ్ళ వరకు మళ్ళీ బ్లాగు జోలికి వెళ్ళలేదు.
ఈమధ్య కాలంలో ఆంధ్రామృతం, రౌడీరాజ్యం, ఊకదంపుడు, తురుపుముక్క, డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగుల్లో అడపా దడపా ఇచ్చే సమస్యలను పూరించేవాణ్ణి. ఆ బ్లాగు నిర్వాహకులు "పూరణ బాగున్న"దని మెచ్చుకున్నపుడు సంతోషం, తృప్తి కలిగేవి. అయితే ఆ బ్లాగుల్లో సమస్యలను ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. రోజూ ఆ బ్లాగులను తెరిచి ఎవరూ సమస్యలు ఇవ్వకపోవడంతో నిరుత్సాహపడేవాణ్ణి. నాలాగే సమస్యలకోసం ఎదురు చూసేవాళ్ళు కొందరున్నారని తెలుసుకొన్నాను.
ప్రతిరోజూ సమస్యాపూరణలకు ప్రాధాన్యం ఇస్తూ పద్యసాహిత్యంపై పోస్టులు పెడుతూ నేనే ఒక బ్లాగును ప్రారంభిస్తే బాగుంటుందనిపించింది.
అయితే బ్లాగుకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచించాను. నా పేరు వచ్చే విధంగా "శంకరాభరణం" అన్న పేరును ఎన్నుకున్నాను. నిజానికి ఈ పేరును సంగీతానికి లేదా భక్తికి సంబంధించిన బ్లాగుకు పెట్టాలి. బ్లాగు పేరుకు, బ్లాగులోని విషయాలకు సంబంధం లేకుండా ఉంది. అయినా "నా బ్లాగు నాకు అలంకారం" అని సర్దిపెట్టుకున్నాను. ఆ విధంగా 'KANDI SHANKARAIAH BLOG' పేరును 'శంకరాభరణం'గా మార్చాను.
1-6-2010 నాడు బ్లాగును పునఃప్రారంభించాను. ఆరోజు నేను చిన్నప్పుడు వ్రాసిన ఏకాక్షర పద్యాన్ని పోస్ట్ చేశాను.
2-6-2010 నాడు మొదటి సమస్యను (మందు త్రాగి పొందె మరణ మతఁడు) పోస్ట్ చేశాను. నా బ్లాగులో మొట్టమొదటి పూరణ చేసిన వ్యక్తి 'సుమిత్ర' గారు. ఆరోజు అదొక్కటే వచ్చింది. కొన్ని రోజులు రోజుకు ఒకటి, రెండు చొప్పున పూరణలు వచ్చేవి. ఈలోగా బ్లాగును కూడలి మొదలైన అగ్రిగేటర్లలో చేర్చాను. బ్లాగు గురించి అందరికీ తెలిసింది. మెల్లమెల్లగా పూరించే కవుల సంఖ్య పెరిగింది.
ప్రతిరోజూ సమస్య ఇవ్వాలనే నియమం పెట్టుకున్నాను. ఈ ఏడు సంవత్సరాలలో రెండు మూడు సందర్భాలలో తప్ప అనారోగ్యంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఈతి బాధలతో సతమతమైనా సమస్యలు ఇవ్వడం మాత్రం మానలేదు. చివరికి మా అమ్మానాన్నలు మరణించిన రోజుల్లోను సమస్యలు ఇచ్చాను (అవి అంతకు ముందురోజు షేడ్యూల్ చేసి ఉన్నాను కనుక).
సమస్యాపూరణలే కాకుండా చమత్కార పద్యాలు, ఛందోవ్యాకరణ పాఠాలు, పద్యరచన తదితర శీర్షికలు కూడా నిర్వహించాను.
ఈ ఏడేళ్ళలో ఎన్నో అనుభవాలు... గౌరవాలు... అవమానాలు... దూషణ భూషణ తిరస్కారాలు... పొగడ్తలకు పొంగి, అవమానాలకు క్రింగిపోవడమో, కోపం తెచ్చుకోవడమో ఎన్నడూ లేదు.
పూరణలు చేసేవారిలో లబ్ధప్రతిష్ఠులైన గొప్పకవులున్నారు. ఔత్సాహికులున్నారు. అప్పుడే పద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నవారూ ఉన్నారు. నేను స్థాయీభేదం పాటించకుండా అందరితోనూ సమానంగా ప్రవర్తిస్తున్నాను.
కీ.శే. శ్రీమాన్ పండిత రామజోగి సన్యాసి రావు గారు ఈ బ్లాగు అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. వారికి పాదాభివందనాలు!
ఈ మధ్యకాలంలో మిత్రులు అప్పుడప్పుడు ఆర్థికంగా ఆదుకున్నారు. 2011లో నాకు కంప్యూటర్ లేదని తెలిసి జ్యోతి వలబోజు గారి అధ్వర్యంలో నాకు కంప్యూటర్ కొనిచ్చారు. ఒకానొక సందర్భంలో అవసరార్థం బ్లాగు మిత్రుల వద్ద అప్పుగా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లింపలేకపోయాను. ఈ విషయంలో కొందరికి మనస్తాపాన్ని కలిగించినందుకు సిగ్గుపడుతున్నాను. నా అర్థిక పరిస్థితి అలాంటిది!
ఈరోజుతో సమస్యల సంఖ్య 2400 చేరుకున్నది. నిజానికి ఇంతకంటే ఎక్కువే. కొంతకాలంగా ఒకే భావంతో వృత్తంలోను, జాత్యుపజాతుల్లోను సమస్యలు ఇస్తూ వాటికి ఒకే సంఖ్యను కేటాయిస్తున్నాను. వాటిని పరిగణిస్తే ఇప్పటికి 2500 దాటి ఉంటాయి.
2500 సమస్యలు... సగటున ఒక్కొక్క సమస్యకు 15 పూరణలు అనుకుంటే 37500 పూరణలు. ఇవి కాక దత్తపదులు, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి (200x15) 3000 పూరణలు. పద్యరచన శీర్షికలో దాదాపు 25000 పద్యాలు... అంతేకాక కవులు తమ స్పందనలు తెలియజేస్తూ సందర్భానుసారం చెప్పిన పద్యాలు... అన్నీ కలిసి దాదాపుగా 70000 పద్యాల వరకు ఉండవచ్చు. ఇదంతా కవిమిత్రుల సహకారం వల్లనే సాధ్యమయింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
ఏదో కాలక్షేపానికి ప్రారంభించిన బ్లాగు ఈ స్థితికి వచ్చింది. ఈ బ్లాగు కారణంగా నాకు ఒక గుర్తింపు వచ్చింది. కొందరు నన్ను ఆత్మీయంగా ఆహ్వానించి సన్మానాలు చేశారు. ఏడు సంవత్సరాలుగా ప్రతిరోజూ తప్పక పోస్టులు ఉండే బ్లాగుగా అంతర్జాలంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రయత్నించలేదు కాని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తదితరాలలో నమోదై ఉండేది. పత్రికలలోను మన బ్లాగు ప్రస్తావింపబడింది.
కొందరు మిత్రుల కోరికపై కొన్ని మంచి సమస్యలను ఏరి ఒక్కొక్క సమస్యకు నలుగురి వైవిధ్యమైన పూరణలు ఎన్నుకొంటూ ఒక పుస్తకం తయారు చేస్తున్నాను. ఇప్పటికి 100 సమస్యలను, పూరణలను సిద్ధంచేశాను. పుస్తకంలో 500 లేదా 1000 సమస్యలు ఉండేవిధంగా తయారు చేస్తున్నాను. ఏదైనా స్వచ్ఛంద సాహితీ సంస్థ ముందుకు వచ్చి ప్రచురిస్తే పుస్తక రూపంలో వస్తుంది. లేదా ebook రూపంలో విడుదల చేస్తాను.
నా ఆరోగ్యం సహకరించినంతవరకు, ఓపిక ఉన్నంతవరకు ఈ బ్లాగు ఇలాగే మీ సహాకారంతో నిర్విరామంగా కొనసాగుతుంది.
ఎన్నో చెప్పాలనుకున్నాను. కొన్ని మరిచిపోయాను. అనుకున్నట్లుగా మనస్సు విప్పి వివరంగా చెప్పలేకపోయాను.
అందరికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

శంకరాభరణం దిగ్విజయ సోపానకథ చదివాను విచలితుడనైనాను సత్సంకల్పబలం ఎలా కార్యసాధనకు తోడ్పడుతుందో మీ అనుభవమే తార్కాణం భవిష్యత్తు లో శంకరాభరణం ఘన విజయాలతో ముందడుగు వెయ్యాలని మనసారా కాంక్షిస్తున్నాను
రిప్లయితొలగించండివంశస్థ వృత్తము.
రిప్లయితొలగించండిఅనన్య సామాన్య సుయజ్ఞ మియ్యదే
అనన్య సామాన్య విహార మియ్యదే
అనన్య సామాన్య సుయంత్ర మియ్యదే
అనన్య సానాన్యపు యత్న మియ్యదే
అనన్య సామాన్య సుహాస!శంకరా!
ఇది మీకే సాధ్యము గురువరా!శంకరార్యా!
...క్రియా సిద్ధిః సత్వే భవతి మహతాన్నోపకరణే ...
రిప్లయితొలగించండినమస్సులు!
నమస్కారములు
రిప్లయితొలగించండిశంకరాభరణము మరింత శోభాయమానమై దినదిన ప్రవర్ధ మానముగా వర్ధిల్లాలని ఆశీర్వదించి అక్క
ఇంతింతై..వటుడింతయై...గురువుగారికిశుభాకాంక్షలు.శంకరాభరణంజీవనది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజీవితంలో ఛందోబద్ధ కవిత్వం వ్రాయలేననుకొన్న నాచేత 64 వ యేటనుండి వివిధరకముల పద్యములను వ్రాయించి, అష్టావధానంలో పృచ్ఛకునిగా పాల్గొనజేసిన ఘనత శంకరాభరణానికి చెందుతుంది. పద్యరచనలో నా అభివృద్ధికి కారణమైన గురువర్యులు శంకరయ్య గారికి పాదాభివందనములు. శంకరాభరణం కవులందరం పూనుకుంటే శంకరాభరణం పుస్తకాన్ని ప్రచురించవచ్చు. మనమిచ్చే కొద్ది ధనంతో చక్కని పుస్తకం తయారౌతుంది. అందరం గురువుగారి ఎకౌంటు నెం. తీసుకొని మనీ జమచేస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిసత్యనారాయణ రెడ్డి గారూ, మీ సూచన అమోఘం. నా వంతు సహకారం అందించడానికి నేను సంసిద్ధుడను.
తొలగించండిగురుదేవులకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండిజీవితంలో ఛందోబద్ధ కవిత్వం వ్రాయలనుకున్న నేను నా ప్రదమ పద్యమును బ్లాగున నా మిత్రుని సహకారముతో పెట్టాను. మరుసటి రోజు బ్లాగును గురుదేవుల వ్యాఖ్యను జూచిన నేను గురుదేవులకు ఏకల్య శిష్యుడ నైతిని.ఏన్నో తప్పులను శ్రీ శంకరయ్య గారు సరి జేసి వెన్ను తట్టి నా పద్యరచన చేయించారు వారికి నా పాదాబివందనములు.
కీ.శే. శ్రీమాన్ పండిత రామజోగి సన్యాసి రావు గారి ,
శ్రీ శంకరయ్య గారి మరియు శ్రీ చింతా వారి సహకారము లబించుట నా పూర్వజన్మ పుణ్య పలము.
శంకరాభరణము కవులకాభరణమై మరింత శోభాయమానమై దినదిన ప్రవర్ధ మానముగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ... గురువుగారికిశుభాకాంక్షలు
కనులు చమ్మగిల్లె కారణంబెరుగను
రిప్లయితొలగించండిమనసె యార్ద్రమయ్యె మర్మమెరుగ
శంకరార్య!మీదు జయగాధగన్నంత
సంతసంబు గలిగె, స్వస్తి!మీకు
మీ కృషిని మాటల్లో చెప్పలేను.మనస్పూర్తిగా ధన్యవాదాలు,కృతజ్ఞతలు అభినందనలు చెప్పడం తప్ప.
రిప్లయితొలగించండినేను మాత్రం కేవలం మీ బ్లాగ్ ద్వారా మాతిరమే పద్యరచనలో మెలకువలు నేర్చుకున్నాను.నా పద్దరచన కేవలం మీకృపాకటాక్షఫలం

గురువుగారూ నమస్సులు. మీ యొక్క సాహితీ సేవ అపూర్వం. ముదావహం. మీకు సర్వేశ్వరుడు సంపూర్ణ ఆయురారోగ్యములనిచ్చి ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నముగా అవిచ్ఛిన్నముగా కొనసాగేలా ఆశీర్వదించాలని నా ప్రార్థన.
రిప్లయితొలగించండిసాఫ్టువేర్ ప్రపంచంలో విపరీతమైన ఒత్తిడిలో ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు పరుగులు పెట్టే నా వంటి వారికి హాయిని కలిగిస్తున్న నందనవనం ఈ శంకరాభరణం. మీకు నా అభివాదములు.
గురువుగారూ, ఈ సందర్భంలో నేను చేసిన మొట్టమొదటి సమస్యా పూరణ జ్ఞప్తికి వచ్చి చాలా సంతోషం కలిగింది. ఈ సమస్య శంకరాభరణం లోనిది అవునో కాదో నాకు తెలియదు. అయినా ఉండబట్టలేక ఇక్కడ వ్రాస్తున్నాను. మన్నించండి.
తొలగించండిజైత్ర యాత్ర లోన చిత్రసేనుని తోడ
పోరలేక పారిపోవువాని
శూర కర్ణుడంటు స్తుతిజేయు లోకాన
వెన్ను జూపు వాడె వీరుడనగ
అపూర్వమూ, అనితర సాధ్యమూ అయిన కృషి మీది. శ్రీ శంకరయ్య గారూ! మీరు ఆయురారోగ్యాలతో నుండాలనీ, ఈ శంకరాభరణం మరెంతో కాలము సాహితీ లోకంలో పద్య ప్రభలతో వెలుగుతూ ఉండాలనీ మనసారా ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిశంకరార్యులకు నమస్సుమాంజలి.
రిప్లయితొలగించండిమీ అకుంఠిత దీక్ష చూస్తుంటే ఆరంభింపరు నీచమానవులు అనే పద్యం గుర్తుకు వస్తోంది. మీరు ధీరులు. ప్రజ్ఞానిధులు. మీ స్వలాభాపేక్ష లేని ఇటువంటి ప్రయత్నం ఎవరి హృదయాన్ని కదపకుండా ఉంటుందండి? స్పందించినవారు ముందు నిలిచారు, సత్కవులుగా మున్ముందు నిలుస్తారు కూడా. మీ బ్లాగుననుసరించిన సహృదయులందరినీ నేను అభినందిస్తున్నాను. ఆ పరమాత్మ మీకు పరిపూర్ణ ఆయుర్దాయమునిచ్చుటమూలముగా శంకరాభరణం జగజ్జేగీయమానమయేవిధంగా తప్పక చేయఁగలఁడు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు. నమస్తే.
మాలాంటి వారెందరిచేతనో పద్యాలు వ్రాయిస్తున్న ఈ సమూహం దినదినప్రవృద్ధమానం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
రిప్లయితొలగించండిగురువు గారూ....మీ సాహిత్య ప్రస్థానంలో నాలాంటి ఔత్సాహికుడిని కలుపుకొని పద్యాలు వ్రాయిస్తున్న మీ సహృదయతకు నమస్సులు. "శంకరాభరణం" తెలుగు వెలుగులు విరబూస్తూ నిరంతరాయంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమశ్శతములు. అబ్బ యొక్కసారి గుండె యాగినంత పని యయ్యింది ముందు మీ 'శంకరాభరణం' ప్రస్థానం!’ చూసాక. పూర్తిగా చదిన తర్వాత శంక దీరి మహదానందము కలిగినది.
రిప్లయితొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిఇది ప్రస్థానమే! 'మహాప్రస్థానం' కాదు!
ప్రస్థానమంటే యాత్ర అనుకున్నాను. కాని 'ఉన్నచోటు వదలి మరోచోటికి చేసే ప్రయాణం' అన్న సరైన అర్థాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ లెక్కన మీ భయం సార్థకమే.
తొలగించండిమాష్టారూ! మీ శిష్యులమవటం మా పూర్వజన్మ సుకృతం...శంకరాభరణం నిరంతరాయంగా నిర్వహించడానికి కావలసిన ఆయురారోగ్యాలు మీకు కల్పించాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండిశంకరయార్యవర్యునకు సత్కవిముఖ్యున కెల్ల వేళలం
దంకిత భావమూని కడు హర్షము నెంచుచు బృచ్ఛకాళికిన్
శంకలు దీర్చుచుండి సరసంబుగ వెల్గెడు పద్యమాలికా
లంకృత శంకరాభరణ లాలిత మూర్తికి సన్నుతాంజలుల్ .
ఉ.
మీరొనరించు సత్కృతికి మేదిని లోన నిరంతరంబుగా
జేరును సద్యశంబు కవిశేఖర! భారతి కెల్లకాలమున్
కోరిక మీర సేవలను కూరిమి జూపుచు జేయుచుండు మీ
రారయ శంకరార్య! నుతి కర్హులు చేసెద నమ్రతాంజలుల్.
మ.
విసు గొక్కింతయు జూపకుండ సతమున్ విజ్ఞాన దానంబునం
దసమానం బగు విజ్ఞతన్ దెలుపుచున్ హర్షాతిరేకంబుతో
దెస లెల్లన్ వినుతించు రీతి యిచటన్ దీపిల్లు సత్కావ్యముల్
వెస సృష్టించెడి శంకరార్య! తమకున్ వేవేలుగా సన్నుతుల్.
చం.
అలసట లేదు చూడగ రవంతయు, స్వీయ సుఖంబులెంచుటల్
తెలియదు, రాత్రియుం బవలు తెల్గు కవిత్వ శుభ ప్రకాశముల్
వెలుగగ జేయు కార్యమును వీడక నుండెడి శంకరార్య! మీ
కలఘు సుఖంబు లెల్లెడల నందగ జేయ గిరీశు వేడెదన్.
సీ.
శంకరాభరణంబు సర్వప్రపంచాన
హర్షదంబై కీర్తు లందు గాత
శంకరాభరణంబు సత్కవీంద్రుల కెల్ల
నాటపట్టై దీప్తు లరయు గాత
శంకరాభరణంబు చదువరు లౌవారి
కాశ్రయంబై ఘనత నందు గాత
శంకరా భరణంబు సాహితీ లోకాన
నగ్ర భాగస్థమై యలరు గాత
ఆ.వె.
శంకరార్య గురుని సంరక్ష ణంబున
శంకరాభరణము సర్వ గతుల
సతము జగతి లోన సాహితీ గంధంబు
చిమ్ము చుండు గాత స్థిరముగాను.
శంకరాభరణంలో సమస్యల సంఖ్య 2400 కు చేరిన సందర్భంగా
అలుపెరుగని నిరంతర సాహితీ తపస్వి శ్రీ శంకరయ్య గురువర్యులకు నమ్రతా పూర్వక అభివాదములతో
హ.వేం.స.నా.మూర్తి.
శ్రీ శంకరయ్య గురువరులకు గండూరి లక్ష్మీనారాయణ నమస్కారము సుమారు నిర్విరామంగా నిరాటంకంగా ఎనిమిది సంవత్సరాలు వ్యయప్రయాసకోర్ఛి శంకరాభరణ బ్లాగును నడి పిస్సూ తెలుగు సాహిత్యమునకు దృఢసంకల్పముతో నెనలేని నిస్వార్థ సేవ చేస్తున్న మీకు
రిప్లయితొలగించండిజోహార్లు .

శ్రీ శంకరయ్య గురువరులకు గండూరి లక్ష్మీనారాయణ నమస్కారము సుమారు నిర్విరామంగా నిరాటంకంగా ఎనిమిది సంవత్సరాలు వ్యయప్రయాసకోర్ఛి శంకరాభరణ బ్లాగును నడి పిస్సూ తెలుగు సాహిత్యమునకు దృఢసంకల్పముతో నెనలేని సేవచేస్తున్న నిస్వార్థ సేవకు జోహార్లు
రిప్లయితొలగించండిగరువర్యులకు శతాధిక వందనములు! వేనవేల అభినందనలు! ఏడు వత్సరాలు ఒక కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించడమంటే మాటలు కాదు! యే రకార్డులలో నమోదుచేయ డానికైనా మీరు అర్హులే!
రిప్లయితొలగించండిమా బోటి ప్రాధమిక స్థాయి విద్యార్ధులకు మీరిచ్చు ప్రోత్సాహము యనితర సాధ్యము! యెన్ని సార్లు తప్పులు దొర్లినా సవరిస్తారేగాని మందలించరు! మీ వంటి సౌజన్యమూర్తి మాకు గురువుగా లభించడం, శంకరాభరణం వంటి వేదిక దొరకడం మా అదృష్టము!
ఈ మహాయజ్ఞము యింకా యెన్నో వసంతాలు కొనసాగాలని, ఐదువేల సమస్యల రికార్డు నమోదు చేయాలని, గిన్నిస్ బుక్ లోకెక్కాలని ఆకాంక్షిస్తూ, సమస్సుమాంజలి!!
శంకరాభరణం బ్లాగును నిరాటంకంగా నిర్వహిస్తున్న శ్రీ శంకరయ్య గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిపూజ్య గురుదేవులకు అభినందనవందనములు..
రిప్లయితొలగించండిశంకరాభరణం మా అందరి జీవితాలలో భాగమైంది..ఇంత చక్కని వేదికను నెలకొల్పి నావంటివారెందరికో చందోబద్దంగా పద్యరచనము నేర్పిన మీ నిరంతర కృషికి శతసహస్రవందనములు ...శంకరాభరణం ఇంకా పేరు తెచ్చుకోవాలని గిన్నెస్ బుక్ లో స్ధానం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను..
శంకరయాభరణమ్మున
రిప్లయితొలగించండిశంకలు పదివేలు దీర్చ సత్కవులెల్లన్
వంకర లేవియు లేకను
సంకలనంబుగ వచించె చక్కని కవితల్
గురువుగారూ, మీకు పద్మ బిరుదు రావాలని నా ఆకాంక్ష.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువర్యులకు నమస్సులు.
రిప్లయితొలగించండితెలుగు సాహిత్యమునకు మీరు చేస్తున్న సేవ అసమానము.పద్య ప్రియులకు మీరు ఇస్తున్న ప్రోత్సాహము అమోఘము. ఇన్ని సంవత్సరములు క్రమం తప్పకుండా ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న "శంకరాభరణం" బ్లాగు అందుకు నిదర్శనము.ఇది నిజంగా ఒక "రికార్డు". ఇందులకు తగిన గుర్తింపు మీరు కోరుకోకున్ననూ మకోసం తప్పక కలగాలని ఆభిలషిస్తున్నాను.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఉద్యమముగ జేపట్టుచు
మాద్యమమై నిలచినాడు మా శంకరుడే
పద్యకవిత్వము వ్రాయగ
విద్యల నేర్పించె గురువు విశ్వహితుండై
గురువర్యులు శీ కంది శంకరయ్య గారి కృషి అభినందనీయము. గురువుగారికి పాదాభివందనములు.
మాస్టరుగారికి నమస్సులు. శంకరాభరణ సమస్యా పూరణలను పుస్తకముగా తీసుకురావాలనే మీ అలోచన మాకందరికీ ఎంతో ముదావహము. ఆ పుస్తకము పూర్తి చేయుటకు మాయొక్క సహకారము పూర్తిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏమాత్రం సంకోచించకుండా వివరములు తెలుపగలరు.
రిప్లయితొలగించండికవిమిత్రులకు విజ్ఞప్తి.ఆ పుస్తకము పూర్తి అయినపిదప ఆవిష్కరణ తోపాటు గురువుగారిని తగురీతిని సత్కరించుకార్యక్రమము అందరమూ కలసి ఒకచోట ఏర్పాటుచేసుకుంటే బాగుంటుంది.తగిన ప్రణాళికను రూపొందిద్దాము. శ్రీ సత్యనారాయణ రెడ్డిగారి సూచన అందరికీ అమోదయోగ్యముగా నున్నది.
ఆత్మీయంగా అభినందనలు తెలియజేసిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిసదా మీవెంటే నేనుంటా
రిప్లయితొలగించండిశ్రీధర రావు గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి వందనములు మరియు వారి ముద్దు బిడ్డ శంకరాభరణం బ్లాగుకు విజయోత్సవ శుభాకాంక్షలు. పద్య కవిత్వం ప్రారంభించిన అనతి కాలం లోనే నేను కూడా పద్యాలను వ్రాయ గలుగుతున్నందుకు ముందుగా గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి నా కృతఙ్ఞతా పూర్వక నమస్సులు.
కవి మిత్రులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ గోలి శాస్త్రి గారలన్నట్లుగా గురువర్యులు తలబెట్టిన ఈ బృహత్ కార్యం లో పాలు పంచుకునేందుకు నేను కూడా కవి మిత్రులందరితో కలిసి నడుస్తాను. ఈ సరస్వతీ వేదికను పంచుకుంటున్న కవిమిత్రులందరికి శుభాకాంక్షలు.ధన్యవాదములు.
ధన్యవాదములు.
తొలగించండి